నల్గొండ: భవిష్యత్లో చిన్నారి అంజలికి ఇబ్బందులు రాకుండా చూస్తామని నల్గొండ జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం నల్గొండలో సాక్షి మీడియాతో కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ... చట్టపరంగా కాటన్ మిల్లు యాజమాన్యం నుంచి రావాల్సిన నగదు అంజలికి ఇప్పిస్తామని వెల్లడించారు. చిన్నారి అంజలి చూపిన ధైర్యసాహసాలు ఎంతోమందికి ఆదర్శమన్నారు. చిన్నారి అంజలి అంశాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన సాక్షికి ఈ సందర్భంగా ఇంఛార్జ్ కలెక్టర్ సత్యనారాయణ అభినందనలు తెలిపారు.