తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం | Telangana Government Suspends 104 Ambulance Services | Sakshi
Sakshi News home page

తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం.. 104 సేవలు బంద్‌

Published Wed, Jun 8 2022 6:18 PM | Last Updated on Thu, Jun 9 2022 5:10 PM

Telangana Government Suspends 104 Ambulance Services - Sakshi

తెలంగాణ ప‍్రభుత‍్వం మరో సంచలన నిర‍్ణయం తీసుకుంది. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న 104 అంబులెన్స్‌ సేవలకు స్వస్థి పలికింది. 104 వాహనాల సేవలను రద్దు చేస్తూ బుధవారం జీవోను విడుదల చేసింది. దీంతో మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అంబులెన్స్‌ సేవలను కోల్పోనున్నారు. 

ఇక, 104 వాహనాల సేవలు నిలిచిపోనుండటంతో పనిచేస్తున్న అంబులెన్సులను త్వరలో వేలం వేయనున్నట్టు ప‍్రభుత‍్వం తెలిపింది. తెలంగాణవ్యాప్తంగా ఉన్న వాహనాలను వేలం వేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.

ఇదిలా ఉండగా, 104 అంబులెన్స్​ సర్వీసులను 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప‍్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. మారుమూల ప్రాంతాల్లో బీపీ, షుగర్, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి స్థానికంగా ట్రీట్​మెంట్​ అందించేందుకు ఈ అంబులెన్స్‌లను తీసుకువచ్చారు. ప్రభుత్వం ఈ వాహనాల్లో ఫార్మసిస్ట్, ఏఎన్‌ఎం, ల్యాబ్​టెక్నీషియన్, మెడికల్‌ అసిస్టెంట్‌, డ్రైవర్లను నియమించింది. 

ఇది కూడా చదవండి: రోగులకు మందుల సరఫరాకు బ్రేక్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement