![Telangana High Court Suspends 402 Go Relating To Teachers Mutual Transfers - Sakshi](/styles/webp/s3/article_images/2022/04/12/Untitled-9_0.jpg.webp?itok=yhBqiEjl)
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరస్పర బదిలీ (మ్యూచువల్)లకు సంబంధించిన మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీచేసిన జీవో 402ను హైకోర్టు సస్పెండ్ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విజయసేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా జీవో 402 జారీ చేశారని పలువురు ఉపాధ్యాయులు వేసిన పిటిషన్లను న్యాయమూర్తి విచారించారు.
‘పరస్పర బదిలీలతో సీనియారిటీ కోల్పోవాల్సి ఉంటుంది. అయితే రాష్ట్రప్రభుత్వం సీనియారిటీ కోల్పోకుండా జీవో 402 జారీచేసింది. కానీ ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధం’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను జూన్ 20కి న్యాయమూర్తి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment