Satyanarayana
-
రిబ్బన్ కటింగ్ కు దొర్కలేదు.. ఎమ్మెల్యేకు కత్తెర
-
రిబ్బన్ కటింగ్‌కి కత్తెర లేదా?.. ఎమ్మెల్యే గిడ్డి అసహనం
సాక్షి, కోనసీమ జిల్లా: అంబాజీపేట మండలంలో క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. క్రీడోత్సవాల కోసం అంబాజీపేట జడ్పీ హైస్కూల్లో అధికారులు అరకొర ఏర్పాట్లు చేశారు. స్కూల్ మేనేజజ్మెంట్ కమిటీకి కనీసం హెచ్ఎంకు కూడా భాగస్వాము లేకుండా క్రీడోత్సవాలు ఏర్పాటు చేయటంపై ఆయన మండిపడ్డారు.కనీసం స్వాగత ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోవడంతో పాటు, రిబ్బన్ కటింగ్‌కి కత్తెర కూడా సకాలంలో అందచేయలేకపోవడంతో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తమకు చెబితే క్రీడోత్సవాల ఏర్పాట్లు తామే చేసుకుంటామంటూ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, క్రీడోత్సవాల ఏర్పాట్లపై ఎంఈవోలను కూటమి నేతలు నిలదీశారు. దీంతో తూతూ మంత్రంగా ప్రారంభించిన ఎమ్మెల్యే గిడ్డి అలిగి వెళ్లిపోయారు. -
ఓటీటీలో వివాదాస్పద సినిమా.. 'రజాకార్'పై ప్రకటన
'రజాకార్' చిత్రం ఓటీటీలోకి వచ్చేస్తుంది. తెలంగాణ చరిత్రలో జరిగిన కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు దర్శకుడు యాటా సత్యనారాయణ తెలిపారు. మార్చి 15న విడుదలైన ఈ మూవీ ఒక వర్గం వారిని కించపరిచే విధంగా ఉందంటూ పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. థియేటర్లో కాస్త పర్వాలేదని మెప్పించిన ఈ మూవీ విమర్శల కారణంగా ఇప్పటి వరకు ఓటీటీలో స్ట్రీమింగ్కు రాలేదు. అయితే, సుమారు 9 నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదల కానున్నట్లు 'ఆహా' నుంచి ప్రకటన వచ్చేసింది.గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలయింది. తెలంగాణ పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే 'రజాకార్' నిర్మించినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను 'ఆహా' సంస్ధ సొంతం చేసుకుంది. ఈమేరకు తన సోషల్‌మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. త్వరలో రజాకర్ చిత్రాన్ని స్ట్రీమింగ్కు తీసుకురానున్నట్లు ఆహా ప్రకటించడంతో సినిమా చూడాలని కోరుకునేవారు సంతోషిస్తున్నారు. అయితే, ఎప్పుడు విడుదల చేస్తామనే విషయాన్ని మాత్రం రివీల్ చేయలేదు. కానీ, డిసెంబర్ 20న ఓటీటీలో విడుదల కానుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది.బాబీ సింహా, అనసూయ, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్ పాండే వంటి ముఖ్య నటీనటులు రజాకర్ చిత్రంలో నటించారు. భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం కావడానికి ముందు రజాకార్లు సాగించిన అకృత్యాలను ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు దర్శకుడు చెప్పారు. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
‘ఉత్తమ’ టీచర్.. చెత్త పనులు
మంచిర్యాల అర్బన్: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరించాడు. అభంశుభం తెలి యని బాలి కల పట్ల వికృత చేష్టలకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయ వృత్తికే కళంకం తెచ్చిన ఈ కీచక ఉపాధ్యాయుడి ఉదంతం మంగళ వారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రం మంచిర్యాలలోని ఓ పాఠశాలలో ఎస్ఏ(తెలుగు) టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్న టి.సత్యనారాయణ కొన్ని రోజులుగా విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. దీంతో తల్లిదండ్రులు ప్రధానోపా ద్యాయురాలితో పాటు డీఈవో యాదయ్యకు సమాచారం అందించారు. ఆయన మంగళవారం ఎంఈవో, సెక్టోరల్ అధికారులను విచారణకు ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమక్షంలో విచారణ చేప ట్టారు. సత్యనారాయణ అసభ్యకరంగా తాకుతు న్నాడని, కళ్లు మూసుకుని ధ్యానం చేయాలంటూ సెల్ఫోన్లో చిత్రీ కరించాడని బాలికలు పేర్కొన్నారు. మాటల్లో చెప్పరాని విషయా లను లిఖిత పూర్వకంగా ఇచ్చారు. విచారణ అధికారులు వెళ్లిన తర్వాత ఆ ఉపాధ్యాయుడిని బయటకు రావాలని తల్లిదండ్రులు పదేపదే పిలి చినా రాకపోవడంతో ఆగ్రహించి దేహశుద్ధి చేశారు. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సత్యనారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈవో ప్రకటించారు. కాగా, సత్యనారాయణ గతంలో ఉత్తమ టీచర్ అవార్డు కూడా అందుకున్నట్లు తెలుస్తోంది. -
మెజార్టీ నిందితులకు భూముల్లేవు
వికారాబాద్: తమ వద్ద పక్కా సాక్ష్యాధారాలు ఉన్నందునే లగచర్ల ఘటనలో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చి అరెస్టు చేశామని ఐజీ సత్యనారాయణ చెప్పారు. బుధవారం కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో భేటీ అయిన ఆయన, ఆ తర్వాత ఎస్పీ నారాయణతో కలిసి మీడియాతో మాట్లాడారు. లగచర్ల ఘటనకు సంబంధించి నరేందర్‌రెడ్డితో పాటు మరో 20 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని తెలిపారు. కోర్టులో హాజరుపర్చిన సమయంలో జరిగిన వాదనల సందర్భంగా సాంకేతిక ఆధారాలతో పాటు ఇతర ప్రాథమిక ఆధారాలు సమరి్పంచామని వెల్లడించారు. కలెక్టర్‌తో పాటు అధికారులపై జరిగిన దాడిపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని చెప్పారు. ముందుగా 57 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రశ్నించిన తర్వాత ఘటనతో సంబంధం లేని 40 మందిని విడుదల చేశామని చెప్పారు. దాడిలో పాల్గొన్నవారిలో 42 మందిని గుర్తించామని, అయితే ఇందులో 19 మంది ఏ సంబంధం లేకుండానే దాడిలో పాల్గొన్నారని వెల్లడించారు. మెజార్టీ నిందితులకు అక్కడ భూములు లేవని, ముందస్తు కుట్రలో భాగంగానే ఈ ఘటన జరిగినట్టుగా ఆధారాలున్నాయని ఐజీ చెప్పారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామన్నారు. తొలుత ఏ–1గా సురేశ్ ఉండగా దర్యాప్తు తర్వాత లభ్యమైన సాక్ష్యాధారాలతో నరేందర్‌రెడ్డిని ఏ–1గా చేర్చామని వివరించారు. దాడిలో సురేష్, మహేశ్, దేవదాస్, గోపాల్‌నాయక్, విఠల్, రాజు, విజయ్ ప్రధాన భూమిక పోషించారన్నారు. ఈ కేసులో ఇంకా చాలామందిని గుర్తించాల్సి ఉందన్నారు. గతంలో సురేష్ పై కేసులున్నాయని, రేప్ కేస్ ఉంటే మేనేజ్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. తదుపరి దర్యాప్తులో అన్ని విషయాలను గుర్తిస్తామని పేర్కొన్నారు. రిమాండ్‌కు తరలించింది వీరినే..ఏ1 పట్నం నరేందర్‌రెడ్డి, ఏ 21 బోగమోని మహేశ్, ఏ 22 బ్యాగరి విశాల్, ఏ 24 నీరటి సాయిలు, ఏ 27 నీరటి రమేశ్ (వీరిని బుధవారం అరె స్టు చేశారు), ఏ 3 ఎ.శివకుమార్, ఏ 11 మైలారం విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ 14 హీర్యానాయక్, ఏ 15 పతీవత్ శ్రీను, ఏ 16 పతీవత్ ప్రవీణ్, ఏ 17 పతీవత్ వినోద్, ఏ 18 రాథోడ్ వినోద్, ఏ 19 జర్పాల హీర్యానాయక్, ఏ 20 బాస్యానాయక్, ఏ 23 బ్యా గరి యాదయ్య, ఏ 25 దోరేమోని రమేష్, ఏ 26 కావ లి రాఘవేందర్, ఏ 28 లక్ష్మయ్య, ఏ29 నీలి రవి, ఏ 30 శ్రీశైలం, ఏ 31 బాలకిష్టయ్య (వీరిని మంగళవారం రాత్రి అరెస్టు చేశారు). -
ముగ్గురు సీఐలు, 13 మంది ఎస్సైలపై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణా కట్టడిలో విఫలమైన, నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ కొరడా ఝుళిపించారు. ఒకేసారి మల్టీజోన్–2లోని తొమ్మిది జిల్లాల్లో ముగ్గురు ఇన్స్పెక్టర్లు, 13 మంది ఎస్సైలను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. వేటు పడిన వారిలో కొందరికి ఇసుక అక్రమ రవాణాలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలు ఉన్నట్టు నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణ తర్వాతే చర్యలు తీసుకున్నట్టు ఐజీ స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో 14 మంది ఎస్సైలను వారు పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ చేసినట్టు వెల్లడించారు. ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్, మట్కాలకు సహకరిస్తే కఠిన చర్యలు తప్పవని ఐజీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వేటు పడింది వీరిపైనే..సంగారెడ్డి రూరల్, తాండూర్ రూరల్, తాండూరు టౌన్ సీఐలతోపాటు వీపనగండ్ల, బిజినేపల్లి, తెలకపల్లి, వంగూరు, ఉప్పనూతల, సంగారెడ్డి రూరల్, పెద్దేముల్, యాలాల్, తుంగతుర్తి, ఆత్మకూర్ (ఎస్), పెన్‌పహాడ్, వాడపల్లి, హాలియా ఎస్సైలు ఉన్నారు. త్వరలో వీరిని లూప్లైన్కు బదిలీ చేస్తామని ఐజీ తెలిపారు. రాష్ట్ర నిఘా అధికారుల నివేదికలు, ఇతర విచారణల ద్వారా ఈ చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. ఇప్పటికే అడవిదేవులపల్లి, వేములపల్లి, నార్కట్‌పల్లి, చండూర్, మాడుగులపల్లి, తిప్పర్తి, చింతలపాలెం, తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, అచ్చంపేట, బొంరాస్‌పేట, తాండూర్, చిన్నంబావి ఎస్సైలను స్థానచలనం చేసినట్టు పేర్కొన్నారు.వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్పై వేటుజోగిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న సమయంలో ఓబా లికపై జరిగిన రేప్ కేసులో అలసత్వం, దర్యాప్తులో అవకతవక లకు పాల్పడినందుకు సీఐ నాగరాజును సస్పెండ్ చేసినట్టు మల్టీజోన్–2 ఐజీ సత్యనారాయణ తెలిపారు. నాగరాజు ప్రస్తుతం వికారాబాద్ టౌన్ ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాడు.రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఫోకస్ పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కూడా ఫోకస్ పెట్టనున్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. దీనిపై ఇప్పటికే రహస్య విచారణ జరుగుతోందని, రేషన్ బియ్యం అక్రమ రవాణాలో స్థానిక నిందితులతోపాటు అంతర్రాష్ట్రంగా అక్రమ రవాణా చేసే ప్రధాన నిందితులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా జిల్లాల ఎస్పీలను ఐజీ ఆదేశించారు. -
బొలిశెట్టి వ్యాఖ్యలపై దుమారం
విశాఖ సిటీ: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులను అవమానిస్తూ జనసేన పార్టీ నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 1,314 రోజులుగా స్టీల్‌ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులు చేస్తున్న పోరాటాలు దొంగ ఉద్యమాలని బొలిశెట్టి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ‘దుకాణాల మాదిరిగా టెంట్లు వేసుకుని కూర్చున్న వారు పవన్‌కళ్యాణ్‌ను ఎందుకు కలవలేదని, వారిని చాచిపెట్టి కొట్టాల’న్న బొలిశెట్టి వ్యాఖ్యలపై కార్మికులు, ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ స్టాండా? అని ప్రశ్నిస్తున్నారు. అదే వారి విధానమైతే తాము స్టీల్‌ప్లాంట్ కోసమే కాకుండా.. జనసేన పార్టీకి వ్యతిరేకంగా కూడా ఉద్యమిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.ఆ వ్యాఖ్యలు పట్టించుకోంకార్మిక సంఘాల ఉద్యమాల వల్లే ప్రైవేటీకరణ ఇంతకాలం ఆగిందని బహిరంగ సభలో పవన్చెప్పారు. బొలిశెట్టి జనసేనలో ఉంటూ బాధ్యతారహితంగా మాట్లాడుతూ ఆ పార్టీ పరువు తీస్తున్నారు. – డి.ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఏఐటీయూసీక్షమాపణ చెప్పాలిఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం ఇది. ఏనాడూ బొలిశెట్టి కార్మికుల ఉద్యమంలో పాల్గొనలేదు. ఆయన భేషరతుగా క్షమాపణ చెప్పాలి. దమ్ముంటే టెంట్ వద్దకు వచ్చి ఆ మాట చెప్పాలి. – రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి, స్టీల్ ఐఎన్టీయూసీసంఘాల వల్లే ప్రైవేటీకరణ ఆగిందికార్మిక సంఘాలు ఉండబట్టే ఇప్పటివరకు ప్రైవేటీకరణ ఆగింది. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ సీఐటీయూ పోరాటాల వల్ల ఆగింది తప్ప.. పవన్‌కళ్యాణ్ వల్ల కాదు. ఈ విషయాలేవీ బొలిశెట్టికి తెలియదేమో. – యు.రామస్వామి, ప్రధాన కార్యదర్శి, స్టీల్ సీఐటీయూవిమర్శలు అర్థరహితంస్టీల్ప్లాంట్ కార్మిక సంఘాలపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన విమర్శలు అర్థరహితం. జనసేన అధికారంలోకి వచ్చాకే కార్మిక సంఘాలు మంచివి కావని ఆయనకు తెలిసిందా. – వై.మస్తానప్ప, ప్రధాన కార్యదర్శి, స్టీల్ వైఎస్సార్టీయూసీ -
విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు
విశాఖపట్నం, సాక్షి: కార్మిక సంఘాల నాయకులు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను అమ్మేయాలని చూస్తున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో సోమవారం ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘స్టీల్ ప్లాంట్‌ను ఎలా అమ్మేయాలా అని చూస్తున్న వారిలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది కార్మిక సంఘాల నేతలే. ఏదో ఒక యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు. ఈ నెల 19న పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు కార్మిక సంఘాల నేతలు వెళ్తున్నారని తెలిసి ఇలా స్పందిస్తున్నా’ అని పేర్కొన్నారు. ఫిబ్రవరి 2021లో అమిత్‌షా వద్దకు పవన్ కల్యాణ్ వెళ్లి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించవద్దంటూ ఉక్కు సెంటిమెంట్‌ను ఆయన దృష్టికి తీసుకెళ్లారని, ఆ సమయానికి స్టీల్‌ప్లాంట్‌లో ఒక్క ఉద్యమం కూడా మొదలవలేదని పేర్కొన్నారు.ప్రైవేటీకరణ ఆగిపోతే ఎక్కడ పవన్‌కు క్రెడిట్ వచ్చేస్తుందోనని ఈ నాయకులు దుకాణాలు తెరిచారని ఎద్దేవా చేశారు. ఉక్కు నిర్వాసితుల్ని పక్కనపెట్టి కార్మిక సంఘాలు పెద్ద టెంట్ పెట్టుకుని తూతూమంత్రంగా ఉద్యమాన్ని నడిపారని ఆక్షేపించారు. అక్టోబర్ 2021లో అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేస్తే.. అప్పటి ప్రభుత్వానికి, విజయసాయిరెడ్డికి, బొత్సకు ఎవరికీ పట్టలేదన్నారు. పవన్ కల్యాణ్ నిరాహార దీక్షకు కార్మిక సంఘాల నేతలు ఎవరూ ముందుకురాలేదని, వీరంతా ప్రైవేటీకరణకు పూర్తిగా సహకరించిన వారేనని ఆరోపించారు. 10 ఫిబ్రవరి 2021న ప్రైవేటీకరణ ప్రకటన దశలోనే @PawanKalyan గారు డిల్లీ వెళ్లి కేంద్రంలో అధికారులను, కేంద్ర హోం మంత్రి @AmitShah గారిని కలిసి విశాఖ ఉక్కు కర్మాగారం 32మంది ప్రాణత్యాగం వల్ల వచ్చిందని దీని వెనుక తెలుగు ప్రజల సెంటిమెంటు ఉందని కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణ పరిశ్రమల నుండి… pic.twitter.com/c9BCRVidbO— Bolisetty Satyanarayana (@bolisetti_satya) September 16, 2024అప్పటి ప్రభుత్వం కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఊరుకుందన్నారు. అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, ఒత్తిడి తీసుకొస్తే అప్పుడే ఫలితం వచ్చేదన్నారు. వైఎస్సార్సీపీ నేతలు తామే ఇన్నాళ్లూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపినట్టు చెబుతున్నారని, వారి హయాంలోనే చాపకింద నీరులా ప్రైవేటీకరణ ప్రక్రియ అంతా జరిగిందని వ్యాఖ్యానించారు. నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలి పవన్‌ను కలిసే ముందు పాత పద్ధతిలో తువ్వాలు మెడకు చుట్టి కొట్టినట్టు.. యూనియన్ నాయకులందర్నీ చాచిపెట్టి కొట్టాలంటూ బొలిశెట్టి పరుష పదజాలాన్ని వాడారు. జనసేన వెంట ఆనాడు రమ్మంటే ఎవరూ రాలేదని, తాళి కట్టించుకోవడం ఒకడితో.. సంసారం మరొకడితో అన్నట్టు కొంతమంది యూనియన్ నాయకుల్ని వెధవలంటూ ధ్వజమెత్తారు. పవన్‌తోపాటు, సీఎం చంద్రబాబును సమన్వయం చేసుకుంటూ అన్ని పార్టీలు కలిసి నిలబడితే తప్ప స్టీల్‌ప్లాంట్‌ను నిలబెట్టుకోలేమని పేర్కొన్నారు.పవన్‌ను కలవాలని పోరాట కమిటీ నిర్ణయం ఉక్కు నగరం: ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు త్వరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు సోమవారం జరిగిన ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ భేటీలో నిర్ణయించారు. ఇటీవల వరదలతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాలకు ఉక్కు ఉద్యోగులు సగం రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చేందుకు అంగీకరించారు. సమావేశంలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, కేఎస్ఎన్ రావు, అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, జి.గణపతిరెడ్డి, రామ్మోహన్కుమార్, కామేష్, వరసాల శ్రీనివాసరావు, శ్రీనివాసనాయుడు, సురేష్ పాల్గొన్నారు. -
టీడీపీ వేధింపులతో వైఎస్సార్సీపీ నేత ఆత్మహత్య
-
రెచ్చిపోతున్న ఇసుక స్మగ్లర్లు
ముస్తాబాద్ (సిరిసిల్ల): ఇసుక స్మగ్లర్ల ఆగడాలు జిల్లాలో పరాకాష్టకు చేరుకున్నాయి. పోలీసులు పట్టుకున్న ఇసుక ట్రాక్టర్‌ను స్టేషన్‌కు తరలించే క్రమంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌పై ఇసుక స్మగ్లర్ దాడి చేశాడు. ఈ ఘటనలో కానిస్టేబుల్ తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం ప్రకారం.. ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లె మానేరు వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా అవుతోందన్న సమాచారంతో ఎస్సై ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి తనిఖీలకు వెళ్లారు. రాంరెడ్డిపల్లె, నామాపూర్ గ్రామాల మధ్య ఐదు ట్రాక్టర్లను పట్టుకున్నారు. వాటిని ఠాణాకు తరలిస్తుండగా, గోపాల్పల్లెకు చెందిన భూక్య గురుబాబు తన కారులో నామాపూర్ చేరుకున్నాడు. ‘నా బండినే పట్టుకుంటారా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ సత్యనారాయణపై దాడికి దిగాడు. దీంతో కానిస్టేబుల్ ఎదురుతిరిగి ట్రాక్టర్‌ను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లాల్సిందేనని పట్టుబట్టాడు. అక్కడికి చేరుకున్న ఎస్సై ట్రాక్టర్‌ను ఠాణాకు తీసుకెళ్లాలని హెచ్చరించాడు. దీంతో గురుబాబు ట్రాక్టర్‌ను నడిపాడు. ఆ సమయంలో కానిస్టేబుల్ సత్యనారాయణ ట్రాక్టర్ ఇంజిన్‌పై కూర్చోగా, నామాపూర్ శివారులోని మేళ్ల చెరువు వద్దకు చేరుకోగానే గురుబాబు ట్రాక్టర్‌ను వేగంగా నడుపుతూ చెరువులోకి తీసుకెళ్లి.. తాను కిందకి దూకి పారిపోయాడు. ట్రాక్టర్‌పై ఉన్న కానిస్టేబుల్ చెరువులోని బండరాళ్లపై పడిపోగా నడుము భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ చెరువు నీటిలో మునిగిపోయింది. అటుగా వచ్చిన ఎస్సై వెంటనే కానిస్టేబుల్‌ను 108లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గురుబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
ఒకే ఒక్క రైస్ మిల్లు... రూ. వంద కోట్ల ధాన్యం దగా
కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ సమీపంలోని కొమరబండంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండస్ట్రీస్ యాజమాన్యం ప్రభుత్వం సరఫరా చేసిన రూ.100 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు అధికారులు గుర్తించారు. గడిచిన రెండేళ్లుగా సీఎంఆర్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న ఈ మిల్లుపై మంగళవారం రాష్ట్ర విజిలెన్స్, పౌరసరఫరాలశాఖ, రెవెన్యూ, పోలీస్‌శాఖల అధికారులు 30 మంది బృందంగా ఏర్పడి మూకుమ్మడి దాడి చేశారు. దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన మిల్లు యజమాని నీలా సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యులు, మిల్లు భాగస్వాములు పరారైనట్లు అధికారులు తెలిపారు. దాడుల నిర్వహిస్తున్న టీమ్‌లకు జిల్లా అడిషనల్ కలెక్టర్ బీఎస్ లత, కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, పోలీస్ అధికారులు సహకారం అందించారు. 3 సీజన్ల నుంచి బియ్యం ఇవ్వడంలేదు. కొమరబండ వద్ద ఉన్న శ్రీ వెంకటేశ్వర రైస్ ఇండ్రస్ట్రీస్ గత రెండేళ్లుగా, మూడు సీజన్లకు సంబంధించి సుమారు రూ.90 కోట్ల విలువ చేసే కస్టమ్ మిల్లింగ్ రైస్ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు తెలిపారు. 2022–23 వానాకాలం సీజన్‌కు సంబంధించి 15,628 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 7,067 టన్నులు ఆ మిల్లు ఇచ్చిందనీ, 8,607 టన్నుల బియ్యం బకాయి పడిందని చెప్పారు. ఇక ఇదే సంవత్సరం యాసంగి సీజన్‌కు సంబంధించి 10,408 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 202 టన్నుల బియ్యం మాత్రమే సదరు మిల్లు నుంచి వచ్చిందని, 10, 206 టన్నులు బకాయి పడిందని వివరించారు. దీంతో పాటు 2023–24 వానాకాలం సీజన్‌కు సంబంధించి 2748 టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉండగా 261 టన్నులు మాత్రమే వచ్చిందనీ, ఇంకా 2487 టన్నులు బకాయి ఉందని తెలిపారు. ఈ మూడు సీజన్లకు సంబంధించి మొత్తం 21,300 టన్నుల బియ్యం ఇవ్వాలని దీని విలువ రూ.90 కోట్ల వరకు ఉంటుందని, అపరాధ రుసుంతో కలిపితే దాదాపు రూ.100 కోట్లు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ధాన్యం పక్కదారి పట్టించిన మిల్లర్ కోదాడకు చెందిన శ్రీ వెంకటేశ్వరరైస్ ఇండ్రస్ట్రీస్ యజమాని నీల సత్యనారాయణ కస్టమ్ మిల్లింగ్ రైస్ సక్రమంగా ఇవ్వకపోవడంతో 2022–23 యాసంగి సీజన్‌కు సంబంధించి మిల్లుకు కేటాయించిన 15,237 టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర స్థాయిలో వేలం వేశారు. వేలంలో ధాన్యం దక్కించుకున్న వారు మిల్లు వద్దకు ధాన్యం కోసం వెళితే అక్కడ ఆ ధాన్యం లేదని చెప్పి, దాన్ని మర పట్టించి ఆ బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్లో అమ్ముకున్నట్లు అధికారులు తెలిపారు. ఇలా ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లర్‌పై పూర్తి నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. -
ఇంటింటి ప్రచారం లో ప్రజలు అంటున్న మాటలు
-
చరిత్ర తెలియజేసే రజాకార్
‘‘రజాకార్’ ముస్లింలకు వ్యతిరేకమైన సినిమా కాదు. మన చరిత్ర గురించి తెలియజేసే చిత్రం. నాటి కాలంలో జరిగిన దుర్మార్గాలను ప్రజలకు తెలియజేసేలా తెరకెక్కించిన మూవీ. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం కావాలి. దర్శకుడు సత్యనారాయణ, నిర్మాత నారాయణరెడ్డిలకు ధన్యవాదాలు’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. బాబీ సింహా, వేదిక, అనుష్యా త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ, మకరంద్ దేశ్‌పాండే నటీనటులుగా యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘రజాకార్’. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, హిందీ భాషల్లో విడుదలవుతోంది. గురువారం జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో యాటా సత్యనారాయణ మాట్లాడుతూ– ‘‘తెలంగాణ చరిత్రపై ‘రజాకార్’ చేసే చాన్స్ ఇచ్చిన నారాయణరెడ్డిగారికి ధన్యవాదాలు’’ అన్నారు. ‘‘మన పోరాట యోధుల గురించి రాబోయే తరాలకు చెప్పాలనే ‘రజాకార్’ నిర్మించాను’’ అన్నారు గూడూరు నారాయణ రెడ్డి. -
కుటుంబాన్ని వదిలి పార్టీ కోసం పనిచేశా: బొలిశెట్టి
-
చేతులెత్తి మొక్కుతున్నాం..
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ఎమ్మెల్సీలుగా రాజ్యాంగబద్ధంగా నామినేటైన తమ అభ్యర్థిత్వాన్ని ఆమోదించాలని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ.. గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తమ పేర్లను ఆమోదించాల్సిందిగా చేతులెత్తి మొక్కుతున్నట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ అయిన దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ సోమవారం రాజ్‌భవన్‌లో వినతిపత్రం సమరి్పంచారు. తమ విజ్ఞాపనతో పాటు ఇటీవల హైకోర్టు వెలువరించిన 88 పేజీల తీర్పు కాపీని కూడా జత చేసి గవర్నర్ కార్యాలయంలో అందజేశారు. తమను ఎమ్మెల్సీలుగా ఆమోదించాలని రాజ్‌భవన్ గేట్లకు మొక్కారు. రాజ్యాంగ ఉల్లంఘనపై హైకోర్టుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేట్ చేసినా, 55 రోజుల తర్వాత కేబినెట్ ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించారని దాసోజు శ్రవణ్ మీడియాకు తెలిపారు. అయితే తమ అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించడంపై హైకోర్టును ఆశ్రయించామన్నారు. మరోవైపు కొత్త ప్రభుత్వం గవర్నర్ కోటాలో కోదండరాం, అమేర్ అలీఖాన్ పేర్లను ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారన్నారు. ఈ మేరకు గెజిట్ కూడా విడుదల కాగా, కోదండరాం, అమేర్ అలీఖాన్‌లను నామినేట్ చేయడం రాజ్యాంగ ఉల్లంఘన అని హైకోర్టు పేర్కొందన్నారు. అట్టడుగు కులాలకు చెందిన తమకు న్యాయం చేయాలని దాసోజు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. తాము ఇద్దరూ గతంలో బీజేపీ, దాని అనుబంధ విభాగాల్లో పనిచేశామని దాసోజు, కుర్రా సత్యనారాయణ తమ వినతిపత్రంలో పేర్కొన్నారు. -
పాన్ ఇండియా భాషల్లో రజాకార్.. ట్రైలర్ రిలీజ్!
సమర వీర్ క్రియేషన్స్ పతాకంపై గూడూర్ నారాయణరెడ్డి నిర్మించిన తాజా చిత్రం 'రజాకర్'. యధా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఇందులో బాబీ సింహా, వేదిక జంటగా నటించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర తమిళ వర్షన్ ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ వేదికపై చిత్ర నిర్మాత గూడూర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సమర్ వీర్ క్రియేషన్స్ సంస్థ తరపున యూనిట్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం కాలంలో హైదరాబాదులో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా రూపొందించిన కథా చిత్రమని చెప్పారు. 1948లో హైదరాబాద్ భారతదేశంలో విలీనం కాకముందు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంపై రూపొందించిట్లు చెప్పారు. నిజాం రాజు హైదరాబాదును దుర్గిస్తాన్గా మార్చే ప్రయత్నం చేసినప్పుడు భారత ప్రభుత్వం దాన్ని అడ్డుకుందని చెప్పారు. తమ వంశంలో తన తాత కూడా ఆ పోరాటంలో పాల్గొని ప్రజలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు అర్పించారన్నారు. అలాంటి ఒక యదార్థ ఘటనపై ఈ తరం ప్రజలకు తెలియచేయాలనే ప్రయత్నమే ఈ రజాకర్ చిత్రమని చెప్పారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పారు. ఈ చిత్రం నిర్మాత నారాయణరెడ్డి తాత పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారన్నారు. మరుగున పడ్డ చరిత్ర ప్రజలకు తెలియచేయాలనే లక్ష్యంతో ఆయన ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి: ఎంపీ ఎంవీవీ
-
వంశీ వైఎస్ఆర్సీపీకి వెన్నుపోటు పొడిచారు : ఎంపీ ఎంవీవీ
-
‘ధరణి’లో నమోదుకు రూ.40 లక్షలు
శామీర్‌పేట్: ధరణి పోర్టల్‌లో భూ వివరాల నమోదుకు రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన ఓ తహసీల్దార్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ మజీద్ అలీఖాన్ తెలిపిన వివరాల ప్రకారం..సిటీకి చెందిన రామశేషగిరిరావు శామీర్‌పేట మండల పరిధిలోని లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006లో భూమి కొనుగోలు చేశాడు. ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి సంవత్సరం క్రితం తహసీల్దార్ సత్యనారాయణను సంప్రదించగా, రూ.40 లక్షలు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగానే గతంలో రామశేషగిరిరావు రూ.10లక్షలు ఇచ్చి, మరో 20లక్షల చెక్కు ఇచ్చాడు. తాజాగా మిగతా సొమ్ము రూ.10లక్షలు మంగళవారం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో సత్యనారాయణ డ్రైవర్ బద్రికి ఇస్తుండగా, అధికారులు వల పన్ని పట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు తాము దాడులు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. తహసీల్దార్ సత్యనారాయణ నివాసముంటున్న తూంకుంటలోనూ ఏసీబీ అధికారులు మరిన్ని సోదాలు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు మల్లికార్జున్, పురంధర్భట్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోనూ సోదాలు కరీంనగర్‌క్రైం: ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కరీంనగర్ విద్యానగర్‌లోని తోడేటి సత్యనారాయణ నివాసంలో సోదాలు నిర్వహించారు. జిల్లాలోని పూడూర్‌లోని ప్రాథమిక పాఠశాలలో సత్యనారాయణ భార్య రేణుక టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెను కూడా ఏసీబీ పోలీసులు విచారించి పలు డాక్యుమెంట్లు స్వా«దీనం చేసుకున్నట్టు సమాచారం. ఏడాది నుంచి తిరుగుతున్నా... ధరణి పోర్టల్‌లో భూవివరాల నమోదుకు ఏడాది నుంచి తహసీల్దార్ చుట్టూ తిరుగుతున్నా ఆయన పనిచేయలేదని బాధితుడు రామశేషగిరిరావు తెలిపారు. లాల్‌గడీ మలక్‌పేట్‌లో 2006 సంవత్సరంలో తాను 29 ఎకరాల భూమి కొనుగోలు చేశానని, ఆ భూమిని ధరణిలో నమోదు చేయడానికి రూ.40 లక్షలు డిమాండ్ చేశాడని తెలిపారు. తాను ఇంతకుముందు రూ.10 లక్షలు నగదు రూపంలో, 20 లక్షలు చెక్కురూపంలో చెల్లించానని చెప్పారు. 30 లక్షలు ఇచ్చినా తన పని కాకపోవడంతో విసిగిపోయి ఏసీబీని ఆశ్రయించానని చెప్పారు. -
ఎమ్మెల్సీల తిరస్కరణ పిటిషన్.. జనవరి 24కు విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్: గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామినేట్ చేసిన ఎమ్మెల్సీలను తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తిరస్కరించిన విషయంలో దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఎమ్మెల్సీల తిరస్కరణపై దాశోజు శ్రవణ్, సత్య నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టు విచారణ జరిపింది. శ్రవణ్, సత్యనారాయణ తరుపు న్యాయవాదులు.. ఆర్టికల్ 171 ప్రకారం క్యాబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీలు లేదని హైకోర్టుకు తెలియజేశారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషనర్ల పిటిషన్‌కు అర్హత లేదని గవర్నర్ తరుపు కౌన్సిల్ కోర్టుకు తెలిపారు. పిటిషన్ మెంటేనబిలిటీపై విచారణ జరుపుతామని హైకోర్టు పేర్కొంది. కాగా.. తదుపరి విచారణ జనవరి 24కు హైకోర్టు వాయిదా వేసింది. చదవండి: మాది చేతల ప్రభుత్వం: మంత్రి దామోదర రాజనర్సింహ -
మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు.. వీడియో వైరల్
సాక్షి, కరీంనగర్: ప్రపంచ వ్యాప్తంగా న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఆటపాటలతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి, పటాకులు కాల్చి కొత్త ఏడాదికి స్వాగతం పలికారు. అయితే కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ.. నియోజకవర్గంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో అత్యుత్సాహం ప్రదర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చిలిపి చేష్టలు న్యూ ఇయర్ వేడుకల్లో కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ చిలిపి చేష్టలు. pic.twitter.com/wvyvurebqp — Telugu Scribe (@TeluguScribe) January 2, 2024 కాంగ్రెస్ మహిళా కార్యకర్తలతో సత్యనారాయణ చిలిపి చేష్టలు చేశారు. కేక్ కటింగ్ సందర్భంగా అక్కడున్న మహిళా కార్యకర్త ముఖానికి ఆయన కేక్ పూయగా, ఆమె పక్కకు తప్పుకుంది. అయితే రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ను పక్కకు జరిపి మరీ ఎమ్మెల్యే సత్యనారాయణ ఆ మహిళా కార్యకర్తకు కేక్ పూశారు. దీంతో సదరు మహిళ కాస్తా ఇబ్బందిగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. మానకొండూరు ఎమ్మెల్యేపై నెటిజన్లు, స్థానికులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది కాంగ్రెస్ నాయకుల అసలు నైజం...! సభ్య సమాజం తలదించుకునేలా మహిళతో మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సత్యనారాయణ అసభ్య ప్రవర్తన. దేశం మొత్తం నీతులు బోధించే ప్రియాంక గాంధీకి ఈ విషయం పట్ల స్పందించే ధైర్యం ఉందా...? pic.twitter.com/4wwNVCO9Qb — Sumiran Komarraju (@SumiranKV) January 2, 2024 -
నీతి నియమాలు లేని ప్రతిపక్షాలు ఏపీలో ఉన్నాయి: మంత్రి కొట్టు
-
చెట్ల మందు తాగించి..బండరాళ్లతో చంపుతాడు
సాక్షి, నాగర్‌కర్నూల్: మాయలు, మంత్రాలు తెలుసునని నమ్మిస్తూ, మంత్ర శక్తితో గుప్తనిధులు వెలికితీస్తానంటూ ఆస్తులు కాజేసి, ప్రాణాలు తీస్తున్న సైకో కిల్లర్ రామెట్టి సత్యనారాయణను నాగర్‌కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో జోగుళాంబ గద్వాల జోన్ డీఐజీ ఎల్ఎస్ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ నిందితుడిని అరెస్ట్ చూపుతూ, మీడియాకు వివరాలను వెల్లడించారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ ఇప్పటివరకు 11 మందిని హత్యచేసినట్టు వెల్లడించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోనూ హత్యలకు పాల్పడ్డాడని వెల్లడించారు. నిర్మానుష్య ప్రాంతాల్లో హత్యలు.. ‘‘నిందితుడు సత్యనారాయణ యాదవ్ తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని అమాయకులను నమ్మిస్తూ వారి పేరిట ఉన్న ప్లాట్లు, వ్యవసాయ భూములను తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు గుర్తించాం. గుప్తనిధులు వెలికితీస్తానని ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతాలకు రప్పించి వారికి జిల్లేడు పాలు, ఇతర చెట్ల మందులను తాగిస్తాడు. వారు అపస్మారక స్థితిలోకి చేరుకోగానే బండ రాళ్లతో మోది హత్యకు పాల్పడ్డాడ’’ని డీఐజీ చౌహాన్ వివరించారు. మొత్తం 11 మందిని హత్య చేయగా, ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు దొరకలేదని చెప్పారు. 11 మంది అమాయకులు బలి.. 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా నాగాపూర్‌లో గుప్తనిధు ల కోసం పూజల పేరుతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని హత్య చేశాడు. వీరిలో హజిరాబీ(60), ఆష్మాబేగం(32), ఖాజా(35), ఆశ్రీన్(10) ఉన్నారు. 2021లో నాగర్‌కర్నూల్ జిల్లా ఎండబెట్లకు చెందిన సలీం పాషా(38), కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం గ్రామానికి చెందిన ఆరెపల్లి శ్రీనివాసులు(52), 2022లో నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన వాసర్ల లింగస్వామి(50), 2023లో కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి(43), కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి(70), తిరుపతమ్మ(42), వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్(32)ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. నిందితుడు సత్యనారాయణకు పోలీస్ అధికారులతో సంబంధాలు? మూడేళ్ల నుంచి తరచుగా హత్యలు, మోసాలకు పాల్పడుతూ ఇప్పటివరకు 11 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్న మాంత్రికుడు సత్యనారాయణ యాదవ్.. కొంతమంది ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారుల అండదండలతోనే ఇన్నాళ్లు తప్పించుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్‌లో నివసిస్తున్న ఓ మహిళ తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం సత్య నారాయణను ఆశ్రయించగా, ఆమె భూమిని కూడా తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. దీనిపై సదరు మహిళ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నాగర్‌కర్నూల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. అయితే అప్పటి దర్యాప్తు అధికారి నిందితుడు సత్యనారాయణ యాద వ్ నుంచి రెండు ప్లాట్లను.. తన మామ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుని కేసును నీరుగార్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. తాజాగా వీపనగండ్ల మండలం బొల్లారానికి చెందిన వెంకటేశ్ భార్య ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టడంతో విషయం బయటపడింది. అప్పుడే పట్టుకుంటే నలుగురు బతికేవారు.. వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగాపూర్‌లో 2020 ఆగస్టు 14న ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దారుణహత్యకు గురికాగా, మూడేళ్లుగా పోలీసులు నిందితుడిని గుర్తించలేదన్న విమర్శలు ఉన్నాయి. మాయలు, మంత్రాల పేరుతో భూ రిజిస్ట్రేషన్లు, ఆ తర్వాత హత్యలకు పాల్పడుతున్న సత్యనారాయణ బాగోతాలను వెలుగులోకి తెస్తూ గత ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. ఆ సమయంలోనూ పోలీసులు సత్యనారాయణ కేసులో నిర్లక్ష్యం ప్రదర్శించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ తర్వాత 2023 జూలైలో నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తిమ్మరాసిపల్లికి చెందిన సంపతి శ్రీధర్‌రెడ్డి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన తండ్రీకూతుళ్లు బీంరెడ్డి రాంరెడ్డి, తిరుపతమ్మ, వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన గోవుల వెంకటేశ్ హత్యకు గురయ్యారు. ఆరు నెలల ముందే పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని ఉంటే ఆ నలుగురు ప్రాణాలతో బయటపడేవారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
11మందిని పొట్టన పెట్టుకుని?
సాక్షి, నాగర్‌కర్నూల్: 'మంత్రాలు, మాయలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేయడం.. ఎవరైనా ఎదురుతిరిగితే మట్టుబెట్టడం.. ఇలా ఇప్పటివరకు ఏకంగా 11 మందిని∙పొట్టన పెట్టుకున్నాడని భావిస్తున్న ఓ నరహంతకుడిని నాగర్‌కర్నూల్ జిల్లా పోలీసులు ఇటీవల అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ యాదవ్ కొన్నేళ్లుగా తనకు మంత్రాలు, మాయలు తెలుసునంటూ అమాయక మహిళలు, వ్యక్తులను నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు.' తన మంత్రశక్తితో గుప్తనిధులను వెలికితీస్తానని, కుటుంబ కలహాలు, సమస్యలను పరిష్కరిస్తానంటూ మొదట తనకు పరిచయం అయిన వారిని నమ్మిస్తాడు. ఈ క్రమంలో వారి పేరిట ఉన్న భూములు, ఇతర ఆస్తిపాస్తులను తన పేరిట, అనుయాయుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంటాడు. ఎవరైనా తిరగబడితే గుట్టుచప్పుడు కాకుండా పథకం ప్రకారం హత్యకు తెగబడతాడని బాధితుల నుంచి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా 11 మంది అమాయకులను బలితీసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడి నుంచి పూర్తి వివరాలు రాబడుతున్నట్టు తెలుస్తోంది. కాగా మంగళవారం నిందితుడి పూర్తి వివరాలను వెల్లడిస్తామని నాగర్‌కర్నూల్ సీఐ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. ఓ రియల్టర్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి.. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు సత్యనారాయణ యాదవ్ ఇప్పటివరకు 11 మంది అమాయకులను హత్య చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. మృతుల జాబితాలో మూడేళ్ల కిందట 2020 ఆగస్టు 14న వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో గుప్తనిధుల తవ్వకాల సమయంలో అపస్మారక స్థితిలో మరణించిన ఉన్న నలుగురు వ్యక్తులు హజిరాబీ(60), ఆష్మా బేగం (32), ఖాజా (35), ఆశ్రీన్ (10) ఉన్నారని తెలుస్తోంది. రెండేళ్ల కిందట నాగర్‌కర్నూల్ మండలం గన్యాగులకి చెందిన లింగస్వామి, కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణానికి చెందిన ఓ వ్యక్తిని సైతం హతమార్చినట్టు అనుమానిస్తున్నారు. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలానికి చెందిన రియల్ఎస్టేట్ వ్యాపారి వెంకటేశ్ కన్పించడం లేదని అతని భార్య లక్ష్మీ హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణలో భాగంగా సత్యనారాయణ యాదవ్ బాగోతం బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా మంత్రాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న సత్యనారాయణ యాదవ్ బాగోతాలపై ఈ ఏడాది ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’శీర్షికన ‘సాక్షి’కథనాన్ని ప్రచురించింది. బాధితులు ఫిర్యాదు చేస్తున్నా విచారణపై నిర్లక్ష్యం చేస్తున్న పోలీసుల తీరును ఆ కథనంలో ప్రస్తావించింది. కందనూలులో కలకలం! 'మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను నమ్మిస్తాడు.. మాటలతో పూర్తిగా మభ్యపెట్టి ఆస్తులు రాయించుకుంటాడు.. ఎవరైనా తన దారిలోకి రాలేదని అనుమానం వస్తే మట్టుబెట్టేందుకు సైతం వెనకాడడు.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 11 మందిని హతమార్చాడు.. ఇలా మాయమాటలతో మొదలుపెట్టి.. హత్యలతో ముగింపు పలుకుతున్న సదరు మాయగాడి పాపం పండింది.. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతుండటంతో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి..' కందనూలులో కలకలం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా.. మాయలు, మంత్రాలు చేసి గుప్తనిధులను వెలికితీస్తానంటూ అమాయకులను మోసం చేస్తున్న మాయగాడు రామెట్టి సత్యనారాయణయాదవ్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. తన దారికి రానందుకు ఏకంగా 11 మందిని హత్య చేసి పొట్టనబెట్టుకున్నాడని పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం, ఉమ్మడి పాలమూరు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు వదకొండు మంది అమాయకుల హత్యలో సత్యనారాయణకు ప్రమేయం ఉందని, పూర్తిస్థాయి విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. మాయగాడు సత్యనారాయణయాదవ్ కు సంబంధించి పూర్తి వివరాలను పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించే అవకాశం ఉంది. ► తనకు మంత్రాలు తెలుసంటూ అమాయకులను మచ్చిక చేసుకోవడం, గుప్తనిధులను వెలికితీస్తానంటూ నమ్మిస్తూ సత్యనారాయణయాదవ్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలుచోట్ల మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. మరో ఘటనలో నాగర్ కర్నూల్ మండలం గన్యాగుల గ్రామానికి చెందిన రామస్వామి(50) 2022 నవంబర్ 17న వనపట్ల శివారులో దారుణ హత్యకు గురయ్యాడు. లింగస్వామి కుమారుడికి బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, ప్రతిఫలంగా ఆయనకు ఉన్న 130 గజాల ప్లాటును మార్టిగేజ్ చేయాలని నమ్మించాడని బాధిత కుటుంయిం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్లాటును మార్టిగేజ్ చేయకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న 10 రోజుల వ్యవధిలోనే రామస్వామి హత్యకు గురయ్యాడని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అలాగే కోడేరు మండలం తీగలపల్లికి చెందిన రాంరెడ్డి, కల్వకుర్తి పట్టణంలో ఓ వ్యక్తి మరణంతో పాటు వీపనగండ్ల మండలానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి మిస్సింగ్ కేసుతోనూ సత్యనారాయణ యాదవ్ కు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ► ఇప్పటికే 11 మందిని హత్య చేసినట్లు అనుమానాలు ► హైదరాబాద్‌లో జరిగిన ఓఘటనతో కదులుతున్న డొంక ► పోలీసుల అదుపులో మాయగాడు సత్యనారాయణ ► మూడేళ్ల క్రితం నాగాపూర్‌లో సంచలనం రేపిన నలుగురి మృతి ► ఈ ఘటన వెనుక కూడా ఇతడి హస్తమే ఉన్నట్లు సమాచారం ► గతంలోనే నిందితుడి బాగోతాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’ మహిళలపై లైంగిక వేధింపులు.. కుటుంబ సమస్యలు పరిష్కరిస్తానంటూ మహిళలను నమ్మిస్తూ వారిపై సత్యనారాయణయాదవ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది. వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళ కొంతకాలంగా భర్తతో దూరంగా ఉంటుండగా.. వారి కుటుంబ సమస్యను మంత్రశక్తితో పరిష్కరిస్తానంటూ ఆమెకు చెందిన భూమిని సత్యనారాయణయాదవ్ తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. సత్యనారాయణయాదవ్ బాగోతాలపై ఏప్రిల్ 5న ‘మాయగాళ్లు’ శీర్షికన కథనం ద్వారా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. ఇటీవల సత్యనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఇప్పటి వరకు కొనసాగిన హత్యోదంతం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. సంచలనం రేపిన నాగాపూర్ ఘటన! 'జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్ల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. జిల్లాకేంద్రంలో తరచుగా చోటుచేసుకుంటున్న ఘటనలపై బాధితులు నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నా సంబందిత అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలుమార్లు పోలీస్ స్టేషన్ల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం ఉండటం లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తన మంత్రశక్తితో దూరమైన భార్యాభర్తలను కలుపుతానంటూ మహిళను నమ్మించి రూ.లక్షలు విలువైన భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘటన తాజాగా వెలుగుచూసింది. మోసపోయానని గ్రహించిన బాధితురాలు తనకు న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీ మనోహర్ని కలసి ఫిర్యాదు చేసింది.' ► జిల్లాలో విచ్చలవిడిగా కొనసాగుతున్న సెటిల్మెంట్ రాయుళ్లదందా ► మంత్రాలు, మాయలతో అమాయకులకు బురిడి ► వరస ఘటనలు చోటుచేసుకుంటున్నా పట్టని పోలీసు అధికారులు ► చోద్యం చూస్తూ నేరస్తులకే సహకరిస్తున్నారన్న ఆరోపణలు మంత్రాలు, మాయలు అంటూ అడ్డగోలు దందా.. జిల్లాలో మంత్రాలు, మాయలు చేస్తామంటూ నమ్మబలుకుతూ అమాయకుల నుంచి అందినకాడికి దండుకుంటున్న మాయగాళ్ల దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. మాయగాళ్ల చేతుల్లో నష్టపోయిన బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.. జిల్లాలోని వంగూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళకు ఆమె భర్తతో కొన్నాళ్లుగా గౌడవలు జరుగుతున్నాయి. జిల్లాకేంద్రానికి చెందిన రామెట్టి సత్యనారాయణ తాను మంత్రాలు చేసి భార్యభర్తలను కలుపుతానని నమ్మబలికాడు. ఇందుకోసం మహిళ పేరిట భూమి, ఆస్తులు ఉంటే పని జరగదని చెప్పి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని ఒప్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్ పరిధిలో సదరు మహిళకు ఉన్న రెండు ప్లాట్లను సత్యనారాయణ పేరిట, అతని బందువుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. విషయం భర్తకు చెప్పిన తర్వాత తాము మోసపోయామని తెలుసుకున్న భార్యభర్తలు ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై ఫిర్యాదుచేసినా పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో కాలయాపన.. నాగర్ కర్నూల్ మండలం గన్యాగులకు చెందిన లింగస్వామి (50)కి రామెట్టి సత్యనారాయణ 2013లో 130 గణాల ప్లాటును విక్రయించాడు. తర్వాత లింగస్వామితో పరిచయం పెంచుకున్న సత్యనారాయణ.. లింగస్వామి చిన్న కుమారుడు శివశంకర్‌కు బ్యాంకులో క్లర్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. ఇందుకు తనకు రూ.2 లక్షలు ఇవ్వాలని, లేదంటే ప్లాటును మార్టిగేజ్ చేయాలని ఒప్పించారు. 2022 నవంబర్ 7న తన బందువు మహేశ్ పేరిట భూమిని మార్టిగేజ్ కాకుండా రిజిస్ట్రేషన్ చేయించాడు. తర్వాత పది రోజులకే 2022 నవంబర్ 17న లింగస్వామి వనపట్ల శివారులో దారుణహత్యకు గురయ్యాడు. లింగస్వామి హత్యకు సంబంధించి ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోలేదు. పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లాకేంద్రానికి చెందిన మహ్మద్ పాషా శ్రీపురం రోడ్డులో డబ్బాను ఏర్పాటుచేసుకుని చిన్నపిల్లలకు తాయత్తులు కడుతుండేవాడు. తన వద్దకు వచ్చే మహిళకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెకు సంబందించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, సోషల్ మీడియాలో పెడుతానంటూ బెదిరించి పెద్ద ఎత్తున నగదు వసూలు చేశాడు. అతని వేధింపులకు తాళలేక సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పదిరోజులు గడుస్తున్నా ఇప్పటివరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోలేదు. నిందితులను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నెలలు గడిచినా స్పందన లేదు! జిల్లాకేంద్రానికి చెందిన సత్యనారాయణ నాకు బ్యాంకులో ఉద్యోగం ఇప్పిస్తానని, భూమిని మార్టిగేజ్ చేయించాలని చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తర్వాత పదిరోజులకే మా నాన్న హత్యకు గురయ్యాడు. మాకు వేరే ఎవరితో గొడవలు లేవు. నిందితులను పట్టుకోవాలని ఇప్పటికీ పలుమార్లు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదు. పోలీసులు విచారణ చేపట్టి నిందితులను బయటపెట్టాలి. -శివశంకర్,గన్యాగుల విచారణ చేపట్టాం.. బాధితుల నుంచి అందిన ఫిర్యాదుపై విచారణ కొనసాగుతోంది. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోంది. ప్రతి కేసును లోతుగా విచారణ చేపడుతున్నాం. త్వరలోనే విచారణ పూర్తిచేస్తాం.- మోహన్ కుమార్, డీఎస్పీ, నాగర్ కర్నూల్ -
విశాఖ తూర్పులో సామాజిక న్యాయ నినాదం
సాక్షి, విశాఖపట్నం/ఆరిలోవ: విశాఖ తూర్పు నియోజకవర్గంలో సామాజిక సాధికారత వెల్లివిరిసింది. ఆ నియోజకవర్గానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమను అభివృద్ధి పథంలో నడిపించిన వైనాన్ని వివరిస్తూ శనివారం సామాజిక సాధికార బస్సు యాత్ర నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన బస్ యాత్రను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరిలోవ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. వేలాది బడుగు, బలహీన వర్గాల ప్రజలతో ప్రారంభమైన యాత్ర.. పులి వేషాలు, డప్పు వాయిద్యాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల నడుమ పెదగదిలిలో బీఆర్టీఎస్ మీదుగా జాతీయ రహదారికి చేరుకుంది. అక్కడకు వందల సంఖ్యలో పార్టీ శ్రేణులు జతకూడాయి. వెంకోజీపాలెం, ఇసుకతోట మీదుగా ఎంవీపీ కాలనీలోని సభా ప్రాంగణానికి యాత్ర చేరుకుంది. ఇక్కడ సభలో అశేష జనవాహిని పాల్గొన్నారు. అడుగడుగునా సీఎం జగన్‌కు జేజేలు పలికారు. ఈ సాధికారత నభూతో నభవిష్యతి: మంత్రి విశ్వరూప్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన చేయూతతో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సాధించిన సాధికారత నభూతో నభవిష్యతి అని మంత్రి పినిపె విశ్వరూప్ చెప్పారు. రాష్ట్ర కేబినేట్ సహా అన్ని రకాల పదవుల్లో, పథకాల్లో పెద్దపీట వేసి సీఎం వైఎస్ జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ పాలన పొరుగు రాష్ట్రాలకూ దిక్సూచీ అయిందని కొనియాడారు. నిరంతరం పేదోడి బాగోగుల కోసం పరితపించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందరమూ అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు, నాలుగున్నరేళ్లగా ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సుపరిపాలనను ప్రతి ఒక్కరూ బేరీజు వేసుకోవాలని సూచించారు. సామాజిక న్యాయానికి ఛాంపియన్ సీఎం వైఎస్ జగన్ అయితే.. బడుగు బలహీనవర్గాల వారిని హీనంగా చూస్తూ దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగున్నరేళ్లలో 2.70 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను అందించారన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఏపీలో అమలు చేసే పింఛను విధానాన్ని అమలు చేస్తామని బహిరంగంగా ప్రçశంసించారన్నారు. సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తెలంగాణలో అమలు చేస్తామని అక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందన్నారు. ఇలా ఒకటీ రెండూ కాదు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన అనేక సంస్కరణలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధికి కేరాఫ్‌గా మారుస్తున్నారని తెలిపారు. సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఏపీలో పది హార్బర్లు, నాలుగు పోర్టులు నిర్మిస్తున్నారని చెప్పారు. విశాఖలో హార్బర్ ఆధునీకరణకు రూ.150 కోట్లు మంజూరు చేశారన్నారు. గత పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కూరలో కరివేపాకులా చూసేవారే తప్ప వారి బాగోగులు చూసిన సందర్భాలు లేవన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవే వర్గాలను అందలం ఎక్కించి, సాధికారతకు తోడ్పడుతున్నారని చెప్పారు. కేబినెట్ సహా అన్ని పదవుల్లో అధిక భాగం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే కట్టబెట్టిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. ఒక ఊరులో ఒక జాతి మాత్రమే బాగుండాలంటే చంద్రబాబు కావాలని, అదే ఊరులో అందరూ బాగుండాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రావాలని తెలిపారు. ఉత్తరాంధ్రలో బడుగు బలహీన వర్గాల వారికి కీలక పదవులు కల్పించి సామాజిక న్యాయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చారని ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ అన్నారు. యువతకు ఉద్యోగాలు కావాలన్నా, పేదోడు ఆర్థికంగా ఎదగాలన్నా సీఎంగా మళ్లీ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, వరుదు కల్యాణి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, మేయర్ హరివెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు. -
రసమయి బాలకిషన్‌తో.. ‘నువ్వెవరివి నన్ను విష్ చేసేందుకు’ : కవ్వంపల్లి సత్యనారాయణ
కరీంనగర్: మండలంలోని కొత్తపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ మానకొండూర్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ మధ్య బుధవారం వాగ్వాదం జరిగింది. ఓ ఫంక్షన్హాల్లో జరిగిన వివాహనికి మొదట సత్యనారాయణ హాజరై, వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత తన కార్యకర్తలతో కూర్చొని, మాట్లాడుతుండగా ఎమ్మెల్యే రసమయి వచ్చారు. వధూవరులను ఆశీర్వదించి, వేదిక దిగుతూ ఆయనను నమస్తే అంటూ పలకరించారు. దీంతో సత్యనారాయణ ‘నువ్వెవరివి నన్ను విష్ చేసేందుకు’ అంటూ మండిపడ్డారు. ఇరువర్గాలవారు కొద్దిసేపు గొడవ పడ్డారు. రాజకీయాల్లో శత్రువులు ఉండటం సహజమని, ఒకరినొకరు పలకరించుకోవడాన్ని రాజకీయ కోణంలో చూసి, వాగ్వాదానికి దిగిన సత్యనారాయణపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. గొడవ చేయడం కోసమే రసమయి ఆయనను పలకరించినట్లు నాటకం ఆడారని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు దీన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. -
చంద్రబాబు ఆలయాలు కూలిస్తే... జగన్ నిర్మిస్తున్నారు
సాక్షి, అమరావతి: గోదావరి పుష్కరాల్లో సినిమా షూటింగ్ పెట్టి 31మంది మృతికి కారకుడైన చంద్రబాబు... కృష్ణా పుష్కరాల సమయంలో అత్యంత దారుణంగా విజయవాడలో 23 ఆలయాలను కూల్చివేశారని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. చంద్రబాబు ఆలయాలను కూల్చితే... సీఎం పునర్ నిర్మిస్తున్నారని, త్వరలోనే విజయవాడలో కొత్త ఆలయాలు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. ‘దేవాలయాల అభివృద్ధి–ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు’పై శాసన మండలిలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరిగింది. సభ్యులు ప్రస్తావించిన పలు అంశాలతోపాటు ప్రభుత్వం తీసుకున్న చర్యలను మంత్రి కొట్టు సత్యనారాయణ వివరించారు. హిందూ ధర్మం ఒక మతం కాదని, మన జీవనశైలి అని అన్నారు. సనాతన సంప్రదాయాలు, హిందూ ధర్మాన్ని భావితరాలకు అందించాలనే మహోన్నత ఆశయంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవదాయశాఖ పరిధిలో ఉన్న 23,001 దేవాలయాలు, 1,742 ధార్మిక సంస్థలు, 133 మఠాల పవిత్రతను కాపాడేందుకు, ఆస్తులను పరిరక్షించేందుకు సీఎం జగన్ విప్లవాత్మక చర్యలు చేపట్టారని తెలిపారు. రాష్ట్రంలోని 32 ప్రముఖ ఆలయాల అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేశామని, భక్తులకు సౌకర్యాల కోసం అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నామని వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మత్స్యకారుల కాలనీల్లో రూ.296.20కోట్లతో 2,962 నూతన ఆలయాలను రెండు దశల్లో నిర్మిస్తున్నట్లు వివరించారు. టీటీడీలో 6,700 మంది ఉద్యోగులు ఉండగా, ఇప్పటికే 3,518 మందికి రూ.313కోట్లతో ఇళ్ల పట్టాలను సీఎం జగన్ చేతుల మీదుగా పంపిణీ చేశామన్నారు. తిరుమలలో సన్నిధి గొల్లలకు వంశపారంపర్య హక్కును పునరుద్ధరించామన్నారు. టీడీపీ హయాంలో దేవాలయాల పవిత్రతను దెబ్బతీశారని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి రావడం కోసం ఏకంగా దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయించారని తెలిపారు. కనకదుర్గమ్మకు భక్తులు సమర్పించిన చీరలను సైతం మాయం చేశారని పేర్కొన్నారు. దేవదాయ భూముల పరిరక్షణకు పెద్దపీట ‘‘ఒక్కసారి దేవదాయ భూమిగా ప్రకటించిన తర్వాత వాటిని విక్రయించే అవకాశం ఉండదు, రాష్ట్రంలోని దేవదాయ భూముల రక్షణ కోసం 1987లో సెక్షన్–83ని సవరిస్తూ ఇప్పటికే ఆర్డినెన్స్ అమల్లోకి తీసుకొచ్చాం. దీనికి సంబంధించిన బిల్లును త్వరలోనే ప్రవేశపెడుతున్నాం. కొత్తగా గుర్తిస్తున్న దేవదాయ భూములను ఎప్పటికప్పుడు నిషేధిత జాబితాలో చేరుస్తున్నాం. తిరుమల నడకదారిలో వెళ్లే భక్తులకు పూర్తి రక్షణ కల్పించే విధంగా పలు చర్యలు తీసుకున్నాం’’. అని మంత్రి తెలిపారు. ఈ చర్చలో ఎమ్మెల్సీలు వంకా రవీంద్రనాథ్, సత్యనారాయణరాజు, కల్పలత, పాకలపాటి రఘువర్మ, తోట త్రిమూర్తులు మాట్లాడారు. -
ఆ ఎమ్మెల్సీలకు నో!.. ఇద్దరిని తిరస్కరించిన తమిళిసై
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, వైజ్ఞానిక శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యతగానీ, ఆచరణాత్మక అనుభవంగానీ వీరికి లేదని.. అందువల్ల వారి అభ్యర్దిత్వాలను తిరస్కరిస్తున్నామని ప్రకటించారు. దాసోజు శ్రవణ్ రాజకీయాలు, వ్యాపారం, విద్యా రంగాల్లో.. కుర్ర సత్యనారాయణ రాజకీయాలు, పారిశ్రామిక కార్మిక సంఘం కార్యకలాపాల్లో క్రియాశీలకంగా ఉన్నట్టు ప్రతిపాదనల సారాంశం వెల్లడిస్తోందని గవర్నర్ వివరించారు. దీనిపై ఈ నెల 19న సీఎం కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి గవర్నర్ తమిళిసై రాసిన లేఖలు సోమవారం బయటికి వచ్చాయి. రాజ్యాంగబద్ధంగానే తిరస్కరణ రాజ్యాంగంలోని 171(1ఈ), 171(5) అధికరణాల ద్వారా చట్టసభలకు సభ్యులను నామినేట్ చేసే అధికారం గవర్నర్‌కు ఉందని.. దానిని అనుసరించే తాను నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ తమిళిసై తన లేఖల్లో స్పష్టం చేశారు. ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని సెక్షన్ 10లో పొందుపరిచిన షెడ్యూల్–3ను అనుసరించి శాసనమండలిలో సీట్ల కేటాయింపు జరపాల్సి ఉంటుందని వివరించారు. ఆ చట్టంలోని షెడ్యూల్–3కు ఏపీ పునర్విభజన చట్టం–2014లోని సెక్షన్ 17 ద్వారా సవరణ జరిపి తెలంగాణ రాష్ట్రానికి 40 ఎమ్మెల్సీ సీట్లను కేటాయించారని, అందులో గవర్నర్ కోటా కింద నామినేట్ చేసే 6 సీట్లు కూడా ఉన్నాయని తెలిపారు. ఎన్నిక కాబోయే అభ్యర్థి ఏదైనా ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కును లేదా రాష్ట్రంలో స్థిర నివాసాన్ని కలిగి ఉండాలని ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 3, 6(2) సెక్షన్లు స్పష్టం చేస్తున్నాయన్నారు. సభ్యుల అనర్హతలపై సెక్షన్ 8 నుంచి 11 (ఏ) వరకు పొందుపరిచిన నిబంధనలు శాసనమండలికి నామినేట్ అయ్యే సభ్యులకు కూడా వర్తిస్తాయని వివరించారు. కేబినెట్ నోట్ ఫైల్ పంపలేదు ఇద్దరు ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనలతో ఇతర వివరాలు, ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం జత చేయలేదని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. మంత్రివర్గం, సీఎం సంబంధిత రికార్డులన్నింటినీ పరిశీలించినట్టు ధ్రువీకరించే కేబినెట్ నోట్ ఫైల్‌ను పంపలేదని.. ఎమ్మెల్సీలుగా వీరి అభ్యర్థిత్వాన్ని పరిశీలించడానికి ప్రభుత్వం అనుసరించిన పద్ధతిని కూడా తెలియజేయలేదని తప్పుపట్టారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 8 నుంచి 11(ఏ) వరకు పేర్కొన్న అనర్హతలు వీరికి వర్తించవని ధ్రువీకరిస్తూ నిఘా విభాగం, ఇతర సంస్థల నుంచి ఎలాంటి నివేదికలూ అందలేదన్నారు. సిఫార్సుల కోసం పంపే ఫైలు సంబంధిత అన్ని రికార్డులతో రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని స్పష్టం చేశారు. ఇన్ని లోపాలకు తోడు అర్హతలను ధ్రువీకరించే ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో దాసోజు శ్రవణ్‌కుమార్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడం సముచితం కాదని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి తిప్పిపంపుతున్నట్టు ప్రకటించారు. ఇకపై రాజకీయ నేతలను సిఫార్సు చేయొద్దు రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5)లో ప్రస్తావించిన రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత, అనుభవం కలిగి, రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని చాలా మంది రాష్ట్రంలో ఉన్నారని, వారిని ఎమ్మెల్సీలుగా నియమించవచ్చని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. వారికి కేటాయించిన పదవుల్లో రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను నియమిస్తే.. ఆయా రంగాల్లోని వారు చేసిన కృషిని, సాధించిన నిపుణతను విస్మరించినట్టు అవుతుందని స్పష్టం చేశారు. అంతేగాకుండా రాజ్యాంగంలోని సెక్షన్ 171 (5) కింద వారికి కల్పించిన ప్రయోజనాలు సైతం నీరుగారిపోతాయన్నారు. అర్హుల అవకాశాలను లాక్కున్నట్టు అవుతుందని, ఇది రాజ్యాంగ నిర్మాతల ఆశయాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ఇకపై సెక్షన్ 171(5) కింద నామినేట్ చేసే పదవుల కోసం రాజకీయాలతో సంబంధమున్న వ్యక్తులను పరిగణనలోకి తీసుకోవద్దని సీఎంకు, మంత్రి వర్గానికి విజ్ఞప్తి చేశారు. నెలన్నరకుపైగా పెండింగ్ తర్వాత సుమారు రెండేళ్ల క్రితం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా పాడి కౌశిక్‌రెడ్డిని మంత్రిమండలి నామినేట్ చేయగా.. కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం ఆ స్థానంలో మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా గవర్నర్ ఆమోదించారు. తాజాగా ఎస్టీల్లోని ఎరుకల సామాజిక వర్గానికి చెందిన కుర్ర సత్యనారాయణ, బీసీ సామాజికవర్గానికి చెందిన దాసోజు శ్రవణ్‌కుమార్‌లను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయాలని జూలై 31న మంత్రివర్గం తీర్మానించింది. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదనలను పంపింది. అప్పటి నుంచి దాదాపు నెలన్నరకుపైగా ఆ సిఫార్సులు రాజ్‌భవన్‌లోనే పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ గవర్నర్ లేఖ రాశారు. కొత్త వారికి అవకాశం ఇస్తారా? మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందనే అంచనాల నేపథ్యంలో.. ఎమ్మెల్సీలను నామినేట్ చేయాలన్న ప్రతిపాదనను గవర్నర్ తిరస్కరించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో గతంలో మాదిరిగా కొత్తవారిని నామినేట్ చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం మరో తీర్మానం చేసి పంపిస్తుందా? వీరినే నియమించాలని మళ్లీ కోరుతుందా? అసలు ఈ అంశంపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న కొందరు బీఆర్ఎస్ నేతల్లో మళ్లీ ఆశలు చిగురించడం గమనార్హం. మరోవైపు ఈ పరిణామంతో గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం మధ్య విభేదాలు మరోసారి రచ్చకెక్కినట్టేనని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
దుర్గ గుడి, శ్రీశైలంలో అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం శంకుస్థాపన
విజయవాడ దుర్గ గుడి వద్ద భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం దాదాపు రూ.225 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు ఈ నెలలో సీఎం జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. శ్రీశైలం ఆలయం వద్ద మరో రూ.175 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు కూడా సీఎం శంకుస్థాపన చేస్తారని చెప్పారు. దుర్గ గుడి వద్ద ప్రసాదం పోటు, అన్నదానం భవనం, శివాలయం నిర్మాణ పనులు, రాక్ మిటిగేషన్ (కొండ చరియలు విరిగిపడకుండా), ఆటోమేషన్ పార్కింగ్ వసతి తదితర పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. ఇప్పుడున్న ఘాట్ రోడ్డు వాస్తుపరంగా అంత శుభప్రదం కాదని వాస్తు పండితులు పేర్కొంటున్నందున రాజగోపురం నుంచి భక్తులు వచ్చి వెళ్లేలా దుర్గానగర్‌లో ఎలివేటెడ్ క్యూలైన్ (ప్లై ఓవర్), క్యూ కాంపెక్స్ విస్తరణ చేపడుతున్నట్లు తెలిపారు. అమ్మవారి ఆలయాల పక్కన రెండు అంతస్తులతో పూజా మండపాలు కడుతున్నామన్నారు. ఇక శ్రీశైలం ఆలయం వద్ద రూ.75 కోట్లతో క్యూ కాంప్లెక్స్, రూ.40 కోట్లతో సాల మండపాల నిర్మాణంతో పాటు ఇటీవల అటవీ శాఖ నుంచి ఆలయం స్వాదీనంలోకి వచ్చిన 4,600 ఎకరాలకు ఫెన్సింగ్ నిర్మాణ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. అక్టోబరు నుంచి ధర్మ ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు వివరించారు. -
పీవీ సత్యనారాయణకు స్వామినాథన్ అవార్డు ప్రదానం
ఏజీ వర్సిటీ: ఎంఎస్ స్వామినాథన్ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్ట్ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నూజివీడ్ సీడ్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్ ఐసీఏఆర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ డీజీ డీఏఆర్ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్ఈ కార్యదర్శి ఆర్ఎస్ పరోడా, ఐసీఏఆర్ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు. -
దొంగ ఓట్ల పేరుతో బాబు కొత్త డ్రామా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల వివరాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘమే ఇప్పుడు ఇంటింటి సర్వే చేస్తోందని.. ఆ సర్వేలోనే దొంగ ఓట్లు, అసలు ఓట్ల సంగతేంటో తెలిసిందని.. అలాంటిది టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపై కొత్తగా డ్రామాలాడటమేంటని ఉప ముఖ్యమంత్రి (దేవదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ ప్రశ్నించారు. రాష్ట్ర సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. చంద్రబాబు ఎప్పుడూ ఏదో ఒక డ్రామా ఆడుతుంటాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఈసీకి లేఖలు, ఢిల్లీ పర్యటనలు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ డేటాను టీడీపీ చౌర్యం చేసి, ఎలా దొరికిపోయిందో ప్రజలకు తెలుసు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఆయన మాటలు నమ్మే పరిస్థితిలేదు. బౌన్సర్లతో, కిరాయి జనంతో, రాజకీయ కూలీలతో లోకేశ్ చేసేది పాదయాత్ర ఎలా అవుతుంది? ధర్మ ప్రచార పర్యవేక్షణకు ఏడుగురితో కమిటీ.. సనాతన హిందూ ధర్మం ప్రాముఖ్యతను, ప్రాశస్త్యాన్ని నేటి యువతకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈనెల 6న అన్నవరంలో ప్రారంభమైన ధర్మ ప్రచార కార్యక్రమం అన్నిచోట్లా కొనసాగుతాయి. ఈ ధర్మ ప్రచార కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించాం. అలాగే, ఐదు లక్షలలోపు ఆదాయం ఉండే ఆలయాల నిర్వహణ బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటివరకు వంశపారంపర్య ధర్మకర్తలు లేదా అర్చకుల నుంచి 37 దరఖాస్తులు అందాయి. -
20 సీట్లకోసం చంద్రబాబు బూట్లు నాకుతున్న పవన్
ఎంవీపీకాలనీ (విశాఖ తూర్పు): కేవలం 20 నుంచి 30 ఎమ్మెల్యే సీట్లకోసం జనసేన అధినేత పవన్‌కళ్యాణ్.. చంద్రబాబు బూట్లు నాకుతున్నాడని విశాఖ ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ దుయ్యబట్టారు. ఇందుకోసమే ఆయనతోపాటు ఆయన సామాజికవర్గాన్ని చంద్రబాబుకు తాకట్టుపెట్టాడని ధ్వజమెత్తారు. విశాఖలో తనపై పవన్‌కళ్యాణ్ చేసిన అవినీతి వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. ఆదివారం విశాఖ లాసన్స్ బే కాలనీలోని తన కార్యాలయంలో ఎంపీ విలేకరులతో మాట్లాడారు. తనను రాజీనామా చేయమనే నైతికహక్కు పవన్‌కు లేదన్నారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి తనపై ఆరోపణలు చేయడమేంటని ప్రశ్నించారు. పవన్ రాష్ట్రంపై కనీస అవగాహన, విజ్ఞానం, నైతికత, కుటుంబ విలువలు, కనీసం మనిషికి ఉండాల్సిన లక్షణాలు లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఎంపీగా తనను ఎందుకు గెలిపించారని అడుగుతున్న పవన్‌కళ్యాణ్ ఏరోజైనా గాజువాక ప్రజలు ఆయన్ని ఎందుకు ఓడించారో అడిగారా అని ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచిన నాటి నుంచి విశాఖలోనే ఉన్నానన్నారు. గాజువాకలో ఓడిపోయిన తర్వాత పవన్ ఎప్పుడైనా ఆ నియోజకవర్గ ప్రజల వైపు చూశారా.. అని నిలదీశారు. అక్రమ వ్యాపారంతో విశాఖను నాశనం చేస్తున్నానంటూ తనపై చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. సినిమాల ద్వారా ఆయన వ్యాపారం చేయడం లేదా.. అని ప్రశ్నించారు. సీబీసీఎన్సీ భూముల టీడీఆర్‌పై కనీస అవగాహన లేదు సీబీసీఎన్సీ భూముల టీడీఆర్‌పై కనీసం అవగాహన లేకుండా దున్నపోతు మాదిరిగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతున్నారన్నారు. ఆ ప్రాజెక్టు నిబంధనలకు అనుగుణంగానే చేపట్టినట్లు తెలిపారు. సొంత కులాన్ని చంద్రబాబుకి తాకట్టుపెట్టిన పవన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆ కులానికి ఏం మేలు చేశాడో చెప్పాలన్నారు. పవన్‌కళ్యాణ్‌కు నిజంగా సత్తా ఉంటే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులను పోటీచేయించాలని సూచించారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో తనపై పోటీచేసి గెలవాలని సవాల్ చేశారు. తన కుటుంబసభ్యుల కిడ్నాప్ కేసుపై పవన్ వ్యాఖ్యలను ఎంపీ కొట్టిపడేశారు. నేరస్తులపై చర్యలు తీసుకోవడం అంటే.. తాను వెళ్లి వారిని మర్డర్ చేయాలని పవన్ భావిస్తున్నాడా అని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో రాజ్యాంగబద్ధంగా చట్టప్రకారం నేరస్తులపై చర్యలుంటాయని చెప్పారు. వీఐపీ రోడ్డు కూడలి మూసివేత అన్నది నగర మాస్టర్ ప్లాన్‌లో భాగంగా పోలీసులు తీసుకున్న నిర్ణయమని తెలిపారు. ఆ రోడ్డు మూసివేతకు, పక్కనే జరుగుతున్న తమ ప్రాజెక్టు నిర్మాణానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ రోడ్డు మూసివేతపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నట్లు మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా ఆ సమస్యను పరిష్కరించాలని కోరుతూ నగర పోలీసు కమిషనర్‌కు లేఖ రాస్తానని ఎంపీ చెప్పారు. -
గురుకుల పాఠశాల, కళాశాల భవనాలు ప్రారంభం
తాడేపల్లిగూడెం రూరల్: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలనులో రూ.22.17 కోట్లతో నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల భవనాలను రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖమంత్రి మేరుగు నాగార్జున, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను వాడుకుని వదిలేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం వైఎస్ జగన్ చొరవతో విజయవాడ నడిబొడ్డున 19 ఎకరాల్లో రూ.400 కోట్ల వ్యయంతో బీఆర్ అంబేడ్కర్ భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రానికి దిక్సూచిగా అంబేడ్కర్ విగ్రహం నిలవనుందన్నారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి పాల్గొన్నారు. -
చావని ప్రేమిది...
హెబ్బా పటేల్ ప్రధాన పా త్రలో నటించిన చిత్రం ‘సందేహం’. సతీష్ పరమవేద దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుమన్ ఊటుకూరు హీరో. సత్యనారాయణ పర్చా నిర్మించిన ఈ చిత్రం నుంచి సంగీతదర్శకుడు సుభాష్ ఆనంద్ స్వరపరచిన ‘చచ్చినా చావని ప్రేమిది..’ పాటను దర్శకుడు దశరథ్ విడుదల చేశారు. ‘‘ఈ చిత్రంలో హెబ్బా పటేల్ డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
ఐఐటీ, ఐఐఎంల్లోని బీసీ విద్యార్థులకు...పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై హర్షం
ముషీరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎంలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లిస్తామని ప్రకటించడాన్ని బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జల్లపల్లి అంజి హర్షం వ్యక్తం చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చదివే సుమారు ఐదున్నర లక్షల విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బుధవారం విద్యానగర్‌లోని బీసీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రకాల వృత్తి విద్యా కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇక్కడ మాత్రం పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించకపోగా కోట్ల రూపాయల బకాయిలు ఉండటంతో విద్యార్థులను కళాశాలల యాజమాన్యం విద్యాభ్యాసం పూర్తయినా సర్టీఫికెట్లు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ అడ్మిషన్ ఇవ్వాలని, అవసరమైతే అదనపు సెక్షన్లు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల మెస్ చార్జీలను రూ. 1575 నుంచి రూ. 2500లకు పెంచాలని డిమాండ్ చేశారు. విదేశీ విద్యను 300 మందికి మాత్రమే ఎందుకు కుదించారని ప్రశ్నించారు. బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఐఐటీ, ఐఐఎం చదివే విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తూ, ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంసీఏ చదివే విద్యార్థులకు ఎందుకు నిరాకరిస్తుందని ఇది సవతి తల్లి ప్రేమ కాదా అని ప్రశ్నించారు. బీసీ హాస్టల్స్‌కు ఒక్క సొంత భవనం కూడా లేదని అద్దెలకు మాత్రం కోట్లాది రూపాయలు చెల్లిస్తూ అధికారులు మధ్య దళారుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. -
ఏయూ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్!
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ సత్యనారాయణపై లైంగిక వేధింపుల ఆరోపణ కేసులో కొత్త ట్విస్ట్ నెలకొంది. యూనివర్సిటీ పాలక మండలిపై ప్రొఫెసర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎగ్జిక్యూటివ్ పీహెచ్‌డీల పేరుతో పెద్ద దందా నడుస్తోందని ఆరోపించారు. ఇప్పటి వరకు 1400 అడ్మిషన్లు జరగ్గా.. వాటిలో చాలా మొత్తం డబ్బులు చేతులు మారాయని తెలిపారు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఉజ్వల్ ఘటక్ అనే ప్రైవేటు వ్యక్తి ద్వారా ఈ వ్యవహారాలన్నీ యూనివర్సిటీ అధికారులు నడుపుతున్నారని ప్రొఫెసర్ ఆరోపించారు. డిఫెన్స్ లిక్కర్ వ్యాపారం చేస్తూ యూనివర్సిటీ అధికారులను ఉజ్వల్ చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని ఆరోపించారు. తన భార్యకు అర్హత లేకపోయినా ఫ్రీ పీహెచ్డీ కోసం ఒత్తిడి తెచ్చారని, నిబంధనలకు విరుద్ధమని తిరస్కరించినందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఒక్కరోజు కూడా డిపార్ట్ మెంట్‌కు రాని మహిళపై లైంగిక వేధింపులు ఎలా సాధ్యమని ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రశ్నించారు. ఏయూతో సంబంధం లేని ఉజ్వల్ ఘటక్‌కు డీన్ పదవి ఏ విధంగా ఇచ్చారో వీసీ, రిజిస్ట్రార్ చెప్పాలని నిలదీశారు. చదవండి: Video: ఆగ్రాలో దారుణం.. టూరిస్ట్‌ను వెంబడించి.. ఇనుపరాడ్లతో దాడి కాగా ఆంధ్రా యూనివర్సీలో హిందీ విభాగం హెడ్,ప్రొఫెసర్ సత్యనారాయణపై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై జాతీయ మహిళా కమిషన్‌కు సోనాలి ఫిర్యాదు చేసింది. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని ఆరోపించింది. తన వద్ద నుంచి ఇప్పటికే రూ.75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఎన్సీడబ్ల్యూకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్తపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపించింది. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన జాతీయ మహిళా కమిషన్.. సోనాలీ ఆరోపణలపై తగిన విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని ఏయూ యూనివర్సిటీ వీసీని ఆదేశిస్తూ మెయిల్ చేసింది. అయితే సోనాలీ ఆరోపణలపై ఏయూ అధికారులు ఇంత వరకు స్పందించలేదు. -
రెరాతో రియల్ దందాకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ దందాలకు ఆస్కారం లేకుండా టీఎస్ రెరా (తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అధారిటీ) కృషి చేస్తుందని ‘రెరా’ చైర్మన్ సత్యనారాయణ వెల్లడించారు. ’’ రాష్ట్రంలో 598 చదరపు మీటర్ల విస్తీర్ణం దాటిన ఏ రియల్ ఎస్టేట్ వెంచర్ అయినా, 8 ఫ్లాట్లను మించి నిర్మించే ఏ అపార్ట్‌మెంట్‌కు అయినా... రెరా రిజిస్ట్రేషన్, అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ‘ఏ వెంచర్ కోసం కొనుగోలు దారుల నుంచి వసూలు చేశారో.. ఆ మొత్తంలో 70 శాతం అదే వెంచర్లో ఖర్చు చేయాలి. ప్రాజెక్టు వ్యయంలో 10 శాతం మాత్రమే అగ్రిమెంట్ సమయంలో చెల్లించాలి. ప్రాజెక్టు ప్లాన్ మార్చాలన్నా... కొనుగోలు దారుల్లో మూడింట రెండొంతుల మంది అనుమతి తప్పనిసరి’... ఇలాంటి నిబంధనలన్నింటినీ తప్పనిసరి చేసేందుకు ‘రెరా’ పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది.’’ అని ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. ‘రెరా’ నిబంధనలకు లోబడే.. ప్రతీ ప్రాజెక్టు రియల్ వెంచర్ అయినా, భారీ అపార్ట్మెంట్ అయినా.. ఒప్పందాన్ని ఉల్లంఘించి, ముందుగా చెప్పిన దానికి భిన్నంగా నిర్మాణం జరిపినా, పూర్తిస్థాయిలో అనుమతులు లేకపోయినా, సౌకర్యాలు కల్పించకపోయినా ‘రెరా’ చర్యలకు ఉపక్రమిస్తుంది. రాష్ట్రంలో ఏమూలన రియల్ ఎస్టేట్ వెంచర్ చేసినా, అపార్ట్మెంట్ కట్టినా ‘రెరా’ వద్ద ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయించాలి. దీంతో కొనుగోలుదారుడికి, రియల్ వ్యాపారికి అనుసంధానంగా ఈ సంస్థ పనిచేస్తుంది. 2017లో రెరా అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 6,805 వెంచర్లు, ఫ్లాట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ కోసం ‘రెరా’ వద్దకు రాగా, అందులో 6,770కి అనుమతులు లభించాయి. మరో 35 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, నిర్ణీత గడువులోగా ఈ దరఖాస్తులను కూడా పరిశీలించి అనుమతులు ఇవ్వనున్నట్లు సత్యనారాయణ తెలిపారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సైతం రిజిస్ట్రేషన్ చేయాల్సిందే ‘రెరా’ చట్టం ప్రకారం రియల్ వెంచర్లు, ఫ్లాట్లతో పాటు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు (బ్రోకర్లు) కూడా ‘రెరా’ వద్ద రిజిస్టర్ అయి ఉండాల్సిందే. ఇప్పటి వరకు 2,912 మంది ఏజెంట్లు రిజిస్టర్ కాగా, మిగతా వారిని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చైర్మన్ సత్యనారాయణ సూచించారు. కాగా, గతంలో జరిగిన రియల్ దందాలకు సంబంధించి ఫిర్యాదులు వస్తే ఆ లావాదేవీలపైనా విచారించి తప్పు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
విశాఖ కిడ్నాప్ కేసు: లవర్‌కు 40 లక్షలు పంపిన హేమంత్
దొండపర్తి (విశాఖ దక్షిణ): ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 48 గంటలపాటు ఎంపీ కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు నరకం చూపించారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడు శరత్, ప్రముఖ ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు(జీవీ)ను చిత్ర హింసలు పెట్టారు. ఈ వ్యవహారంపై పోలీసులు చేపట్టిన దర్యాప్తులో అనేక కీలక అంశాలు వెలుగు చూశాయి. పోలీసుల దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం.. భీమిలి ప్రాంతానికి చెందిన కోలా వెంకట హేమంత్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మధుసూదనరావు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్ చేసిన కేసులో జైలుకు వెళ్లాడు. చోరీలు చేసే రాజేష్, ఇతర గ్యాంగ్‌తో అక్కడ అతనికి పరిచయం ఏర్పడింది. చిన్న చిన్న చోరీలు చేసే కంటే ఒకేసారి బిగ్‌షాట్‌ను కిడ్నాప్ చేస్తే సెటిల్ అయిపోవచ్చని హేమంత్ వారికి ఆశపెట్టాడు. టార్గెట్ ఎంపీ కుటుంబం బయటకు వెళ్లాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేయాలని నిర్ణయించారు. హేమంత్‌కుమార్, రాజేష్, సాయి, చిన్న సాయి, గోవర్ధన్, మరో వ్యక్తి కలిసి ఎంపీ కొత్త ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారు. ఇంట్లోకి చొరబడి ఎంపీ కుమారుడు శరత్‌పై దాడి చేశారు. కాళ్లు, చేతులు కట్టేశారు. శరత్‌తో ఫోన్ చేయించి సెక్యూరిటీ గార్డును పంపించేశారు. శరత్ ఒంటిపై ఉన్న బంగారం దోచుకున్నారు. మరుసటి రోజు ఉదయం శరత్‌తో ఫోన్ చేయించి ఒంట్లో బాగోలేదని చెప్పించి, తల్లి జ్యోతిని ఆ ఇంటికి రప్పించారు. ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, ఆమెనూ బంధించారు. అనంతరం ఎంపీ ఎంవీవీ స్నేహితుడు జీవీ వద్ద డబ్బులు ఉంటాయని భావించి అతనికి బలవంతంగా ఫోన్ చేయించి రప్పించారు. హేమంత్ రాజేష్‌లు అతడిపై దాడి చేసి.. చేతులు, కాళ్లు కట్టేశారు. కారు డ్రైవర్‌ను అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఫోన్ చేయించారు. రూ.20 కోట్లు ఇస్తావా? లేదా ఇల్లు, స్థలం రాసిస్తావా? అసలు ఎందుకు తమను నిర్బంధించారని, ఏం కావాలో చెబితే ఇస్తామని జీవీ కిడ్నాపర్లకు చెప్పగా.. రూ.100 కోట్లు కావాలి ఇస్తావా? అని హేమంత్ ప్రశ్నించాడు. అంత డబ్బు ఉండదని, తమను వదిలేస్తే రూ.5 కోట్ల వరకు సమకూరుస్తామని చెప్పారు. దానికి హేమంత్ అంగీకరించలేదు. ఎవరికి ఫోన్ చేస్తే డబ్బులు వస్తాయో వారి పేర్లను హేమంత్కుమారే సూచించి, ఫోన్లు చేయించారు. ఇలా జీవీ రూ.కోటి వరకు సమకూర్చి డ్రైవర్ ద్వారా ఆ డబ్బు తెప్పించారు. వచ్చిన డబ్బులో హేమంత్‌కుమార్, రాజేష్‌లకు 40 శాతం చొప్పున, సాయికి 10 శాతం, ఇతర ఖర్చుల కోసం 10 శాతం పంపకాలు చేసుకున్నారు. శరత్ బ్యాంక్ అకౌంట్లో రూ.65 లక్షలు జీవీ అకౌంటెంట్ ద్వారా విత్‌డ్రా చేయించి తెప్పించుకున్నారు. వచ్చిన డబ్బులో రూ.21 లక్షలు బెయిల్ కోసం రాజేష్ అనే లాయర్‌కు పంపించారు. లవర్‌కు రూ.40 లక్షలు నజరానా హేమంత్‌కుమార్ తన వాటాలో వచ్చిన డబ్బులో రూ.40 లక్షలు తన లవర్ సుబ్బలక్ష్మికి ఇవ్వాలని భావించాడు. అయితే గతంలో చేసిన కిడ్నాప్ వ్యవహారంలో ఇతనితో పాటు సుబ్బలక్ష్మి కూడా జైలుకు వెళ్లింది. ఫలితంగా వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రూ.40 లక్షలు ఇచ్చి మళ్లీ ఆమెకు దగ్గరవ్వాలని భావించాడు. నేరుగా డబ్బులు ఇస్తానంటే అంగీకరించదని జీవీతో ఫోన్ చేయించి.. రెండు గంటల సేపు మాట్లాడి ఒప్పించేలా చేశాడు. జీవీ కారు డ్రైవర్‌ను రప్పించి రూ.40 లక్షలు ఆమెకు అందేలా చేశారు. రెండు రోజుల పాటు కిడ్నాపర్లు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ పెట్టారు. వారికి పెరుగన్నం పెట్టి, కిడ్నాపర్లు మాత్రం బిర్యానీ తినేవారు. రూ.20 కోట్లు ఇవ్వాలంటూ రాజేష్.. వారి చేతులపై కత్తితో కొడుతూ.. దుర్భాషలాడుతూ వారి చేతికి ఉన్న ఉంగరాలను లాక్కున్నాడు. డబ్బు లేదంటే ఎంపీ ఇల్లు, జీవీకి ఉన్న స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయాలని హేమంత్ డిమాండ్ చేశాడు. శరత్‌ను డిక్కిలో కుక్కి.. ఫోన్ చేసినప్పుడు జీవీ పొంతన లేని సమాధానాలతో ఎంపీకి అనుమానం వచ్చింది. వెంటనే పోలీస్ కమిషనర్ త్రివిక్రమ్ వర్మకు ఫోన్ చేసి విషయం చెప్పారు. వెంటనే పోలీసులు జీవీ నెంబర్‌కు వరుసగా ఫోన్ చేస్తుండటంతో.. అనుమానం వస్తుందని భావించిన కిడ్నాపర్లు ఫోన్లో మాట్లాడించారు. పోలీసులకు అనుమానం వచ్చినట్లు గ్రహించిన హేమంత్‌కుమార్ గ్యాంగ్ వెంటనే అక్కడి నుంచి శరత్ కారులోనే తప్పించుకోవాలని చూసింది. చేతులు, కాళ్లు కట్టేసి శరత్‌ను డిక్కీలో కుక్కారు. హేమంత్ కార్ డ్రైవ్ చేయగా ముందు సీట్లో రాజేష్ ఎక్కాడు. జ్యోతి, జీవీతో పాటు సాయి కూర్చున్నాడు. మధ్యలో వీరు తమ వద్ద ఉంటే ప్రమాదమని భావించిన హేమంత్‌కుమార్.. వారిని ఆనందపురం మండలంలో దించేశాడు. దీంతో జ్యోతి, జీవీలు జాతీయ రహదారి వరకు నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కారు. అనంతరం కారు ఆపి మధ్యలోనే సాయి దిగిపారిపోయాడు. అంతలో పోలీసులు వారి కారును వెంబడించి హేమంత్, రాజేష్‌లను పట్టుకుని.. శరత్‌ను విడిపించిన విషయం తెలిసిందే. ముగ్గురి అరెస్ట్.. రూ.86.6 లక్షలు రికవరీ దొండపర్తి (విశాఖ దక్షిణ): ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ ఘటనలో ముగ్గురు కిడ్నాపర్లను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. వాస్తవానికి గురువారమే కోలా వెంకట హేమంత్‌కుమార్, రాజేష్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా కిడ్నాప్‌లో పాల్గొన్న వారి వివరాలను వెల్లడించారు. దీని ప్రకారం శుక్రవారం గాజువాకకు చెందిన సాయిని షీలానగర్ ప్రాంతంలో పట్టుకున్నారు. వీరి ముగ్గురి నుంచి రూ.86.6 లక్షలు రికవరీ చేశారు. ఈ ముగ్గురిని సాయంత్రం కేజీహెచ్‌కు తీసుకువెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. కాగా, మరో ముగ్గురు నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. -
లీకేజీ కేసులో ఈడీ స్పీడు
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) స్పీడ్ పెంచింది. పేపర్ లీకేజీలో హవాలా లావాదేవీలకు అవకాశం ఉన్నందున వీటిపై దర్యాప్తు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మరికొందరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకమైన టీఎస్పీఎస్సీ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితోపాటు టీఎస్పీఎస్సీ తరఫున ఈ కేసులో ఫిర్యాదుదారు సత్యనారాయణలను గురువారం ఈడీ అధికారులు 10 గంటలపాటు విచారించినట్టు సమాచారం. శంకర లక్ష్మిని ఈ కేసులో కేవలం సాక్షిగానే సిట్ పేర్కొనగా.. ఇప్పుడు ఈడీ మాత్రం శంకర్ లక్ష్మి నుంచే దర్యాప్తు ప్రారంభించడం ఈ కేసు విచారణపర్వంలో కొత్త కోణంగా చెప్పవచ్చు. మొత్తం పేపర్ల లీకేజీ కుట్రకు శంకర్లక్ష్మి కంప్యూటర్ నుంచే మూలాలు ఉండడంతో తొలుత ఆమెను ఈడీ అధికారులు విచారించినట్టు సమాచారం. ప్రధా నంగా ఈ కేసులో కీలక నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల గురించి ఆరా తీసినట్టు తెలిసింది. కాగా, టీఎస్పీఎస్సీకి సంబంధించి ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు అడిగారని విచారణానంతరం శంకరలక్ష్మి మీడియా ప్రతినిధులకు తెలిపారు. తన ఆధార్, పాన్ వివరాలు తీసుకున్నారని, అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామన్నారని ఆమె చెప్పారు. మీ సిస్టంలోకి వాళ్లు యాక్సెస్ ఎలా అయ్యారు? శంకర్‌లక్ష్మికి ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిలతో ఉన్న పరిచయం, ఆఫీస్‌లో వారి ప్రవర్తన, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో వారు వచ్చేవారా..? డబ్బు లావాదేవీల గురించి మీతో ఎప్పుడైనా చర్చించే వారా..? మీ కంప్యూటర్లోకి యా క్సెస్ ఎలా అవుతారు..? ఈ కంప్యూటర్ పాస్వర్డ్లు ఇంకా ఎవరికైనా తెలిసే అవకాశం ఉందా?..మీ కంప్యూటర్ పరిసరా ల్లో సీసీటీవీ కెమెరాలు ఏవైనా ఉంటాయా?.. అన్న అంశాలపై నా ప్రశ్నించినట్టు తెలిసింది. టీఎస్పీఎస్సీ అధికారి సత్యనారాయ ణ నుంచి సైతం కీలక వివరాలు సేకరించినట్టు తెలిసింది. పేపర్‌లీకేజీ వ్యవహారం టీఎస్పీఎస్సీ దృష్టికి ఎలా వచ్చింది? ఏయే పేపర్లు లీకైనట్టు గుర్తించారు..? ఉద్యోగుల పాత్రపై అంతర్గతంగా ఏ చర్యలు తీసుకున్నారు? ఇలాంటి వివరాలు సేకరించినట్టు తెలిసింది. వీటిని ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు దర్యాప్తును కొనసాగించనున్నట్టు తెలుస్తోంది. సిట్ అధికారులను వివరాలు ఇవ్వాలని ఈడీ అధికారులు కోరినా స్పందన లేకపోవడంతో కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం విచారణకు హాజరైన శంకర్లక్ష్మి, సత్యనారాయణలను అవసరం మేరకు మరోమారు పిలుస్తామని ఈడీ అధికారులు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్ల ఈడీ కస్టడీపై తీర్పు రిజర్వ్ పేపర్ల లీకేజీలో నిందితులు ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డిల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ వేశారు. గురువారం దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. మనీలాండరింగ్ కోణంలో దర్యాప్తు చేయాల్సి ఉందని, ఈ కేసులో సిట్ వివరాలు ఇవ్వవడం లేదని ఈడీ కోర్టుకు తెలిపింది. 8 డాక్యుమెంట్లు కావాలని, కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌ను ఆదేశించాలని ఈడీ కోరింది. అయితే కేసు కీలక దశలో ఉన్నందున వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలిపింది. -
ఆదియోగి సేవలో రజనీకాంత్!
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్‌స్టార్ రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి కర్ణాటక, చిక్కబల్లాపుర జిల్లాలోని ఆదియోగి దర్శనానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోయంబత్తూరు ఈషా యోగ మందిరం తరపున ఈఏడాది జనవరి 15 కర్ణాటక రాష్ట్రం చిక్కబల్లాపుర జిల్లాలోని నందిమలై (కొండ) పరీవాహక ప్రాంతంలో 112 అడుగుల ఎత్తయిన ఆదియోగి శిలా విగ్రహాన్ని ఆవిష్కరించారు. కోయంబత్తూరులోని శివుని శిలా విగ్రహం మాదిరిగానే చిక్కబల్లాపురలో ఆదియోగి శిలా విగ్రహం ఉండడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. కాగా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తులు శనివారం నుంచే శివ దర్శనం చేసుకున్నారు. అదేవిధంగా నటుడు రజనీకాంత్ తన సోదరుడు సత్యనారాయణతో కలిసి ఆదియోగిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ యోగేశ్వర లింగానికి విశేష పూజలు నిర్వహించారు. ఆ ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌కు ఐఎస్వో గుర్తింపు
కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం (సీపీవో)కు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ఐఎస్వో) గుర్తింపు లభించింది. ఆ సంస్థ ప్రతినిధులు శనివారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణకు ధ్రువీకరణపత్రం అందజేశారు. కమిషనరేట్ పరిధిలో పోలీసుల పనితీరు, పరిశుభ్రత, సదుపాయాలు, బాధితులకు త్వరితగతిన సమస్యలు పరిష్కరించడం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ ఐఎస్వో 9001 సర్టిఫికెట్‌కు ఎంపిక చేశారు. కాగా, కమిషనరేట్ పోలీస్ కార్యాలయం (సీపీవో) విభాగంలో తెలుగు రాష్ట్రాల్లోనే కరీంనగర్ కమిషనరేట్ ఎంపికై మేటిగా నిలవడం ప్రత్యేకం. ఈ సందర్భంగా కమిషనరేట్‌లో విలేకరుల సమావేశంలో సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎస్వో గుర్తింపునకు ఎంపికవడం బాధ్యతను మరింత పెంచిందన్నారు. మరిన్ని సమర్థవంతమైన సేవలందించేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్.శ్రీనివాస్ (ఎల్‌అండ్‌వో) జి.చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీలు తుల శ్రీనివాసరావు, విజయ్‌కుమార్, సి.ప్రతాప్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి మునిరత్నం పాల్గొన్నారు. -
ఆప్యాయత అల్లుకున్న ’మన ఇల్లు‘
పెద్దాపురం: స్పందించే మనసుంటే చాలు...సేవ చేయాలనే తపన ఉంటే చాలు..ఆదుకోడానికి పెద్దగా ఆస్తిపాస్తులక్కరలేదని చెప్పడానికి ఆయనే నిదర్శనం. అయినవాళ్ల ఆదరణకు దూరంగా ..వృద్ధాప్యంలో అనాథలైన వారికి ఆసరా ఇస్తున్న ఆయన పేరు అల్లవరపు సత్యన్నారాయణ. బాల్యంలో తండ్రి అనారోగ్యం పాలై ఆస్పత్రిలో పడిన బాధల్ని కళ్లారా చూశారు. ఆర్ధిక పరిస్థితి సహకరించకపోతే ఎదురయ్యే పరిస్థితులనూ చూశారు. ఆవే ఆయన్ను ప్రభావితం చేశాయి. అభాగ్యులకు అండగా నిలవాలనే తత్వాన్ని పెంచాయి. ఫలితంగా ఆయన నేతృత్వంలో 2016లో కాకినాలో ఆవిర్భవించిందే బాధ్యత స్వచ్ఛంద సంస్థ. తనలాంటి స్వభావమున్న మరో ఏడుగురు ఈయనకు తోడయ్యారు. నాటి ఆస్పత్రి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాఘవేంద్రరావు ప్రోత్సాహమూ బలమైంది. తొలుత కాకినాడలో అనాథ బాలలు గుర్తించి, దిశ వన్ స్టాప్ సర్వీస్‌ల సహాకారంతో సేవలకు శ్రీకారం చుట్టారు. మేమున్నామని.. జీజీహెచ్‌లో ఏ దిక్కూ లేని వృద్ధుల వైద్యసేవలకో వార్డు ఉంది. ఈ వార్డులో చికిత్స పొందుతున్న వారెవరికీ తెలియదు. వీరికోసం ఎవరూ అక్కడికి రారు. ఈ వార్డుకు సత్యనారాయణ బృందం వెళుతూ వారికి సపర్యలు చేస్తున్నారు. వీరికి తామే ఎందుకు ఆసరా కల్పించకూడదనే ఆలోచనతో పెద్దాపురంలో మన ఇల్లు ఏర్పాటు చేశారు. తొలుత ఎనిమిది మందితో ఆరంభమైన మన ఇల్లులో ఇప్పుడు 29మంది ఉంటున్నారు. సహచరులు.. యువత, ప్రభుత్వ ఉద్యోగులు సత్యనారాయణ ఆలోచనకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు చేయూతనిస్తున్నారు. మన ఇల్లులో ఉన్నవారెవరికీ తాము అనాథలం అనే భావన రానీయకుండా సాకుతున్నామని సత్యనారాయణ చెప్పారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో పడుకోవడానికి బెడ్లు, దుప్పట్లు, వేళకు భోజనం సమకూర్చుతున్నారు. వినోదం కోసం టీవీలు అందుబాటులో ఉంచుతున్నారు మన ఇల్లు నిర్వాహకులు. అసోం నుంచి రైలు ప్రమాదంలో అనారోగ్యం పాలై మతిస్థిమితం కోల్పోయిన శ్రీదౌహరుకు మూడేళ్లపాటు సేవలందించారు. తర్వాత కుటుంబీకుల వివరాలు చెప్పడంతో ఇటీవల వారిని రప్పించి అతడ్ని స్వస్థలానికి పంపించారు. ఈవిషయంలో మన ఇల్లు నిర్వాహకుడు సత్యనారాయణ పోషించిన పాత్రను జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. జీజీహెచ్‌లో అనాథలుగా ప్రాణాలు కోల్పోయిన 14 మంది మృతదేహాలకు సత్యనారాయణ బృందం అంతిమ సంస్కారాలను నిర్వహించింది. కాళ్లు చచ్చుబడిన స్థితి నుంచి ఇలా ఉన్నా.. నాది రాజమహేంద్రవరం. నాకు అందరూ ఉన్నారు. రెండు కాళ్లు చచ్చుబడిపోయి మంచాన పడ్డాను. కాకినాడ తిమ్మాపురానికి చెందిన నా సోదరి జీజీహెచ్‌లో చేర్పించింది. నా పరిస్థితి గుర్తించి సత్యన్నారాయణ పెద్దాపురంలోని మన ఇల్లుకు తీసుకువచ్చారు. ఏ ఇబ్బంది లేకుండా ఆనందంగా గడుపుతున్నాను. – వెంకటరమణ, రాజమహేంద్రవరం ఆ వృద్ధులందరూ అమ్మానాన్నలే.. పెద్దాపురంలో మూడేళ్లుగా ‘మనఇల్లు’ను ప్రారంభించాం. ప్రస్తుతం 29 మంది వృద్ధులు ఉన్నారు. వీరికి ఏ ఇబ్బంది రాకుండా చూస్తున్నాం. కొందరికి ఫిజియోథెరపీ సేవలు కూడా అందిస్తున్నాం. వీరంతా అనాధ వృద్ధులు కాదు. నాకు అమ్మా నాన్నలే. వృద్ధులైన వారిపై కుటుంబీకులు నిరాదరణ చూపడం సరికాదు. పెద్దలను గౌరవిస్తూ సేవలందించాలి. – అల్లవరపు సత్యనారాయణ, ‘మన ఇల్లు’ సంస్థ నిర్వాహకుడు -
Pudami Sakshiga:అడవి సృష్టికర్త "దుశర్ల సత్యనారాయణ"
-
కరీంనగర్ సీపీపై చర్యలు తీసుకోండి
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, మరికొందరు పోలీసు అధికారులు తనపై దాడి చేసి, అక్రమంగా అరెస్టు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీకి విజ్ఞప్తి చేశారు. సీపీతోపాటు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం ఢిల్లీలో లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ ముందు బండి సంజయ్ హాజరై తన వాదనలు వినిపించారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 317ను సవరించాలంటూ ఈ నెల 2న కరీంనగర్‌లోని తన కార్యాలయంలో దీక్ష చేపట్టానని.. కానీ కొందరు పోలీసు అధికారులు అక్రమంగా దాడి చేసి, అరెస్టు చేశారని ఫిర్యాదు చేశారు. పోలీసుల తీరును, అరెస్టును హైకోర్టు కూడా తప్పుపట్టిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారని వివరించారు. 2019 అక్టోబర్‌లో ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళుతుండగా.. పోలీసులు తనను అడ్డుకుని, క్రూరంగా దాడి చేశారని ప్రివిలేజ్ కమిటీకి సంజయ్ వెల్లడించారు. తాజా ఘటన లో సీపీ సత్యనారాయణ, హుజూరాబాద్ ఏసీపీ కోట్ల వెంకట్‌రెడ్డి, జమ్మికుంట ఇన్స్పెక్టర్ కొమ్మినేని రాంచందర్‌రావు, హుజూరాబా ద్ ఇన్స్పెక్టర్ వీ.శ్రీనివాస్, కరీంనగర్ సీసీఎస్ ఏసీపీ కె.శ్రీనివాస్, కరీంనగర్ టూటౌన్ ఇన్స్పెక్టర్ చల్లమల్ల నరేశ్ సహా గుర్తు తెలియని ఇతర పోలీస్ సిబ్బంది ఈ నెల 2న తనపై దాడి చేశారని సంజయ్ వివరించారు. ఆ రోజు జరిగిన ఘటనలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలతో పాటు వీడియో క్లిప్పింగులను కమిటీకి సమర్పించారు. -
ముదిరిన ఎంపీ.. సీపీల వివాదం.. ఢిల్లీకి గల్లీ లొల్లి!
సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షు డు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్.. కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మధ్య వివాదం ముదిరింది. నగరంలోని ఎంపీ కార్యాలయం ఉన్న చైతన్యపురి గల్లీలో మొదలైన వివాదం.. ఢిల్లీలోని ప్రివిలేజ్ కమిటీ వద్దకు చేరింది. ఈ వ్యవహారంలో శుక్రవారం సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. 317 జీవో సవరణకు సంజయ్ ఈ నెల 2న తలపెట్టిన జాగరణ దీక్ష సందర్భంగా పోలీసులు అతడిని అరెస్టు చేసిన వి షయం తెలిసిందే. ఆ సమయంలో పోలీసులు బీజేపీ కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి, తన గల్లా పట్టుకుని ఈడ్చుకెళ్లి అరెస్టు చేశారని సంజయ్ ఆరోపించారు. సంబంధిత వార్త: సీపీ నా గల్లా పట్టుకున్నారు: బండి సంజయ్ ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఆయన ఈ– మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై స్పందించిన ప్రివిలేజ్ కమిటీ హోంశాఖ కార్యదర్శిని రిపోర్టు అడిగిందని స మాచారం. హోంశాఖ కార్యదర్శి తెలంగాణ డీ జీపీ, సీఎస్‌ను నివేదిక కోరారని తెలిసింది. ని వేదికలు ఇప్పటికే ప్రివిలేజ్ కమిటీకి చేరాయని సమాచారం. ఈ నేపథ్యంలో తనపై పోలీసులు దాడి చేశారని, అరెస్టు సందర్భంగా హద్దుదాటి వ్యవహరించారని సంజయ్ ఆరోపిస్తున్నారు. గ్యాస్ కట్టర్లతో ఎంపీ కార్యాలయం తలుపులు, కిటికీలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి అత్యుత్సాహం ప్రదర్శించారని ప్రివిలేజ్ కమిటీకి ఇ చ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తమపై పోలీసులు అకారణంగా లాఠీచార్జీ చేశారని వివరించారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చే పలు ఫొటోలు, వీడియోలు, న్యూస్ క్లిప్పింగులతో కూడిన ఫైల్‌ను కమిటీకి సంజయ్ సమర్పించనున్నారని సమాచారం. చదవండి: జాగ‘రణం’.. బండి సంజయ్ దీక్ష భగ్నం సీపీతోపాటు ముగ్గురికి నోటీసులు!? ఎంపీ సంజయ్ ఇచ్చిన ఆధారాలను పరిశీలించిన అనంతరం కమిటీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీతోపాటు ముగ్గురు పోలీసుల అధికారులకు నోటీసులు జారీ చేసే అవకాశాలున్నాయి. కరీంనగర్ పోలీసులపై సంజయ్ పార్లమెంటు కు ఫిర్యాదు చేయ డం రెండోసారి కావడం గమనార్హం. అది కూడా ప్రస్తుత సీపీ సత్యనారాయణపైనే. 2019లో ఆర్టీసీ సమ్మె సమయంలోనూ ఓ ఆర్టీసీ కార్మికుడి శవయాత్రలో పోలీసులు తనతో అసభ్యంగా ప్రవర్తించారని బండి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అప్పటి సీపీ కమలాసన్‌రెడ్డి సెలవులో ఉ న్నారు. ఆ సమయంలో రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణ కరీంనగర్‌కు ఇన్చార్జి సీపీగా వ్యవహరించారు. అప్పుడూ ఎంపీ సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా మారింది. దీంతో వీరిద్దరి మధ్య వృత్తిగతంగా విభేదాలు రావడం ఇది రెండోసారి కావడం విశేషం. సీనియర్లకు వివరణతో సరి..! మరోవైపు ఇటీవల సంజయ్‌కి వ్యతిరేకంగా అ సమ్మతి రాగాలు పలికిన సీనియర్ల విషయంలో అధిష్టానం స్పష్టమైన వైఖరితోనే ఉంది. ఈ వ్య వహారంపై సీనియర్ నాయకుడు నల్లు ఇంద్రసే నారెడ్డి నేతృత్వంలో విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిపై అసమ్మతి గళం విషయంలో తొలుత సీనియర్లను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించినట్లు సమాచారం. వారి వివరణలు వినాలని, వాటితో సంతృప్తి చెందకపోతే అపుడు నోటీసులు జారీ చేయాలన్న ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఇటీవల కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో సీనియర్ నేతలు సుగుణాకర్‌రావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి తదితరులు సమావేశం నిర్వహించడం రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. దీనిని తీవ్రంగా పరిగణించిన అధిష్టానం వెంటనే అసమ్మతి నిప్పును ఆర్పేందుకు చర్యలు చేపట్టింది. బీసీ కమిషన్ ఎదుట సీపీ వివరణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈనెల 2న నిర్వహించిన జాగరణ దీక్షను భగ్నం చేసిన ఘటనలో సీపీ సత్యనారాయణ జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరయ్యారు. గురువారం హైదరాబాద్‌లోని దిల్కుషా గెస్ట్‌హౌస్‌లో జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజ్ ఆచారీ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎంపీ సంజయ్ కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీ జనసమీకరణతో దీక్ష తలపెట్టిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు. దీక్షకు అనుమతి లేదని, కోవిడ్ ప్రబలుతున్న నేపథ్యంలో దీక్షను రద్దు చేసుకోవాలని సూచిస్తూ ఆ రోజు ఉదయం బీజేపీ నాయకులకు నోటీసులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు. అయినా దీక్ష కొనసాగించడంతో అరెస్టు చేయాల్సి వచ్చిందని సీపీ సత్యనారాయణ వివరణ ఇచ్చినట్లు తెలిసింది. -
‘సురేంద్రపురి’ కుందా సత్యనారాయణ కన్నుమూత
Surendra Puri creator kunda satyanarayana died: యాదాద్రికి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సురేంద్రపురి కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ బుధవారం కన్నుమూశారు. 1938 జూన్ 15వ తేదీన జన్మించిన ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో కుందా సత్యనారాయణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన కుందా సత్యనారాయణ మూడో కుమారుడు సురేంద్రబాబు 1991లో మరణించగా.. ఆయన జ్ఞాపకార్థం 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో స్థలం కొని ఆ ప్రాంతా నికి సురేంద్రపురి ప్రాంగణంగా నామకరణం చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ ఒకే ప్రదేశంలో చూసిన అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో 2008లో వివిధ ప్రముఖ ఆలయాల పోలికతో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు కట్టించారు. రామాయణ, మహాభారత, భాగవత సన్నివేశాలను విగ్రహాల రూపంలో ఏర్పాటు చేయించారు. ఈ ప్రాంతానికి ‘కుందా సత్యనారాయణ కళాధామం' పేరు పెట్టారు. -
ఒకే ఎఫ్ఐఆర్తో రెండు కేసులు, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి.. సీపీ సీరియస్
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఒకే నెంబరుతో రెండు ఎఫ్ఐఆర్ల విషయం పోలీసు డిపార్ట్మెంటులో కలకలం రేపుతోంది. ఈ ఉదంతంపై ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ విషయంలో శుక్రవారం ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి డీజీపీ కార్యాలయం స్పందించింది. ఈ ఘటనపై తక్షణమే పూర్తి వివరాలతో నివేదిక పంపాలని కరీంనగర్ పోలీసులను ఆదేశించింది. సీపీ సత్యనారాయణ కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఒకే నెంబరుతో రెండు కేసులు నమోదవడం రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనూ తాము చూడలేదని పలువురు సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఈ విషయం డిపార్ట్మెంటులో సరికొత్త చర్చకు దారితీసింది. మరోవైపు ఘటనపై ఇంటలిజె న్స్ పోలీసులు కూడా రంగంలోకి దిగి ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ డమ్మీ ఎఫ్ఐఆర్ ఎవరిపని? దీన్ని పోలీసులే సృష్టించి బాధితుడిని భయపెట్టారా? లేక బాధితుడే పోలీసులను అప్రతిష్ట పాలు చేస్తున్నాడా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. చదవండి: డ్యూటీకి వెళ్లిన భర్త సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి.. బాధితుడు తనకు ఇచ్చినట్లుగా చెబుతున్న 255/2020 ఎఫ్ఐఆర్ అసలేం జరిగింది..?: విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఆరెపల్లికి చెందిన నల్లగోపు చంద్రకళ–శ్రీనివాసరావు దంపతులు. మనస్పర్థలతో విడిగా ఉంటున్నారు. తన పేరిట ఉన్న ఇంటిని విక్రయించేందుకు చంద్రకళ సిద్ధపడింది. తన కూతురు పెళ్లికోసమని కొన్న ఇంటిని విక్రయించేందుకు శ్రీనివాసరావు అంగీకరించలేదు. ఈ విషయంలో వీరి మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత ఒకరోజు కరీంనగర్ రూరల్ పోలీస్‌స్టేషన్ నుంచి పిలు పువచ్చింది. మరునాడు కూడా అతన్ని పోలీస్‌స్టేషన్‌కి పిలిపించారు. చేతిలో ఎఫ్ఐఆర్ పెట్టారు. ‘నిన్ను అరెస్టు చేస్తున్నాం. వైద్యపరీక్షలకు పంపుతాం. దాదాపు ఆరునెలల వరకు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో భయపడిపోయిన.. అతను ఇంటి విక్రయానికి అంగీకరించాడు. అప్పుడు దంపతులిద్దరూ రాజీ పడుతున్నామని రాసివ్వడంతో జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని, పిలిచినప్పుడు కోర్టుకు రావాల్సి ఉంటుందన్నారు. తనకు ఎంతకూ న్యాయస్థానం నుంచి పిలుపు రాకపోవడంతో అనుమానంతో శ్రీనివాసరావు తన వద్ద ఉన్న ఎఫ్ఐఆర్ 255/2020 కాపీ వివరాలతో లాయరును ఆశ్రయించారు. అక్కడ అదే నెంబరుతో మరో ఎఫ్ఐఆర్ ఉందని తెలుసుకుని విస్తుపోయాడు. తన ఇంటిని విక్రయించేందుకే.. ఈ వ్యవహారమంతా నడిపించారని గగ్గోలు పెడుతున్నారు. చదవండి: అమెరికా అమ్మాయి.. హనుమకొండ అబ్మాయి అలా ఒకటయ్యారు పోలీసు రికార్డుల్లో ప్రస్తుతం ఉన్న 255/2020 ఎఫ్ఐఆర్ ఏది నిజం.. ఆ రెండు ఇవే..! ఇందుకు సంబంధించిన రెండు ఎఫ్ఐఆర్ కాపీలను ‘సాక్షి’ సంపాదించింది. ఇందులో శ్రీనివాసరావుపై 341,323, 506 సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నెంబరు 255/2020 పేరుతో ఎస్సై బి.చంద్రశేఖర్ ఉదయం 11 గంటల సమయంలో కేసు నమోదు చేశారు. అదే సమయంలో నెంబరుపై ఐపీసీ సెక్షన్లు 290, 324తో మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మొ గ్దూంపూర్కు చెందిన కేసు నమోదైంది. ఈ కే సును ఎస్సై వి.శ్రీనివాసరావు నమోదు చేశారు. ఈ క్రమంలో పోలీసుశాఖ మొదటి ఎఫ్ఐఆర్పై దృష్టి పెట్టింది. బాధితుడు చెబుతున్న ప్రకారం.. నిజంగానే పోలీసులు దాన్ని సృష్టించారా? లేక పోలీసులపై నిందలు వేసేందుకు బాధితుడే ఇదంతా చేస్తున్నాడా? విషయాలను నిర్ధారించుకునే పనిలో పడ్డారు. -
కథ: కథకుడు
ఆ సాయంత్రం కథావేదిక సమావేశానికి ఎంత ప్రయత్నించినా టైమ్‌కి బయల్దేరలేకపోయాను.. ఒకరి తర్వాత ఒకరు అతిథులు రావటంతో. వెళ్లకుండా మానేద్దాం అనుకుంటే ఆరోజు ‘జనరంజకంగా కథ’అనే అంశంపై నేను మాట్లాడవలసి ఉంది. అతిథుల హడావుడి అయిపోయాక, బస్సులో వెళితే సమయానికి చేరలేను అని క్యాబ్ బుక్ చేశాను. ఇదిగో వచ్చేస్తుంది అనుకుంటుండగా మెసేజ్.. ‘మన్నించాలి ముందు బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ క్యాన్సిల్ చేసుకున్నాడు. మీకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరుగుతున్నాయి’ అని. మొత్తానికి మరో రెండు (ఇద్దరు) డ్రైవర్ రద్దుల తర్వాత, పావుగంట సమయం ఖర్చు అయ్యాక వచ్చింది క్యాబ్. అది ఆగటంతోనే క్యాబ్ డ్రైవర్లందరి మీద చిరాకు భావంతో వెళ్లాను ఎడమవైపు తలుపు దగ్గరకు. ఇంతలో తటాలున తన వైపు డోర్ తీసి పరుగున వచ్చి ఈ వైపున ఉన్న డోర్ తీసి పట్టుకుని ‘రండి సార్’ అన్నాడా డ్రైవర్. ఆశ్చర్యంగా చూశాను అతని వైపు. అంతకుముందు డ్రైవర్ల మీద ఏర్పడ్డ చిరాకు మీద నీళ్లు చల్లినట్లు అయ్యింది అతడి ప్రవర్తనతో. నేను కూర్చున్న తర్వాత తలుపు మూసి వెళ్లి తన సీట్లో కూర్చుని తన వైపు డోర్ కూడా వేసుకుని సీట్ బెల్ట్ పెట్టుకుంటూ నా వంక తిరిగి ‘స్టార్ట్ చేయనా సార్’ అన్నాడు. నేను అంగీకారంతో తల వూపడంతో అతడి మొబైల్లో ట్రిప్ స్టార్ట్ చేసి, కారు స్టార్ట్ చేశాడు. కాస్త దూరం వెళ్ళామో లేదో, పక్కనున్న అడ్డరోడ్డులోంచి హఠాత్తుగా.. వేగంగా.. మేం వెళ్తున్న కారుకి అడ్డంగా వచ్చిందో స్కూటర్. ఈ డ్రైవర్ సడన్ బ్రేక్ వెయ్యకపోతే ఆ స్కూటర్ని గుద్దేసేదే కారు. సడన్ బ్రేక్ వెయ్యడంతో నేను సీట్లో ఎగిరి దాదాపు తల టాప్‌కి తగిలి మళ్లీ కూలబడ్డాను. ఆ స్కూటర్ అతన్ని తిడుతున్నాడు క్యాబ్ డ్రైవర్. తిరిగి కారు బయల్దేరాక గమనించాను నా కాళ్ల దగ్గర పడి ఉన్న కథల పుస్తకాన్ని. డాష్ బోర్డు మీద ఉన్నది ఎగిరి పడినట్లు ఉంది. తీసి అక్కడ పెడుతూ చూశాను అది నా కథా సంకలనమే. ఇటీవలే వచ్చిన మూడో కథా సంకలనం. ఇప్పటికే వందకు పైగా కథలు, మూడు నవలలు, కొన్ని వ్యాసాలు రాసిన సీనియర్ రైటర్ని. అయినా ఒక క్యాబ్ డ్రైవర్ దగ్గర నా కథల పుస్తకం చూసి ఒక కొత్త ఆనందం, గర్వం కలిగాయి. ‘పుస్తకాలు చదువుతావా?’ నా చేతిలో పుస్తకాన్ని డాష్ బోర్డు మీద పెడుతూ అడిగాను అతన్ని. ‘అవునండీ. ఎక్కువ కథల పుస్తకాలే చదువుతాను. ఎప్పుడూ ఒకటో రెండో కారులో పెట్టుకుంటాను, బేరాలు లేక ఖాళీగా ఉన్న సమయాల్లో చదువుకోటానికి ఉంటాయని’ అన్నాడతను. అంటూనే ఏదో గుర్తొచ్చినట్టుగా నా వైపు ఒంగి ఆ పుస్తకం తీసుకుని వెనక్కి తిప్పి చూశాడు. అక్కడ ఉన్న నా ఫొటో చూపిస్తూ ‘ఇది మీరేగా సార్’ అన్నాడు. ‘నేనే’ అన్నాను.. మనసులో గర్వం. ఆ పుస్తకాన్ని నాకు ఇస్తూ ‘మీ సంతకం పెట్టి ఇవ్వండి సార్. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు నా కారులో ఇలా రావటం’ అన్నాడు ఉత్సాహంగా. పుస్తకం తీసుకుని మొదటి పేజీలో సంతకం చేసి తిరిగి దాని స్థానంలో పెట్టాను. ‘థాంక్యూ సార్’ అని చెప్పి ఊరుకోకుండా గలగలా మాట్లాడేస్తున్నాడు. ‘మీ కథలు చదువుతుంటే అవేవో కల్పితాలుగా అనిపించవు సార్ నాకు. ఎంత బాగా రాస్తారో! నా కళ్ళముందు జరిగినట్లు అనిపిస్తుంది. చాలా గ్రేట్ సార్ మీరు!’ ఆ మాటలు వింటుంటే సంతోషమే కాదు గర్వం కూడా నాకు. క్యాబ్ ఎక్కేముందు తను దిగొచ్చి నా కోసం డోర్ తెరిచి పట్టుకున్న డ్రైవర్ని తొలిసారి చూశాను. పైగా అతనికి సాహిత్యం చదివే అలవాటు. చాలా గౌరవం, ఇష్టం కలిగాయి అతనిమీద. ‘నీ పేరు’ అడిగాను ‘రమేశ్.. సార్’ ‘ఎంతవరకు చదివావు?’ ‘డిగ్రీ మొదటి సంవత్సరంలో మానేశాను సార్’ ‘ఎందుకలా? ఇంకా చదువుకోవాల్సింది’ ‘పరిస్థితులు సార్. పేదరికం. నాన్నని ఇంకా కష్టపెట్టలేకపోయాను’ ‘ఈ కారు నీ సొంతమేనా?’ ‘లేదు సార్.. అద్దెదే’ ‘ఆదాయం బాగానే ఉంటోందా’ ‘పర్వాలేదు సార్. ఏమైనా కారు సొంతమైతే అదొక రకమైన తృప్తి. ఇంకొంచెం ఆదాయం కూడా’ నేనేం మాట్లాడలేదు. కాసేపయ్యాక అతనే అన్నాడు.. ‘ఆరునెలల కిందట కారు కొనడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను సార్. నేను సేవ్ చేసుకున్న రెండు లక్షలు ఉన్నాయి. నాలుగున్నర లక్షలకు బేరం కుదుర్చుకున్నాను. ఫైనాన్స్‌కి సంబంధించిన పేపర్లన్నీ సిద్ధం చేసుకున్నాను. మర్నాడు వెళ్లి ఆ డబ్బుకట్టి ఆ పేపర్ల మీద సంతకాలు పెట్టి కారు తెచ్చుకోవాలని ప్లాన్’ ‘మరి?’ అని అడిగాను. ‘మనం మానవ మాత్రులమే సార్. అన్నీ మన చేతుల్లో ఉంటాయనుకుంటాం. ఆ రాత్రి...’ అంటూ ఆగాడు రమేశ్. ‘ఏమైంది మరి’ అప్రయత్నంగానే ఆత్రం దొర్లింది నా మాటల్లో. ‘మా నాన్న పోయారు’ ఊహించని మాట. ‘అయ్యో’ సానుభూతి ధ్వనించింది నా స్వరంలో. ‘ఏ ఆరోగ్యసమస్యలు లేవు సార్. పడుకోబోయే ముందు ‘కారు రేపేగా తెచ్చేది. నేనూ వస్తాను వెళ్లే ముందు చెప్పు’ అని కూడా అన్నాడు. రాత్రి రెండింటికి అమ్మ ఏడుపు విని లేచాను. నాన్న ఆయాస పడిపోతున్నాడు. మాట్లాడలేక పోతున్నాడు. ఏవో సైగలు చేస్తున్నాడు’ అంటూ జరిగింది చెప్పుకుపోతున్నాడతను. వింటున్నాను.. ‘వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాను. లాభం లేకపోయింది. అప్పటికే పోయాడు ఆయన. హార్ట్ ఎటాక్ అని చెప్పారు డాక్టర్లు’ ‘సారీ రమేశ్’ అన్నాను ఓదార్పుగా. ‘అదొక అదృష్టం సార్. అలాగే ఆస్పత్రిలో చేరి మరో నాలుగురోజుల వైద్యం తర్వాత పోయుంటే నా దగ్గరి రెండు లక్షలూ హారతి కర్పూరం అయ్యేవి. నాన్నకి న్యాయమూ చేయలేకపోయేవాడిని!’ ఆశ్చర్యంగా చూశాను అతని వంక. ‘నిజం సార్! అలా జరగబట్టే నా దగ్గర ఉన్న డబ్బుతో మా నాన్నని ఘనంగా సాగనంపాను. దిన కార్యాలు పూర్తయ్యేవరకూ ఏ లోటూ చేయకుండా గొప్పగా వచ్చిన బంధువులకి మందు, మాంసం ఏర్పట్లన్నీ అదిరిపోయేలా చేశాను’ ‘మీ ఆచారమా అలా చేయటం? అంత ఖర్చుతో ప్రతి వాళ్ళు చెయ్యాలా?’ అడిగాను. ‘అదేంలేదు సార్. తక్కువలో కూడా కావాలంటే ముగించేయొచ్చు. కానీ నాన్న సార్.. ఆయన కోసం నేను చేసే ఆఖరి పని. నలుగురూ ఆయన గురించి, ఆయన చివరి జ్ఞాపకాల గురించి ఘనంగా చెప్పుకోవాలి. డబ్బుదేముంది సార్? ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు. అలా చేసినందువల్ల నేను పొందిన ఆనందం.. తృప్తి గొప్పవి సార్. దానికి విలువ కట్టలేము కదా’ అన్నాడు. ఒక్కో మెట్టు పైకెక్కి కనపడుతున్నాతను నాకిప్పుడు. మొదట నాకు ఇచ్చిన మర్యాద.. పుస్తకాలు చదివే అలవాటు.. తండ్రి మీద తను చూపించిన అపారమైన గౌరవం, ప్రేమ.. రెండు లక్షలు ఇంట్లో.. తెల్లవారితే కారు వచ్చేది.. ఆ రాత్రి తండ్రికి హార్ట్ ఎటాక్.. హఠాన్మరణం. తండ్రి చివరి జ్ఞాపకంగా ఆ డబ్బంతా ఖర్చు చేయటం.. ఇవన్నీ కలిపితే ఇంతకంటే గొప్ప కథావస్తువు ఉంటుందా? నాలో రచయిత ఆలోచిస్తున్నాడు. ‘సార్ వచ్చేశాం’ అన్నాడు రమేశ్. చూస్తే ఆలంబన స్కూల్ ముందు ఉన్నాం. అక్కడే కథా వేదిక సమావేశం. దిగాను. నూటా నలభై మంది హాజరు. పర్సు తీసి రెండు వంద నోట్లు తీయబోతూ ఆగి, అయిదు వందల నోటు తీసిచ్చాను. అతను జేబులోంచి చిల్లర తీసి ఇవ్వబోయాడు. ‘వద్దు ఉంచేసుకో’ అన్నాను. ‘ఎందుకు సార్?’అన్నాడతను మొహమాటంగా. ‘పర్వాలేదు ఇటు రా’ అంటూ అతన్ని నా దగ్గరకు పిలిచి ‘మీ నాన్న కోసం నువ్వు చేసిన పని నాకు నచ్చిందయ్యా. చాలా గొప్ప పని చేశావ్. నిన్ను కలవడం సంతోషంగా ఉంది’ అని అతని భుజం తట్టి లోపలికి నడిచాను. నేను గేటు తీసుకుని లోపలికి వెళ్ళేసరికి బయట కారు స్టార్టయ్యి వెళ్లిపోయిన శబ్దం వినిపించింది. అప్పటికే అక్కడికి వచ్చి ఉన్న వేదిక సభ్యులకు సారీ చెప్పాను. ఆ రోజుకి నేను ప్రిపేర్ అయిన విషయాన్ని పక్కనబెట్టి, రమేశ్ చెప్పిన అనుభవాన్ని ప్రస్తావించి మాట్లాడాను. ఒక్కోసారి కల్పనని మించి వాస్తవం ఎంతగా కరిగిస్తుందో.. ఆ వాస్తవ వివరణ ఎంత ఆకట్టుకుంటుందో నా మాటల్లో చెప్పాను. ‘ఫ్యాక్ట్ ఈజ్ స్ట్రేంజర్ దేన్ ఫిక్షన్’ అన్న కొటేషన్ గుర్తు చేశాను. అందరూ రమేశ్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటూ చప్పట్లు కొట్టారు. ∙∙ ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు రమేశ్ గురించి మా ఆవిడ లక్ష్మికి చెప్పాను. ‘నాన్నకి నేను చేసే ఆఖరి పని సార్’ అన్న అతని మాటల్ని ప్రత్యేకంగా చెప్పాను. తను కూడా ఎంతో మెచ్చుకుంది అతని వ్యక్తిత్వాన్ని. ఆ తర్వాత లక్ష్మి వంటిల్లు సర్దుకుంటూండగా ఫోన్ తీసి కాసేపు ఫేస్బుక్ పోస్టులు చూస్తూ కూర్చున్నాను. రకరకాల విషయాలు దొర్లుతున్నాయి ఆ పోస్టుల్లో. కవిత ఒకరు రాస్తే, కుల వివక్ష గురించి ఇంకొకరు వేదన చెందితే, మంచి మంచి ఫొటోలు.. వాటికి వ్యాఖ్యలు మరికొందరివి. వాటికింద కామెంట్లు ఆసక్తికరంగానే వుంటాయి. కొన్నిసార్లు మితిమీరిన విమర్శలతో,అసభ్యమైన భాషలతో కొన్ని అసహ్యంగానూ వుంటాయి. అలా వాటిని చూస్తూ ఒకచోట ఆగాను.. అక్కడున్న ఒక సెల్ఫీ ఫొటో చూసి. నాకు వ్యక్తిగతంగా పరిచయం లేని ఒక ఫేస్బుక్ స్నేహితుడు.. క్యాబ్ డ్రైవర్ రమేశ్‌తో దిగిన సెల్ఫీ అది. అతనితో ఈ స్నేహితుడి పరిచయ కథనం కూడా ఉంది. ‘ఈ ఫొటోలో నాతో ఉన్న ఒక గొప్ప మనిషి రమేశ్ గురించి చెప్పాలి. వారం కిందట నేను ఒక పెళ్ళికి ఇతని క్యాబ్‌లోనే వెళ్లాను. దారిలో మాటల మధ్య అతడు చెప్పిన విషయం విని అతనికి సెల్యూట్ చేయాలనిపించింది. ఆరునెలల కిందట అతను సొంతంగా కారు కొనుక్కోవాలి అనుకున్న సందర్భం అది. రెండు రోజుల్లో ఆ డబ్బు కట్టి మరికొంత ఫైనా¯Œ ్స తీసుకుని కారు తెచ్చుకునే ప్రయత్నం. అయితే ఒకరోజు ముందే ఒక స్నేహితుడి చెల్లి పెళ్లి.. కట్నం సమస్యతో ఆగిపోయే పరిస్థితి రావటంతో క్షణం కూడా ఆలోచించకుండా వెళ్లి ఆ రెండు లక్షలు ఇచ్చి సాయపడ్డాడట ఆ స్నేహితుడికి. ‘డబ్బు దేముంది సార్? మళ్లీ సంపాదించుకోవచ్చు. నా స్నేహితుడి కష్టం చూసి తట్టుకోలేక పోయాను. ఆ గొడవ జరుగుతుండగా బిక్క మొహంతో నిలబడ్డ ఆ పిల్లను చూసి గుండె తరుక్కుపోయింది’ అన్నాడతను. ‘ఆ స్నేహితుడు నెలనెలా పదివేల చొప్పున తిరిగి ఇచ్చేస్తున్నాడు సార్’ అని కూడా తన స్నేహితుడి గురించి మెచ్చుకోలుగా చెప్పాడు. ఆ క్యాబ్ డ్రైవర్ రమేశ్ చేసిన ఈ ఉదాత్తమైన పనిని మీతో పంచుకోవాలనిపించింది. ఈ మంచి మనిషికి జేజేలు చెబుదాం అందరం!’ చివరి వరకు చదివిన నేను అలా ఆ ఫొటోలో రమేశ్ వంక చూస్తూ ఉండిపోయాను. అతని అనుభవాన్ని వేదిక మీటింగ్‌లో నా మాటలతో ఆసక్తికరంగా చెప్పినప్పుడు సభ్యులు కొట్టిన చప్పట్లు గుర్తొచ్చాయి. ∙∙ ఈ కథని ఇంతవరకూ రాసిన నేను ఆ క«థలోని ‘నేను’ను కాదు. కథని ఫస్ట్ పర్సన్లో చెప్పే ఏర్పాటు మాత్రమే. అంతా రాసేశాక ‘ఓ హెన్రీ’ గుర్తొచ్చి ముగింపుగా ఈ కిందది రాశాను. ఆరోజు రాత్రి రమేశ్ భార్య అతనికి పెద్దక్లాస్ తీసుకుంది. ‘రెండు లక్షల చుట్టూ మీకు తోచిన కథలల్లి చెప్తున్నారు సరే. మీకు కారు కొనుక్కోవటానికి తన సేవింగ్స్ నుంచి ఆ రెండు లక్షలు ఇచ్చిన మామయ్యగారిని ఇలా చచ్చిపోయినట్టు కథ అల్లటం.. ఛీ ఛీ...బుద్ధుందా అసలు’ అంటూ! ‘అదికాదే.. బతికున్న మనిషి చావు గురించి మాట్లాడితే వాళ్ల ఆయుష్షు పెరుగుతుందని నిన్నే ఒక పుస్తకంలో చదివాను’ అన్నాడు రమేశ్ ‘నాన్నా.. ఎలా ఉన్నారు?’ అని పలకరించటానికి ఆయన ఫోన్ నంబర్ డయల్ చేస్తూ! - వేమూరి సత్యనారాయణ చదవండి: Electric Motorcycle: డుగ్గు.. డుగ్గు.. మాబాగా మడతడిపోద్ది! పార్కింగ్ అక్కరలేదోచ్ .. -
11 నుంచి హైకోర్టుకు దసరా సెలవులు
సాక్షి,అమరావతి: ఈ నెల 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు హైకోర్టుకు దసరా సెలవులు ప్రకటించారు. 20వ తేదీన హైకోర్టు పునః ప్రారంభం అవుతుంది. ఈ సెలవుల్లో దాఖలయ్యే అత్యవసర కేసులను న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ మంతోజు గంగారావు విచారించనున్నారు. జస్టిస్ సత్యనారాయణమూర్తి, జస్టిస్ రఘునందన్‌రావు బెంచ్‌లో, జస్టిస్ గంగారావు సింగిల్‌గా కేసులను విచారిస్తారు. ఈ నెల 12న ఈ ముగ్గురు న్యాయమూర్తులు తమ ముందు దాఖలయ్యే కేసులను విచారిస్తారు. కేసులను దాఖలు చేయాలనుకునే వారు ఈ నెల 11న దాఖలు చేయాల్సి ఉంటుంది. నవంబర్ 1 నుంచి భౌతిక విచారణ.. రాష్ట్ర హైకోర్టులో నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ మొదలు కానుంది. ప్రస్తుతం అమలు చేస్తున్న హైబ్రీడ్ విచారణ (భౌతిక, వీడియో కాన్ఫరెన్స్) విధానం ఈ నెల 31 వరకు కొనసాగనుంది. కోవిడ్ నేపథ్యంలో 2020 మే నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే న్యాయస్థానాల్లో కేసుల విచారణ జరుగుతూ వస్తోంది. ఇటీవల కోవిడ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో హైకోర్టు ప్రయోగాత్మకంగా హైబ్రీడ్ విచారణ చేపట్టింది. కోవిడ్ కనిష్ట స్థాయికి చేరుకోవడంతో నవంబర్ 1 నుంచి పూర్తిస్థాయిలో భౌతిక విచారణ ద్వారా కేసులను విచారించాలని హైకోర్టు నిర్ణయించింది. -
తెలంగాణ తొలి పోరాట భేరి
మూడు తరాల తెలం గాణవాది ముచ్చర్ల సత్య నారాయణ. అతని జీవితం ఒక మహా ప్రవాహం. అలాంటి నాయకులు అతి తక్కువ. ఆ విలక్షణతే అతడిని ప్రజలకు దగ్గర చేసింది. స్కూలు విద్యా ర్థిగా ఉన్నప్పుడే ఊరిని గెలిచాడు. పాటలు పాడి, బుర్రకథలు చెప్పి ఊరి ప్రజల తరపున నిలబడ్డాడు. ఊళ్లో భూపోరాటా లకు అక్షరమై మద్దతునిచ్చాడు. కంఠస్వరమై వారికి రక్షణ కవచమయ్యాడు. కాసం లింగారెడ్డి దొర ప్రజల భూములు లాక్కుంటుంటే ప్రజలు ప్రతిఘ టించారు. తన భూముల్లోకి ఎవరూ రాకుండా దారికి అడ్డంగా దొర గోడ కట్టించాడు. అది గమ నించిన ముచ్చర్ల ఓ అర్థరాత్రి తన స్నేహితుల్ని తీసుకెళ్ళి గోడల్ని పగలగొట్టి ఆధిపత్యాల్ని ధిక్క రించాడు. సత్యనారాయణ ఇంటిపేరు సంగంరెడ్డి. సొంతూరు హనుమకొండ పక్కనే ఉన్న ముచ్చర్ల. అందుకే ముచ్చర్ల ఇంటిపేరైంది. ముందు తన ఊరికి సేవ చేయాలను కున్నాడు. తన బాల్య స్నేహితులలో ఎరుకల, యానాది, హరిజన, గిరి జన కులాల వారు ఎందరో. చివరివరకు వారి స్నేహ మాధుర్యాన్ని ఆస్వాదించిన ప్రజల బంధువు. వ్యవసాయ కుటుంబమే అయినా ఎన్నో ఆర్థిక ఇక్కట్లు ఎదుర్కొన్నాడు. ఒకే జత బట్టలతో స్కూలు విద్య పూర్తి చేశాడు. స్కూలు విద్యార్థిగా ఉన్నప్పుడే పొరుగురాష్ట్రం నుండి కుప్పలు తెప్పలుగా వచ్చిన అధికారులు, టీచర్ల వివక్షని ఎదుర్కొన్నాడు. ఫీజు కట్టలేదనే నెపంవేసి పరీక్షలు రాయనివ్వలేదు. ఐతే ఇలాంటి ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఎదుర్కొని నిలబడ్డాడు. ఒకవైపు రైతాంగం, ప్రజలు నిజాంకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తుంటే ముచ్చర్ల గ్రామ ప్రజలు ఊళ్ళోని దొరలకు వ్యతిరేకంగా పోరాడు తుంటే ఆ ప్రజలకు అనుకూలంగా నిలిచాడు. ఆయన తండ్రి నర్సయ్య, తల్లి నర్సమ్మ. ఐదుగురు అన్నదమ్ములు. అందరు కూడా అన్యాయాలను ఎదిరించే గుణం కలిగినవారే. ఇదే లక్షణం చివరి కంటా సత్యనారాయణని వదిలిపెట్టలేదు. ఎన్టీ రామారావు పిలిచి తెలుగుదేశం టిక్కెట్టు ఇప్పిం చాడు. గెలిచాక రవాణా శాఖ మంత్రిగా నియమిం చాడు. కానీ తన ఆత్మగౌరవానికి ప్రజాశ్రేయస్సుకు భంగం కలిగినప్పుడు చేస్తున్న పదవిని తృణ ప్రాయంగా పడేసి వచ్చాడు. ఆ తరువాత ప్రజా జీవితంలో అతి సామాన్య జీవితం గడిపాడు. చదువులకు దూరమైన కుటుం బంలో పుట్టినా తన స్వంతశక్తితో పై చదువులు చదివాడు. ధిక్కార కెరటం లాంటి అతనిలో బలమైన కవి, కళాకారుడు దాగి ఉన్నాడు. పాటలు పాడుతూ బుర్రకథలు చెబుతూ అన్యాయంపై యుద్ధభేరి ప్రకటించాడు. అందుకే ‘‘ తెలంగాణ తొలి పోరాట భేరి’’ అని తనను పిలుచుకున్నారు. ‘నాన్ ముల్కీ గో బ్యాక్’ అని నినదించిన తొలితరం ఉద్యమకారుల్లో ముచ్చర్ల మొదటి శ్రేణిలో నిలు స్తాడు. ఈయన వేసే నాటకాలలో ప్రొ. జయ శంకర్ గారు స్త్రీ వేషాలు వేసేవారు. అంతేకాదు ఇద్దరు ఎంతో మంచి స్నేహితులు. తెలంగాణ వారిని మరింత దగ్గరకు చేర్చింది. ఏనాడు అనుచర ప్రవృత్తిని దరిచేరనివ్వలేదు. నాయకుని గానే నిలి చాడు. ప్రజలకు దూరంగా ఉండి సేవ చేయాలని ఏనాడు భావించలేదు. అందుకే ప్రజల మధ్య, ప్రజలలో ఒకడిగా ఉంటూ కలెక్టర్ల దగ్గరికి, పోలీసుల దగ్గరికి అన్యాయం జరిగిన వాళ్ళని తీసు కెళ్ళి న్యాయం జరిగేలా చూసే వాడు. ప్రేక్షక పాత్ర వహించడానికి ఆమడదూరంలో ఉండేవాడు. తన దైన స్థానాన్ని తాను నిర్మించుకో గల దిట్ట. అది ఉపన్యాసం కావచ్చు. పాట కావచ్చు. అక్షరశక్తి అతనికి వరం. తెలంగాణ సోదరా తెలు సుకో నీ బతుకు అని పాడినా ‘రావోయి రావోయ్ మర్రి చెన్నా రెడ్డి ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి’ అని గళ మెత్తినా ఇసుక వేస్తే రాలని జనం ఏకగాన ప్రవాహంలో లీనం కావలసిందే. ముచ్చర్ల పాటల మాటలు వినడానికి వేలాదిమంది జనం పిలవ కున్నా వచ్చేవారు. అతని పాటలు ఒక్కొక్కటి ఆయా సందర్భంలో పిడిబాకులవలె దిగేవి. శ్రోతలు అగ్రహోదగ్రులు అయ్యేవారు. ఆలోచించే వారు. తన మాటలతో వారిని కనికట్టు చేసేవారు. మంత్రముగ్ధులై వినేవారు. అంతటితో తనపని పూర్తయిందని ఇంటికెళ్ళి పడుకుంటాడు. ముచ్చర్ల ఆశావాది. గాలికెదురీదుతాడు. సభా నంతరం వారిలో వెలిగిన చైతన్యాన్ని ఏ రూపంలో ఏ దారిలో ముందుకు తీసుకెళ్ళాలో ప్రణాళికలు వేసేవాడు. గాలివాటిన్ని బట్టి పోడు. తానే సుడి గాలై దారిచూపుతాడు. సాహిత్యంలోనే కాదు రాజకీయ ఎత్తుగడలు నిర్మించడంలో అతను దిట్ట. పట్టువిడుపులు లేవని కాదు. కానీ తనకు, తన జాతి, ప్రాంతాలకు అన్యాయం ఎదురైనా, ఆత్మ గౌరవానికి దెబ్బతగిలినా సహించలేడు. వరంగల్ లోనే తనకు పోటీగా ఎన్టీఆర్ మరొకరిని ప్రోత్స హిస్తే దానిని వ్యతిరేకించాడు. కులమో, స్థలమో, బంధు త్వమో, ఏదో ఒక పేరుతో గ్రూపులు పెట్ట డాన్ని సహించలేదు. ఆ విష యాన్ని అధిష్టానానికి స్పష్టం చేసిన గుండెదిటవు గల మనిషి. అందుకే ఒకచోట ఇలా అన్నాడు. ఊరిలో సర్పం చుగా పనిచేసిన ప్పుడు ఇంట్లో ఉన్నట్లు అనిపిం చింది. సమితి ప్రెసిడెంట్ అయ్యాక స్కూల్లో విద్యార్థులతో ఉన్నట్లు అనిపిం చింది. మంత్రి అయినాక మాత్రం జైల్లో ఉన్నట్లు అనిపిస్తుంది. అని తన పరిస్థితి వివరించాడు. ఇల్లు గడవకుంటే ముచ్చర్ల చివరి దశలో కొన్ని వ్యాపారాలు మొదలుపెట్టి చేతులు కాల్చుకున్నాడు. ఉన్న ఆస్థిని కరిగించడంలో దిట్ట. ఏనాడూ వెనకంజ వేయలేదు. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికన్నా సుమారు రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఇంటా బయటా ఎలా మోసపోతున్నదో కళ్ళారా చూసినవాడు. భవిష్యత్‌ని అంచనా వేశాడు. అందుకు వ్యతిరేకంగా పావులు కదిలించాడు. తాను కదలుతూ ప్రజలను కదిల్చాడు. మలి ఉద్యమం ఆరంభం నుండి నగారాలా మోగిన వాడు. తెలంగాణ కోసం ఒక సెంట్రీలాగ పనిచేశాడు. తానే ఒక సైరన్ అయి మోగాడు. తెలంగాణ ప్రయో జనాలకు పరిరక్షకుడిగా నిలబడ్డాడు. ముచ్చర్ల జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. కానీ అన్ని మలుపుల్లో కూడా తెలంగాణానే శాసించాడు. ఒక రాష్ట్రం కోసం దాని ఏర్పాటు నుండి సాధించిన దశ వరకు జీవించిన వ్యక్తి మరొకరు లేరు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఎందుకోగాని ముచ్చర్ల పక్కనే ఉండిపోయాడు. ఎంతో గుర్తింపు పొందాల్సిన వాడు చాలా మందిలాగే సైడ్‌లైన్ కాబడ్డాడు. అలాంటివాడికి ఒక విగ్రహం కూడా లేకపోవడం వింతే. ఒక రాష్ట్రం కోసం ఒక వ్యక్తి జీవితాన్ని ధారపోసి కనుమరుగయ్యాడు. అలా కావాలనే కనుమరుగు చేశారని అతని మిత్రులు అంటారు. ఏమైనా ముచ్చర్ల రాష్ట్రం కోసం చేసిన కృషి చరిత్ర పుటల నుండి బయటపడక తప్పదు. మలి పోరా టంలో కనిపించీ కనబడని వాళ్ళకే అందలాలు, తాయిలాలు, అందుతున్న కాలంలో చరిత్రకే ముచ్చెమటలు పోయించిన ముచ్చర్లల చరిత్ర రేపటి అవసరం. వలపోతల మధ్య చరిత్ర మరో మహోజ్వల ఉద్యమాన్ని కలగంటున్న వేళ అది అవసరం. జయధీర్ తిరుమలరావు వ్యాసకర్త కవి, పరిశోధకులు మొబైల్: 99519 42242 (ముచ్చర్ల సత్యనారాయణ ఐదో వర్ధంతి సందర్భంగా నేడు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సంస్మరణ సభ) -
‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా డాక్టర్ చావా సత్యనారాయణ
వ్యాపారం అంటేనే రిస్క్. రిస్క్ అనుకోకుండా ముందుకెళితే? అది రిసెర్చ్. అదే డెవలప్మెంట్. రిస్క్ ఎందుకులే అనుకునే మందుల కంపెనీలు మొదటే ఉత్పత్తిని మొదలు పెట్టేస్తాయి. తర్వాతే ఆర్ అండ్ డి. రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్. సేఫ్ గేమ్. కానీ.. లారస్ ల్యాబ్స్ తన సేఫ్‌ని చూసుకోలేదు. మొదటే ఆర్ అండ్ డి మొదలు పెట్టేసింది! తర్వాతే మందుల తయారీ. లారస్ ల్యాబ్స్ మొదలై పదిహేనేళ్లే అయినా ఇప్పటి వరకు కనిపెట్టిన కొత్త మందులు 150. అంటే.. నూటా యాభై పేటెంట్లు! రెస్పెక్ట్ – రివార్డు – రీటెయిన్.. అనే మూడు స్తంభాలపై ల్యాబ్స్ నిర్మాణం జరిగింది. నాలుగో స్తంభం డాక్టర్ చావా సత్యనారాయణ. ర్యాన్‌బాక్సీ లో యువ పరిశోధకుడిగా డాక్టర్ సత్యనారాయణ విజయ ప్రస్థానం మొదలైంది. మ్యాట్రిక్స్లో చేరిన ఎనిమిదేళ్లకే ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా శిఖరానికి చేరింది. లారస్ ల్యాబ్ వ్యవస్థాపన (2005 హైదరాబాద్) తో భారతీయ ఔషధ ఉత్పత్తుల రంగానికి ‘హితామహులు’, దిశాదర్శకులు అయ్యారు. సాక్షి ఇప్పుడు తన ఎక్స్‌లెన్స్ అవార్డుతో ‘బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్’ గా ఆయన్ని ఘనంగా సత్కరించింది. -
రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్‌గా సత్యనారాయణరెడ్డి బాధ్యతలు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్‌గా చింతలచెరువు సత్యనారాయణరెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం తాడేపల్లి సీఎస్ఆర్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన ప్రమాణ స్వీకారోత్సవంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొని అభినందనలు తెలియజేశారు. గత నెలలో ఆంధ్రప్రదేశ్‌లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 56 శాతం పదవులు కేటాయించారు. 137 పోస్టుల్లో మహిళలకు 69, పురుషులకు 68 పదవులు ఇచ్చారు. -
కరీంనగర్ సీపీగా సత్యనారాయణ
సాక్షి, కరీంనగర్: ఐదేళ్ల సుదీర్ఘకాలం కరీంనగర్ పోలీసు కమిషనర్‌గా వ్యవహరించిన వీబీ కమలాసన్ రెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో రామగుండం సీపీ వి.సత్యనారాయణను నియమిస్తూ మంగళవారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కమలాసన్‌రెడ్డిని ప్రభుత్వం డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. వి.సత్యనారాయణ రామగుండంలో సుమారు మూడేళ్ల పాటు కమిషనర్‌గా విధులు నిర్వర్తించారు. అంతకుముందు హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో డీసీపీగా వ్యవహరించారు. కాగా.. రామగుండం పోలీస్ కమిషనర్‌గా అవినీతి నిరోధక శాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.రమణకుమార్ నియమితులయ్యారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం కోరెం గ్రామానికి చెందిన రమణ కుమార్ హైదరాబాద్‌లో వివిధ శాఖల్లో ఎస్పీ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. కరీంనగర్‌పై చెరగని ముద్ర కరీంనగర్ సీపీగా సుదీర్ఘకాలం పనిచేసిన కమలాసన్‌రెడ్డి శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. కరుడుగట్టిన నేరస్థులపై పీడీయాక్టు అమలు చేశారు. బ్లూకోల్ట్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి సమాచారం అందించిన నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వాలిపోయే విధంగా చర్యలు తీసుకున్నారు. సీపీ తీసుకున్న చర్యల కారణంగా దేశంలోనే ఉత్తమ పోలీస్స్టేషన్లుగా చొప్పదండి, జమ్మికుంట ఎంపికయ్యాయి. ప్రజల రక్షణ భద్రతలో దేశవ్యాప్తంగా నాలుగో స్థానం, పీడీయాక్టు అమలులో 2వ స్థానం సాధించారు. కమిషనరేట్ పరిధిలో 10 వేల సీసీ కెమెరాలు లక్ష్యంగా పెట్టుకోగా దాతల సహాయంతో 8,500 పైగా సీసీ కెమెరాలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ సిటీ పోలీసు శిక్షణ కేంద్రంలో ‘మియావాకీ’ చిట్టడవుల ప్రాజెక్టు ఏర్పాటు చేసి 12,500 మొక్కలు మొదటి దశలో, 14,800 మొక్కలు పెంచి ఆదర్శంగా నిలిచారు. దీంతోపాటు నక్షత్ర, రాశి వనాలను ఏర్పాటు చేసి రాష్ట్రానికే కరీంనగర్ పోలీసులను ఆదర్శంగా నిలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, హెల్మెట్ వినియోగంలో యువతలో జరిమానాల ద్వారా భయాన్ని కల్పించారు. ఆపరేషన్ నైట్ సేప్టీలో భాగంగా దొంగతనాలకు అడుకట్ట వేశారు. ప్రతిరోజూ కమిషరేట్‌లో నాఖాబందీ నిర్వహించి అక్రమార్కులకు, నేరగాళ్లకు సింహస్వప్నమయ్యారు. కమిషనరేట్‌లో 2 లక్షలకు పైగా ప్రజలు హ్యాక్ ఐ యాప్‌ను వినియోగింపచేశారు.లేక్ పోలీస్‌స్టేషన్, టాస్క్‌ఫోర్స్ విభా గాన్ని ఏర్పాటు చేసి అసాంఘిక శక్తుల ఆటలు కట్టించడంలో తనవంతు పాత్ర పోషించారు. భూదందాలు, సెటిల్మెంట్లు చేసి అక్రమాలకు పాల్పడిన 102 మందిపై పీడీయాక్టు విధించారు. కరీంనగర్ టూటౌన్, త్రీటౌన్, జమ్మికుంట, రామడుగు, ఎల్ఎండీ, గంగాధరతో పాటు వివిధ పోలీసుస్టేషన్లను ఆధునికీకరించారు. దివ్యాంగులు పోలీసుస్టేషన్లకు వచ్చేందుకు వీల్చైర్లు, ర్యాంపులు నిర్మించారు. నిజాం కాలం నాటి గోల్‌బంగ్లాను ఆధునికీకరించి అంతర్జాతీయ ప్రమాణాలతో జిమ్నాజియం ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల ఫీడ్ బ్యాక్డే ద్వారా కేసుల పురోగతిని సమీక్షించారు. ఆటోలు, టాక్సీలకు క్యూఆర్ కోడ్ అమలు చేసి ప్రజలకు రక్షణ కల్పించారు. రామగుండం నుంచి కరీంనగర్‌కు.. కొత్త జిల్లాల అనంతరం ఏర్పాటైన రామగుండం పోలీస్ కమిషనరేట్‌కు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన వెలివల సత్యనారాయణ కరీంనగర్ సీపీగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 2006 బ్యాచ్‌కు చెందిన సత్యనారాయణ డీసీపీగా హైదరాబాద్ వెస్ట్ జోన్, సౌత్ జోన్లలో విధులు నిర్వర్తించి సమర్థవంతుడైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన 2018 సెప్టెంబర్ 26న రామగుండం పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టారు. సుమారు మూడేళ్లపాటు రామగుండం సీపీగా పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రల పరిరక్షణకు తన వంతు కృషి చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల డివిజన్లలో అక్రమార్కులపై కొరడా ఝులిపించారు. శాసనసభ, పార్లమెంటు, పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా తనదైన మార్కు చూపించారు. కమలాసన్ రెడ్డి వారసుడిగా కరీంనగర్‌కు రానున్నారు. ఐదేళ్లకు బదిలీ అయిన కమలాసన్ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో భాగంగా కరీంనగర్లో ఏర్పాటైన పోలీస్ కమిషనరేట్‌కు 2016 అక్టోబర్ 11న తొలి కమిషనర్‌గా వీబీ కమలాసన్ రెడ్డి నియమితులయ్యారు. సుదీర్ఘంగా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలపాటు కమిషనర్‌గా వ్యవహరించిన ఆయన కరీంనగర్‌పై చెరగని ముద్ర వేశారు. సమర్థవంతుడైన అధికారిగా పేరున్న కమలాసన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సదభిప్రాయం ఉండడంతో ఇన్నేళ్ల పాటు కొనసాగారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో కమలాసన్ రెడ్డిని బదిలీ చేసినట్లు తెలుస్తోంది. డీఐజీ హోదాలో ఉన్న ఆయనను డీజీ కార్యాలయానికి అటాచ్ చేయగా, హైదరాబాద్‌లోనే ఆయనకు పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
న్యాయవాదుల హత్య: ‘ఆ ఆరోపణల్లో నిజం లేదు’
సాక్షి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన న్యాయవాద దంపతుల హత్య కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా ఉపేక్షించేది లేదని రామగుండం పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ స్పష్టం చేశారు. న్యాయవాదులు గట్టు వామన్‌రావు, నాగమణిలను పట్టపగలు నడిరోడ్డుపై అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని చాలెంజింగ్‌గా తీసుకున్నామని.. హత్య జరిగిన 24 గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని పేర్కొన్నారు. మంథనికి సంబంధం లేని పోలీస్ అధికారులతో దర్యాప్తు సాగుతోందని వెల్లడించారు. న్యాయవాద దంపతుల హత్య అనంతరం చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో రామగుండం సీపీని ‘సాక్షి’ఇంటర్వ్యూ చేసింది. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 24 గంటల్లోపే అరెస్టు చేశాం.. గట్టు వామన్‌రావు, నాగమణిలను దారుణంగా పట్టపగలు, నడిరోడ్డు మీద హత్య చేయడాన్ని తీవ్రంగా పరిగణించి ఉన్నతస్థాయి అధికారులు రంగంలోకి దిగారు. దంపతులపై దాడిచేసినవారిని 24 గంటలలోపే అరెస్టు చేశాం. వారికి రెక్కీగా ఉపయోగపడ్డ కుమార్‌ను అరెస్టు చేశాం. ఈ క్రమంలోనే శాస్త్రీయపరమైన దర్యాప్తులో బిట్టు శ్రీను పాత్ర బయటకొచ్చింది. అతడు కారు, కత్తులు సమకూర్చినట్టు తేలింది. మాతోపాటు హైదరాబాద్ నుంచి వచ్చిన శాస్త్రీయ, సాంకేతిక బృందాలు దర్యాప్తులో పాలు పంచుకుంటున్నాయి. విచారణలో నిందితులుగా తేలితే వారు ఎంతటివారైనా సరే కచ్చితంగా అరెస్టు చేస్తాం. శాస్త్రీయ విధానంలో దర్యాప్తు.. బిట్టు శ్రీను అనే వ్యక్తి మంథనికి చెందిన ఓ ప్రజాప్రతినిధి మేనల్లుడు. చిరంజీవి, కుంట శ్రీనుతో హత్యకు ముందు, తర్వాత చాలాసార్లు మాట్లాడాడు. వారికి కారు, కత్తులు ఇచ్చాడు. మరోవైపు ప్రధాన నిందితుడు కుంట శ్రీనుకు ఊరిలో ఉన్న ఇల్లు, పెద్దమ్మ గుడి, రామస్వామి గోపాలస్వామి గుడి వివాదాలతోపాటు వామన్‌రావు కుటుంబంతో విభేదాలు ఉండటంతో హత్యలో నేరుగా పాల్గొన్నాడు. బిట్టు శ్రీను కీలక పాత్ర వహించాడన్న ఆధారాలు దొరికిన తర్వాత శాస్త్రీయ పద్ధతిలో దర్యాప్తు చేస్తున్నాం. కేసును ఇతర ప్రాంతాల వారే దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఫోన్ సీజ్ చేశాం.. వామన్‌రావు తొలుత పుట్ట మధు పేరు ప్రస్తావించినట్లు వైరల్ అయింది నిజమే. ఒరిజనల్‌గా వామన్‌రావును వీడియో తీసిన వ్యక్తి ఫోన్‌ను సీజ్ చేశాం. ఎలాంటి మార్ఫింగ్‌లు, కటింగ్‌లు లేని ఒరిజనల్ వీడియోను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(ఎఫ్ఎస్ఎల్)కి పంపిస్తున్నాం. అందులో పుట్ట మధు అనే పదం లేదు. ఐదు సెకన్లు ముందు వచ్చిందది. పెదాల కదలిక, సౌండ్స్ చూస్తే కరెక్ట్ అనిపించలేదు. అయినా నిజానిజాల కోసం ఎఫ్ఎస్ఎల్కు పంపించాం. అవి కాకుండా చాలా వీడియోలు, ఆడియోలను 2018 కంటే ముందువి, ఇటీవల కాలంలోనివి వేరే వాళ్ల వాయిస్ కూడా కుంట శ్రీను వాయిస్‌గా పెడుతున్నారు. దర్యాప్తును ఇవి ప్రభావితం చేస్తాయి. ఘటనను ప్రత్యక్షంగా చూసిన చాలామంది సాక్షులను విచారించాం. వీడియోలను సేకరించాం. దర్యాప్తుకు ఉపయోగపడే వీడియోలు ఉంటే ఇవ్వాలని కోరాం. ఈ సమయంలో ఫేక్ వీడియోలు, ఆడియోలు వైరల్ చేయడం కరెక్ట్ కాదు. భద్రత అడిగితే ఇచ్చేవాళ్లమే.. వామన్‌రావు, నాగమణిలకు సంబంధించి కొన్ని కేసుల్లో వ్యాజ్యాలు వేయగా.. ఆ కేసుల విచారణ పూర్తయ్యే వరకు దంపతులిద్దరినీ తెలంగాణలోని ఏ పోలీస్‌స్టేషన్‌కు పిలవొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. వాటిని పాటించాం. లోక్ అదాలత్‌కు సంబంధించి ఒకటి రెండుసార్లు కానిస్టేబుల్ ఫోన్ చేస్తేనే ‘కంటెప్ట్ ఆఫ్ కోర్టు’అని వామన్‌రావు చెప్పారు. ఐదారు నెలలుగా వారితో ఎవరూ టచ్‌లో లేరు. వాళ్లకు ముప్పు ఉంటే లిఖితపూర్వకంగా పిటిషన్ ఇస్తే చర్యలు తీసుకొనేవాళ్లం. వాళ్లు ఎప్పుడు వస్తున్నారో, ఎప్పుడు పోతున్నారో కూడా మాకు తెలియదు. గుంజపడుగులో గొడవలు జరగకుండా పెట్రోలింగ్ చేశాం. కానీ ఇంత దారుణంగా హత్య చేస్తారని భావించలేదు. బ్యారేజీలో లోతు ఎక్కువ ఉండటంతో.. హత్య జరిగిన తరువాత ఆయుధాలను సుందిళ్ల బ్యారేజీలో వేసినట్లు తేలింది. వాటిని తీయాలని భావించినా, అక్కడ లోతు ఎక్కువగా ఉండడంతో గజ ఈతగాళ్లను పిలిపించాలని నిర్ణయించాం. ఆయుధాలను తీసే విషయంలో శ్రద్ధ చూపించలేదనే ఆరోపణల్లో నిజం లేదు. త్వరలోనే వాటిని వెలికి తీస్తాం. ఇక ఈ కేసును త్వరలోనే పరిష్కరిస్తాం. బిట్టు శ్రీనును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నాం. మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. తరువాత ఈ కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేస్తాం. చదవండి: దంపతుల హత్య: ఆ సమాచారం ఇచ్చింది లచ్చయ్య నేను వజ్రాన్ని... మోసగాణ్ని కాదు: పుట్ట మధు -
అభ్యర్థిస్తే బెదిరించినట్లా?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామంటూ గత కొద్ది రోజులుగా జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం జరుపుతున్న విచారణలో బుధవారం కూడా వాడివేడిగా వాదనలు జరిగాయి. గత విచారణ సందర్భంగా తనను బెదిరించారంటూ జస్టిస్ రాకేశ్ కుమార్ ఆరోపించడంపై ప్రభుత్వ న్యాయవాదులు చింతల సుమన్, వైఎన్ వివేకానంద, స్పెషల్ సీనియర్ కౌన్సిల్ సత్యనారాయణ ప్రసాద్ తీవ్రంగా అభ్యంతరం తెలిపారు. పలు అభ్యర్థనలతో పిటిషన్లు దాఖలు చేయడం, కేసును వాయిదా వేయాలని కోరడం వంటి వాటిని బెదిరింపులని ఎలా అంటారంటూ ప్రశ్నించారు. వాస్తవానికి కోర్టు ద్వారా తామే బెదిరింపులకు గురవుతున్నామని తెలిపారు. సత్యనారాయణ ప్రసాద్ వాదనలు కొనసాగిస్తూ.. సోమవారం నాటి విచారణ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) విషయంలో జస్టిస్ రాకేశ్ కుమార్ వ్యవహరించిన తీరును ఎత్తిచూపారు. ఏజీ పట్ల గౌరవప్రదంగా వ్యవహరించలేదని, వాదనలు వినిపించేందుకు, కోర్టు తీర్పులను ప్రస్తావించేందుకు సైతం ఆయనను అనుమతించలేదని, దీనిని అందరూ గమనించారని వివరించారు. న్యాయమూర్తులు మౌఖికంగా గానీ, తీర్పుల్లో గానీ ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయరాదని, అలాగే వ్యక్తుల ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఓ కేసు విచారణకు నిర్ధిష్టమైన విధి విధానాలు ఉంటాయని, వాటికి అనుగుణంగా తమకు కౌంటర్ దాఖలుకు, వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ న్యాయవాదులు, స్పెషల్ కౌన్సిల్ గట్టిగా చెప్పారు. వీరి వాదనతో ఒకింత వెనక్కి తగ్గిన జస్టిస్ రాకేశ్‌కుమార్.. ఈ అంశం నుంచి వాదనలను మళ్లించేందుకు పలుమార్లు ప్రయత్నించారు. చివరకు విచారణను జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం గురువారానికి వాయిదా వేసింది. రాజ్యాంగం వైఫల్యం చెందిందన్న అంశంపై విచారణ జరిపే పరిధి లేదని, అందువల్ల ఆ అంశంపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలన్న తమ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై ఈనెల 18న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని, అందువల్ల విచారణను 21వ తేదీకి వాయిదా వేయాలన్న స్పెషల్ కౌన్సిల్ అభ్యర్థనను జస్టిస్ రాకేశ్ కుమార్ తోసిపుచ్చారు. కేసు వాయిదా కోసం పలుమార్లు సత్యనారాయణ ప్రసాద్ అభ్యర్థనలు చేస్తుండటంతో, కోర్టు ప్రొసీడింగ్స్‌కు ఆటంకం కలిగిస్తున్నారంటూ ధర్మాసనం తన ఉత్తర్వుల్లో రికార్డ్ చేసింది. కౌంటర్ దాఖలుకు అనుమతినివ్వని విషయాన్ని రికార్డ్ చేయాలని సుమన్ ధర్మాసనాన్ని కోరారు. తమ వాదనలు వినిపించేందుకు సైతం అవకాశం ఇవ్వలేదని, ఈ కోర్టు సహజ న్యాయ సూత్రాలను అను సరించలేదన్నారు. దీంతో ప్రభుత్వ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఈ నెల 14న తామిచ్చిన ఉత్తర్వుల కాపీని ప్రభుత్వానికి అందచేయాలని రిజిస్ట్రీని ధర్మాసనం ఆదేశించింది. సుమోటోగా విచారిస్తున్న జస్టిస్ రాకేశ్ ధర్మాసనం పోలీసులు చేసిన అరెస్టులపై పలువురు వ్యక్తులు వేసిన హెబియస్ కార్పస్ పిటిషన్లు, రాజధాని ప్రాంతంలో ఇతరులెవ్వరూ పోటీగా నిరసనలు చేపట్టకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీడీపీ నేత తెనాలి శ్రావణ్‌కుమార్ వేసిన పిల్‌పై విచారణ జరుపుతున్న జస్టిస్ రాకేశ్ నేతృత్వంలోని ధర్మాసనం, రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా అన్న అంశాన్ని తేలుస్తామని తెలిపింది. వాస్తవానికి ఏ పిటిషనర్ కూడా రాజ్యాంగం వైఫల్యం చెందిందని ప్రకటించాలని కోర్టును కోరకపోయినా.. జస్టిస్ రాకేశ్ కుమారే సుమోటోగా తీసుకుని ఆ విషయాన్ని తేలుస్తామంటూ విచారణ మొదలుపెట్టారు. బుధవారం విచారణ ప్రారంభం కాగానే, తమ రీకాల్ పిటిషన్‌ను కొట్టేస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. దీనికి జస్టిస్ రాకేశ్ కుమార్ స్పందిస్తూ, సుప్రీంకోర్టు స్టే ఇస్తే మొత్తం విచారణ నిలిచిపోతుందని, అయితే సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతం ఎలాంటి ఉత్తర్వులు లేనందున విచారణ కొనసాగిస్తామని తెలిపారు. -
వీవీ అల్లుడికి ఎన్ఐఏ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విరసం నేత వరవరరావు అల్లుడు, ఇఫ్లూ యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు పంపింది. భీమా-కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును పూణె పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విషయంలో వరవరరావు అల్లుడు, ఫ్రొఫెసర్ సత్యనారాయణ ఇంట్లో 2018లోనే ఎన్ఐఏ సోదాలు జరిపింది. అయితే తాజాగా ఎన్ఐఏ ఆయనకు నోటీసులు పంపింది. (ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!) ఈ నెల 9న ముంబైలో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించింది. ఎన్ఐఏ పంపిన నోటీసులపై స్పందించిన ప్రొఫెసర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. భీమా-కొరెగావ్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇప్పటికే వరవరరావు ఆరోగ్య పరిస్థితిపై తామంతా ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ తరుణంలో మళ్లీ ఇలా తనకు నోటీసులు ఇచ్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. (ఆ లేఖ నా వ్యక్తిగత నిర్ణయం : భూమన) -
నిర్మాత సత్యనారాయణ ఇకలేరు
సీనియర్ నిర్మాత కందేపి సత్యనారాయణ ఆదివారం రాత్రి కన్నుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ‘పాండురంగ మహాత్మ్యం’ అనే డబ్బింగ్ సినిమా ద్వారా సత్యనారాయణ నిర్మాతగా మారారు. ‘కొంగుముడి, శ్రీవారు, సక్కనోడు, మాయా మోహిని, దొరగారింట్లో దొంగోడు’ వంటి సినిమాలు నిర్మాతగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. తెలుగులోనే కాదు.. తమిళంలోనూ ఆయన పలు సినిమాలు నిర్మించారు. మొత్తం 40 చిత్రాలకుపైగా ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సత్యనారాయణ మృతికి తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
‘సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడారు’
సాక్షి, సంగారెడ్డి : మంత్రి హరీశ్‌రావుకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కుసంస్కారంతో మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విమర్శించారు. సభ్యసమాజం సిగ్గుపడేలా జగ్గారెడ్డి మాట్లాడరన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సదాశివపేట మున్సిపాలిటీలలో మంత్రి హరీశ్‌రావుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే జగ్గారెడ్డి ప్రజలు తలదించుకునే విధంగా మాట్లాడరని విమర్శించారు. సదాశివపేటలో జగ్గారెడ్డి కూతురు ప్రచారానికి వెళితే కూడా ఓటర్లు నిలదీస్తున్నారని ఎద్దేవా చేశారు. సానుభూతి కోసమే జగ్గారెడ్డి అసభ్య పదజాలాన్ని వాడుతున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్‌కు తరలిస్తే జగ్గారెడ్డికి సింపతి వస్తుందని భ్రమపడుతున్నారన్నారు. తులసి వనంలో గంజాయి మొక్క జగ్గారెడ్డి సంగారెడ్డ ప్రజలకు తలవంపులు తెచ్చేవిధంగా ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మండిపడ్డారు. మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌రావు వస్తున్న ఆదరణను చూసి జగ్గారెడ్డి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. మంత్రి పట్ల జగ్గారెడ్డి వాడిన భాషకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలా జగ్గారెడ్డి వ్యవహారం ఉందన్నారు. సంగారెడ్డి ప్రజలకు తలవంపులు తెస్తున్న జగ్గారెడ్డికి మున్సిపాలిటీ ఎన్నికల్లో గట్టి బుద్ధి చెప్పాలని కోరారు. -
ఐఏఎస్ సత్యనారాయణ అవినీతిపై ఫిర్యాదు
ఎమ్మిగనూరు టౌన్: గతంలో కర్నూలు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సత్యనారాయణ అవినీతి, అక్రమ సంపాదనపై ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ)తోపాటు సీబీఐ డైరెక్టర్‌కు బీజేపీ రాష్ట్ర నేత, ఆలిండియా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బి.పురుషోత్తంరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన శనివారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో విలేకరులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌గా రెండున్నరేళ్లపాటు పనిచేసిన సత్యనారాయణ అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ తోపాటు కేఈ కృష్ణమూర్తి పేరుతో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. అప్పట్లో పీఎంఏవై కింద కర్నూలుకు ఆరువేల గృహాలు, నంద్యాలకు 4,500, ఆదోనికి 4,700, ఎమ్మిగనూరుకు వెయ్యి గృహాలు మంజూరయ్యాయన్నారు. వీటి నిర్మాణ కాంట్రాక్టు పొందిన షాపూర్జీ పల్లోంజి కంపెనీ నుంచి తమిళనాడుకు చెందిన వాసన్ అండ్ కంపెనీకి సబ్ కాంట్రాక్ట్‌ను సత్యనారాయణ ఇప్పించి లబ్ధి పొందారన్నారు. అంతేగాక వాసన్ అండ్ కంపెనీకి ఇసుక సరఫరాకోసం తన సోదరుడి కుమారుడు మురళి, బంధువు శ్రీనివాస్‌లను బినామీలుగా పెట్టుకుని.. వారి పేరిట జిల్లాలోని కౌతాళం, గుడికంబాళి ఇసుక రీచ్‌లను మంజూరు చేయించారని ఆరోపించారు. ఆయన అవినీతిపై సమగ్ర విచారణ జరిపి అక్రమాస్తులను జప్తు చేయాలన్నారు. ఈ మేరకు పీఎంవో, సీబీఐ డైరెక్టర్‌తోపాటు సీబీఐ జేడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్లకు ఫిర్యాదు చేశానని తెలిపారు. -
తెలుగోడి సత్తా; 33 డాక్టరేట్లతో గిన్నిస్ రికార్డ్
సాక్షి, హైదరాబాద్: భాగ్య నగరానికి చెందిన వైద్యుడు సాగి సత్యనారాయణ అత్యధికంగా 33 డాక్టరేట్ డిగ్రీలు చేసి మూడోసారి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నారు. అందులో 22 పీహెచ్‌డీలు, ఆరు డీలిట్ (డాక్టర్ ఆఫ్ లిటరేచర్)లు, 5 డాక్టర్ ఆఫ్ సైన్స్‌లు ఉన్నాయి. స్పిరిచ్యువాలిటీ, ఆస్ట్రాలజీ, జనరల్ అండ్ క్లినికల్ సైకాలజీ, మెడికల్ సైన్సెస్, లిటరేచర్, ఆల్టర్నేటివ్ మెడిసిన్, యోగా అండ్ స్పిరిచ్యువాలిటీ, సైకాలజీ, యోగా అవేర్నెస్, మెడికల్ ఆస్ట్రాలజీ, పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్, థెరప్యూటిక్ సైకాలజీ, హెల్త్ అండ్ సైన్సెస్, బ్రహ్మజ్ఞానం అంశాలపై ఆయన ఈ పట్టాలను అందుకున్నారు. ఏడాది కాలంలో వరుసగా 72 పుస్తకాలు రచించడంతోపాటు అవి ముద్రణకు నోచుకున్న నేపథ్యంలో 2016 జనవరి 28న డాక్టర్ సాగి తొలిసారి గిన్నిస్ రికార్డులోకి ఎక్కారు. 2006 ఏప్రిల్ నుంచి 2012 జనవరి మధ్యలో 125 పుస్తకాలు రచించడంతో 2016 ఆగస్టు 28న రెండోసారి గిన్నిస్‌కు ఎక్కారు. ఈ నెల మూడోసారి ప్రపంచ గిన్నిస్ రికార్డులో ఆయన పేరు నమోదైంది. సాగి సత్యనారాయణ గుంటూరులో ఎంబీబీఎస్ విద్య పూర్తి చేశారు. తెలుగు, ఇంగ్లీష్ భాషలపై ఆయనకు మంచి పట్టు ఉంది. వైద్య, ఆరోగ్య, జనరల్, ఆధ్యాత్మిక, సోషల్ సైన్స్, యోగా, వేదాలు, సైకాలజీలపై అనేక వ్యాసాలు రాయడమే కాకుండా ఆయా అంశాలపై పరిశోధనలు సాగించారు. మన దేశంలోని ఐదు విశ్వవిద్యాలయాలు, అంతర్జాతీయ సాయిలో వివిధ దేశాలకు చెందిన తన పరిశోధనల సారాంశం పంపి.. 25 వర్సిటీల నుంచి డాక్టరేట్లను సాధించారు. మల్కాజిగిరిలో సాయంత్రం పూట ఉచితంగా పేదలకు వైద్య సేవలు అందిస్తూ మంచి మనసును చాటుకున్నారు. -
అక్రమార్కుల మెడకు బిగుస్తున్నఉచ్చు!
సాక్షి, కర్నూలు : వ్యవసాయశాఖలో చోటు చేసుకున్న రూ.97.55 లక్షల కుంభకోణంలో అక్రమార్కుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షం గా సంబంధం ఉన్న ఆత్మ పీడీ ఉమామహేశ్వరమ్మ, ఇటీవల పదవీ విరమణ చేసిన జేడీఏ ఠాగూర్‌నాయక్, ప్రస్తుతం నంద్యాల రైతు శిక్షణ కేంద్రంలో ఏడీఏగా ఉన్న గిరీష్, జేడీఏ కార్యాలయంలో ఎన్ఎఫ్ఎస్ఎం సీటు నిర్వహిస్తున్న ఏవో అశోక్‌కుమార్‌రెడ్డి సోమవారం జిల్లా ఎస్పీ ఫక్కీరప్పను కలిశారు. ఈ కుంభకోణంపై అప్పటి జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అప్పటి జేసీ–2 మణిమాలతో సహా నలుగురు సభ్యుల కమిటీని వేశారు. ఈ కమిటీ ప్రస్తుత కలెక్టర్‌కు నివేదిక ఇచ్చింది. దీనిని పరిశీలించిన కలెక్టర్ వీరపాండియన్.. కుంభకోణానికి ప్రధాన సూత్రధారి అయిన జూనియర్ అసిస్టెంట్ రాజేష్‌పై క్రిమినల్ కేసు పెట్టాలని ఆదేశిస్తూ మిగిలిన నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కమిషనర్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తొలుత రూ.28.65 లక్షలు దారి మళ్లినట్లు తేలింది. దీనిపై అప్పటి జేడీఏ ఠాగూర్‌నాయక్ త్రీటౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాజేష్‌ను అరెస్ట్ చేసి.. రూ.3.50 లక్షలు రికవరీ చేశారు. తర్వాత ఫోర్‌మెన్ కమిటీ విచారణలో జాతీయ ఆహార భద్రత పథకం నిధులు మొత్తంగా రూ.97.55 లక్షలు స్వాహా అయినట్లు తేలింది. ప్రధాన సూత్రధారి రాజేష్‌పై మరోసారి క్రిమినల్ కేసు పెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుత జేడీఏ విల్సన్ దీనిపై రెండు, మూడు రోజుల్లో ఫిర్యాదు చేయనున్నారు. విశ్రాంత జేడీఏ ఠాగూర్‌నాయక్, ఆత్మపీడీ ఉమామహేశ్వరమ్మ, నంద్యాల ఎఫ్‌టీసీ ఏడీఏ గిరీష్, ఏవో అశోక్కుమార్రెడ్డిలపై వ్యవసాయశాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ చర్యలు తీసుకోనున్నారు. కుంభకోణంలో విశ్రాంత జేడీఏకు కూడా సంబంధం ఉండటం వల్ల ఆయనకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. కుంభకోణాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఒక్క జూనియర్ అసిస్టెంటు ఇంత పెద్ద కుంభకోణానికి పాల్పడటం సాధ్యమేనా అనే అనుమానాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
నిమ్స్‌లో ఇకపై మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు
పంజగుట్ట: నిమ్స్ ఆస్పత్రిలో శనివారం నుంచి కొత్తగా మాస్టర్ హెల్త్ చెకప్ సేవలు ప్రారంభిస్తున్నట్లు నిమ్స్ మెడికల్ డైరెక్టర్ నిమ్మ సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిమ్స్‌లో ఆయన విలేకరులకు వాటి వివరాలు వెల్లడించారు. మాస్టర్ హెల్త్ చెకప్‌లో రూ.5 వేల ప్యాకేజీతో అన్ని రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు, ఈసీజీ, చెస్ట్ ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్ తదితర పరీక్షలు చేస్తామన్నారు. ఇందులో మొత్తం 16 రకాల వైద్య పరీక్షలు ఉంటాయన్నారు. ఎక్స్లెంట్ హెల్త్ చెకప్ కింద ఎనిమిదివేలు చెల్లిస్తే 23 రకాల పరీక్షలు జరుపుతామన్నారు. లైఫ్ చెకప్ పరీక్షలు పురుషులకు రూ.15 వేలు, మహిళలకు రూ.16 వేలతో 29 రకాల పరీక్షలు చేస్తామన్నారు. మహిళలకు ఒక్క పరీక్ష అదనంగా ఉంటుందని అందుకే రూ.వెయ్యి ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పరీక్షల ద్వారా మనిషిలో ఏ వ్యాధి ఉన్నా నిర్ధారించవచ్చునన్నారు. ఈ సేవలతో పాటు ఆయుష్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయన్నారు. కార్డియాలజిస్ట్, జనరల్ మెడిసిన్ వైద్యులు, రేడియాలజీ వైద్యులు, ఆయుష్ వైద్యులు ఈ ప్రత్యేక ప్యాకేజీ కేంద్రంలో ఉంటారన్నారు. నిమ్స్‌లోని పాత భవనంలో పాత కాథలాబ్ వద్ద ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్లో ఈ సేవలు లభిస్తాయన్నారు.వివరాలకు 040–23489022 నంబరు, https://nims.edu.in, నిమ్స్ హెచ్ఎమ్ఐఎస్ తదితర యాప్‌లను సంప్రదించి ప్రత్యేక బుకింగ్ చేసుకోవచ్చునన్నారు. ఇదే కేంద్రంలో ఇప్పటికే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా తమ సేవలు పొందేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో అత్యంత ఖరీదైన ఈ పరీక్షలు నిమ్స్‌లో తక్కువ ధరలకే నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు వీటిని వినియోగించుకోవాలని కోరారు. -
తెల్లదొరలను వణికించిన తెలుగు పాట
స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న రోజులవి. స్వాతంత్య్ర సమర యోధులపై బ్రిటిష్ పాలకుల దమనకాండ దారుణంగా కొనసాగుతున్న రోజులవి. అలాంటి రోజుల్లో ఒక సామాన్యమైన తెలుగు కవి తెల్లదొరల అరాచకాలను తెగనాడుతూ గొంతెత్తాడు. ఆయన కలం నుంచి జాలువారిన తెలుగు పాట– ఆయన గళం నుంచి ఎలుగెత్తిన తెలుగు పాట– ఒకే ఒక్క తెలుగు పాట తెల్లదొరల వెన్నుల్లో వణుకు పుట్టించింది. ఆ పాట తెలుగునాట నలుచెరగులా మార్మోగింది. ‘‘మాకొద్దీ తెల్లదొరతనము.. దేవా.. మా కొద్దీ తెల్లదొరతనము..’’ అనే పాట రాసిన ఆ కవి గరిమెళ్ల సత్యనారాయణ. ‘‘పన్నెండు దేశాలు పండుచున్నగాని పట్టెడన్నము లోపమండి... ఉప్పు ముట్టుకుంటే దోషమండి నోట మట్టి కొట్టి పోతాడండి అయ్యో! కుక్కలతో పోరాడి కూడు తింటామండి...’’ అంటూ ఆ పాటలో నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తూ ఆయన పాడుతుంటే ఆబాల గోపాలమూ గొంతు కలిపేవారు. ఉద్యమావేశంతో ఉర్రూతలూగిపోయేవారు. జనాలను ఉర్రూతలూగించే కవి గాయకుడు జనంలో ఉంటే తమ ఉనికికే ముప్పు తప్పదని తలచిన బ్రిటిష్ పాలకులు ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపారు. ‘సుకవి జీవించు ప్రజల నాల్కలయందు’ అనే జాషువా మాట గరిమెళ్ల సత్యనారాయణకు అక్షరాలా అతికినట్లుగా సరిపోతుంది. చిరకాలం ప్రజల నాల్కల మీద నర్తించే పాటను రాసిన గరిమెళ్ల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట తాలూకా గోనెపాడు గ్రామంలో 1893 జూలై 14న జన్మించారు. తల్లి సూరమ్మ, తండ్రి వెంకట నరసింహం. స్వగ్రామమైన ప్రియాగ్రహారంలో ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. తర్వాత విజయనగరం, మచిలీపట్నం, రాజమండ్రిలలో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. బీఏ పూర్తి చేశాక కొంతకాలం గంజాం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమస్తాగాను, మరికొంతకాలం విజయనగరం ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగాను పని చేశారు. చిన్నవయసులోనే ఆయనకు మేనమామ కూతురితో వివాహం జరిగింది. స్వేచ్ఛాప్రియుడైన గరిమెళ్ల ఏ ఉద్యోగంలోనూ ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. స్వాతంత్య్రోద్యమం ఉధృతంగా సాగుతున్న కాలంలో కలకత్తాలో 1920లో జరిగిన కాంగ్రెస్ మహాసభలో సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదం పొందింది. దేశవ్యాప్తంగా సహాయ నిరాకరణోద్యమం మొదలైంది. ఆ స్ఫూర్తితోనే గరిమెళ్ల వీరావేశంతో ఉద్యమంలోకి దూకారు. ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అంటూ గొంతెత్తి పాడుతూ రాజమండ్రి వీధి వీధినా తిరిగారు. ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ చేరి ఆయనతో పాటే గొంతు కలిపారు. ఆనాటి రోజుల్లో ఆ పాట నకలు ప్రతులు ఒక్కొక్కటీ పన్నెండు పైసలకు అమ్ముడు పోయాయంటే, గరిమెళ్ల పాట ఏ స్థాయిలో జనాలను ప్రభావితులను చేసిందో అర్థం చేసుకోవచ్చు. బ్రిటిష్ కలెక్టర్‌కు తెలుగుభాష రాకపోయినా, గరిమెళ్ల చేత ఈ పాట పాడించుకుని విన్నాడు. తనకు భాష అర్థం కాకపోయినా, ఈ పాట జనాలను ఏ స్థాయిలో ఉద్రేకపరచగలదో ఊహించగలనంటూ గరిమెళ్లకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించాడు. ఆయన జైలు పాలైనా, కాంగ్రెస్ కార్యకర్తలు గాంధీ టోపీలు ధరించి ‘మాకొద్దీ తెల్లదొరతనము..’ అని పాడుకుంటూ ఊరూరా కవాతులు సాగించేవారు. శిక్ష పూర్తయ్యాక విడుదలైన గరిమెళ్ల మళ్లీ జనం మధ్యకు వచ్చి, ఎలుగెత్తి పాడటం మొదలు పెట్టారు. మళ్లీ ఎక్కడికక్కడ జనం ఆయన చుట్టూ గుమిగూడి, ఆయనతో పాటే గొంతు కలిపి పాడసాగారు. సముద్రఘోషలాంటి ఆ పాట తెల్లదొరల గుండెల్లో సునామీలు సృష్టించింది. గరిమెళ్ల బయట ఉండటం ప్రభుత్వానికి క్షేమం కాదని తలచి మళ్లీ ఆయనను అరెస్టు చేశారు. కాకినాడ మెజిస్ట్రేటు ముందు హాజరుపరచారు. ఈసారి మెజిస్ట్రేటు ఆయనకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించారు. గరిమెళ్ల జైలులో ఉండగా, 1923లో ఆయన తండ్రి మరణించారు. అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన ముందుకు ఒక ప్రతిపాదన తెచ్చారు. అదేమిటంటే– క్షమాపణ చెప్పి, బయటకు వెళ్లిన తర్వాత మళ్లీ పాట పాడకుండా ఉండే వెంటనే విడుదల చేసేస్తామన్నారు. గరిమెళ్ల అందుకు అంగీకరించక శిక్షాకాలం పూర్తయ్యేంత వరకు జైలులో ఉండటానికే సిద్ధపడ్డారు. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. చాలా చోట్ల ఆయనకు ఘన సన్మానాలు చేశారు. అయితే, కొద్ది రోజులకే ఆయన భార్య మరణించింది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమార్తెలు. వాళ్ల ఆలనాపాలన కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. సరైన ఉద్యోగం ఎక్కడా లేకపోవడంతో అప్పుల పాలయ్యారు. అప్పులు తీర్చడానికి ఆస్తులను అమ్ముకున్నారు. కొంతకాలం ప్రియాగ్రహారంలో గ్రంథాలయ కార్యదర్శిగా పనిచేశారు. శ్రీ శారదా గ్రంథమాలను స్థాపించి, పద్దెనిమిది పుస్తకాలను అచ్చు వేయించారు. ఉద్యమకాలంలో ఆయన తరచు విజయనగరం, రాజమండ్రి, మద్రాసులకు తిరుగుతూ ఉండటంతో అచ్చు వేయించిన పుస్తకాలను అమ్ముకోవడంపై శ్రద్ధ పెట్టలేదు. చాలా పుస్తకాలు ఇంట్లోనే గుట్టలు గుట్టలుగా మిగిలిపోయాయి. వాటికి చెదలు పట్టి నాశనం కావడంతో ఆర్థికంగా నష్టపోయారు. గరిమెళ్ల తొలి పుస్తకం ‘స్వరాజ్య గీతాలు’ 1921లో అచ్చయింది. తర్వాత 1923లో ‘హరిజన గీతాలు’, 1926లో ఖండకావ్యములు, భక్తిగీతాలు, బాలగీతాలు వంటి రచనలు వెలుగులోకి వచ్చాయి. జైలులో ఉన్న కాలంలో తమిళ, కన్నడ భాషలను నేర్చుకున్న గరిమెళ్ల, కొన్ని తమిళ, కన్నడ పుస్తకాలను కూడా తెలుగులోకి అనువదించారు. భోగరాజు పట్టాభిసీతారామయ్య ఇంగ్లిష్‌లో రాసిన ‘ది ఎకనామిక్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇవేవీ ఆయనకు ఆర్థికంగా పెద్దగా ఉపయోగపడలేదు. జీవనోపాధి కోసం 1933లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ ‘గృహలక్ష్మి’ పత్రికకు సంపాదకుడిగా కొంతకాలం పనిచేశారు. అక్కడ మానేసిన తర్వాత ఆచార్య రంగా నిర్వహించే ‘వాహిని’ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరారు. కొన్నాళ్లకు ‘ఆంధ్రప్రభ’లో చేరారు. ఆ తర్వాత కొంతకాలం ‘ఆనందవాణి’ సంపాదకుడిగా చేశారు. ఉద్యోగాల్లో స్థిరంగా కొనసాగలేకపోవడం వల్ల కొంతకాలం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేశారు. గరిమెళ్ల ఆర్థికంగా ఇక్కట్లు పడుతున్న కాలంలో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు, వావిళ్ల వెంకటేశ్వర శాస్త్రలు ఆయనను ఆర్థికంగా కొంత ఆదుకున్నారు. ఒకవైపు పత్రికలకు, మరోవైపు ఆలిండియా రేడియోకు రచనలు చేస్తూ వస్తున్నా, ఆ ఆదాయం ఆయన కనీస అవసరాలకు కూడా సరిపోయేది కాదు. ఒకవైపు పేదరికం, మరోవైపు అనారోగ్యం ఆయనను బాగా కుంగదీశాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా మన పాలకుల వల్ల ఆయనకు ఎలాంటి మేలూ జరగలేదు. స్వాతంత్య్రోద్యమ కాలంలో జనాలను ఉర్రూతలూగించే పాట రాసినందుకైనా ఆయనకు ఎలాంటి ప్రభుత్వ సత్కారాలూ దక్కలేదు. చివరి దశలో ఆయనకు ఒక కన్నుపోయింది. పక్షవాతం వచ్చింది. ఏ పనీ చేయలేని దయనీయమైన పరిస్థితుల్లో ఆయన యాచనతో రోజులను వెళ్లదీశారంటే, ఆయన పట్ల మన పాలకులు ఏ స్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శించారో అర్థం చేసుకోవచ్చు. స్వాతంత్య్రానంతరం దేశంలో ప్రబలిన అవినీతికి విసిగి వేసారిన గరిమెళ్ల మిత్రుల్లో కొందరు ఆయనను ‘మాకొద్దీ నల్లదొరతనము..’ అంటూ కొత్త పాట రాయాల్సిందిగా కోరారు. అయితే, నరనరానా దేశభక్తిని జీర్ణించుకున్న ఆయన అందుకు అంగీకరించలేదు. దుర్భర దారిద్య్ర పరిస్థితులతో పోరాడుతూనే ఆయన 1952 డిసెంబరు 18న తుదిశ్వాస విడిచారు. ఇరుగు పొరుగుల సహాయంతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. ఆయన మరణం తర్వాత మేలుకొన్న మన ఘనత వహించిన పాలకులు శ్రీకాకుళంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పి దేశభక్తిని చాటుకున్నారు. - పన్యాల జగన్నాథదాసు -
కియాలో స్థానికులకు ఉద్యోగాలివ్వాలి
సాక్షి, అనంతపురం : కియా కార్ల పరిశ్రమలో అర్హులైన స్థానిక అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాలని ఆ కంపెనీ యాజమాన్యానికి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ సూచించారు. కియా, దాని అనుబంధ సంస్థల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించే అంశంపై గురువారం తన చాంబర్లో అహుడా వైస్ చైర్పర్సన్ ప్రశాంతితో కలిసి కియా యాజమాన్య ప్రతినిధులు, అధికారులతో ఆయన సమీక్షించారు. స్థానికులకు వారి విద్యార్హతల మేరకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ముఖ్యంగా భూములిచ్చిన రైతుల పిల్లలకు కచ్చితంగా ప్రాధానత్యనివ్వాలన్నారు. ఉద్యోగాలకు తగిన వేతనమూ ఉండాలని సూచించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి 19.33 ఎకరాలు కావాలి కియా సమీపంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి 19.33 ఎకరాలు అవసరమున్నట్లు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి కియా ప్రతినిధులు తీసుకొచ్చారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ అంశంపై రైతులతో చర్చించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ గోపీకృష్ణ, , పెనుకొండ ఆర్డీఓ శ్రీనివాస్‌కు సూచించారు. ప్రాజెక్టు లే–ఔట్ ఆమోదానికి చర్యలు తీసుకోవాలని అహుడా వీసీ ప్రశాంతికి సూచించారు. కియా ట్రైనింగ్ సైట్ నుంచి రోడ్డు ఏర్పాటు, తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో కియా కంపెనీ చీఫ్ అడ్మినిస్టేటివ్ అధికారి కిమ్, చీఫ్ కన్స్ట్రక్షన్ అధికారి జిమ్, లీగల్ హెడ్ జూడ్, పరిశ్రమల శాఖ జీఎం సుదర్శన్‌బాబు, ఆర్అండ్బీ ఎస్ఈ శివకుమార్, తదితరులు పాల్గొన్నారు. -
వ్యాపార దిగ్గజం మీలా.. అస్తమయం
సూర్యాపేట: ప్రముఖ వ్యాపార దిగ్గజం, స్వాతంత్య్ర సమరయోధుడు, సుధాకర్ పీవీసీ గ్రూప్ కంపెనీ అధినేత, మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ (88) మంగళవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా మీలా సత్యనారాయణ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మీలా సతీమణి కమలమ్మ నాలుగేళ్ల క్రితమే కన్నుమూశారు. మీలాకు కుమారులు మహదేవ్, వాసుదేవ్, జయదేవ్, కుమార్తెలు విజయ, ఇందిర, రత్నకుమారిలు ఉన్నారు. మీలా అంత్యక్రియలు బుధవారం సూర్యాపేట మండలం గాంధీనగర్‌లోని వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. సుధాకర్ పీవీసీ కంపెనీకి ప్రత్యేక గుర్తింపు.. 1971లో ఉపాధ్యాయ వృత్తిని వీడిన మీలా సత్యనారాయణ సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీని ప్రారంభించారు. సుధాకర్ పీవీసీ పైపుల కంపెనీకి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా కృషి చేశారు. దేశవ్యాప్తంగా పీవీసీ పైపుల కంపెనీలను స్థాపించారు. దీంతో సుధాకర్ అంటే మీలా.. మీలా అంటే సుధాకర్ అన్న రీతిలో పేరు ప్రఖ్యాతులు పొందారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు.. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి స్వాతంత్య్ర సమరయోధుడు మీలా సత్యనారాయణను ప్రతిష్టాత్మక రాష్ట్రపతి పురస్కారానికి ఎంపిక చేయగా, అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఆయనకు అవార్డును అందజేశారు. పారిశ్రామిక రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అవార్డు ను అమెరికాలో భారత రాయబారి అబీద్ హుస్సేన్ చేతుల మీదుగా తీసుకున్నారు. సత్యనారాయణ మృతి పట్ల మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, మల్లు స్వరాజ్యం సంతాపం ప్రకటించారు. సత్యనారాయణ గొప్ప నాయకుడు: దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: సూర్యాపేట మాజీ మున్సిపల్ చైర్మన్ మీలా సత్యనారాయణ మరణంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ సంతాపం వ్యక్తం చేశారు. సత్యనారాయణ నిరుపేదలకు నిస్వార్థ సేవలను అందించిన గొప్ప నాయకుడని, ఆయన మరణం ప్రజలకు తీరని లోటన్నారు. తాను పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నపుడు ఆయన అనేక పథకాలను సూర్యాపేటకు మంజూరు చేయించారని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. -
చంద్రబాబుకు గుణపాఠం చెప్తాం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. బీసీ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 14 బీసీ సంఘాల నేతలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను విమర్శిస్తే రూ. 50 లక్షలు ఇస్తామని చంద్రబాబు తెలంగాణకు కొంతమంది నేత లను పంపించి బీసీ నేతలతో బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ నేతలను డబ్బులతో కొనడానికి కుట్రలు చేస్తున్నా రన్నారు. గత ఎన్నికల్లో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసి బీసీ ఓట్లు దండుకొని ఏపీలో బాబు అధికారం చేపట్టారని విమర్శిం చారు. చంద్రబాబు కృష్ణయ్యను ఎంత అణచివేసినా ఏనాడూ బాబును విమర్శించలేదని, వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. బీసీలకు నేడు లభిస్తున్న పథకాలు కృష్ణయ్య పోరాటం వల్ల వచ్చినవేనని, బీసీ ఉద్యమ నాయకుడిగా అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే ఏపీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామని హెచ్చరించారు. -
మృగాడి దాష్టీకానికి ఆరిన మరో ‘జ్యోతి’
తన కుమారుడి వయసున్న యువతి నిండు ప్రాణాలను ఆ మానవ మృగం బలి తీసుకుంది. ఆమెకు పెళ్లి కుదరడాన్ని తట్టుకోలేకపోయింది. తనకు దక్కని ఆమె ఎవరికీ దక్కకూడదన్న అక్కసుతో గొంతునులిమి, పీక కోసి హతమార్చింది. పెళ్లి సంబంధం కోసం ఏలూరు వెళ్లిన తల్లిదండ్రులు తమ బిడ్డ హత్యకుగురైందని తెలుసుకుని కన్నీరుమున్నీరయ్యారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లాలోని రాజధాని పరిధిలో ప్రేమికుడి వెంట వెళ్లిన నేరానికి ప్రాణాలు కోల్పోయిన జ్యోతి హత్య కేసులో వాస్తవాలు ఇంకా వెలుగు చూడక ముందే.. తెనాలిలో ఓ మృగాడి ఘాతుకానికి మరో ‘జ్యోతి’ కొడిగట్టింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ యువతిని గొంతు కోసి దారుణంగా హతమార్చిన ఆ మానవ మృగం..నేరుగా పోలీసుస్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే..పట్టణానికి చెందిన బిట్రా సుధాకర్, దుర్గాభవాని దంపతులు పట్టణ ఇస్లాంపేటలోని హిందూ ముస్లిం రోడ్డులో నివసిస్తున్నారు. వస్త్ర దుకాణాల్లో పనిచేసే వీరికి కుమారుడు ప్రవీణ్ అలియాస్ నాని, కుమార్తె శ్రీజ్యోతి (20) ఉన్నారు. ప్రవీణ్ ఆటోనగర్‌లో స్టీలు కంపెనీలో పనిచేస్తుండగా, పదోతరగతి వరకు చదివిన శ్రీజ్యోతి ఇంట్లోనే ఉంటోంది. ఆమెకు పెళ్లిసంబంధం మాట్లాడేందుకని సుధాకర్ దంపతులు గురువారం తెల్లవారుజామునే ఏలూరు బయలుదేరి వెళ్లారు. ప్రవీణ్ ఆటోనగర్ వెళ్లాడు. శ్రీజ్యోతి తండ్రి సుధాకర్‌ది స్వస్థలం భట్టిప్రోలు. అదే ఊరికి చెందిన నేతికుంట్ల సత్యనారాయణ(42)తో స్నేహం కుదిరింది. తన కొడుకుతోపాటు అదే ఈడు వాళ్లయిన సుధాకర్ పిల్లలనూ సత్యనారాయణ ఆడిస్తుండేవాడు. ఏడెనిమిదేళ్ల క్రితం వ్యాపారంలో నష్టపోయిన సుధాకర్ ఉపాధి కోసం తెనాలికి వచ్చేసి సాలిపేటలో అద్దెకు ఉంటున్నారు. ఆ తర్వాత రెండేళ్లకు సత్యనారాయణ కూడా కుటుంబంతో సహా ఇక్కడకు వచ్చి రైస్‌కాలనీలో నివసించసాగాడు. కుటుంబ వివాదాల కారణంగా సత్యనారాయణ ఒంటరిగా జీవిస్తున్నాడు. కుటుంబ స్నేహితుడిగా అన్ని అవసరాలకు సుధాకర్ కుటుబానికి ఆసరాగా ఉంటూ వచ్చాడు. అయితే తన కుమారుడి వయస్సున్న శ్రీజ్యోతిపై కన్నేసిన సత్యనారాయణ ఆమెను వివాహం చేసుకుంటానని ఎవరి చేతనో తల్లిదండ్రులను అడిగించాడు. ఎందుకలా అడిగారని సుధాకర్ దంపతులు అతడిని నిలదీయగా..‘నేనెందుకు అన్నాను..చిన్నపిల్లకదా..సరదాగా అన్నాను’ అంటూ సత్యనారాయణ మాట దాటేశాడు. ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషనుకు వచ్చిన మృతురాలి తలిదండ్రులు బిట్రా సుధాకర్, దుర్గాభవాని ఆ తర్వా త కొద్దిరోజులకే ‘శ్రీజ్యోతికి పెళ్లి చేయండి..అవసరమైతే ఎంతో కొంత డబ్బు సర్దుబాటు చేస్తాను’ అంటూ హామీనిచ్చాడు. అతని మాటలు నమ్మిన శ్రీజ్యోతి తల్లిదండ్రులు ఏలూరులో చూసిన పెళ్లి సంబంధం దాదాపు ఖరారైనట్టేనని ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సత్యనారాయణకు ఫోనులో చెప్పారు. దీంతో ఆమె తనకు దక్కదని భావించిన సత్యనారాయణ.. ఇంట్లో ఒంటరిగా ఉన్న శ్రీజ్యోతిని హత్య చేసి పోలీసుస్టేషన్లో లొంగిపోయాడు. నిర్ఘాంతపోయిన పోలీసులు..అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇస్లాంపేటలోని సుధాకర్ ఇంటికి వెళ్లి చూడగా రక్తపు మడుగులో శ్రీజ్యోతి మృతదేహం కనిపించింది. గొంతు నులిమి కూరగాయలు కోసుకునే కత్తితో పీక కోసినట్టు గమనించారు. నిందితుడిని పోలీస్‌స్టేషనుకు తరలించి..ఏలూరు వెళ్లిన తలిదండ్రులకు వన్‌టౌన్ సీఐ మరీదు శ్రీనివాసరావు సమాచారం అందించారు. మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకున్న ఆ దంపతులు, విగత జీవురాలై పడి ఉన్న కుమార్తెను చూసి గుండెలవిసేలా రోదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు. -
సౌకర్యాలపై అవగాహన కల్పించాలి: ఆర్టీసీ చైర్మన్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కల్పించే సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులకు అవగాహన కల్పించినప్పుడే సంస్థకు మరింత ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం టీఎస్ఆర్టీసీ పరిపుష్టి కోసం ఏర్పాటైన నిపుణుల అధ్యయన కమిటీతో బస్‌భవన్‌లో సమావేశమయ్యారు. క్షేత్ర స్థాయిలోని సమస్యలను చర్చించి కమిటీకి వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఆర్టీసీ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలుపుకోవడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటా మన్నారు. సమావేశంలో సంస్థ కార్యదర్శి పురుషోత్తం, కమిటీ సభ్యులు నాగరాజుయాదవ్, నర కేసరి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనకు అల్లుడు కావడమే.. నేను చేసిన నేరం!!
‘బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ - ఇఫ్లూ ప్రొఫెసర్ సత్యనారాయణ సాక్షి, హైదరాబాద్ : భీమా- కోరెగావ్ అల్లర్లు, ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో.. విప్లవ రచయితల సంఘం నేత వరవరరావుతో సహా మరో నలుగురు పౌరహక్కుల నేతలను పోలీసులు మంగళవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన మేధావులు.. ప్రభుత్వం, పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పౌరహక్కుల నేతలపై అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేయడాన్ని వ్యతిరేకిస్తూ ‘మీటూ అర్బన్ నక్సల్’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్విటర్లో ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన వరవరరావు అల్లుడు, ఇఫ్లూ(ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) ప్రొఫెసర్ సత్యనారాయణ.. తన ఇంట్లో సోదాలు చేసిన సమయంలో పోలీసులు ప్రవర్తించిన తీరుపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అది అరెస్టు వారెంటు కాదు.. మావోయిస్టులకు వరవరరావు నిధులు సమకూర్చారని ఆరోపిస్తూ పుణె నుంచి వచ్చిన పోలీసులు గాంధీనగర్‌లోని వరవరరావు నివాసంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కూతురు పవన, అల్లుడు సత్యనారాయణ ఇంటిలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ విషయం గురించి సత్యనారాయణ మాట్లాడుతూ... వరవరరావుకు అల్లుడినైన నేరానికే పోలీసులు తన పట్ల ఈ విధంగా ప్రవర్తించారేమో అంటూ సోదాలు నిర్వహించిన తీరును మీడియాకు వివరించారు. ‘ ఆరోజు(మంగళవారం) ఉదయం 8 గంటల 30 నిమిషాల సమయంలో.. సుమారు 20 మంది పోలీసులు (10 మంది మహారాష్ట్ర, 10 మంది తెలంగాణ పోలీసులు)ఇఫ్లూ స్టాఫ్ క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మరాఠీ భాషలో ఉన్న ఓ కాగితాన్ని సర్చ్ వారెంట్ అంటూ నా చేతిలో పెట్టి ఇంట్లోకి వచ్చి, సోదాలు మొదలుపెట్టారు. ల్యాండ్‌లైన్ ఫోన్ కనెక్షన్ కట్ చేశారు. మా దగ్గర ఉన్న మొబైల్స్, ల్యాప్టాప్స్ తీసేసుకున్నారు. ఈ- మెయిల్ ఐడీలు బ్లాక్ చేశారు. అయితే పోలీసులు నాకు ఇచ్చింది సెర్చ్ వారెంట్ కాదని, ఓ పోలీసు ఉన్నతాధికారి రాసి ఇచ్చిన స్టేట్మెంట్ అని తర్వాత తెలిసిందని’ సత్యనారాయణ చెప్పారు. బాత్రూం డోర్ తెరచి ఉంచాలంటూ.. ‘బ్రష్ చేసుకునేందుకు, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదు. బాత్రూంకి వెళ్తాననడంతో ఓ వ్యక్తి నా వెనకాలే వచ్చాడు. తలుపు తెరిచే ఉంచాలంటూ నాకు చెప్పాడు. అదే విధంగా నా భార్య పవన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ... మీ భర్త దళితుడు. మీరేమో బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. మరి మీరెందుకు సంప్రదాయాలు పాటించరు? మంగళ సూత్రం ఎందుకు ధరించరు? కమ్యూనిస్టు అయితే కావచ్చు గానీ హిందూ సంప్రదాయాలు పాటించాలి కదా’ అంటూ తన భార్య పవనను మనోవేదనకు గురిచేశారని సత్యనారాయణ ఆరోపించారు. ఇన్నేళ్ల సర్వీసులో ఒక్క మచ్చ కూడా లేదు.. 30 ఏళ్ల సర్వీసులో తనపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, కేవలం వరవరరావు అల్లుడనే ఒకే ఒక్క కారణం చేత తనను టార్గెట్ చేశారని విమర్శించారు. తనలాంటి అమాయకుల మీద లేనిపోని నిందలు మోపి, గోప్యత హక్కుకు భంగం కలిగిస్తుంటే ఏ కోర్టులకు కూడా పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘నువ్వు మేధావి అవ్వాలని ఎందుకు అనుకున్నావ్. నీ గదిలో అంబేద్కర్, ఫూలే దంపతుల ఫొటోలు ఎందుకున్నాయి. ప్రొఫెసర్‌గా సంపాదిస్తున్నది సరిపోవడం లేదా? మావో సాహిత్యం ఎందుకు చదువుతున్నావ్? వేరే పనులేమీ లేవా అంటూ ఒక ఉగ్రవాదిని ప్రశ్నించినట్లు తనను కూడా ప్రశ్నించారంటూ’ పోలీసుల తీరుపై సత్యనారాయణ మండిపడ్డారు. ఈ ఘటనతో క్యాంపస్ అంతా ఉలిక్కి పడింది. సత్యనారాయణ ఇంట్లో సోదాలు జరపటానికి పోలీసులు రావడంతో క్యాంపస్‌లోని విద్యార్థులంతా భయభ్రాంతులకు గురయ్యారని ఇఫ్లూ ప్రొఫెసర్ సుజాత ముకిరి అన్నారు. సత్యనారాయణ, ఆయన కుటుంబ సభ్యుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని పేర్కొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి కొనసాగుతున్న చేరికలు
సాక్షి, ఉండి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పోటెత్తున్నాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వ అక్రమాలపై రాజీలేని పోరాటం చేస్తున్న జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు, ప్రముఖులు, సామాన్యులు వైఎస్సార్ సీపీలో వెల్లువలా చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నంకు చెందిన ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ గురువారం వైఎస్సార్ సీపీలో చేరారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో సత్యనారాయణ, ఆయన మద్దతుదారులను వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సత్యనారాయణ తెలిపారు. వైఎస్ జగన్ లాంటి ప్రజాదరణ కలిగిన నాయకుడు ఎవరూ లేరని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు పార్టీలో చేరినట్టు చెప్పారు. 27న వైఎస్సార్ సీపీలో చేరతా: చెరుకువాడ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మాజీ శాసనసభ్యుడు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెరుకువాడ శ్రీరంగనాధరాజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. 27న భీమవరం నియోజకవర్గం చిన అమిరంలో వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరుతున్నట్టు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. -
టీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది!
సాహిత్య మరమరాలు స్థానాపతి సత్యనారాయణ, కన్యకాపరమేశ్వరి దేవాలయంలో వంశపరంపరలో పూజారి. ఆ దేవాలయాన్ని అంటుకునివున్న చిన్న ఇల్లు పూజారి వసతి గృహం. అందులోనే ఆయన ఉండేవారు. బలిష్టమైన మనిషి. పహిల్వాన్ కావాలని కాంక్ష ఉండేదట. ఆయన దగ్గరికి అబ్బూరి వరదరాజేశ్వరరావు తెలుగు, సంస్కృతం అభ్యసించేందుకు వెళ్లేవారట. అయితే, చదువు చెబుతూ తన దగ్గర చదువుకోవటమే ఒక సరదా అనే అనుభూతిని కలిగించాలని సత్యనారాయణ తాపత్రయపడేవారు. ఆ ఉత్సాహంలో వరదను ఒకసారి కోట ప్రాంతంలో బీచ్‌రోడ్ మీద వున్న ఒక రెస్టారెంటుకు కాఫీ తాగుదామని తీసుకెళ్లారు. ఆ రోజుల్లో దానిని ఇంగ్లీష్ వాళ్లు నిర్వహించేవారు. అలాంటి చోట్లకు పోవడం సత్యనారాయణకు మొదటిసారి. బల్లమీద టేబుల్ సాల్టూ, సాసూ వున్నాయి. వెయిటర్ వాళ్లు కూచున్న టేబుల్ దగ్గరికి వచ్చి యేంకావాలన్నాడు. ఇంట్లో ఎటూ రోజూ కాఫీయే కదా, ఇక్కడ కూడా అదేనా అని, రెండు కప్పులు టీ పట్రమ్మని చెప్పారు సత్యనారాయణ. రెండు కప్పుల టీ తెచ్చాడు వెయిటరు. పంచదార విడిగా ఇచ్చాడు. అది కలుపుకొని తాగాడు వరద. సత్యనారాయణ బాధగా తాగారు. బిల్లు చెల్లించి, రోడ్డు మీదకు వచ్చాక, ‘‘ఏమిటోయ్, ఇంగ్లీషువాళ్ల టీ ఉప్పగా ఉంటుందేమోయి’’ అన్నారట సత్యనారాయణ. పంచదార అనుకుని, తన కప్పు పక్కనేవున్న టేబుల్ సాల్ట్ అయిదారు చంచాలు ఆయన టీలో కలుపుకున్నారు పాపం! -
నెన్నెలలో తొలి వికెట్ పడింది..
మంచిర్యాలసిటీ: అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన రంగు రామాగౌడ్ ఉదంతంలో తొలి వికెట్ పడింది. రామాగౌడ్‌పై అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసినందుకు నెన్నెల తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాజలింగును నెన్నెల తహసీల్దార్‌గా బదిలీ చేశారు. అట్రాసిటీ కేసు విషయంలో తనకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో ఈ నెల 22న కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో రామాగౌడ్ క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. పల్ల మహేష్ ఎస్టీ కాకున్నా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అట్రాసిటీ కేసు పెట్టాడని, తనకు న్యాయం చేయాలని ఆయన ప్రజావాణిలో రెండుసార్లు ఫిర్యాదు చేయడం, అధికారులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే రామాగౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్‌ను కలెక్టర్ కర్ణన్ విచారణ అధికారిగా నియమించారు. సబ్ కలెక్టర్ బుధవారం నెన్నెలకు వెళ్లి రామాగౌడ్ కుటుంబసభ్యులను విచారించారు. పల్ల మహేష్‌కు సంబంధించిన వివరాలు సేకరించారు. రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలింది. కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సత్యనారాయణ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేశారు. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు నమోదు కావడం, రామాగౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాథమిక విచారణలో తహసీల్దార్‌పై మొదటి వేటు పడింది. ఎస్సై కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో పోలీస్‌శాఖ తీరుపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఆ శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిబంధనల మేరకు పోలీసులు కేసు పెట్టారా, ఒత్తిళ్లతోనే కేసు నమోదైందా అనేది తేలితే ఆ శాఖపై కూడా చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
విషాదం: కన్నబిడ్డలు పట్టించుకోవడం లేదని...
సాక్షి, భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కన్న బిడ్డలు చూసుకోవడంలేదని మనస్థాపంతో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భీమవరం శివారు గునుపూడిలో తటవర్తి సత్యనారాయణ(70) నివాసం ఉంటున్నాడు. అతని భార్య పదేళ్ల క్రితం అతని భార్య మృతిచెందడంతో అతను ఒంటరిగా ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కొడుకు, ఓ కుమార్తె హైదరాబాద్‌లో ఉంటుండగా, మరో కుమార్తె అత్లిలిలో ఉంటోంది. అయితే ముగ్గురు పిల్లలున్నా తన బాగోగులు పట్టించుకోవడం లేదని సత్యనారాయణ కొంతకాలంగా భాదపడుతున్నాడు. ఈ క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఇంటిలోనే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్ధానికలు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అమ్మానుషం
మద్యానికి డబ్బులివ్వలేదని తల్లిని చంపిన కిరాతకుడు మాయమైపోతున్నాడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా కానడమ్మ మనసున్నవాడు.. మానవత్వం కనుమరుగవుతోందని ఓ కవి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. కానీ కశింకోట మండలంలో జరిగింది మరింత ఘోరం. మానవ సంబంధాలకు మచ్చ తెచ్చేలా ఏకంగా కన్నతల్లినే కడతేర్చాడు ఓ కిరాతకుడు.. మద్యం తాగడానికి డబ్బులివ్వలేదని కత్తితో నరికి చంపాడు. ఏ మత్తులోనో చేసిన అఘాయిత్యం కాదిది.. చంపేస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి మరీ చంపాడు. నవ మాసాలు మోసి.. కని.. పెంచినందుకు బహుమతిగా సమాజం తలదించుకునేలా అమ్మను ఇలా అంతం చేశాడు. వాడిని ఏమనాలి? పశువు అందామంటే జంతువులు సైతం తల్లిని ప్రేమిస్తాయి. రాక్షసుడు అందామంటే రక్కసి కూడా కన్నతల్లిని ఆదరిస్తాడు. మరి వీడిని ఏమనాలి? అనకాపల్లి: ఆ కిరాతకుడు చెప్పిందే చేశాడు. కన్న తల్లి అని కూడా చూడలేదు. చంపుతానన్నాడు. కుటుంబ సభ్యులకు ఫోన్లు చేసి మరీ ముందుగానే చెప్పాడు. అంతా బెదిరింపు అనుకున్నారు. మద్యం మైకంలో మాట్లాడుతున్నాడనుకున్నారు. తల్లిని ఎందుకు చంపుతాడనుకున్నారు. అన్నంత పనీ చేశాడు. పట్టపగలే ప్రాణం తీశాడు. కన్నతల్లిని చుర కత్తితో పీక కోసి కిరాతకంగా చంపాడు. ఇదేదో పెద్ద ఆస్తుల కోసం అనుకుంటే పొరపాటే. మద్యానికి బానిసగా మారిన దుర్మార్గుడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని హత్య చేశాడు. ఈ సంఘటన మండలంలోని నూతలగుంటపాలెం శివారు అచ్యుతాపురం గ్రామంలో మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జరిగింది. నూతనగుంటపాలెం అచ్యుతాపురం గ్రామానికి చెందిన అప్పికొండ రాజులమ్మ (75) తనకు వచ్చే వితంతు పింఛన్ సొమ్ముతో బతుకు బండి నడిపిస్తోంది. మూడున్నర దశాబ్దాల క్రితమే భర్త అప్పలనాయుడు మృతి చెందాడు. అప్పటి నుంచి పూరి పాకలో ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తోంది. పెద్ద కుమారుడు జోగినాయుడు విశ్రాంత రైల్వే ఉద్యోగి. చేదోడుగా వాదోడుగా ఉంటూ జాతీయ రహదారి పక్కన రేకులతో ఇటీవల తల్లికి ఇల్లు కూడా కట్టించాడు. ఇక రెండో కుమారుడు, నిందితుడు సత్యనారాయణ (55) అదే గ్రామంలో మరో పెంకిటింటిలో ఒంటరిగా ఉంటున్నాడు. కూలి పని చేసుకుంటూ.. ఉన్న కాస్త వ్యవసాయ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాడు. మద్యానికి బానిసై వేధించడంతో భార్య పదేళ్ల క్రితం దండం పెట్టి తన ఇద్దరు పిల్లలతో రాంబిల్లి మండలం పెద కళ్లపల్లిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. నిత్యం వేధింపులే.. మద్యానికి డబ్బులివ్వమని సత్యనారాయణ నిత్యం తల్లిని వేధిస్తుంటాడు. తన వద్ద ఉన్నప్పుడు డబ్బులు ఇస్తుండేది. లేవంటే గొడవ.. ఈ బాధ భరించలేక ఆమె అప్పుడప్పుడు కశింకోటలో ఉన్న తన కుమార్తె మెరుగు నూకరత్నం, అల్లుడు వెంకటరావుల ఇంటికి వెళ్లి వస్తూ ఉండేది. తన రెండో కుమారుని నిర్వాకం గురించి మాత్రం ఆత్మాభిమానంతో ఎవరికీ తెలియనిచ్చేది కాదు. అందరికీ మంచిగానే చెబుతుండేది. ఈ నెల 6న రాజులమ్మ నెలవారీ వితంతు పింఛన్ సొమ్ము రూ.వెయ్యి అందుకుంది. ఈ విషయం తెలుసుకున్న సత్యనారాయణ సోమవారం తల్లి ఇంటికి వెళ్లి మద్యం తాగడానికి డబ్బులు అడిగాడు. అందుకు తల్లి నిరాకరించింది. దీంతో చంపుతానని భయపెట్టాడు. అయినా లేవని పంపించేసింది. దీంతో కశింకోటలో ఉన్న తన బావ వెంకటరావుకు నాలుగైదు సార్లు, ఇతర బంధువులకు ఫోన్ చేసి తల్లి రాజులమ్మను చంపనున్నట్లు హెచ్చరిస్తూ బెదిరించాడు. అయితే మద్యం మత్తులో మాట్లాడుతున్నాడని వారు తేలికగా తీసుకున్నారు. అయితే అన్నట్లుగానే తన వద్ద ఎప్పుడూ ఉంచుకొనే చురకత్తిని తీసి మంగళవారం తల్లిని హత్య చేశాడు. పెళ్లి పెద్దను చంపేస్తానని హెచ్చరిక సరైన వివాహ సంబంధం తేకుండా సంసారిక సుఖం లేకుండా చేసిందంటూ అదే గ్రామంలోని పెళ్లి పెద్ద అప్పికొండ కొండమ్మను కూడా చంపుతానని సత్యనారాయణ హెచ్చరించాడని స్థానికులు తెలిపారు. దీంతో తల్లిని చంపిన వానికి ఇతరులను చంపడం ఓ లెక్కా అంటూ ఎవరికి ఎటువంటి హాని తలపెడతాడోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సత్యనారాయణను తక్షణమే అరెస్టు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి హత్య సంఘటన చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. పోస్టుమార్టం మృతురాలు రాజులమ్మ మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఆమె పెద్ద కుమారుడు అప్పికొండ జోగినాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి సీఐ రామచంద్రరావు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సన్యాసిరావు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. చిక్కంతో పరారు తన ఇంటి ముందు వంట చేస్తూ రాజులమ్మ చేపల కూర వండుతోంది. ఈ సమయంలో మళ్లీ డబ్బులు ఇమ్మని అడిగితే ఆమె నిరాకరించింది. దీంతో కత్తి తీసి పీక ముందు భాగంలో కోసి హతమార్చాడు. రక్తపు మడుగులో ఆమె కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా కొడుకు మనసు కరగలేదు. తల్లి వద్ద చిక్కం (సంచి)లో ఉన్న నగదు లాక్కొని సమీపంలోని పొలాల వైపు పరారయ్యాడు. రాజులమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో బంధువులు, గ్రామస్తులు నివ్వెరపోయారు. కుమార్తె నూకరత్నం, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
కటకటాల్లో 'కలకలం'
► బాస్‌పైనే డీఐజీ రూప సమరశంఖం ► అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజం ► పరప్పన అగ్రహార సెంట్రల్ జైలే వివాద కేంద్రం ► గొడవ ఎక్కడికెళ్తుందోనని ఉత్కంఠ ► సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం సీనియర్ల మాటను జవదాటని పోలీసు శాఖలో ఇది సంచలనమే. ఒక సీనియర్‌ను మరో జూనియర్ ఐపీఎస్ సవాల్ చేశారు. ఏకంగా అవినీతి ఆరోపణలనే సంధించారు. జైళ్లశాఖ డీఐజీ రూప మౌద్గిల్... ఆ శాఖ చీఫ్ సత్యనారాయణపై ముడుపుల ఆరోపణలతో నివేదికను సర్కారుకు పంపడం కలకలం రేపుతోంది. పరప్పన జైల్లో చిన్నమ్మ శశికళకు ప్రత్యేక వసతుల కోసం రూ.2 కోట్లు చేతులు మారాయని రూప స్పష్టంచేయడం వ్యవహారం తీవ్రతను చాటుతోంది. సాక్షి, బెంగళూరు: జైలంటే ‘తప్పుచేసిన వారిని సన్మార్గంలో నడిపించే పరివర్తన కేంద్రం’, కానీ ఈ స్ఫూర్తి కాగితాలకే పరిమితమన్నది మరోసారి స్పష్టమైంది. అక్కడ గంజాయి మొదలుకొని మద్యపానం, సెల్ఫోన్లు వాడటం, దాడులు,దౌర్జన్యాలు వంటివి సాధారణంగా మారిపోయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఈ ఆరోపణలు పై స్థాయిలోని అధికారిపై రావడం మాత్రం సంచలనం రేపుతోంది. ఇందులో అనేక పెద్ద తలకాయలు ఉండడంతో విషయం ఎక్కడికి వెళ్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు లోపల అనేక అక్రమాలు జరుగుతున్నట్లు జైళ్ల శాఖ డీఐజీ రూప మౌద్గిల్ ఆ శాఖ డీజీపీ సత్యనారాయణరావ్, ప్రభుత్వానికి నివేదిక పంపడం కలకలం రేపుతోంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నా డీఎంకే నాయకురాలు శశికళకు ప్రత్యేకవసతులు కల్పించడానికి ఆ ఉన్నతాధికారి రూ.2కోట్ల ముడుపులు తీసుకున్నట్లు ఆమె నివేదికలో లిఖితపూర్వకంగా ఆరోపించడం గమనార్హం. వైద్య సిబ్బందిపై ఖైదీల దాడులతోనే రట్టు! పరప్పన అగ్రహార కేంద్ర కారాగృహంలో జరుగుతున్న అక్రమాలు బయటికి రావడానికి ప్రధాన కారణం అక్కడి వైద్య సిబ్బంది పై ఖైదీలు దాడికి పాల్పడం అని విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల కొందరు ఖైదీలు వైద్య సిబ్బంది తమ మాట వినలేదని కొట్టారు. దీనిని జైలు వార్డర్లు చూసినా పట్టించుకోలేదు. ఫిర్యాదులు చేస్తే ఉన్నతాధికారులకు ఇబ్బందులకు గురవుతారని వైద్యులను బుజ్జగించారు. దీంతో వైద్యులను ఖైదీలు హేళన చేయడం మొదలైంది. ఈ నేపథ్యంలో వైద్యులు తమ గోడును డీఐజీ రూపాకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని పరప్పనఅగ్రహార జైలు ఉన్నతాధికారులకు డీఐజీ రూప ఆదేశించారు. అయితే సమాధానం రాకపోవడంతో ఆమే స్వయంగా ఈ నెల 10న తనిఖీకి వెళ్లడం వ్యవహారాన్ని మలుపు తిప్పింది. జైల్లోని సంగతులపై తాజా నివేదికను రూపొందించారు. ఇది కూడా కారణమా? రాష్ట్రంలో సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులకు, అలాగే జూనియర్ ఐఏఎస్‌లు– ఐపీఎస్‌లకు మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్ల శాఖ ఐజీపీగా సత్యనారాయణ ఆ శాఖలో తాను ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలను, పథకాలను డీఐజీ రూప తనవేనని ప్రచారం చేసుకుంటున్నారని భావిస్తున్నారు. ఈ క్రమంలో పై నుంచి ఆమెకు రెండు మెమోలు కూడా వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే డీఐజీ రూప పరప్పన జైల్‌పై వ్యూహాత్మకంగా వ్యవహరించి అక్రమాలపై గళమెత్తారని ఆ శాఖ వర్గాల కథనం. పనిచేస్తే.. మెమో ఇస్తారా? – జైళ్ల డీఐజీ రూప నివేదికలో డీఐజీ రూప కొన్ని అంశాలను ప్రస్తావించారు. ‘జైళ్ల శాఖ డీఐజీగా నేను జూన్ 23న బాధ్యతలు స్వీకరించాను. విధుల్లో భాగంగా ఈనెల 10న నేను పరప్పన జైలుకు వెళ్లాను. ఆ తరువాతి రోజే మీ (సత్యనారాయణ) కార్యాలయం నుంచి నాకు మెమో వచ్చింది. అందులో ‘మిమ్ములను పరప్పన అగ్రహార జైలుకు ఎవరు వెళ్లమన్నారు’ అని ప్రశ్నించారు. నా అధికార పరిధి ప్రకారం జైళ్లకు వెళ్లి తనిఖీ చేయడం, తప్పు చేసినసిబ్బంది నుంచి వివరణ కోరడం కూడా నా విధి. నా విధులను సక్రమంగా నిర్వర్తిస్తుంటే మీరు మెమో జారీ చేయడం అత్యంత శోచనీయం’ అని ఘాటుగా పేర్కొన్నారు. డీఐజీ రూప వైఖరి సరికాదు రాయచూరు రూరల్ : బెంగళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో శశికళ, స్టాంపుల కేసు దోషి తెల్గీ నుంచి జైళ్ల శాఖ ఐజీపీ సత్యనారాయణరావు ముడుపులు తీసుకుని రాచమర్యాదలు చేస్తున్నారని ఆ శాఖ డీఐజీ రూప చేసిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన గురువారం రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా తొండిహాళ్లోని హెలిప్యాడ్ వద్ద విలేకరులతో మాట్లాడారు. డీజీపీ సత్యనారాయణ జైళ్లలో అక్రమాలకు పాల్పడ్డారని డీఐజీ రూప మీడియా ముందు బహిరంగంగా చెప్పడం తగదని సూచించారు. ఈ విషయంపై హోం శాఖ కార్యదర్శితో చర్చించి పరప్పనజైలు వ్యవహారంపై క్షుణ్ణంగా విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. మళ్లీ కరువు ఛాయలు రాష్ట్రంలో కాంగెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.40 వేల కోట్లను నీటిపారుదల రంగానికి కేటాయించామన్నారు. గత బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.18 వేల కోట్లను మాత్రమే కేటాయించిందన్నారు. రాష్ట్రంలోని జాతీయబ్యాంకుల్లో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను రద్దు చేసేలా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు అనంతకుమార్, సదానందగౌడ, విధాన పరిషత్ ప్రతిపక్ష నేత జగదీష్ శెట్టర్లు ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేయాలన్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో కరువు ఛాయలు అలుముకునే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం తరపున ముందు జాగ్రత్త చర్యగా మేఘ మథనం చేపడతామన్నారు. బీజేపీ నాయకులు 2018 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కంటున్న కలలు కల్లలు కాక తప్పదన్నారు. -
కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్ జగన్ ఆరా
హైదరాబాద్ : తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ కార్యకర్త ఆత్మహత్యపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరా తీశారు. జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబుకు సోమవారం వైఎస్ జగన్ ఫోన్‌చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతుడి వివరాలు, ఆత్మహత్యకు గల కారణాలపై పార్టీ నేతలు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి సమాచారాన్ని సేకరించారు. కాగా పెద్దపూడి మండలం సహపురంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్త సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల వేధింపుల కారణంగానే అతడు చనిపోయాడని కుటుంబసభ్యులు ఆరోపించారు. మరోవైపు సత్యనారాయణ మృతదేహంతో పార్టీ శ్రేణులు ఇవాళ కైకవోలు సెంటర్ వద్ద ధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో పార్టీ కార్యకర్తలతో పాటు కురసాల కన్నబాబు, సూరినారాయణరెడ్డి, కృష్ణారెడ్డి పాల్గొన్నారు. అయితే వైఎస్ఆర్ సీపీ ధర్నాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. -
హరితహారానికి భూములను గుర్తించండి
► అధికారులతో కలెక్టర్ సత్యనారాయణ వీడియో కాన్ఫరెన్సు సాక్షి, కామారెడ్డి : హరితహారంలో భాగంగా ప్రతీ మండలంలో ప్రభుత్వ స్థలాలను గుర్తించి మొక్కలు నాటడానికి ప్రణాళిక సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఎంపీడీవోలు, తహశీల్దార్లు, ఏపీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి ప్రణాళిక సిద్దంగా ఉంచుకోవాలన్నారు. రెండు లక్షల యూకలిప్టస్ మొక్కలను నాటాలని ఆదేశించారు. జిల్లాలో కోటి 30 లక్షల మొక్కలు నాటడానికి లక్ష్యం నిర్ణయించినందున అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ నెల నాలుగో వారం లేదా జూలై మొదటి వారంలో హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని, అప్పటిలోగా సంసిద్దులై ఉండాలన్నారు. ప్రతీ మండలంలో 50 వేల సీడ్ బాల్స్‌ను తయారు చేయించి నిల్వ ఉంచుకోవాలన్నారు. ఉపాధి హామీ పథకంలో 45 లక్షల పనిదినాలను కల్పించి జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపినందుకు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి అభినందించిన విషయాన్ని మండల అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మనిమాల, డీఈవో మదన్మోహన్, డీఆర్డీఏ పీడీ చంద్రమోహన్‌రెడ్డి, ఎఫ్‌డీవో రేఖాభాను, జిల్లా అధికారులు గజ్జారాం, శ్రీనివాస్, చంద్రశేఖర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ ఢీకొని కార్మికుడి మృతి
వి.సావరం(రాయవరం) : ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర సరుకులు తీసుకుని వచ్చేందుకు వెళ్తున్న బట్టీ కార్మికుడు మృత్యువాత పడ్డాడు. ప్రమాదంలో ఉందుర్తి సత్యనారాయణ (50) అనే బట్టీ కార్మికుడు మృతి చెందగా, మోర్త మహేష్ అనే మరో కార్మికుడు తీవ్రగాయాల పాలైన ఘటన శనివారం వి.సావరంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిందిలా.. అమలాపురం మండలం సామంకుర్రుకు చెందిన ఉందుర్తి సత్యనారాయణ, మండలంలోని పసలపూడికి చెందిన మోర్త మహేష్‌లు కుటుంబ సభ్యులతో పనిచేస్తున్నారు. ఇంట్లోకి కావాల్సిన సరుకులు తెచ్చుకునేందుకు మహేష్, సత్యనారాయణ కలిసి మోటార్‌సైకిల్‌పై రాయవరం బయలుదేరాడు. బట్టీకి కొద్ది అడుగుల దూరంలోనే వీరు ప్రయాణిస్తున్న మోటార్‌సైకిల్‌ను రాయవరం నుంచి వెదురుపాక వైపుకు వస్తున్న ట్రాక్టర్ ఢీకొంది. ప్రమాదంలో సత్యనారాయణ అక్కడికక్కడే చనిపోగా, గాయాలపాలైన మహేష్‌ను 108 వాహనంపై రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఇదిలా ఉంటే మృతుడు సత్యనారాయణ రెండేళ్లుగా బట్టీలో పనిచేస్తున్నాడు. సత్యనారాయణ భార్య మరియమ్మతో కలిసి బట్టీలో పనిచేసుకుంటుండగా, కుమారుడు, కుమార్తె వారి స్వగ్రామంలో నివసిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎస్సై వెలుగుల సురేష్ సంఘటనా స్థలికి వచ్చి ప్రమాద ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేష్ తెలిపారు. దేవుడా ఎంతపనిచేశావు.. సరుకులు తెస్తానని చెప్పిన నా భర్తను నీ దగ్గరకే తీసుకుని పోయావా..దేవుడా ఎంత పని చేశావంటూ మృతుడు భార్య మరియమ్మ బోరున విలపించింది. బయటకు వెళ్లక పోయినా ప్రాణాలు దక్కి ఉండేవని, ఎంతపని జరిగిందంటూ రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. -
బల్దియాలో ‘స్వచ్ఛతా పక్షం’
► ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికులది కీలక బాధ్యత ► వేతనాల పెంపు, డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరుకు కృషి ► ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ► కార్మికులు, ఉద్యోగులతో స్వచ్ఛతా ప్రతిజ్ఞ ► ఉత్తమ కార్మికులకు ప్రశంసపత్రాలు కోల్‌సిటీ: రామగుండం బల్దియాలో ‘స్వచ్ఛతా పక్షం’ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ఉత్తమ అవార్డులు ప్రదానం చేశారు. సహపంక్తి భోజనాల కార్యక్రమాన్ని నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణతో కలిసి ఆర్టీసీ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవడంతోపాటు అందరితో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ చైర్మన్ మాట్లాడారు. నగర ప్రజల ఆరోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. హైదరాబాద్‌లో మాదిరిగా రామగుండం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని, వేతనాలు పెంచాలని ముఖ్యమంత్రిని కోరుతానని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా మంది ఉద్యోగులకు వేతనాలు పెరిగాయని, మున్సిపల్ కార్మికుల వేతనాలు కూడా పెంచాలని ప్రభుత్వం యోచిస్తుందన్నారు. కనీస వేతనాల పెంపుదల కోసం మంత్రిత్వ స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయన్నారు. కార్మికుల సంక్షేమం కోసం త్వరలో రామగుండంలో వంద పడకల ఈఎస్ఐ ఆస్పత్రి ప్రారంభమవుతుందని తెలిపారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, 24 గంటల మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలను 15 ఏళ్ల క్రితమే తాను రామగుండం మున్సిపల్ చైర్మన్‌గా ఉన్న కాలంలో ప్రవేశపెట్టి విజయవంతం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం వెనుక మున్సిపల్ కార్మికుల విశేష కృషి ఉందన్నారు. రామగుండం ప్రాంతాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఆర్‌ఏవై స్కీం ద్వారా మురికివాడలను తొలగించి అందమైన భవనలుగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తే, కొందరు నాయకులు ప్రజలను తప్పుదోవపట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల వ్యతిరేకతతో ఈ ప్రక్రియ కార్యరూపం దాల్చలేదన్నారు. రీకన్స్ట్రక్షన్ చేయనిదే ముఖ్యమంత్రి మరో రూ.400 కోట్లు మంజూరు చేసినా రామగుండం అభివృద్ధికి నోచుకోదని స్పష్టం చేశారు. తొలిసారి పండగలా... మేడే పర్వదినాన్ని తొలిసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలాగా నిర్వహించడం సంతోషంగా ఉందని నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ అన్నారు. మున్సిపల్ కార్మికులకు గతంలో రెండుమూడు నెలలకొకసారి వేతనాలు ఇచ్చేవారని, తమ పాలకవర్గం వచ్చిన తర్వాత ప్రతీనెల జీతాలు చెల్లిస్తున్నామన్నారు. గతంలో కార్మికులు సమ్మె చేస్తే తాము రూ.వెయ్యి పెంచి ఇవ్వడానికి ముందుకు వచ్చామన్నారు. పరిశుభ్రతలో రాష్ట్రంలో నంబర్ వన్‌గా ఎదిగిన స్థానిక కార్మికులకు కూడా రాష్ట్రస్థాయిలో గుర్తింపు రావాలనేది తన ఆకాంక్ష అన్నారు. పాలకవర్గం ఏర్పడిన తర్వాత రామగుండంను స్వచ్ఛ రామగుండంగా మార్చడానికి ట్రై సైకిళ్లు, కొత్త వాహనాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. ఇంటింటా చెత్తను తడి, పొడిగా విభజించడంలో అవగాహన కల్పించడం కోసం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఉత్తమ కార్మికులకు ప్రశంసాపత్రాలు... ఉత్తమ సేవలందించిన కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, నగర మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ చేతుల మీదుగా శాలువాలు కప్పి ప్రశంసపత్రంతోపాటు బహుమతులు అందజేశారు. అనంతరం మున్సిపల్ వర్కర్లతో కలిసి భోజనం చేశారు. తెలగాణ సాంస్కృతిక సారథి బృందం ఆలపించిన మేడే గీతాలు అలరించాయి. కార్యక్రమంలో డెప్యూటీ మేయర్ సాగంటి శంకర్, కమిషనర్ జాన్‌శ్యాంసన్, ఫ్లోర్ లీడర్లు నారాయణదాసు మారుతి, మహంకాళి స్వామి, డెప్యూటీ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, కార్పొరేటర్లు దాసరి ఉమాదేవి, కోదాటి తిరుపతి, షేక్ బాబుమియా, వడ్లూరి రవి, దొంతుల లింగం, మేరుగు నరేశ్, జనగామ నర్సయ్య, కత్తెరమల్ల సుజాత, పీచర శ్రీనివాసరావు, బాలసాని స్వప్న, కో–ఆప్షన్ సభ్యులు జంగపల్లి సరోజన, తస్నీమ్ భాను, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు యాకయ్య, మురళీధర్‌రావు, నాయకులు సోమారపు అరుణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను ప్రగతి పథంలో నడిపిద్దాం
బాధ్యతలు చేపట్టిన కొత్త కలెక్టర్ - కుటుంబ పెద్దగా వ్యవహరిస్తానని స్పష్టం - సూచనలు, సలహాలు అందజేయాలని పిలుపు - అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉపాధి హామీ పథకం - శాఖల వారీగా అధికారులతో సమీక్ష కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా నూతన కలెక్టర్‌గా ఎస్.సత్యనారాయణ శనివారం సాయంత్రం 4.41 గంటలకు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురోహితులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. పట్టు వస్త్రం, పూలమాల, పండ్లు సమర్పించారు. బదిలీ అయిన కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ 1997లో పెద్దాపురం ఆర్డీఓగా పనిచేసి జూన్ 22న బదిలీపై వెళ్తూ ప్రస్తుత కలెక్టర్ అయిన ఎస్.సత్యనారాయణకు ఆర్డీఓగా బాధ్యతలు అప్పగించారు. యాదృశ్చికంగా ఇప్పుడు కూడా సీహెచ్ విజయమోహన్ నుంచే కలెక్టర్‌గా సత్యనారాయణ చార్జి తీసుకోవడం విశేషం. కొత్త కలెక్టర్‌ను బదిలీ అయిన కలెక్టర్ విజయమోహన్ అభినందించారు. బాధ్యతలు తీసుకున్న కలెక్టర్‌ను దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్లు బొకేలు సమర్పించి అభినందనలు తెలిపారు. అనంతరం కలెక్టర్ విలేకర్లతో మాట్లాడుతూ.. చారిత్రక గుర్తింపు పొందిన జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. గతంలో చేపట్టిన మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూ జిల్లాను మరింత ప్రగతి పథంలోకి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వం, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులను పరిగణలోకి తీసుకొని ప్రాధాన్యత అంశాలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. గతంలో చేపట్టిన ఫాంపాండ్స్ తవ్వకాలతో పాటు సాగునీరు, విద్య, వైద్యం తదితరాలకు ప్రాధాన్యతనిస్తామన్నారు. జిల్లా అభివృద్ధిలో మీడియా కూడా సహకరించాలని కోరారు. తిట్టడం నా స్వభావం కాదు.. కటుంబ పెద్దగా వ్యవహరిస్తా: కలెక్టర్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. తనను తాను పరిచయం చేసుకున్నారు. ‘‘తిట్టడం నా స్వభావం కాదు.. నేను సుపీరియర్, మీరు సబార్డినేట్స్ అనే భావన ఉండదు. అభివృద్ధి ఒక్కరితో సాద్యం కాదు. అందరం టీమ్‌గా పనిచేసి జిల్లాను అభివృద్ధిలో మొదటి స్థానానికి తీసుకెళ్దాం.’’ అని కలెక్టర్ పిలుపు నిచ్చారు. నేను కుటుంబ పెద్దగా వ్యవహరిస్తా.. జిల్లా అభివృద్ధిలో ఏవైనా ఐడియాలు, సూచనలు ఉంటే నా దృష్టికి తీసురండి.. వాటిపై చర్చించి తగిన నిర్ణయం తీసుకుందామని కలెక్టర్ పేర్కొన్నారు. జాతీయ గ్రామీణ ఉఫాధి హామీ పథకాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా అమలు చేద్దామని, తర్వాత నీటిపారుదల, ఫాంపాండ్స్, రెవెన్యూ, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, విద్య, వైద్యం తదితరాలకు ప్రాధాన్యతనిద్దామని అన్నారు. శాఖల వారీగా గ్యాప్‌లను గుర్తించిన కలెక్టర్ అన్ని శాఖల అధికారులు పరిచయం చేసుకుంటూ తామ శాఖల్లోని ప్రాధాన్యత అంశాలను కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల్లోని గ్యాప్‌లను గుర్తించారు. గ్యాప్‌లు లేకుండా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఎన్ఆర్ఈజీఎస్లో గ్యాప్‌లు ఉన్నాయని వీటిని సరిచేసుకోవాలని వివరించారు. ఎన్ఆర్ఇజీఎస్లో కర్నూలు జిల్లా రాష్ట్రంలో ఎన్నో స్థానంలో ఉందని పీడీని ప్రశ్నించారు. ప్రస్తుతం 6వ స్థానంలో ఉందని పీడీ తెలుపగా మొదటి స్థానానికి తీసుకరావడానికి కృషి చేయాలని తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, పరిశ్రమలు, అంగన్వాడీ కేంద్రాలు తదితరాలకు ఉన్న భూసేకరణ సమస్యలను సత్వరం పరిష్కరిస్తామన్నారు. రూ.500, 1000 నోట్ల రద్దు నేపథ్యంలో జిల్లాలో ఉన్న నగదు కొరత, పింఛన్ల పంపిణీ తదితరాలను సమీక్షించారు. ఉద్యాన ప్రగతిని తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ గంగాధర్‌గౌడు, సీపీఓ ఆనంద్‌నాయక్, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డ్వామా పీడీ పుల్లారెడ్డి, డీఆర్డీఏ పీడీ రామకృష్ణ, శ్రీశైలం ప్రాజెక్టు ప్రత్యేక కలెక్టర్ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డీఓలు హుసేన్‌సాహెబ్, ఓబులేసు, రాంసుందర్‌రెడ్డి, డిప్యూటి కల్టెకర్లు తిప్పేనాయక్, మల్లికార్జున ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.