
మంచిర్యాలటౌన్: చిన్ననాటి నుంచి చదువులో రాణిస్తూ వరుసగా ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన బొడ్డు సంకీర్తన. పట్టణంలోని రాంనగర్‌కు చెందిన బొడ్డు భీమయ్య, మల్లక్క దంపతులకు కుమారుడు సాయికిరణ్, కుమార్తె సంకీర్తన సంతానం. భీమయ్య హమాలి పనిచేస్తూ తన ఇద్దరు పిల్లలను ఉన్నత చదువులు చదివించాడు.
పదోతరగతి మంచిర్యాల జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో, డిగ్రీ కోటి ఉమెన్స్ కళాశాలలో చదివిన సంకీర్తన 2023లో కానిస్టేబుల్ ఉద్యోగం సాధించింది. అందులో చేరకుండానే గ్రూప్–4 రాసి మంచిర్యాలలోని జ్యోతిబాపూలే బీసీ గురుకులంలో జూనియర్ అసిస్టెంటుగా ఉద్యోగం సాధించింది. విధులు నిర్వహిస్తూనే మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించిన సీడీపీవో పరీక్షతో పాటు, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్‌వైజర్) గ్రేడ్–1లో రెండు ఉద్యోగాలు సాధించింది.
సీడీపీవో ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 12వ ర్యాంకు, మల్టీజోన్ కేటగిరీలో 7వ ర్యాంకు సాధించింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్(సూపర్‌వైజర్) గ్రేడ్ 1 మహిళా, శిశు అభివృద్ధి శాఖ ఫలితాలను బుధవారం ప్రకటించగా, రాష్ట్రస్థాయిలో 2వ ర్యాంకు, మల్టీజోన్‌లో 1వ ర్యాంకు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment