104 employees
-
ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం!
సాక్షి, అమరావతి : ఏపీ ప్రభుత్వ నిరంకుశ నిర్ణయం తీసుకుంది. 104 ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించింది. సమస్యల పరిష్కారం కోసం గతనెలలో ప్రభుత్వానికి 104 ఉద్యోగులు సమ్మె నోటీసులు జారీ చేశారు. ఏ క్షణమైనా సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ తరుణంలో రేపు కలెక్టరేట్ వద్ద 36 గంటల నిరాహార దీక్షకు పిలుపు నిచ్చారు. అయితే, 104 ఉద్యోగుల దీక్ష నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఎస్మా ప్రయోగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసలేమిటీ ఎస్మా చట్టం? దీనికి ఉన్న విస్తృతి ఏమిటి? ఎస్మా ప్రయోగిస్తే ఏమవుతుంది తదితర అంశాలు పరిశీలిస్తే..‘ఎస్మా’ అనేది ‘ఎసెన్సియల్ సర్వీసెస్ మెయిన్‌టీనెన్స్ యాక్ట్’కు సంక్షిప్త రూపం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మెలోకి దిగితే.. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది.కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు కోరుతూ.. 1980లలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికి పోయింది. ఆ మరుసటి ఏడాది కార్మిక సంఘాలు ఏకంగా పార్లమెంట్ ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె కూడా చేయాలని పిలుపునిచ్చాయి. ఈ ఉద్యమం తీవ్రరూపం దాలుస్తున్నట్టు గుర్తించిన ప్రభుత్వం.. తొలుత 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ‘ఎస్మా’ ఆర్డినెన్స్‌ని తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానంలో ‘ఎస్మా’ చట్టం చేసింది.ఎస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినా.. దిగొచ్చనే బలమైన అనుమానం కలిగినా సరే.. పోలీసు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్టు చేయవచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలూ చేపట్టవచ్చు. సమ్మెలో పాల్గొంటున్నవారికి, వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష, జరిమానా, లేదా రెండూ విధించవచ్చు. -
Gallery Image Test 600x900-1200x900
-
108, 104 ఉద్యోగుల సమ్మె లేదు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్రంలో 108, 104 ఉద్యోగులు సమ్మె యోచనను విరమించుకున్నారు. 108, 104 ఉద్యోగ సంఘాల నాయకులతో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని శనివారం గుంటూరులో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. తమ సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని, ఈ నెల 22 నుంచి జరపతలపెట్టిన సమ్మెను విరమించుకుంటున్నట్లు సంఘాల నేతలు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే ఉద్యోగులకు గుర్తింపు, గౌరవం: మంత్రి రజిని ఈ చర్చల్లో ఉద్యోగుల డిమాండ్లపై మంత్రి రజిని ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఉద్యోగులకు తగిన గుర్తింపు, గౌరవం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే దక్కాయని వివరించారు. 108, 104 వాహనాల ఉద్యోగులను ఆప్కాస్‌లో చేర్చాలనే వినతిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళతామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో వెయిటేజిపైనా ప్రతిపాదనలు తయారు చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు కోరుతున్నవాటిలో ప్రధానమైన శ్లాబ్ పద్ధతిని వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సీఎం వైఎస్ జగన్ ప్రతినెలా క్రమం తప్పకుండా ఉద్యోగులకు వేతనాలు అందిస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వంలో 104, 108 ఉద్యోగుల జీతాలను సమయానికి ఇచ్చేవారు కాదని గుర్తు చేశారు. ఇకపై కూడా ప్రతి నెలా మొదటి వారంలోనే ఉద్యోగులందరికీ జీతాలు అందేలా కృషి చేస్తామన్నారు. సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా 104, 108 వ్యవస్థను, వాహనాలను బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నారని, ఈ విభాగాల్లోని ఉద్యోగులకు కూడా ఏ సమస్యలు రానీయరని తెలిపారు. అత్యవసర సేవలు అందించే విషయంలో 108 సిబ్బంది చేస్తున్న కృషి ఎంతో గొప్పదని చెప్పారు. 104, 108 ఉద్యోగులకు అండగా ఉంటామని, ఏ సమస్యలున్నా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. సీఎం జగన్ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడకుండా ప్రజలకు ఎలా సేవ చేస్తోందో, ఉద్యోగులకు కూడా ఏ సమస్యలూ రాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. మంత్రి హామీలకు ఉద్యోగుల సంఘ నేతలు అంగీకరించారు. ఈ సమావేశంలో 108 ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బి.కిరణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు ఎన్.మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.శ్రీనివాసరావు, 104 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఫణికుమార్, ఉపాధ్యక్షుడు రాంబాబు, అరబిందో సంస్థ నుంచి ఎంవీ సత్యనారాయణ, రాకేష్ పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలకు ‘ఎర’ కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. నోటీసులు జారీ చేసిన ముగ్గురిపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళ బీడీజేఎస్ అధినేత తుషార్, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది. వీరంతా సోమవారం నాడు విచారణకు హాజరు కాకపోవడంతో లుకౌట్ నోటీసులు ఇచ్చింది. ఇక ఈ కేసులో బండి సంజయ్ అనుచరుడు, అడ్వకేట్ శ్రీనివాస్‌ను ఇప్పటికే ప్రశ్నించిన సిట్ మంగళవారం మరోసారి విచారణకు హాజరు కావాలని తెలిపింది. కాగా సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరు కావాల్సిందిగా బీఎల్ సంతోష్‌కు తొలిసారి జారీ చేసిన నోటీసులో సిట్ పేర్కొంది. కానీ సంతోష్ గైర్హాజరయ్యారు. దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. సంతోష్‌తో పాటు కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్, తుషార్ వెల్లాపల్లి, కేరళకు చెందిన వైద్యుడు జగ్గుస్వామిలకూ సిట్ నోటీసులు జారీ చేసింది. అయితే శ్రీనివాస్ మినహా మిగిలిన ముగ్గురూ విచారణకు హాజరుకాలేదు. నోటీసులు అందిన తర్వాత విచారణకు హాజరుకాకపోతే 41–ఏ (3), (4) సీఆర్పీసీ కింద అరెస్టు చేస్తామని విచారణాధికారి, రాజేంద్రనగర్ ఏసీపీ బి.గంగాధర్ తొలి నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ నోటీసులపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సంతోష్‌ను అరెస్టు చేయవద్దని సిట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
క్రేజీ ఫెలో కోసం బరువు తగ్గాను
‘‘క్రేజీ ఫెలో’ని ఎంజాయ్ చేస్తూ, చేశాను. ప్రేక్షకులకు మంచి ఎంటర్టైనర్ మూవీ చూశామనే అనుభూతి కలిగిస్తుంది’’ అన్నారు ఆది సాయికుమార్. ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా కేకే రాధామోహన్ నిర్మించిన ‘క్రేజీ ఫెలో’ ఈ నెల 14న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా గురువారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆది సాయికుమార్ చెప్పిన విశేషాలు... ► చెప్పింది పూర్తిగా వినకుండా కష్టాలు కొని తెచ్చుకునే యువకుడి పాత్రను ‘క్రేజీ ఫెలో’లో చేశాను. ఫణికృష్ణ చాలా మంచి కథ రాసుకున్నాడు. ఈ చిత్రంలో ఆర్గానిక్ కామెడీ ఉంటుంది. కామెడీ టైమింగ్‌లోనూ ఫణి స్పెషల్ కేర్ తీసుకున్నాడు. సినిమా పట్ల అందరం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాం. కథలో సెకండాఫ్ మంచి ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్రెష్ లుక్ ట్రై చేశాను.. బరువు తగ్గాను. ► నేను హీరోగా చేసే కొన్ని సినిమాల కథలను నాన్న (నటుడు సాయికుమార్)గారు వింటారు. ‘క్రేజీ ఫెలో’ కథ విని, హ్యాపీ ఫీలయ్యారు. నాన్నగారి అభిప్రాయం తీసుకోకుండా నేను చేసిన కొన్ని సినిమాలు అంతగా వర్కౌట్ కాలేదు. ‘గాలిపటం’ సినిమా కథ బాగుంది కానీ క్లయిమాక్స్ కాస్త మార్చితే బాగుంటుందని నాన్నగారు సలహా ఇచ్చారు. కానీ మేం ఒప్పుకోలేదు. ఆడియన్స్ ఆ క్లయిమాక్స్ ఒప్పుకోలేదు. ఇలా నాన్నగారి జడ్జ్మెంట్ బాగుంటుంది. ► ప్రస్తుతం ‘టాప్ గేర్’, ‘సీఎస్ఐ: సనాతన్’ సినిమాలు చేస్తున్నాను. అలాగే ‘పులి–మేక’ అనే వెబ్ సిరీస్ చేశాను. నవంబరులో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కావొచ్చు. ‘అమరన్ ఇన్ సిటీ’ సినిమా షూటింగ్ ఇరవై శాతం పూర్తయింది. కొన్ని కారణాల వల్ల ఈ సినిమా తాత్కాలికంగా ఆగింది. -
మరింత మెరుగ్గా 108, 104 సేవలు
సాక్షి, అమరావతి: 108 అంబులెన్సులు, 104 మొబైల్ మెడికల్ యూనిట్(ఎంఎంయూ)ల సేవలను ప్రజలకు మరింత మెరుగ్గా అందించాలని అధికారులను వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఆదేశించారు. బుధవారం మంగళగిరిలోని వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో 108, 104ల పనితీరుపై ఆయన సమీక్ష నిర్వహించారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం సేవలందించడం లేదంటూ ఐటీ విభాగంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. 108 అంబులెన్సులలో జీపీఎస్ సౌకర్యంపై ఆరా తీశారు. వాహనాల మరమ్మతుల విషయంలో జాప్యం చేయొద్దని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలో వాహనాల బఫర్ స్టాక్ తప్పనిసరిగా ఉంచాలన్నారు. రెండు వారాల్లో సేవలు మెరుగుపడకపోతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ సీఈవో హరేంధిరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Evening News Roundup: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1. తిరుమల పర్యటనలో సీఎం వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. తిరుపతి గ్రామదేవత, శ్రీవారి సోదరి శ్రీతాతయ్యగుంట గంగమ్మను ఆయన దర్శించుకున్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీని పూర్తిచేయాలి: సీఎం జగన్ పశు సంవర్ధక శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పశువుల ఆస్పత్రుల్లో నాడు– నేడు, పశువులకు బీమా, ఫ్యామిలీ డాక్టర్ తరహాలో పశువులకు వైద్య సేవలు తదితర అంశాలపై అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. ఉద్దవ్ థాక్రేకు బిగ్ షాక్.. షిండేకు అనుకూలంగా వెలువడ్డ సుప్రీం తీర్పు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకు భారీ ఎదురు దెబ్బ తగిలింది.శివసేన పార్టీ గుర్తింపు వ్యవహారంలో.. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు అనుకూలంగా సుప్రీం కోర్టులో తీర్పు వెలువడింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. రష్యా చెర నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు రష్యన్ల బంధిఖానా నుంచి బయటపడిన ఉక్రెయిన్ సైనికుడి షాకింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వశాఖ మైఖైలో డయానోవ్ అనే ఉక్రెయిన్ సైనికుడి ఫోటోలను ట్విట్టర్లో పంచుకుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. ‘నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు లోకేష్.. అమ్మవారి కిరీటాలు ఎత్తుకెళ్లిందెవరు?’ ఇటీవలి కాలంలో టీడీపీ నేతలు ప్రతీ విషయాన్ని వివాదాస్పదం చేస్తూ రెచ్చిపోతున్నారు. లేనిది ఉన్నట్టుగా ఊహించుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఓవర్‌గా కామెంట్స్ చేసిన నారా లోకేష్‌కు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కౌంటర్ ఇచ్చారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. బంగారు మైన్స్‌లో పెట్టుబడులు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్న ఈడీ! ఇటీవలి కాలంలో పలు కేసుల్లో తెలంగాణలో ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేయడం, విచారించడం తెలంగాణలో సంచలనంగా మారింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. ఈ ముగ్గురిని ఎంపిక చేసి తప్పుచేశారా? వీళ్లకు బదులు.. టీ20 ప్రపంచకప్-2022 టోర్నీ ఆరంభానికి సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరు 16 నుంచి ఈ ఐసీసీ ఈవెంట్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో పాల్గొనే దేశాలు ఇప్పటికే జట్లను ప్రకటించాయి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. నోట్ల రద్దు రాజ్యాంగ బద్ధమేనా? సుప్రీంలో విచారణ దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న పెద్ద నోట్లను రద్దు చేస్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో తీసుకున్న సంచలన నిర్ణయం వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. నల్లధనం, నకిలీ నోట్ల చలామణికి చెక్ పెట్టేందుకంటూ రాత్రికి రాత్రే ప్రకటించిన ఈ నిషేధం పెను దుమారాన్ని సృష్టించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విషాదం.. జబర్దస్త్ కమెడియన్ కన్నుమూత టాలీవుడ్లో విషాదం నెలకొంది.మిమిక్రీ ఆర్టిస్ట్, జబర్దస్త్ కమెడియన్ మూర్తి కన్నుమూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధ పడుతున్న ఆయన మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన సోదరుడు అరుణ్ స్వయంగా ధ్రువీకరించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. ఆనందం మాటున పొంచి వున్న ప్రమాదాలు గత రెండేళ్లుగా వేసవి, సంక్రాంతి, దసరా వంటి సెలవులు వచ్చినప్పటికీ.. కరోనా కారణంగా ప్రజలు ఎవరూ కూడా ఆనందంగా గడిపి ఆస్వాదించలేక పోయారు. ఇక విద్యార్థులు కూడా సెలవుల్లో ఆటలకు దూరంగా ఉన్నారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Azadi Ka Amrit Mahotsav: విభజన నెహ్రూ పుణ్యమే బీజేపీ వ్యాఖ్యలు.. మండిపడ్డ కాంగ్రెస్
న్యూఢిల్లీ: విభజన గాయాల స్మారక దినం సందర్భంగా ఆదివారం బీజేపీ విడుదల చేసిన వీడియో వివాదానికి దారి తీసింది. 1947లో దేశ విభజనకు దారి తీసిన ఘట్టాలను అందులో చూపించారు. పాకిస్తాన్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలన్న ముస్లిం లీగ్ డిమాండ్‌కు నెహ్రూ తలొగ్గారంటూ ఆరోపించారు. వీడియో అంతా పదే పదే నెహ్రూ విజువల్స్ చూపించారు. ఈ వీడియోపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆధునిక సావర్కర్లు, జిన్నాలు ఇప్పటికీ జాతిని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టేందుకు విభజన విషాదాన్ని వాడుకుంటూ ప్రధాని మోదీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. రెండు దేశాల థియరీని తెరపైకి తెచ్చింది బీజేపీ ఆరాధించే సావర్కరేనని ఆరోపించారు. దాన్ని జిన్నా అందుకున్నారన్నారు. విభజనకు ఒప్పుకోకుంటే చిన్న చిన్న భాగాలుగా విడిపోయి దేశం సర్వనాశనం అయ్యేదన్నారు. భారతావనని ఏకతాటిపైకి తెచ్చేది ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీయేనని జైరాం అన్నారు. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 అంబులెన్స్ సేవలకు స్వస్థి పలికింది. 104 వాహనాల సేవలను రద్దు చేస్తూ బుధవారం జీవోను విడుదల చేసింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అంబులెన్స్ సేవలను కోల్పోనున్నారు. ఇక, 104 వాహనాల సేవలు నిలిచిపోనుండటంతో పనిచేస్తున్న అంబులెన్సులను త్వరలో వేలం వేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. ఇదిలా ఉండగా, 104 అంబులెన్స్ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్మెంట్ అందించేందుకు ఈ అంబులెన్స్‌లను తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్ఎం, ల్యాబ్‌టెక్నీషియన్, మెడికల్ అసిస్టెంట్, డ్రైవర్లను నియమించింది. ఇది కూడా చదవండి: రోగులకు మందుల సరఫరాకు బ్రేక్ -
ఆస్ట్రేలియాలో 13 మంది మహిళా మంత్రులు
కెన్బెరా: ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని అల్బానెసె తన కేబినెట్లో మహిళలకు పెద్ద పీట వేశారు. రికార్డు స్థాయిలో 13 మందికి మంత్రులుగా అవకాశం కల్పించారు. వీరిలో ఆనీ అలీ అనే ముస్లిం కూడా ఉన్నారు. దేశ చరిత్రలో తొలి ముస్లిం మహిళా మంత్రిగా ఆమె రికార్డు సృష్టించారు. అయ్యారు. కెన్బెరాలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జనరల్ డేవిడ్ హర్లీ కొత్త మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు. లేబర్ పార్టీకి చెందిన ఆంటోని ప్రధాని అయిన 11 రోజుల తర్వాత 30 మందితో కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. ఇలాంటి ఒక సమీకృత ప్రభుత్వానికి సారథిగా ఉండడం గర్వంగా ఉందని ఆంటోని ట్విటర్లో పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ఎంత భిన్నత్వంతో కూడుకొని ఉందో, తన కేబినెట్ కూడా అంతే భిన్నంగా ఉందన్నారు. -
108, 104 ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 108 అంబులెన్సులు , 104 మొబైల్ మెడికల్ యూనిట్ సర్వీసుల్లో పనిచేస్తున్న 6 వేల మంది ఉద్యోగులకు వేతన బకాయిల చెల్లింపును ప్రారంభించినట్టు అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ సంపత్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సాంకేతిక కారణాల దృష్ట్యా బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సకాలంలో వేతనాలను విడుదల చేయలేకపోయామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.70 కోట్లు నిధులు రావటంతో 2 నెలల వేతన బకాయిలను చెల్లిస్తున్నట్టు వివరించారు. -
వైద్య సేవల్లో లోపాలుంటే 104కు చెప్పండి
సాక్షి, అమరావతి: కరోనా వ్యాప్తి సమయంలో ఆపద్బాంధవిగా ప్రజలకు విశిష్ట సేవలందించిన 104 కాల్ సెంటర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సేవను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు ఎదురయ్యే సమస్యలపై ఈ కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి ఫిర్యాదు చేసే వీలును కల్పించబోతోంది. ఇందుకోసం వైద్య, ఆరోగ్య శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రభుత్వాస్పత్రులకు వచ్చే నిరుపేద, మధ్యతరగతి రోగులు చికిత్స అనంతరం సంతోషంగా ఇళ్లకు తిరిగి వెళ్లాలనే సంకల్పంతో సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా నాడు–నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మారుస్తున్నారు. ఈ కార్యక్రమానికి రూ.16వేల కోట్లకు పైగా భారీ నిధులను ప్రభుత్వం ఖర్చుచేస్తోంది. ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యులు, వైద్యసిబ్బంది కొరతకు తావులేకుండా చేస్తోంది. 2019 నుంచి ఇప్పటివరకు వైద్య శాఖలో 39వేల పోస్టుల భర్తీ చేపట్టింది. అవసరమైన మౌలిక వసతులనూ సమకూరుస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ ఇటీవల పలు ప్రభుత్వాస్పత్రుల్లో రోగులు ఇబ్బందులకు గురైన ఘటనలు వెలుగుచూశాయి. దీంతో అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆసుపత్రుల్లో రోగులకు ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో 104 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించనున్నారు. కరోనా రోజుల్లో 12లక్షల మందికి సేవలు కరోనా కష్టకాలంలో 104 కాల్ సెంటర్ ద్వారా కోవిడ్‌కు సంబంధించిన సమాచారం, వైద్య పరీక్షలు, ఇతర సేవలన్నింటినీ ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు అందించారు. 12 లక్షల మందికి పైగా ప్రజలు కాల్ సెంటర్‌కు ఫోన్‌చేసి కరోనా మూడు దశల్లో సేవలు పొందారు. ఫోన్‌చేస్తే కరోనా నిర్ధారణ పరీక్షలకు టోకెన్ రైజ్ చేయడం మొదలు, పాజిటివ్ అయితే ఆసుపత్రికి తరలించే అంబులెన్స్‌ను అందుబాటులోకి తీసుకురావడం, ఆసుపత్రిలో బెడ్‌ను సమకూర్చడం ఇలా అనేక రకాల సేవలు కాల్ సెంటర్ ద్వారా అందాయి. వారం రోజుల్లో బలోపేతం ప్రభుత్వాస్పత్రుల్లో ఎదురవుతున్న ఇబ్బందులపై ఫిర్యాదులు స్వీకరించేందుకు వీలుగా 104 కాల్ సెంటర్‌ను వారం రోజుల్లో బలోపేతం చేస్తాం. వైద్యులు, వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడం.. సెక్యూరిటీ, శానిటేషన్, మహాప్రస్థానం, అంబులెన్స్ సహా ఇతర సేవల్లో ఇబ్బందులు ఎదురైతే రోగులు ఫిర్యాదు చేయడానికి వీలు కల్పిస్తాం. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా చర్యలు చేపడతాం. రోగులు ఏ చిన్న ఇబ్బందికీ గురికాకూడదు అనేది ప్రభుత్వ ఉద్దేశం. అందుకనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటాం. – ఎం.టి. కృష్ణబాబు, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి -
Jagananna Amma Vodi: అమ్మ ఒడిపై ‘ఎల్లో’ విషం
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న అమ్మ ఒడి పథకంపై టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేశ్ ఎల్లో మీడియా ద్వారా విషం చిమ్ముతూ లేనిపోని అపోహలు సృష్టించి ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. ఈ పథకానికి మార్పులు చేస్తూ సర్క్యులర్ జారీ చేశారనేది టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం మాత్రమేనని, నిజంగా ఆ సర్క్యులర్ ఉంటే బయటపెట్టాలని సవాల్ విసిరారు. శుక్రవారం హైదరాబాద్ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో మంత్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ పథకం కింద రెండుసార్లు పిల్లల తల్లుల ఖాతాల్లో రూ.15 వేల చొప్పున, దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మొత్తాన్ని ప్రభుత్వం జమ చేసిందన్నారు. కరోనా మహమ్మారితో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా నిరుపేద కుటుంబాలకు మేలు ఆగకూడదన్న సంకల్పంతో సీఎం ఈ పథకాన్ని అమలు చేశారన్నారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్నట్టు ఈ పథకంలో అర్హతలకు సంబంధించి కొత్తగా నియమావళి రూపొందించలేదని, గతం కంటే ఇంకా ఎక్కువ మందికి అవకాశం కల్పించేందుకు గతేడాది అర్హత నియమాలు సవరించినట్లు చెప్పారు. మరింత ఎక్కువ మందికి అందేలా.. ఈ పథకంలో అర్హత కోసం కుటుంబ నెలవారీ ఆదాయం 2019–20లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.5 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.6,250 ఉంటే.. దాన్ని 2020–21లో గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12వేలకు ప్రభుత్వం పెంచిందని మంత్రి తెలిపారు. ఆ కుటుంబాల భూకమతాలకు సంబంధించి 2019–20లో 2.5 ఎకరాల పొలం మాగాణి లేదా 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారికి కూడా వర్తింపచేసినట్టు తెలిపారు. ఇంకా 2019–20లో నెలకు 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే వారినే అర్హులుగా పరిగణిస్తే.. 2020–21లో దాన్ని 300 యూనిట్లకు పెంచినట్లు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అర్హులు కారని, అయితే కొత్తగా శానిటరీ వర్కర్లకు పథకాన్ని వర్తింపజేశామన్నారు. ఫోర్‌వీలర్ రూల్‌ను సవరించి ట్యా క్సీలు, ట్రాక్టర్లు, ఆటో కలిగి ఉన్న వారికి కూడా ఇస్తున్నామన్నారు. పట్టణాల్లో గతంలో 700 చదరపు అడుగుల ఇల్లున్న వారు మాత్రమే అర్హులు కాగా.. ఇప్పుడు 1000 చదరపు అడుగుల ఇల్లున్న వారికి కూడా వర్తింప చేస్తున్నామని వివరించారు. 2 లక్షలకు పైగా పెరిగిన లబ్ధిదారులు 2019–20లో ఈ పథకంలో 42,33,098 మంది తల్లుల ఖాతాల్లో నగదు జమ చేస్తే.. 2020–21లో ఆ సంఖ్య 44,48,865కు పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. అంటే 2,15,767 మంది తల్లులకు అదనంగా పథకంలో ఆర్థిక సహాయం చేశామని తెలిపారు. విద్యార్థుల హాజరుకు సంబంధించి కొత్తగా నియమావళి ఏం మార్చలేదని, 75 శాతం హాజరు ఉండాలని తొలి జీవో 63లో నిర్దేశించినట్లు తెలిపారు. హాజరు 75 శాతం ఉండాలన్న నిబంధన అమలు చేస్తూ ఈ ఏడాది పథకాన్ని జనవరి నుంచి జూన్‌కు మార్చామని స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే నారా లోకేశ్‌తో పాటు, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తూ విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. -
Ola S1 Pro Real Range Test: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..?
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాది(2021) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల(ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రొ)ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ స్కూటర్లు ఒక్కరోజులో లక్షకు ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అందుకొని రికార్డు సృష్టించాయి. గత నెలలో సంస్థ కస్టమర్లకు ఈ స్కూటర్లను డెలివరీ చేయడం ప్రారంభించింది. అయితే, ఈ స్కూటర్ ఇంత క్రేజ్ రావడానికి ప్రధాన కారణం ఆ స్కూటర్ రేంజ్. ఓలా సంస్థకు చెందిన ఎస్1 ప్రొ ఎలక్ట్రిక్ స్కూటర్ టెస్టింగ్ రేంజ్ వచ్చేసి 181 కిలోమీటర్లు అని కంపెనీ క్లెయిమ్ చేసింది. కానీ, వాస్తవానికి ఈ స్కూటర్ రేంజ్ ఎంతో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఓలా సంస్థకు చెందిన ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్న యజమాని సిద్ధార్థ్ రెడ్డి ఈ స్కూటర్ రియల్ రేంజ్ వీడియో రికార్డు చేసి "ప్రదీప్ఆన్ వీల్స్" యూట్యూబ్ చానెల్లో అప్ లోడ్ చేశారు. ఈ యూట్యూబ్ వీడియోలో ఎస్1 ప్రొ స్కూటర్ వాస్తవ పరిస్థితులలో ఎంత రేంజ్ అనేది మనం చూడవచ్చు. స్కూటర్ యజమాని సిద్ధార్థ్ రెడ్డి తన ఎలక్ట్రిక్ స్కూటర్ని ఫుల్(100%) చార్జ్ చేసిన తర్వాత రోడ్డు మీదకు టెస్ట్ రైడ్ కోసం బయలుదేరుతాడు. అయితే, మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ స్కూటర్లో మూడు రైడ్ మోడ్స్(నార్మల్, స్పోర్ట్, హైపర్)ఉన్నాయి అనే విషయం మరిచిపోవద్దు. ఆటోమేటిక్'గా ఎకో మోడ్‌కు పడిపోయిన వేగం ఈ వీడియోలో తను పేర్కొన్న వివరాల ప్రకారం.. స్పోర్ట్, హైపర్ మోడ్స్ లో ప్రయాణించినట్లు తెలిపాడు. హైవేలపై మీద 60-70 కిలోమీటర్ల వేగంతో వెళ్ళినట్లు పేర్కొన్నాడు. 93 కిలోమీటర్లు పాటు విస్తృతంగా ప్రయాణించిన తర్వాత ఈ స్కూటర్ బ్యాటరీ స్థాయి 15 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత స్కూటర్ దానంతట అదే "ఎకో" మోడ్‌కు మారుతుంది. ఈ ఎకో మోడ్‌లో స్కూటర్ గరిష్ట వేగం గంటకు 40 కిలోమీటర్లు. ఆ తర్వాత 7 కిమీ ప్రయాణించిన తర్వాత 3 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత ఛార్జింగ్ పెట్టాలని స్కూటర్ ఆగిపోయింది. (చదవండి: ఊసరవెల్లిలా రంగులు మార్చే ఫోన్ చూశారా..?) ఎస్1 ప్రో స్కూటర్ రియల్ రేంజ్ కాబట్టి, మొత్తంగా ఒకసారి ఈ స్కూటర్ని ఫుల్ చార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల వరకు వెళ్లనుంది. కానీ, ఇది ఏఆర్ఏఐ ద్వారా పరీక్షించినప్పుడు పొందిన 181 కిలోమీటర్ల రేంజ్ క్లెయిం కంటే చాలా తక్కువ. అయితే, ఎస్1 ప్రో వాస్తవ పరిస్థితులలో 135 కిలోమీటర్లు ఇచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఓలా పేర్కొంది. అయితే, ఈ స్కూటర్ మీద 70 కిలోల కంటే ఎక్కువ బరువు లేని ఒకే ఒక వ్యక్తి మాత్రమే ఉండాలి. స్కూటర్ మీద అదనపు లోడ్ తీసుకెళ్లరాదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 8.5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంది. అంతేకాకుండా 3.92 లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని 3.6 సెకండ్లలో అందుకుంటుంది అని కంపెనీ పేర్కొంది. -
ఇక ‘104’ వైద్యసేవలుండవ్
సాక్షి, హైదరాబాద్: పల్లెరోగులకు సేవలందించిన సంచార వైద్యవాహనం ఇక కనుమరుగు కానుంది. ‘104’వైద్య సంచార వాహన సేవలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులకు అక్కడే నెలనెలా వైద్యపరీక్షలు నిర్వహించి, నెలకు సరిపడా మందులను ఒకేసారి ఇచ్చేందుకు ప్రభుత్వం ‘104’వాహనసేవలను ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతినెలా 20వ తేదీ వరకు నిర్దేశిత గ్రామాల్లో ఈ వాహనాలు సంచరిస్తుంటాయి. ఆ సంచార వైద్యవాహనంలో వైద్యుడు, ఏఎన్ఎం, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, సహాయకుడు ఉంటారు. ఈ పథకాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన వైద్య ఆరోగ్యశాఖ, అందులో పనిచేస్తున్న దాదాపు 1,250 మంది ఉద్యోగులను ఆ శాఖలోనే ఇతర పథకాల పరిధిలో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే అమలులో ఉన్న జీవనశైలి వ్యాధుల నివారణ పథకం ద్వారా ఇంటింటికీ మందులను సరఫరా చేస్తున్నారు. మరోవైపు, త్వరలో పల్లె దవాఖానాలను ప్రభుత్వం ప్రారంభించాలని నిర్ణయించడంతో ‘104’సేవలను నిలిపివేస్తున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
11.99 లక్షల మందికి 104 కాల్ సెంటర్ వైద్యసేవలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ ద్వారా ఇప్పటి వరకు 11,99,927 మంది వైద్యసేవలు పొందారు. కరోనా తీవ్ర వ్యాప్తి సమయంలో ప్రభుత్వాస్పత్రుల్లో మినహా ప్రైవేటు ఆస్పత్రులన్నీ ఔట్ పేషెంటు సేవల్ని నిలిపేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఫోన్ చేస్తే వైద్యసేవలు అందేలా ప్రభుత్వం 104 కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేసి భారీగా వైద్యులను నియమించింది. ఇప్పటి వరకు వైద్యసేవలు పొందిన వారిలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణై ఇంట్లో చికిత్స పొందుతున్నవారే 10.14 లక్షలమంది ఉన్నారు. 5,579 మంది పీడియాట్రిక్ వైద్యసేవలు పొందగా మిగిలినవారు వివిధ వ్యాధులకు సలహాలు తీసుకున్నారు. 13,797 సచివాలయాల పరిధిలో నిల్ రాష్ట్రవ్యాప్తంగా 15,001 గ్రామ, వార్డు సచివాలయాలుండగా ప్రస్తుతం 13,797 సచివాలయాల పరిధిలో కరోనా యాక్టివ్ కేసులు లేవు. 859 సచివాలయాల పరిధిలో ఒక్కో యాక్టివ్ కేసు, 222 సచివాలయాల పరిధిలో రెండేసి కేసులున్నాయి. 116 సచివాలయాల పరిధిలో 3 నుంచి 9, ఐదు సచివాలయాల పరిధిలో 10 నుంచి 19, రెండు సచివాలయాల పరిధిలో 20 నుంచి 29 యాక్టివ్ కేసులున్నాయి. గత వారం రోజుల్లో ప్రభుత్వం రోజుకు సగటున 27,656 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించింది. 90 శాతం, అంతకుమించి టీకాలు.. రాష్ట్రంలో 12,834 సచివాలయాల పరిధిలో 18 ఏళ్లు పైబడిన వారిలో 90 శాతం, అంతకంటే ఎక్కువమందికి ప్రభుత్వం కరోనా టీకాలు వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో 11,137 సచివాలయాలకుగాను 9,345, పట్టణ ప్రాంతాల్లో 3,864 సచివాలయాలకుగాను 3,489 సచివాలయాల పరిధిలో 90 శాతం, అంతకంటే ఎక్కువ మందికి టీకా వేశారు. -
నల్లగొండ జిల్లా పర్యటన ఉద్రిక్తం: బండి సంజయ్‌పై కేసు నమోదు
సాక్షి, నల్లగొండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ రంగనాథ్ తెలిపారు. బండి సంజయ్ పర్యటనకు అనుమతి తీసుకోలేదని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండడం కారణంగా సభలు, సమావేశాలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా సమావేశాలు, పర్యటను నిర్వహించదని సూచించారు. కాగా నల్లగొండ జిల్లా పర్యటన నేపథ్యంలో జరిగిన ఘటనలో బీజేపీ, టీఆర్ఎస్ రెండు పార్టీల నేతలపై సంబంధిత పోలీస్ స్టేషన్లలో వీడియో ఆధారాలతో కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ ఏవీ. రంగనాథ్ పేర్కొన్నారు. చదవండి: రైతుల కోసం ఎందాకైనా వస్తా: బండి సంజయ్ బండి సంజయ్ ఐకేపీ కేంద్రాలు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించే క్రమంలో టీఆర్ఎస్ నేతలు ఆయన పర్యటనను అడ్డుకునే క్రమంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం లాఠీచార్జీ చేయడం జరిగిందని ఎస్పీ వెల్లడించారు. అదే క్రమంలో బీజేపీ నేతలు బండి సంజయ్ పర్యటన కోసం జిల్లా యంత్రాంగం నుంచి కానీ, పోలీస్ శాఖ ద్వారా కానీ ఎలాంటి అనుమతి తీసుకోలేదని, చివరి నిమిషంలో బండి సంజయ్ నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించిన తర్వాత అనుమతి కోసం లేఖ ఇచ్చారన్నారు. చదవండి: కొనుడుపై కొట్లాట..! టీఆర్ఎస్, బీజేపీ పరస్పర దాడులు నల్లగొండ పట్టణ శివారులోని అర్జాలబావి ఐకేపి కేంద్రం వద్ద పర్యటన ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతి ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుందని, ముందస్తు సమాచారం, అనుమతి లేని కారణంగా అందుబాటులో ఉన్న సిబ్బందితోనే భద్రతా చర్యలు చేపట్టాల్సి వచ్చిందని స్పష్టం చేశారు. బండి సంజయ్ కాన్వాయిపై సైతం రాళ్లు, కోడిగుడ్లు వేస్తున్నారనే సమాచారంతో అప్పటికప్పుడు ఉన్న సిబ్బందితోనే పరిస్థితికి అనుగుణంగా చర్యలు తీసుకున్నామని ఆయన తెలిపారు. పోలీస్ సిబ్బందికీ గాయాలు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ షబ్ డివిజన్ పరిధిలో బండి సంజయ్ పర్యటనను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నంలో జరిగిన ఘటనలో పలువురు పోలీస్ సిబ్బందికి సైతం గాయాలు అయ్యాయని ఎస్పీ తెలిపారు. రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి రాజకీయ పార్టీల ప్రతినిధులు, నాయకులు ముందస్తు అనుమతులు తీసుకోకుండా పర్యటనలు, సమావేశాలు నిర్వహించవద్దని ఆయన సూచించారు. అనుమతులు లేకుండా చేసే పర్యటనల క్రమంలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం అయితే అప్పటికప్పుడు భద్రతా చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ముందుగా అనుమతి తీసుకోవడం ద్వారా కార్యక్రమానికి అనుగుణంగా తాము అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. మరో పక్క ఎమ్మెల్సీ కోడ్ అమలులో ఉన్న క్రమంలో అనుమతులు లేకుండా కార్యక్రమాలు నిర్వహించవద్దని, శాంతి భద్రతల సమస్యలు రాకుండా తమతో సహకరించాలని ఆయన రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని తెలిపారు. -
మెలోడీ క్వీన్, లెజెండ్రీ సింగర్స్, ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు నేపథ్య సంగీతంలో ఆమె గళం అమరం. భావితరాలకు మెలోడీ క్వీన్ పాటే కొండంత వెలుగు..ఒక పాఠశాల. ఏ దేశమేగినా అని దేశభక్తిని పొంగించినా.. మీర జాలగలడా నా ఆనతి అని పాడినా.. వస్తాడు నా రాజు అంటూ ఆమె గళమెత్తినా, ‘ఆడే పాడే పసివాడా ఆడేనోయి నీతోడ ఆనందం పొంగేనోయి దీపావళి’, ‘చీకటి వెలుగుల రంగేళి... జీవితమే ఒక దీపావళి’ అని రేడియోలో పాట ప్రసారం కాని లేని దీపావళి లేదు. ముత్యముంతా పసుపు ముఖమంతా ఛాయ అన్నా, ఝుమ్మంది నాదం సై అంది పాదం అని మురిపించినా ఆమెకు ఆమే సాటి. లతాజీతో గురుబంధం తనకు ఇష్టమైన గాయని లతా మంగేష్కర్ అని స్వయంగా సుశీలమ్మ గారే చాలా సందర్భంగా గర్వంగా ప్రకటించారు. ఆమె పాటలు వింటూ ఎదిగిన తాను, ఆమె గొంతును దొంగిలించాను అంటారామె. అలా లతాజీ తన మానసిక గురువు ఆమె అని చెబుతారు. అలాగే లతాజీ కూడా సుశీలమ్మను తన నాల్గవ చెల్లెలుగా భావిస్తారు. చెన్నై ఎప్పుడొచ్చినా సుశీలగారిని చూడకుండా వెనుదిరిగేవారు కాదు. అలాగే ముంబాయి వెళితే లతాజీని కలవకుండాక రారు సుశీలమ్మ. అంతటి స్నేహం, గురుభావం ఇద్దరి మధ్య ఉంది. హిందీ సినిమాలలో లతా మంగేష్కర్ ‘మహల్’ (1949) సినిమాతో స్టార్డమ్లోకి వస్తే పి.సుశీల ‘మిస్సమ్మ’ (1955) సినిమాతో స్టార్డమ్లోకి వచ్చారు. సుశీలమ్మను సౌత్ ఇండియా లతా మంగేష్కర్ అని కూడా పిలుచుకుంటారట. వీరిద్దరి మధ్య స్నేహం ఉండేదట. ముఖ్యంగా 1969లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి సంవత్సరమే జాతీయ ఉత్తమ గాయనిగా సుశీల ఎంపికయ్యారు. ఈ సందర్భంగా చెన్నైలో ఏవీయం అధినేత మెయ్యప్పన్ చెట్టియార్‌గారు ఏర్పాటు చేసిన అభినందన సభకు ముఖ్య అతిథిగా లతామంగేష్కర్ విచ్చేశారు. తన తోటిగాయనిని ప్రత్యేకంగా సత్కరించడమే కాకుండా మరుసటిరోజు సుశీలగారి ఇంటికి వెళ్లి ఆమెకు బంగారు నెక్లెస్‌ను కూడా బహుకరించారు. అలాగే ఒకసారి చెన్నై వచ్చి సుశీలమ్మ తలుపు తట్టి ఆశ్చర్యపరిచారట లతా మంగేష్కర్. సుశీలమ్మ బయోపిక్, ఏ ఆర్ రహ్మాన్ సంగీత దర్శకుడు , ఆస్కార్ విన్నర్ ఏఆర్రహమాన్ ఇటీవల వెల్లడించారు. తొలి ప్రొడక్షన్ , క్లాసిక్ మూవీ ‘‘99 సాంగ్స్’’ ప్రమోషన్లో భాగంగా సుశీల తన బయోపిక్‌ను తీయాలనే తన కోరికను వ్యక్తం చేసినట్లు రెహమాన్ వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదలైన అనంతరం దీనఇన ఓటీటీలో కూడా విడుదల చేశారు. ఈ మూవీకి సంబంధించిన ఫీడ్‌బ్యాక్‌పై ఈఏడాది మేలో ట్విటర్ స్పేస్ సెషన్లో రెహమాన్ ఈ విషయాన్ని వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న 99 సాంగ్స్ చూశారా అని అడిగినపుడు చూడలేదని చెప్పారని, అయితే ఈ మూవీ తెలుగు వెర్షన్‌ను చూడాలని కోరినట్టు తెలిపారు. తన కోరిక మేరకు సినిమా చూసిన సుశీలమ్మ సినిమా చాలా బాగుందని ప్రశంసించడంతోపాటు, తన తన కథను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, మీరు సహాయం చేస్తారా? అని అడిగారని ఆ సందర్భంగా రివీల్ చేశారు. అంతేకాదు తన ఫ్యావరెట్ సింగర్ తన సినిమాకి ఈ విధంగా ప్రతిస్పందించడం చాలా సంతోషంగా అనిపించిందన్నారు. దీంతో తమ అభిమాన గాయని బయోపిక్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జానకికి తొలి అవార్డు జానకితోపాటు, తోటిగాయనీ మణులందరితోనూ కూడా సన్నిహిత సంబంధాలను కలిగి ఉండేవారు సుశీల. ముఖ్యంగా తన పేరిట తీసుకొచ్చిన తొలి అవార్డును ఎస్ జానకికి ఇచ్చి సత్కరించడాన్ని ఇండస్ట్రీలో గొప్పగా చెప్పుకుంటారు. రెండో ఏడాది గానగంధర్వుడు ఎస్ పీ బాలూకి, మూడవ ఏడాది కేజే ఏసుదాసుగారికి ఇచ్చారు. అంతేకాదు కొన్నివేల మంది గాయకులకు 2 వేలు పెన్షన్ అందిస్తున్నారు. ఫ్యామిలీ సుశీలమ్మగారి సోదరుడి కోసం వచ్చిన మోహన్‌రావు గారు సుశీలమ్మను చూసి ఇష్టపడ్డారు. ఆయనకు లతా మంగేష్కర్ అంటే మహా ఇష్టం. అయితే అప్పటికే పాటలు పాడుతున్న సుశీలగారు అభిమాని కావడంలో ఆశ్చర్యమేముంది. అలా ఆ తరువాత భర్త అయ్యారు. వివాహం తరువాత ఆయనకు నేనే లతా మంగేష్కర్. సుశీల భర్త వృత్తిరీత్యా వైద్యుడైన మోహనరావు. వీరికి జయకృష్ణ అనే కుమారుడు.. జయశ్రీ- శుభశ్రీ అనే ఇద్దరు మనమరాళ్ళు ఉన్నారు. ఆమె కోడలు సంధ్య జయకృష్ణ `ఇరువర్` అనే తమిళ చిత్రంలో ఏఆర్ రహమాన్‌తో కలసి అరంగేట్రం చేశారామె. అలా రెహామాన్కి సుశీలమ్మ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉంది. -
104కు వచ్చిన కాల్స్ 6 లక్షలకు పైనే..
సాక్షి, అమరావతి: కోవిడ్ సమయంలో అమల్లోకి తెచ్చిన 104 కాల్ సెంటర్ మరో మైలురాయిని అధిగమించింది. సోమవారం నాటికి 104కు కాల్ చేసిన వారి సంఖ్య 6 లక్షలు దాటింది. ఇందులో 2.60 లక్షల మందికి పైగా వివిధ ఆరోగ్య సమస్యల సమాచారం తెలుసుకునేందుకు కాల్ చేశారు. 87 వేల మందికి పైగా కోవిడ్ టెస్టు ఫలితాల కోసం, టీకా కోసం 37 వేల మందికి పైగా, కోవిడ్ టెస్ట్‌ల కోసం 1.12 లక్షల మంది, ఆస్పత్రుల్లో అడ్మిషన్ల కోసం 96 వేల మందికి పైగా కాల్ చేశారు. సోమవారం నాటికి వివిధ సమస్యల కోసం 104 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసిన వారి సంఖ్య 6,01,410కి చేరింది. ఇప్పటికీ 104 కాల్ సెంటర్లో 333 మంది సిబ్బందితో పాటు వైద్యులు మూడు షిఫ్ట్‌లలో పనిచేస్తున్నారు. సోమవారం ఒక్క రోజే 489 ఫోన్ కాల్స్ వచ్చినట్టు కాల్ సెంటర్ అధికారులు చెప్పారు. -
10 లక్షలమందికి ఫోన్లో వైద్యసేవలు
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 104 కాల్‌సెంటర్ బాధితులకు గొప్ప ఊరటనిచ్చింది. 2021 మే 1వ తేదీనుంచి 104 కాల్సెంటర్లో రిజిస్టర్ అయిన 5,523 మంది వైద్యులు ఇప్పటివరకు 10 లక్షలమంది బాధితులకు ఫోన్లో వైద్యసలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ వైద్యుల్లో 1,132 మంది స్పెషలిస్టులు. వీళ్లు టెలీ కన్సల్టేషన్ కింద ఈనెల 21వ తేదీ నాటికి 10,16,760 మందికి వైద్యసేవలు అందించారు. సేవలు పొందిన వారిలో 7.20 లక్షల మంది ఇంట్లో చికిత్స తీసుకుంటున్న వారే ఉన్నారు. కోవిడ్ సమయంలో బయటకు వెళ్లలేక ఇబ్బందులున్న పరిస్థితుల్లో ఏ రాష్ట్రంలోను చేయని విధంగా ఏపీలో మాత్రమే 104 కాల్‌సెంటర్ నుంచి టెలీకన్సల్టెన్సీ ద్వారా వైద్యులు సేవలు అందించారు. -
104 తక్షణం స్పందించాలి
సాక్షి, అమరావతి: కోవిడ్ బాధితులకు తక్షణం సేవలందించేలా 104 కాల్ సెంటర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఈ వ్యవస్థ పటిష్టంగా పనిచేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్ సెంటర్ పనితీరులో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు. ఈ విషయాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. అ«ధికారులు ప్రతిరోజూ మాక్ కాల్స్ చేసి ఆ వ్యవస్థ పని తీరును పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి ఆస్పత్రిలోనూ ఆరోగ్య మిత్ర ఉండాలని, ఎవరైనా సమస్య ఎదుర్కొంటే ఫిర్యాదు చేసేందుకు ప్రతి ఆస్పత్రిలోనూ నంబర్ ప్రదర్శించాలని ఆదేశించారు. కోవిడ్–19 నియంత్రణ, నివారణ, చికిత్సలపై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో కోవిడ్ స్పెషల్ ఆఫీసర్లు, టాస్క్‌ఫోర్స్ బృందంతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలు ఇవీ.. ఆస్పత్రుల ఆవరణల్లో జర్మన్ హేంగర్స్ కోవిడ్ రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అవసరాన్ని బట్టి ఆస్పత్రుల ఆవరణల్లోనే తాత్కాలికంగా జర్మన్ హేంగర్స్‌ను ఏర్పాటు చేసి అదనపు బెడ్లు ఏర్పాటు చేయాలి. దీనివల్ల పేషెంట్లు బయట వేచిచూసే పరిస్థితులు తొలగిపోయి సత్వరమే వైద్యం అందుతుంది. వాటికి ఆక్సిజన్ సదుపాయం కల్పించటాన్ని పరిశీలించాలి. సమీపంలోనే డాక్టర్లు ఉంటారు కాబట్టి పర్యవేక్షించేందుకు వీలుగా ఉంటుంది. 104కు కాల్ చేసిన వెంటనే కచ్చితంగా స్పందన ఉండాలని, అవసరమైన వారికి వెంటనే బెడ్ కల్పించాల్సిందేనని ఆదేశించారు. 104కు కాల్ చేస్తే ఫోన్ కలవలేదని, స్పందన లేదన్న మాట ఎక్కడా వినిపించకూడదన్నారు. 104కు కాల్ చేసిన తర్వాత కోవిడ్ బాధితులకు కచ్చితంగా సహాయం అందాల్సిందేనని స్పష్టం చేశారు. బెడ్ అవసరం లేదనుకుంటే పరిస్థితిని బట్టి కోవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని సూచించారు. 3 గంటల్లో మందుల కిట్లు ప్రస్తుత పరిస్థితుల్లో జ్వరం వస్తే కోవిడ్ లక్షణంగా భావించి వెంటనే మందులు ఇచ్చేలా చూడాలని వైద్య నిపుణులు పేర్కొన్నారని, ఆ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇంట్లో చికిత్స పొందాల్సిన రోగికి 3 గంటల్లోగా మందుల కిట్ పంపాలని ఆదేశించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు కమ్యూనిటీ ఆస్పత్రుల నుంచి బోధనాసుపత్రుల వరకు పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేసి సత్వరమే వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించేందుకు గట్టి చర్యలు రెమ్‌డెసివెర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెటింగ్‌ను నిరోధించేందుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. దీనిపై ఆడిట్ తప్పనిసరిగా ఉండాలని, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగంపై ఆడిటింగ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రుల్లో అవసరమైన ఇంజక్షన్లు రోగులకు అందుబాటులో ఉంచాలని, ఇంజక్షన్ల పేరిట దోచుకునే వ్యవహారాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం ఆదేశించారు. కోవిడ్– కర్ఫ్యూ రాష్ట్రంలో కర్ఫ్యూ అమలవుతున్న తీరుపై ప్రతి జిల్లానుంచి రోజూ నివేదిక ఇవ్వాలని డీజీపీని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్దేశించిన సమయంలో కర్ఫ్యూ అమలు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ప్రతి బుధవారం కోవిడ్‌రివ్యూ కమిటీలు సమావేశం కావాలని సీఎం ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రజా ప్రతినిధులు అధికారులకు వివరించే అవకాశం కలుగుతుందని, ఈ సమావేశంలో అందుతున్న ఫీడ్‌బ్యాక్‌ను పరిశీలించి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాల్సిందిగా సీఎం సూచించారు. హోం ఐసోలేషన్‌లో లక్షన్నర మంది రాష్ట్రంలో కోవిడ్ ఆస్పత్రులు, బెడ్ల వివరాలను అధికారులు సమీక్షా సమావేశంలో వివరించారు. రాష్ట్రానికి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కేటాయించగా, ఈనెల 8న 571 టన్నులు తీసుకున్నామని చెప్పారు. కనీసం 10 ఐఎస్ఓ క్రయోజనిక్ ట్యాంకర్లు కేటాయించాలని కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరామని తెలిపారు. తమిళనాడు, కర్ణాటక నుంచి అదనంగా ఆక్సిజన్ కోసం ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. తమిళనాడు నుంచి కనీసం 60 మెట్రిక్ టన్నులు, కర్ణాటక నుంచి 130 మెట్రిక్ టన్నులు ఆక్సిజన్ వస్తే కనీస అవసరాలు తీరుతాయని వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 638 కోవిడ్ ఆçస్పత్రుల్లో మొత్తం 47,644 బెడ్లు ఉండగా 39,271 బెడ్లు ఆక్యుపై అయినట్లు చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద 24,645 మంది చికిత్స పొందుతుండగా, కోవిడ్ కేర్ సెంటర్లలో మరో 15 వేల మంది ఉన్నారని తెలిపారు. ఐసీయూల్లో 6,789 బెడ్లు ఉండగా 6,317 ఆక్యుపై అయినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు పూర్తిగా ప్రైవేటు ఆస్పత్రి అనేవి లేవని, అన్నీ ఎంప్యానెల్ లేదా తాత్కాలిక ఎంప్యానెల్ ఆస్పత్రులేనని అధికారులు పేర్కొన్నారు. 102 కోవిడ్ కేర్ సెంటర్లలో 49,438 బెడ్లు ఉండగా 15,107 బెడ్లు ఆక్యుపైడ్ అని, హోం ఐసొలేషన్‌లో దాదాపు 1.5 లక్షల మంది ఉన్నారని అధికారులు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు 17,901 మంది నియామకం కోవిడ్ నియంత్రణ, నివారణ కోసం మొత్తం 20,793 మంది నియామకానికి ఆమోదం తెలపగా ఇప్పటి వరకు 17,901 మంది నియామకాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. కోవిడ్ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్‌కు చెందిన దాదాపు 3,500 మందిని తాత్కాలికంగా విధుల్లో నియమిస్తున్నామని తెలిపారు. -
104 Medical Helpline: 104కు భారీ స్పందన
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్‌కు సంబంధించి సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక్క ఫోన్ పలకరింపుతో పరిష్కారం చూపుతున్న 104 కాల్ సెంటర్ ఇప్పుడు సంజీవనిలా అయింది. ఫోన్ చేయగానే బాధితుడికి ఏం కావాలో అడిగి పరిష్కరిస్తున్నారు. కోవిడ్ టెస్టులు ఎక్కడ చేస్తున్నారు? కోవిడ్ చికిత్సకు అనుమతులు ఉన్న ఆస్పత్రులు ఎక్కడున్నాయి? ఏ ఆస్పత్రుల్లో పడకలున్నాయి? ఎక్కడ ఆక్సిజన్ లభ్యత ఉంది? వ్యాక్సిన్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి సమాచారం కోసం ఎక్కువ మంది 104కు ఫోన్ చేస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి 27వ తేదీ రాత్రి వరకూ 52,325 ఫోన్‌కాల్స్ వచ్చాయి. మూడు షిఫ్టుల్లో కాల్‌సెంటర్ ప్రస్తుతం గన్నవరంలో ఏర్పాటు చేసిన 104 కాల్ సెంటర్ 3 షిఫ్టుల్లో 300 మందికి పైగా ఎగ్జిక్యూటివ్‌లతో పనిచేస్తోంది. 21 మంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు. వీళ్లు కాకుండా 2,243 మంది వైద్యులు టెలీ కన్సల్టెంట్లుగా 104 కాల్‌సెంటర్‌కు అనుసంధానమయి ఉన్నారు. కాల్సెంటర్లో పనిచేస్తున్న వైద్యులు బిజీగా ఉంటే వెంటనే ఆ కాల్స్‌ను కన్సల్టెంట్ డాక్టర్‌కు డైవర్ట్ చేస్తారు. దీనివల్ల ఏ బాధితుడికీ ఇబ్బంది లేకుండా వెంటనే సమాధానం లభిస్తోంది. రోజుకు సగటున 7వేలకు పైగా కాల్స్ వస్తున్నాయి. 104 కాల్ సెంటర్ ద్వారా గడిచిన 12 రోజుల్లో 6,732 మందికి పడకలు లభించాయి. కోవిడ్ సమస్యలన్నిటికీ ఇక్కడే పరిష్కారం.. రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ సమస్యతో ఎవరు ఫోన్ చేసినా 104 కాల్ సెంటర్ నుంచి పరిష్కారం అయ్యేలా చేస్తున్నాం. ఎక్కడా సమాచారం రాదు అనుకున్నది కూడా 104కు చేస్తే లభిస్తుంది అనేలా చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు టెలీ కన్సల్టేషన్ డాక్టర్లను భారీగా పెంచాం. ప్రధానంగా పడకల కేటాయింపుపై దృష్టి సారించాం. – బాబు ఎ, 104 కాల్ సెంటర్ పర్యవేక్షణాధికారి -
కోవిడ్ కిట్ల నుంచి బెడ్లు దాకా.. 3 గంటల్లోనే..
104 కాల్‌సెంటర్ పూర్తి స్థాయిలో సమర్థంగా పని చేసేలా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలి. ఆ నంబర్‌కు ఫోన్ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలి. ఆస్పత్రికి వెళ్లడమా? క్వారంటైన్‌కు పంపడమా? హోం ఐసొలేషనా?.. ఏం చేయాలన్నది స్పష్టంగా చెప్పాలి. కోవిడ్‌కు సంబంధించిన అన్ని సమస్య లకు 104 నంబర్ వన్ స్టాప్ సొల్యూషన్ అన్నది ప్రజల్లోకి బలంగా వెళ్లాలి. ఆ స్థాయిలో కాల్ సెంటర్ పని చేయాలి. 104కి ఫోన్ చేసిన వెంటనే 3 గంటల్లోగా బెడ్‌తో సహా రోగులకు ఏది అవసరమో అది కేటాయించాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 104 కాల్సెంటర్లో తగిన సంఖ్యలో వైద్యులు అందుబాటులో ఉండాలి. అన్ని వ్యవస్థలు 104తో అనుసంధానం కావాలి. – సీఎం వైఎస్ జగన్ 48 గంటల్లో నియామకాలు.. పడకల సామర్థ్యానికి తగినట్లుగా అన్ని ఆస్పత్రులలో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలి. ఎక్కడ ఖాళీలున్నా వెంటనే వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించండి. 48 గంటల్లో నియామకాలు పూర్తి చేయాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: కోవిడ్ నియంత్రణ, నివారణకు సంబంధించి 104కి ఫోన్ చేసిన మూడు గంటల్లోగా కోవిడ్ కిట్ల నుంచి బెడ్స్ వరకు ఏదైనా సరే వెంటనే కేటాయించాలని సీఎం వైఎస్ జగన్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 104 కాల్‌సెంటర్ మరింత సమర్థంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి సారించాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఫ్లయింగ్ స్క్వాడ్లతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారా మెడికల్ సిబ్బంది పూర్తి స్థాయిలో ఉండాలని స్పష్టం చేశారు. ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి 48 గంటల్లోగా నియామకాలను పూర్తి చేయాలన్నారు. కోవిడ్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లు వాడాలని విజ్ఞప్తి చేశారు. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌పై పుకార్లు సృష్టించడం, తప్పుడు సమాచారం ప్రసారం చేయడం లాంటి చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించడంతోపాటు అరెస్టు చేసి జైలుకు పంపాలని ఆదేశించారు. కోవిడ్ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు సీఎం మార్గనిర్దేశం చేశారు. ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ వివరాలివీ.. కోవిడ్ ఆస్పత్రులు–బెడ్లు: కోవిడ్ చికిత్స కోసం అన్ని జిల్లాల్లో 355 ఆస్పత్రులను కలెక్టర్లు గుర్తించగా వాటిలో 28,377 బెడ్లున్నాయి. ప్రస్తుతం 17,901 బెడ్లు ఆక్యుపై అయ్యాయి. ఆ ఆస్పత్రులలో వైద్యం పూర్తిగా ఉచితం. మందులు కూడా ఫ్రీగా ఇవ్వాలి. కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్‌లో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జేసీలు పూర్తి దృష్టి సారించాలి.. జేసీలు (గ్రామ, వార్డు సచివాలయాలు – అభివృద్ధి) ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ఆ అధికారి అదేపనిలో నిమగ్నం కావాలి. అప్పుడే అనుకున్న స్థాయిలో సేవలందించగలుగుతాం. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స అందించే ఆరోగ్యశ్రీ ఆస్పత్రులను కూడా జేసీ పర్యవేక్షించాలి. నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, తగినంత మంది వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్‌డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు పని చేస్తున్నాయా? లేదా? అన్నది ప్రతి రోజూ చూడాలి. దాదాపు 355 కోవిడ్ ఆస్పత్రులు (ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్సకు అనుమతించిన ప్రైవేట్ ఆస్పత్రులు, కోవిడ్ చికిత్స చేస్తున్న ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు) వద్ద నిరంతరం పర్యవేక్షణ జరగాలి. కోవిడ్ కేర్ సెంటర్లు (సీసీసీ).. జిల్లాలో తగినన్ని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో 59 సీసీసీలు పని చేస్తుండగా 33,327 బెడ్లున్నాయి. కోవిడ్ కేర్ సెంటర్లలో నాణ్యతతో కూడిన ఆహారం, శానిటేషన్, ఔషధాల లభ్యత, వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది, హెల్ప్ డెస్క్‌లు, ఆరోగ్యమిత్రలు, సీసీటీవీ కెమెరాలు, రోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నారా? లేదా? అన్నది ప్రతి కలెక్టర్ చూడాలి. ఎక్కడా బెడ్ల కొరత లేకుండా కలెక్టర్లు శ్రద్ధ చూపాలి. ఆక్సిజన్ సరఫరా.. ప్రస్తుతం రోజుకు 320 నుంచి 340 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా అవుతోంది. ఇది ప్రస్తుతానికి సరిపోతోంది. ఆక్సిజన్ అవసరమైన వారికి తప్పనిసరిగా వెంటనే ఇవ్వాలి. ఆక్సిజన్ లెవెల్ 94 కంటే తక్కువ ఉంటే వెంటనే అందచేసేలా చర్యలు తీసుకోవాలి. నిరంతర తనిఖీలు.. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించి ఇన్ఛార్జ్లను నియమించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా నిరంతర తనిఖీలు జరపాలి. అందులో ఔషధ నియంత్రణ విభాగం అధికారులు కూడా ఉంటారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కోసం రాష్ట్ర స్థాయిలో ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేశాం. 50 మందికి మించి వద్దు.. ప్రజలు ఒకే చోట గుమికూడకుండా జాగ్రత్తలు పాటించాలి. పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంది. జిమ్‌లు, పార్కుల్లో అందరూ ఒకేచోట చేరకుండా చూడాలి. ఎక్కడా ఆర్థిక కార్యకలాపాలు ఆగిపోకూడదు. అదే సమయంలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరి. ఏ కార్యక్రమంలోనూ 50 మందికి మించి చేరకూడదు. వారి పట్ల కఠినంగా వ్యవహరించండి.. పుకార్లు, తప్పుడు సమాచారం ప్రచారం చేసే వారిపట్ల కఠినంగా వ్యవహరించండి. అరెస్టు చేయండి. అలాంటి వారిని జైలుకు పంపే అధికారం కూడా మీకు (అధికార యంత్రాంగం) ఉందన్న విషయం మర్చిపోవద్దు. ఈ విషయంలో అవసరమైతే ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలి. ప్రతి రోజూ అధికారిక బులెటిన్ ఇస్తారు. దాన్నే అందరూ తీసుకోవాలి. కోవిడ్ వల్ల ఇప్పటికే అందరూ భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లేనిపోని పుకార్లు సృష్టించి అసత్యాలు ప్రచారం చేస్తే, ప్రజల్లో ఆందోళన తీవ్రమవుతుంది. కాబట్టి అసత్య ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించొద్దు. లాక్‌డౌన్‌తో ప్రజలకు నాలుగింతలు నష్టం.. కోవిడ్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో కలెక్టర్లు వచ్చే కొద్ది నెలలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి ఒక్క రూపాయి నష్టం కలిగితే సామాన్యుడికి నాలుగు రూపాయలు నష్టం వాటిల్లుతుంది. గత ఏడాది లాక్డౌన్ వల్ల ప్రభుత్వానికి దాదాపు రూ.20 వేల కోట్ల నష్టం జరిగితే ప్రజలకు దాదాపు రూ.80 వేల కోట్ల నష్టం జరిగింది. కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితి.. దేశంలో ప్రస్తుతం నెలకు 7 కోట్ల వాక్సిన్ ఉత్పత్తి జరుగుతుండగా అందులో కోవాక్సిన్ కోటి డోస్‌లు తయారవుతున్నాయి. మిగతాది కోవిషీల్డ్. రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటివరకు 11.30 లక్షల మందికి రెండు డోసులు, దాదాపు 45.48 లక్షల మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. 18 – 45 ఏళ్ల వారికి కూడా వాక్సిన్ ఇస్తాం. అందరూ కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ మన పని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. అందరికీ టీకాల కార్యక్రమం పూర్తయ్యే వరకు కోవిడ్ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. – ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, బొత్స సత్యనారాయణ, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ వై.శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్ప: ఆ రోల్ చేయడానికి ఐశ్వర్య ఒప్పుకుంటుందా?
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అల్లుఅర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించనుండగా, ఆయనకు జోడీగా రష్మిక మందన్నా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరలవుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ నటించనున్నట్లు సమాచారం. పుష్పరాజ్ (బన్నీ)కు చెల్లెలుగా ఐశ్వర్యా కనిపించనున్నట్లు టాక్. అంతేకాకుండా అనుకోసి పరిస్థితుల్లో ఐశ్వర్యా చనిపోతుందని, దీనికి ఓ పోలీసు అధికారే కారణం అవుతాడని,దీంతో అతడిపై పుష్పరాజ్ ఎలా పగ తీర్చుకుంటాడన్న కథాంశాంతో మూవీ ఉండనుందట. మరి ఈ రోల్‌కు ఐశ్వర్యా ఓకే చెబుతుందా? లేక సిస్టర్ రోల్ అని సైడ్ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో పహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా బాలీవుడ్ నటి ఊశ్వరిరౌటేలా ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయనుంది. ఇలా అన్ని హంగులతో సినిమాపై ఇప్పటికే పాజిటివ్ హైప్ క్రియేట్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చదవండి : మరో రికార్డు సొంతం చేసుకున్న సిద్ శ్రీరామ్ 'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి' -
104 కమాండ్ కంట్రోల్ రూమ్ సేవలు బలోపేతం