
సాక్షి, నల్గొండ జిల్లా: జిల్లాలో 134 మంది పంచాయతీ సెక్రటరీలకు ప్రభుత్వం.. ఛార్జ్ మెమోలు జారీ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా సెలవులు పెట్టిన వారికి ఉన్నతాధికారులు మెమోలు జారీ చేశారు. ఒక్కొక్కరు మూడు నుంచి తొమ్మిది నెలల వరకు ఎలాంటి అనుమతి లేకుండా సెలవులు పెట్టారు. కనీస సమాచారం లేకుండా ఇష్టారీతిన వ్యవహరించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రమశిక్షణ పాటించని పంచాయతీ సెక్రటరీలకు సర్వీస్‌ను బ్రేక్ చేస్తూ ఇటీవల కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు.
డిసెంబర్ నెలలో కూడా క్రమశిక్షణ పాటించని పంచాయతీ సెక్రటరీలకు కలెక్టర్ ఛార్జ్ మెమోలు జారీ చేశారు. మరోసారి మెమోలు ఇవ్వడంతో సెక్రటరీలు ఆందోళనలో పడ్డారు. క్షేత్రస్థాయిలో పలువురు పంచాయతీ సెక్రటరీల తీరు తీవ్ర వివాదాస్పదమైంది. ఇటీవలే ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సాగర్ నియోజకవర్గంలో కొందరు పంచాయతీ సెక్రటరీలు.. క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. క్రమ శిక్షణ పాటించని వారిపై ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment