'హోంమంత్రి బంధువు వేధిస్తున్నాడు' | Minister Relativ threatening : call money victim | Sakshi
Sakshi News home page

'హోంమంత్రి బంధువు వేధిస్తున్నాడు'

Published Sat, Dec 19 2015 11:46 AM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM

'హోంమంత్రి బంధువు వేధిస్తున్నాడు' - Sakshi

'హోంమంత్రి బంధువు వేధిస్తున్నాడు'

కాల్‌మనీ కేసులో హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప బంధువులు వేధిస్తున్నారని ఓ భాధితుడు శనివారం ఏలూరు డీఐజీకి ఫిర్యాదు చేశారు.  పశ్చిమ గోదావరి జిల్లా ఉప్పల గుప్తం మండలం చల్లపల్లి గ్రామానికి చెందిన నడింపల్లి వెంకట కృష్ణరాజు హోంమంత్రి బంధువు నిమ్మకాయల సత్యనారాయణ వద్ద  25 లక్షల అప్పు తీసుకున్నారు.

అప్పు తీర్చేసినా డాక్యుమెంట్లు ఇవ్వకుండా 12 ఎకరాల భూమిని జీపీ చేయించుకుని అక్రమంగా బదలాయించుకున్నారని బాధితుడు ఫిర్యాదు చేశారు. అప్పు తీర్చేశాం కాబట్టి తమ డాక్యుమెంట్లు ఇవ్వాలని కోరగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని.. తమ భూమిని తిరిగి ఇప్పించాలని ఆయన డీఐజీ ని కోరారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement