
కెన్‌బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్‌లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు.
కెన్‌బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్‌లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment