
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కల్పించే సౌకర్యాలు, సేవలపై ప్రయాణికులకు అవగాహన కల్పించినప్పుడే సంస్థకు మరింత ఆదరణ లభిస్తుందని ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. శనివారం టీఎస్‌ఆర్టీసీ పరిపుష్టి కోసం ఏర్పాటైన నిపుణుల అధ్యయన కమిటీతో బస్‌భవన్‌లో సమావేశమయ్యారు.
క్షేత్ర స్థాయిలోని సమస్యలను చర్చించి కమిటీకి వివరించాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రయాణికులకు ఆర్టీసీ పట్ల ఉన్న నమ్మకాన్ని నిలుపుకోవడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటా మన్నారు. సమావేశంలో సంస్థ కార్యదర్శి పురుషోత్తం, కమిటీ సభ్యులు నాగరాజుయాదవ్, నర కేసరి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment