సాక్షి, విశాఖపట్నం: నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద 104 ఉద్యోగులు గురువారం ధర్నా చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలంటూ చేతికి సంకెళ్ళు ధరించి ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం 104 ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ తమ డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు.
నెల్లూరు జిల్లాలోనూ..
నెల్లూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట 104 ఉద్యోగులు ధర్మపోరాట దీక్ష నిర్వహించారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
వైఎస్సార్ జిల్లాలోనూ..
వైఎస్సార్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో 104 కాంట్రాక్టు ఉద్యోగుల ఆందోళన చేపట్టారు. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పరిష్కరించడంతోపాటు 151 జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వీరి ఆందోళనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు నిత్యానందరెడ్డి, షఫీ, ఖాజా రహమతుల్లా తదితరులు మద్దతు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment