బాలికలతో వికృత చేష్టలు
దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు
సస్పెండ్ చేసిన విద్యాశాఖ
మంచిర్యాల అర్బన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. అభంశుభం తెలి యని బాలి కల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం మంగళ వారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఓ పాఠశాలలో ఎస్‌ఏ(తెలుగు) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.సత్యనారాయణ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ప్రధానోపా ద్యాయురాలితో పాటు డీఈవో యాదయ్యకు సమాచారం అందించారు.
ఆయన మంగళవారం ఎంఈవో, సెక్టోరల్ అధికారులను విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో విచారణ చేప ట్టారు. సత్యనారాయణ అసభ్యకరంగా తాకుతు న్నాడని, కళ్లు మూసుకుని ధ్యానం చేయాలంటూ సెల్‌ఫోన్‌లో చిత్రీ కరించాడని బాలికలు పేర్కొన్నారు. మాటల్లో చెప్పరాని విషయా లను లిఖిత పూర్వకంగా ఇచ్చారు.
విచారణ అధికారులు వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని బయటకు రావాలని తల్లిదండ్రులు పదేపదే పిలి చినా రాకపోవడంతో ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. కాగా, సత్యనారాయణ గతంలో ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment