nimmakayala chinarajappa
-
టీడీపీ సీనియర్లకు షాకిచ్చిన చంద్రబాబు
ఈసారి తెలుగుదేశం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన సీనియర్లకు అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న సీనియర్లందరికీ చంద్రబాబు మొండి చెయ్యి చూపించారు. కాకినాడ జిల్లాలో ఇద్దరు నేతలు పదవులపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని కూటమి నుంచి గెలిచి మంత్రి పదవి తీసుకున్న ఆ నేత వల్ల వీరిద్దరి ఆశలకు గండి పడింది. ఇక పదవులు వస్తాయన్న నమ్మకమే లేకుండా పోయిందట వారిద్దరికీ. ఇంతకీ ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు?కాకినాడ జిల్లాలో మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలు తెలుగుదేశం పార్టీలో పరిచయం అక్కర్లేని నాయకలు. 2014లో పెద్దాపురం నియోజకవర్గం నుండి మొదటిసారి గెలిచిన చినరాజప్ప డిప్యూటీ సిఎం హోదాలో హోం మంత్రిగా పని చేశారు. ఇక జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు..ఆ తర్వాత టీడీపీలో చేరిపోయారు. తాజా ఎన్నికల్లో రాజప్ప..నెహ్రూ మరోసారి గెలిచి.. టీడీపీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన తరపున ఆ పార్టీ అధినేత పిఠాపురంలో పోటీ చేసి విజయం సాధించారు. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో రాజప్ప, నెహ్రూ ఆశలకు గండి పడింది.పవన్‌కల్యాణ్.. నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూలది ఒకే సామాజికవర్గం కావడంతో.. సామాజిక సమీకరణాలతో చంద్రబాబు వీరిద్దరని దూరం పెట్టారు. అనేక మంది సీనియర్లతో పాటే వీరిద్దరికి కూడా పదవులు దక్కలేదు. అందుకే ఇద్దిరికీ నిరాశ ఎదురైంది. జ్యోతుల నెహ్రూకు మంత్రి కావాలని ఎప్పటి నుండో ఉన్న ఓకోరిక. అయితే జిల్లా టీడీపీని తన చేతుల్లో ఉంచుకున్న యనమల రామకృష్ణుడుతో ఉన్న రాజకీయ వైరం కారణంగా జ్యోతుల నెహ్రూ కల సాకారం కాలేదు. కనీసం ఈ ఎన్నికల్లో అయినా తన కల సాకారం అవుతుందని ఆయన భావించారు. కాని పవన్ కళ్యాణ్ రూపంలో మరోసారి జ్యోతుల మంత్రి పదవి కల.. కలగానే మిగిలిపోయింది.ఈ ఎన్నికల్లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన పది మందికి చంద్రబాబు మంత్రి పదవులు ఇచ్చారు. వీరితో పాటు రెండు మూడు సార్లు గెలిచిన మరో ఏడుగురికి కూడా తొలిసారి క్యాబినెట్ బెర్త్‌లు దక్కాయి. మరి కాకినాడ జిల్లాలోని జ్యోతుల నెహ్రూ కల ఎప్పటికైనా తీరుతుందా అనే చర్చ జరుగుతోంది. -
పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
తూర్పు గోదావరి: అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారాలు నిర్వహిస్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి రోజురోజుకూ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన నాయకులు వరుస రాజీనామాలు చేయడం, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండడం వంటి పరిస్థితులు నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ఒకపక్క 2009 ఎన్నికల నుంచి టీడీపీ టిక్కెట్ ఆశించి నిరాశ చెందిన పరమట శ్యామ్‌కుమార్‌కు ఈ సారీ టిక్కెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో స్వతంత్ర (రెబల్) అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇదే క్రమంలో నియోజకవర్గ టీడీపీలో కీలక నాయకుడిగా ఉన్న మండలానికి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సోదరుడు నిమ్మకాయల జగ్గయ్యనాయుడు తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని ప్రకటన చేయడం టీడీపీలో ప్రకంపనలు సృష్టించింది. జగ్గయ్యనాయుడు దూరంగా ఉంటానన్న ప్రకటన వెనుక నియోజకవర్గంలో చోటుచేసుకున్న తాజా పరిమాణాలే కారణమని సమాచారం. పరమట శ్యామ్‌కుమార్ రెబల్‌గా పోటీ చేయడంపై తెర వెనుక తన అన్నయ్యతో పాటు తన ప్రమేయం ఉందన్న గుసగుసలు జగ్గయ్యనాయుడిని కొంచెం బా«ధించాయి. టీడీపీలో జరుగుతున్న ఈ అనూహ్య పరిణామాలతో తనకు సంబంధం లేదన్న బాధతో రాజకీయాలకు దూరమయ్యారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ తన సోదరుడు చినరాజప్పతోనూ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి ఆనందరావుతోనూ ఎడమోహం పెడమోహంతో ఉంటున్న జగ్గయ్యనాయుడు పొమ్మనకుండానే పొగ పెడుతున్నట్టు ముందుగానే గుర్తించి రాజకీయాలకు దూరంగా ఉంటున్నానన్న మాటతో పరోక్షంగా టీడీపీకి దూరమవుతున్న సంకేతాలను తెలియజేశారు. ఇటీవల అల్లవరం మండలానికి చెందిన టీడీపీ కీలక నాయకుడు అడపా కృష్ణ పారీ్టకి రాజీనామా చేసి రెబల్ అభ్యర్థి పరమట శ్యామ్‌కుమార్ పక్కన చేరడం ఆ పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. ఇలా వరుస ప్రతికూల ప్రకటనలతో టీడీపీ అభ్యర్థి ఆనందరావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పెద్దాపురంలో వేడెక్కిన రాజకీయం.. లైడిటెక్టివ్ పరీక్షకు సిద్ధమన్న దవులూరి
సాక్షి, కాకినాడ జిల్లా: పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామేశ్వరం మెట్ట, ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన దొరబాబు.. గ్రావెల్ తరలింపు వ్యవహారంలో నిజాయితీని నిరూపించుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో ట్రూత్ ల్యాబ్ అనుమతి తీసుకొని.. సంతకం చేసిన బాండ్ పేపర్లతో లైడిటెక్టర్ పరీక్షల కోసం మున్సిపల్ సెంటర్‌కు బయలుదేరారు. లైడికెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని చినరాజస్పకూ దవలూరి సవాల్ విసిరారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పిఠాపురంలోని వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. దవులూరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్దపురం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. -
చినరాజప్ప ప్రధాన అనుచరుడు పల్లంరాజు అరెస్టు
సాక్షి, అమరావతి/అమలాపురం టౌన్: అమలాపురంలో విధ్వంసం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ప్రభుత్వ ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే నివాసాలపై దాడులకు కీలక పాత్రధారిగా వ్యవహరించిన అమలాపురానికి చెందిన మాజీ రౌడీషీటర్, టీడీపీ నేత గంధం పల్లంరాజు, మరో ఇద్దరు రౌడీషీటర్లు గంప అనిల్, యాళ్ల నాగులతోపాటు 18 మందిని సోమవారం అరెస్టు చేశారు. వారిలో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టి దాడులకు పురిగొల్పిన వారు కూడా ఉన్నారు. దాంతో ఈ కేసులో ఇప్పటివరకు 129 మందిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అరెస్టు చేసిన 18 మంది నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండు కోసం జైలుకు తరలించినట్టు కోనసీమ జిల్లా ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ పాత్ర బట్టబయలు గంధం పల్లంరాజు అరెస్టుతో ఈ కుట్ర కేసులో టీడీపీ పాత్ర మరోసారి బట్టబయలైంది. అతను టీడీపీ ప్రభుత్వంలో హోంమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ప్రధాన అనుచరుడు కావడం గమనార్హం. అతనిపై అమలాపురం, పరిసర ప్రాంతాల్లో పలు కేసులతో పాటు రౌడీషీట్ కూడా ఉండేది. గంధం పల్లంరాజుపై అమలాపురం స్టేషన్లో ఉన్న రౌడీ షీట్‌ను చినరాజప్ప హోంమంత్రిగా ఉన్న సమయంలోనే ఎత్తివేయడం గమనార్హం. గతంలో ఇసుక మాఫియా నడిపిన అతను అనంతరం రియల్టర్‌గా రూపాంతరం చెందాడు. అమలాపురంలో గత నెల 24న చలో కలెక్టరేట్ ర్యాలీ సందర్భంగా అల్లర్లకు పన్నాగం వెనుక అతను క్రియాశీలకంగా వ్యవహరించాడు. రౌడీషీటర్లను అమలాపురం వీధుల్లో మాటువేసేలా చేయడంతోపాటు వారంతా ఒకేసారి ర్యాలీలోకి ప్రవేశించేలా స్కెచ్‌ను అమలు చేశాడు. అతనికి అమలాపురానికే చెందిన గంప అనిల్, కొత్తపేట మండలం మోడేకుర్రుకు చెందిన యాళ్ల నాగులు సహకరించారు. వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా కుట్ర నడిపించారు.. వాట్సాప్ గ్రూపులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మరీ విద్వేషాలు రెచ్చగొట్టడం, వాట్సాప్ గ్రూపుల ద్వారానే పోలీసుల కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం అందించడం, ఏ సమయంలో దాడులకు పాల్పడాలో ఇలా మొత్తం కుట్రను పక్కాగా నడిపించారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు వాట్సాప్ సందేశాలు, కాల్ డేటా, సీసీ టీవీ ఫుటేజీలను విశ్లేషించి పూర్తి ఆధారాలను సేకరించారు. కాగా, ఈ కేసులో కుట్రదారులు, పాత్రధారులు మరికొందరి పాత్రపై పోలీసులు ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. వారిని కూడా త్వరలో అరెస్టు చేసే అవకాశాలున్నాయి. మరోవైపు అమలాపురంతోపాటు కోనసీమ అంతటా 144 సెక్షన్, పోలీసు సెక్షన్ 30లను పోలీసులు కొనసాగిస్తున్నారు. -
టీడీపీలో రచ్చకెక్కిన విభేదాలు..
అధికారంలో ఉన్నప్పుడు సామ్రాజ్యాలను విస్తరించుకుపోయారు తెలుగు తమ్ముళ్లు. అప్పుడు ఒకరంటే ఒకరికి పడకున్నా చేతిలో పవర్ ఉండటంతో కిమ్మనకుండా ఉన్నారు. తీరా గత సార్వత్రిక ఎన్నికల్లో చావుదెబ్బ తిని, అధికారానికి దూరమయ్యేసరికి వారి మధ్య ఉన్న విభేదాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఎన్నికలకు వెళ్లడమంటే డబ్బుతో కూడుకున్న పని. అందుకు ముఖం చాటేస్తున్న నేతలు ఆ నిందను ఒకరిపై మరొకరు నెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడేళ్ల తరువాత జరిగే రాజకీయ పరిణామాలకు ఇప్పటి నుంచే వ్యూహాల కత్తులకు పదును పెడుతున్నారు. సాక్షి ప్రతినిధి,రాజమహేంద్రవరం: జిల్లా టీడీపీ నేతల మధ్య చాప కింద నీరులా ఎప్పటి నుంచో ఉన్న విభేదాలు.. ప్రస్తుత పంచాయతీ పోరు పుణ్యమా అని రచ్చకెక్కాయి. ఆ పార్టీ పదవులకు, కాకినాడ రూరల్ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలకు మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త, పార్టీ సీనియర్ నాయకుడు వీర వెంకట సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) శుక్రవారం గుడ్‌బై చెప్పారు. మీడియా ముందు రాజీనామా ప్రకటన వేళ మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి కంట తడి పెట్టారు. తమ రాజీనామాలకు మాజీ హోం మంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కారణమని సత్తిబాబు ఆరోపించారు. (చదవండి: టీడీపీ పదవులకు మాజీ ఎమ్మెల్యే దంపతుల రాజీనామా) అయితే సత్తిబాబు దంపతుల మీడియా సమావేశం జరిగిన గంటల వ్యవధిలోనే చినరాజప్ప మాట్లాడుతూ, ఇందులో తన ప్రమేయం ఎంతమాత్రం లేదని అన్నారు. ఏడాది కాలంగా అనంతలక్ష్మి దంపతులు పార్టీ బాధ్యతల నుంచి వైదొలగుతామంటూ చెబుతూ వచ్చి, ఇప్పుడు హఠాత్తుగా తనపై నింద వేస్తున్నారని అన్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, బరువు మోయాల్సిన సమయంలో సత్తిబాబు కాడి వదిలేస్తున్నారని వైరి వర్గం ఆరోపిస్తోంది. ఈ వివాదానికి ఇరుపక్షాల నుంచి వినిపిస్తున్న వాదనలు వాస్తవాలకు చాలా దూరంగా ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. ఈ పచ్చ రచ్చకు అసలు కారణాలు వేరే ఉన్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. (చదవండి: చిత్తూరు జిల్లాలో టీడీపీ హైడ్రామా) భాస్కర రామారావును తీసుకువచ్చేందుకు.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావును పార్టీలోకి క్రియాశీలకంగా తీసుకు రావాలనేది సత్తిబాబు వ్యూహం. పార్టీ ఆవిర్భావం నుంచి సత్తిబాబుకు భాస్కర రామారావు ప్రధాన అనుచరుడనే ముద్ర ఉంది. తాను త్యాగం చేసిన కాకినాడ రూరల్ స్థానానికి భాస్కర రామారావును తీసుకువచ్చి, చినరాజప్ప భవిష్యత్తు వ్యూహానికి చెక్ పెట్టాలనేది సత్తిబాబు ఎత్తుగడగా ఉంది. ఎక్కడో కోనసీమ నుంచి వచ్చి, రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసి, తమ నియోజకవర్గంలో వేలు పెడితే తమ వ్యూహం తమకు ఉండదా అని సత్తిబాబు వర్గం ప్రశి్నస్తోంది. ఆర్థిక స్తోమతతో దూకుడుగా వ్యవహరించే భాస్కర రామారావును కాకినాడ రూరల్‌కు తీసుకువస్తే పార్టీ శ్రేణులకు ధైర్యం కల్పించినట్టవుతుందని సత్తిబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ విషయాన్ని ఇటీవల ఆయన వద్ద ప్రతిపాదించారు. ఈ విషయాన్ని సత్తిబాబే స్వయంగా మీడియాకు చెప్పడం గమనార్హం. అయితే భాస్కర రామారావును తీసుకు రావాలనుకుంటే అభ్యంతరం చెప్పాల్సిన అవసరం తమకు ఎంతమాత్రం లేదని చినరాజప్ప వర్గం పేర్కొంటోంది. భాస్కర రామారావును తీసుకురావాలనే సత్తిబాబు వ్యూహం బయటకు పొక్కడంతో తప్పు తమ నాయకుడిపై నెట్టేందుకు ప్రయతి్నస్తున్నారని చినరాజప్ప వర్గీయులు అంటున్నారు. అధికారం ఉన్నప్పుడు అనుభవించి, పవర్ పోయేసరికి పార్టీని వదిలేసిన విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లడం తప్పేమిటని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత ఎంపీటీసీ ఎన్నికల నుంచి నేటి పంచాయతీ ఎన్నికల వరకూ నియోజకవర్గ ఇన్చార్జిగా సత్తిబాబు అభ్యర్థులను నిలబెట్టకుండా పార్టీని నిరీ్వర్యం చేయడం వాస్తవం కాదా అని రాజప్ప వర్గీయులు ప్రశి్నస్తున్నారు. ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి ఎటు పయనిస్తుందో వేచి చూడాల్సిందే. ఈలోగా మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఇరు వర్గాల మధ్య రాజీకి ప్రయత్నాలు చేస్తున్నారు. మా కుటుంబంపై మీకేమైనా గౌరవం ఉంటే, మాజీ శాసన సభ్యురాలిగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారనే ఉద్దేశం ఉంటే నేను, నా భార్య అనంతలక్ష్మి చనిపోయిన తరువాత తెలుగుదేశం జెండా కప్పి శ్మశానానికి తీసుకువెళ్లండి. మీతో అభిప్రాయ భేదాలు కాదు.. నేను మనస్తాపం చెందాను. నా కుటుంబం ఇబ్బంది పాలయింది. నా కుర్రాళ్లు ‘తిరం’ కాదు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను. అర్హత ఉన్న వారిని పెట్టుకోమని చెబుతున్నాను. సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు ఇబ్బందులు వచ్చాయి. నెల కిత్రం చంద్రబాబుతో జూమ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాను. ఆయన సమస్య రెక్టిఫై చేస్తానన్నారు. కానీ రానురానూ జిల్లా పార్టీ యంత్రాంగంలో నాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొంతమంది నాయకులకు నేనంటే ఇష్టం లేదు. ఇష్టం ఉన్న నాయకుడిని పెట్టుకోండి. నాకు ఇబ్బంది లేదు. బొడ్డు భాస్కర రామారావు వద్దకు వెళ్లి, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పోటీ చేయాలని, నీ వద్ద ఉన్న డబ్బు, సత్తా, ఎప్పియరెన్స్కు కచ్చితంగా నెగ్గుతావని అన్నాను. చినరాజప్ప తదితరులతో మనస్పర్థలున్నాయి. బొడ్డు భాస్కర రామారావును రమ్మనడం వలన ఇబ్బందులు పెడుతున్నారేమో అర్థం కాలేదు. – పిల్లి వీర వెంకట సత్యనారాయణమూర్తి రూరల్‌పై రాజప్ప కన్ను వేయడమే కారణమా! టీడీపీలో రగిలిన ఈ రచ్చకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కేంద్ర బిందువనే చర్చ నడుస్తోంది. రెండుసార్లుగా పెద్దాపురం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చినరాజప్ప వచ్చే ఎన్నికలకు కాకినాడ రూరల్‌పై కన్ను వేశారనే ప్రచారం చాలా కాలంగా ఉంది. వాస్తవానికి గత సార్వత్రిక ఎన్నికల్లో చినరాజప్ప కాకినాడ రూరల్ నుంచి పోటీకి దిగుతారని అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో చినరాజప్పను పెద్దాపురం నుంచే రెండోసారి బరిలోకి దింపారు. పెద్దాపురంలో పార్టీ శ్రేణులు చెల్లాచెదురై ఆదరణ తగ్గిపోవడంతో మూడేళ్లు ముందే కొత్త స్థానం కోసం చినరాజప్ప వెతుకులాడుతున్నారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో తాను ఆశించిన కాకినాడ రూరల్ నియోజకవర్గంపై ఆయన కన్ను వేశారని అంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి కాకినాడ రూరల్‌లో లైన్ క్లియర్ చేసుకునే లక్ష్యంతోనే చినరాజప్ప ఆ నియోజకవర్గ ఇన్చార్జి సత్తిబాబు దంపతులపై ఏడాది కాలంగా అధిష్టానానికి వ్యూహాత్మకంగా తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో పార్టీని నిర్వీర్యం చేశారని చినరాజప్ప పార్టీ అధినేత చంద్రబాబుకు పదేపదే ఫిర్యాదులు చేస్తూ, తమను తక్కువ చేస్తున్నారని సత్తిబాబు వర్గీయులు మండిపడుతున్నారు. అనంతలక్ష్మి దంపతులను కాకినాడ రూరల్ నుంచి పొమ్మనకుండానే పొగ పెట్టేందుకే రాజప్ప ఈవిధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. రాజకీయ వేధింపులకు తోడు ఇటీవల కుటుంబ పరంగా ఎదురైన ఇబ్బందుల నేపథ్యంలోనే పార్టీ పదవులు, ఇన్చార్జి బాధ్యతల నుంచి వైదొలగాల్సి వస్తోందని సత్తిబాబు చెబుతున్నారు. ఆ ప్రకటన బాధాకరం.. మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, పిల్లి సత్యనారాయణమూర్తి నా కారణంగా బయటకు వెళ్తున్నట్టు శుక్రవారం విలేకర్ల సమావేశంలో చెప్పారు. వీరిద్దరూ గత ఏడాది కాలంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. అనంతరం చంద్రబాబు, యనమల రామకృష్ణుడితో పాటు నా వద్దకు కూడా వచ్చి తాను ఇన్చార్జ్గా ఉండలేనని చెప్పారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులను పెట్టాలని రామకృష్ణుడు చెప్పారు. ఆవిధంగానే గ్రామాల్లో అభ్యర్థులను ఏర్పాటు చేశారు. ప్రచారం నిర్వహించారు. ఇప్పుడు నా కారణంగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం బాధాకరం. నేను పార్టీ కోసం పని చేస్తాను. పార్టీకి నష్టం కలిగించే పని చేయను. – నిమ్మకాయల రాజప్ప, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్యే, పెద్దాపురం -
తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు..
టీడీపీకి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఒకరైతే పెత్తనం మరొకరిది. దీంతో ఆ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయి ఆధిపత్యపోరుతో సతమతమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవి వెలగబెట్టడంతో సరేలే అని సర్దుకుపోయిన వారు ఇప్పుడు తిరుగుబాటను ఎంచుకున్నారు. ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న పోరు మంగళవారం ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన వెబినార్లోబహిరంగ ఫిర్యాదులకు దిగడం... మాటల తూటాలు పేల్చడంతో విభేదాలు బట్టబయలయ్యాయి. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ‘చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టుగా ఉంది జిల్లా తెలుగుదేశం పార్టీ పరిస్థితి. గత సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన ఆ పార్టీకి జిల్లాలో దిశానిర్దేశకత్వం కొరవడింది. పార్టీ అధినేత చంద్రబాబు సైతం వయోభారంతో పార్టీపైన, నేతలపైన పట్టు కోల్పోతున్నారనే భావన పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఇది వరకు ఆయన సమక్షంలో జరిగే పార్టీ సమావేశాల్లో పెదవి విప్పని నేతలు కూడా ఇప్పుడు తరచు జిల్లా నాయకత్వ తీరును దుయ్యబడుతున్నారు. మాజీ సీఎం చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలతో జూమ్‌లో వెబినార్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నేతల మధ్య నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు చంద్రబాబు సాక్షిగా బట్టబయలవడంతో పార్టీ వర్గాలకు మింగుడుపటం లేదు. ప్రధానంగా పార్టీ జిల్లా నాయకత్వంపై దాదాపు నేతలంతా గుర్రుగా ఉన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడుగా జెడ్పీ మాజీ చైర్మన్ (పదవీ కాలం పూర్తికాకుండానే అర్ధాంతరంగా మధ్యలోనే దింపేసిన)నామన రాంబాబును అధ్యక్ష స్థానానికే పరిమితం చేసేశారని పలువురు నేతలు చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారు. నామనను నామ్కేవాస్తే అధ్యక్షుడిగా చేసి సర్వం తానే అన్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప వ్యవహరిస్తున్నారని కొందరు నేతలు తీవ్రంగా తప్పుపట్టారని తెలియవచ్చింది. చినరాజప్ప పార్టీకి షాడో అధ్యక్షుడిగా తయారవడంతో తమ బోటి నాయకులకు విలువ లేకుండా పోయిందని సీనియర్లు బాబు దృష్టికి తీసుకువెళ్లారని తెలియవచ్చింది. ఆ పార్టీ అనపర్తి నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే ఒక అడుగు ముందుకేసి చినరాజప్పపై చంద్రబాబుకు నేరుగా పలు ఫిర్యాదులు చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆధిపత్యపోరుతో విసుగు కోవిడ్–19తో జిల్లా ప్రజలు అతలాకుతలమవుతుంటే తెలుగు తమ్ముళ్లు ఆధిపత్య పోరు కోసం వెంపర్లాడటం విస్మయాన్ని కలిగిస్తోంది. కరోనా కష్ట కాలంలో ప్రజలకు అండగా నిలవాల్సిన పార్టీ నాయకత్వం నుంచి కనీసం స్పందన లేకపోగా జిల్లా నాయకత్వం కోసం ఆధిపత్య పోరుకు తెరతీయడాన్ని విజ్ఞులు తప్పుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో చావుతప్పి కన్నులొట్ట బోయిన చందాన కేవలం నాలుగు సీట్లకే పరిమితమైనా ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవాలనే ధ్యాస ఆ పార్టీ నాయకులకు లేకుండా పోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇదే విషయాన్ని పలువురు సీనియర్లు చంద్రబాబు ముఖంమీదనే కుండబద్దలు కొట్టారని తెలిసింది. ఫిరాయింపు నేత జ్యోతులకు ఇచ్చిన మాటకోసం చంద్రబాబు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న నామనను తప్పించి ఆ పదవిని జ్యోతుల నవీన్‌కుమార్‌కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. రాంబాబును బుజ్జగించేందుకు అన్నట్టుగా జిల్లా అధ్యక్ష పదవిని వద్దన్నా అంటగట్టారు. ఆయన మెతక వైఖరి కారణంగా పార్టీ పగ్గాలను అనుభవమనే ఆయుధాన్ని వాడుకుంటూ రాజప్ప నేటీకీ చక్కబెడుతున్నారు. చినరాజప్ప ఇటీవల పెదపూడి మండలానికి చెందిన సంపర మాజీ ఎమ్మెల్యే మట్ట వెంకటరమణ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వచ్చారు. అక్కడ కొంతమంది తనకు పూర్వాశ్రమం నుంచి తెలిసిన వైఎస్సార్సీపీ నాయకులను పలకరించడం రామకృష్ణారెడ్డికి రుచించ లేదు. ఆ రోజే రాజప్పను రామకృష్ణారెడ్డి అడిగినా సరైన సమాధానం లేకపోవడంతో యనమల దృష్టికి వెళ్లింది. దీనిని సర్థుబాటు చేయాల్సిందిగా చినరాజప్పకే తిరిగి యనమల అప్పగించినా ఫలితం లేకపోవడంతో ఆ పంచాయతీ వెబినార్‌లో చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారని పార్టీ నేతలు చెబుతున్నారు. అయినా చినరాజప్ప పెద్దగా పట్టించుకోకపోవడంతో రామకృష్ణారెడ్డి చంద్రబాబుకు ఫిర్యాదు చేశారంటున్నారు. అదే సమయంలో పార్టీ జిల్లా నాయకత్వాన్ని, షాడో రాజకీయాన్ని మార్చాలని డిమాండ్ వచ్చింది. అలా మార్చుకోకుంటే తామే పార్టీ మారిపోవాల్సి వస్తుందని హెచ్చరించినట్టు సమాచారం. జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా టీడీపీ నేతలు ‘నిమ్మ’కు నీరెత్తినట్లు వ్యవరిస్తున్న తీరుపై పార్టీ సీనియర్లు ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు. నమోదవుతున్న కేసులపై అధినాయకత్వం ట్విటర్లోను, ప్రసార మాధ్యమాల్లో స్పందించడమే గాని క్షేత్ర స్థాయిలో పట్టించుకోవడాన్ని పలువురు తప్పుపట్టారు. ఈ విషయాలపై కొందరు నేతలు నేరుగా చంద్రబాబుపైనే ప్రశ్నల వర్షం కురిపింకచారని చెబుతున్నారు. చివరకు లోపం మీ వద్ద ఉందా, జిల్లా నేతల వద్ద ఉందా అని బాబును ప్రశ్నించారని తెలిసింది. అన్నీ ఆలకించిన బాబు జిల్లా నాయకత్వంపై త్వరలో నిర్ణయం తీసుకుందాం, రెండు పార్లమెంటు స్థానాలు కలిపి ఒక జిల్లాగా పరిగణించి పార్టీ పగ్గాలు అప్పగిద్దామని నచ్చజెప్పి వెబినార్‌ను ముగించారు. -
‘పచ్చ’ పార్టీ నుంచి.. పరుగో.. పరుగు..
వరుస పంక్చర్లతో కుదేలైపోతున్న ‘సైకిల్’ సచిత్రమాలిక కళ్లెదుటే కనిపిస్తోంది. వికృత చేష్టలతో, అహంకార పూరిత నిర్ణయాలతో, రాష్ట్ర ప్రగతికి అడుగడుగునా అవరోధం కల్పించేలా వ్యవహరిస్తున్న అధినాయకత్వం ప్రజలకు మరింత దూరమవుతోంది. ఐసుగడ్డను ఢీకొని, ముక్కచెక్కలవుతూ, నడిసంద్రంలో మునిగిపోతున్నట్టుగా మారిన ‘తెలుగుదేశం’ నావను భవిష్యత్తీరాలకు చేర్చడానికి.. చుక్కాని పట్టి నడిపించే భావి నేత కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ఇంకా ఆ పార్టీలోనే ఉంటే తమ పుట్టి కూడా మునుగుతుందన్న భయంతో ‘తమ్ముళ్లు’ ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. టీడీపీకి గుడ్‌బై చెప్పి, అత్యంత ప్రజాదరణతో వెలుగొందుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దీంతో జిల్లాలోని టీడీపీ ముఖ్యనేతలు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. సాక్షి, రాజమహేంద్రవరం: పార్టీ నాయకులు ఒక్కొక్కరూ జారిపోతూండడంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీ బేజారెత్తిపోతోంది. అధినేత చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో విసుగు చెందుతున్న పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రజారంజక పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వరుసగా చేరుతున్నారు. ఈ పరిణామాలు చూస్తూ కూడా ఇంకా టీడీపీలో కొనసాగడమంటే తమ రాజకీయ భవిష్యత్తుకు తామే సమాధి కట్టుకున్నట్టు అవుతుందనే భయం తెలుగు తమ్ముళ్లలో స్పష్టంగా కనిపిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి జారిపోతున్న నేతలను నిలబెట్టుకోలేక టీడీపీ ముఖ్యనేతలు తలలు పట్టుకుంటున్నారు. ఒకప్పుడు కంచుకోటగా ఉన్న జిల్లాలో వైఎస్సార్ సీపీ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలహీనపడుతూ వచ్చింది. వైఎస్సార్ సీపీ ప్రభంజనం ఖాయమనే స్పష్టమైన సంకేతాలు సార్వత్రిక ఎన్నికల సమయంలోనే కనిపించాయి. కానీ అప్పటికంటే స్థానిక సంస్థల ఎన్నికలకు తెర లేచిన తరువాతే జిల్లాలో టీడీపీ నుంచి వలసలు ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆవిర్భావం నుంచీ పార్టీలో ఉండి నరనరానా టీడీపీ రక్తమే ప్రవహిస్తోందని బహిరంగంగా చెప్పుకునే నేతలు కూడా బయటకు పోతున్న పరిస్థితులు ఆ పార్టీ అధిష్టానానికి ఒక పట్టాన మింగుడు పడటం లేదు. వలసలను నిరోధించలేక ఆ పార్టీ ముఖ్యనేతలు దిక్కులు చూస్తున్నారు. చదవండి: ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ..! ► చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన త్రిమూర్తులుగా మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, జ్యోతుల నెహ్రూ పేరొందారు. పార్టీ పుట్టి మునిగిపోతున్నా ఈ ముగ్గురూ ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులై చూస్తున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత నంబర్–2గా పేరొంది, తెర వెనుక పార్టీని నడిపించిన ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు జిల్లాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను కళ్లప్పగించి చూస్తున్నారే తప్ప కనీసం పార్టీ నేతలను నిలువరించలేకపోతున్నారు. ►పార్టీని నమ్ముకున్నా నట్టేట ముంచేశారంటూ వైఎస్సార్ సీపీలో చేరి, తిరిగి ప్రలోభాలతో టీడీపీ పంచన చేరిన మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూదీ అదే పరిస్థితి. వారానికో, 15 రోజులకో ఒకసారి కాకినాడలో మీడియాతో మాట్లాడటానికే ఆయన పరిమితమవుతున్నారే తప్ప టీడీపీకి కాయకల్ప చికిత్స చేయలేకపోతున్నారు. ►సుదీర్ఘ కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసిన రికార్డుతో పాటు ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా పని చేశారు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. జిల్లాలో పార్టీ పరిస్థితిపై ఆయన కూడా దాదాపు కన్నెత్తి చూడడం లేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం, సొంత నియోజకవర్గం అమలాపురంలో కూడా పార్టీ ముఖ్య నేతలు వైఎస్సార్ సీపీలో చేరుతూ రాజప్పకు గట్టి షాక్ ఇస్తున్నారు. నాడు హోం మంత్రిగా పార్టీలో తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే తోట వర్గీయులను అమలాపురం పట్టణంలో వెతికి వెతికి మరీ కేసులలో ఇరికించి ఇబ్బందులు పాల్జేసిన నేపథ్యంలో.. వారందరూ ఇప్పుడు టీడీపీని వీడి రాజప్పకు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. చదవండి: ఏబీవీ సస్పెన్షన్‌కు ఆధారాలున్నాయ్ ►తోట త్రిమూర్తులు వైఎస్సార్ సీపీలో చేరడంతో రామచంద్రపురంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ►ఇటు అమలాపురం పట్టణంలో కూడా తోట ప్రభావం, చినరాజప్పపై ఆగ్రహంతో గంగుమళ్ల కాసుబాబు, అరిగెల బుజ్జి తదితరులు మంత్రి పినిపే విశ్వరూప్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. టీఎన్టీయూసీ నాయకుడు, నరనరానా టీడీపీని జీర్ణించుకున్న గల్లా రాము వంటి నాయకులు కూడా ఆ పార్టీని వీడి వైఎస్సార్ సీపీలోకి వచ్చేశారు. అమలాపురం 25వ వార్డు మాజీ కౌన్సిలర్ బండారు సత్యనారాయణ, అంబాజీపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బండారు లోవరాజు(చిన్ని) వైఎస్సార్ సీపీలో చేరారు. ►కాకినాడ రూరల్ కరప మండల టీడీపీ నేత పుల్లా ప్రభాకరరావు, పండూరుకు చెందిన ట్యాంకర్స్ యూనియన్ అధ్యక్షుడు బావిశెట్టి వెంకటేశ్వరరావు మంత్రి కురసాల కన్నబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►తునిలో యనమల సోదర ద్వయం ఒంటెద్దు పోకడలతో విసుగెత్తిపోయిన టీడీపీ శ్రేణులు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై నమ్మకంతో వైఎస్సార్ సీపీలో చేరారు. ► రామచంద్రపురం నియోజకవర్గం కాజులూరు మాజీ జెడ్పీటీసీ యాళ్ళ సూర్యప్రకాశరావు, మాజీ ఎంపీపీ వినకోటి శ్రీనివాస్ టీడీపీని వీడి ఎమ్మెల్యే వేణు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►రాజమహేంద్రవరంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు, నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు, బీసీ సంఘ నాయకుడు కడలి వెంకటేశ్వరరావులు సీఎం జగన్ సమక్షంలో; పెద్దాపురంలో టీడీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల రాజబ్బాయి పార్టీ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ►కొత్తపేటలో మందపల్లి శనైశ్చర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ సలాది బాబ్జీ, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్ కర్రి సుబ్బారెడ్డి, వేమగిరిలో వెలుగుబంటి వెంకటాచలం, దొంతంశెట్టి చినవీరభద్రయ్య, దళిత సంఘం నాయకుడు జంగా బాబురావు.. ఇలా టీడీపీ నేతలు అనేకమంది ఆ పార్టీ మనుగడ కష్టమనే భావనతో వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ►ఈ నేపథ్యంలోనే జిల్లాలోని మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టలేక టీడీపీ చేతులెత్తేసింది. ఆ మేరకు వైఎస్సార్ సీపీకి 80 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ పరిణామాలన్నీ టీడీపీని కోలుకోలేని దెబ్బ తీశాయి. -
పట్టణం మీకు.. ‘మెట్ట’ మాకా..?
‘‘పట్టణం నడిబొడ్డున ఉన్న కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని పేదలకు ఇవ్వడమేమిటి? అసలు ఈ స్థలాన్ని పేదలకు ఇవ్వాలని సూచించడమే సరికాదు. వాళ్లకు రామేశంమెట్ట వద్ద జీ+3 ఇళ్లు నిర్మించండి చాలు’’ అంటూ టీడీపీకి చెందిన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధికారులపై చిందులు తొక్కడం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. తమపై కత్తి కట్టినట్టుగా ఆయన వ్యవహరించిన తీరుపై ఆ నియోజకవర్గానికి చెందిన పేదలు మండిపడుతున్నారు. ప్రజానురంజక పాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉగాది నాటికి పేదలందరికీ ఇంటి స్థలాలు లేదా ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న సత్సంకల్పంతో ముందుకు సాగుతూంటే.. దానికి మోకాలు అడ్డడమేమిటని ప్రశ్నిస్తున్నారు. అన్ని సౌకర్యాలూ అందుబాటులో ఉండే పట్టణాల్లో తమకు గూడు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూంటే.. తమను ఎక్కడో ఉన్న రామేశంమెట్టకు తరిమేయాలని ఎమ్మెల్యే అనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: వచ్చే ఉగాది నాటికి రాష్ట్రంలోని 25 లక్షల మంది నిరుపేదలకు ఇంటి స్థలం ఇవ్వడం.. లేదా ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఇందుకు అనుగుణంగా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యాన జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను ఎంపిక చేసే ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇందులో భాగంగానే నియోజకవర్గ కేంద్రమైన పెద్దాపురం మండలం, పట్టణంలో ఉన్న సుమారు 5,401 మంది పేదలకు లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వడివడిగా జరుగుతున్న పనులు అక్కడి ఎమ్మెల్యే చినరాజప్పకు కంటగింపుగా మారాయి. పోనీ ఆ పేదలేమైనా పక్క నియోజకవర్గంలో వారైతే అడ్డు చెప్పారన్నా అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ లబ్ధి పొందే వారందరూ ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో వారే. అయినప్పటికీ ఆయనఅడ్డం పడుతున్నారంటే.. పేదల పట్ల ఆయనకు ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. పేదలపై దుగ్ధతోనే.. పెద్దాపురం పట్టణం పరిధిలోకి వచ్చే జి.రాగంపేట పంచాయతీ సర్వే నంబర్ 340/1ఎ1లో సుమారు 17 ఎకరాల ఇరిగేషన్ స్థలం ఉంది. ఇందులో 5 ఎకరాల్లో పులిమేరు, తాటిపర్తి, గుడివాడ, సిరివాడ, జి.రాగంపేట గ్రామాల పేదలకు జీ+3 ఇళ్లు నిర్మించి ఇవ్వాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. అక్కడ గజం రూ.25 వేల వరకూ పలుకుతోంది. పెద్దాపురం నడిబొడ్డున అంత ఖరీదైన భూముల్లో పేదలకు ఇళ్లు ఇవ్వడమెందుకని అక్కడి టీడీపీ నేతలు భావించారు. ఈ విషయాన్ని వారు చెవిలో వేయడంతో ఎమ్మెల్యే చినరాజప్ప పేదలకు లబ్ధి కలిగించే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ ‘గూడు’పుఠానీ పన్నారని అంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువుగా ఉన్న ఆ ప్రాంతంలో పేదలకు ఇళ్లు ఎందుకని ఎమ్మెల్యే వాదిస్తున్నారు. పేదల కోసం కేటాయించిన ఐదెకరాలు కాకుండా మరో 12 ఎకరాల వరకూ కూడా అక్కడ ఖాళీగానే ఉంది. ఒకవేళ ఎమ్మెల్యే చెప్పినట్టు అక్కడ నిజంగా ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాల్సి వస్తే మిగిలిన స్థలంలో చేపట్టవచ్చు. కానీ పేదల గూడుకే ఎసరుపెట్టే విధంగా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూములను పేదలకు ఇవ్వడమేమిటన్న దుగ్ధతోనే టీడీపీ నేతలు ఈవిధంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యతిరేకత ఎందుకంటే.. పెద్దాపురం పట్టణంలో పేదల కోసం జీ+3 నిర్మాణాల కోసం కేటాయించిన స్థలానికి ఎదురుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉంది. అక్కడ పేదల ఇళ్లు వస్తే తనకు ఇబ్బంది అవుతుందని బహుశా చినరాజప్ప భావించి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పెద్దాపురం మండలంలోని సుమారు 12 ఏటిపట్టు గ్రామాల్లో మెజార్టీవి గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచాయి. ఈ రెండు కారణాలతోనే ఎమ్మెల్యే తమపై కక్ష సాధిస్తున్నట్టున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఏటిపట్టు గ్రామాల్లోని పేదలకు పట్టణం నడిబొడ్డున ఇళ్లు నిర్మించి ఇస్తే.. వారందరూ త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ వైపు నిలుస్తారన్న భయంతోనే టీడీపీ నేతలు ఈ కుట్రలు పన్నుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. అలా కాకపోతే తన నియోజకవర్గ పేదలకే లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ముందుకు వస్తే ఎమ్మెల్యే వ్యతిరేకించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే.. ప్రజలకు దూరాభారం కట్టమూరు, జె.తిమ్మాపురం గ్రామాలతో పాటు పెద్దాపురం పట్టణ లబ్ధిదారులు 2,826 మందికి రామేశంమెట్ట వద్ద జీ+3 మోడల్ ఇళ్లు నిర్మించనున్నారు. అక్కడే ఏటిపట్టు గ్రామాల వారికి కూడా నిర్మించాలని ఎమ్మెల్యే అంటున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్టే రామేశ్వరం మెట్టలో ఇళ్లు నిర్మిస్తే అది ఏటిపట్టు గ్రామాల ప్రజలకు దూరాభారమే అవుతుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 20 కిలోమీటర్లు ఉంటుంది. నిబంధనల ప్రకారం పేదలకు 10 కిలోమీటర్ల లోపులోనే ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. ఈ విషయం ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా చేసిన ఎమ్మెల్యే చినరాజప్పకు తెలియకుండా ఉంటుందా అని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పేరు వస్తుందనే వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా పేద ప్రజలకు ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను సేకరించారు. దీనిలో భాగంగా సామర్లకోటకు చెందిన విస్తరణ, శిక్షణ కేంద్రంలోని భూములను ఇళ్ల స్థలాల కోసం అధికారులు సేకరించారు. పెద్దాపురం ఇరిగేషన్ కార్యాలయానికి చెందిన భూములు నిరుపయోగంగా ఉండి ఆక్రమణలకు గురవుతున్నాయి. ఆ భూములను ఇళ్లస్థలాలకు ఇవ్వాలని నిర్ణయించాం. అయితే ఎమ్మెల్యే రాజప్ప ఆ భూములను పేదలకు ఇళ్లస్థలాలుగా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ భూములు పేదలకు ఇస్తే మా పార్టీకి పేరు వస్తుందనే దురుద్దేశంతోనే ఆయన వ్యతిరేకిస్తున్నారు.– దవులూరి దొరబాబు,వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్, పెద్దాపురం -
తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన చినరాజప్ప
సామర్లకోట, (పెద్దాపురం): తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తప్పుడు అఫిడవిట్‌ను దాఖలు చేసి ఎన్నికల కమిషన్‌ను మోసం చేశారని ఆ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేసిన తోట వాణి ఆరోపించారు. పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. అఫిడవిట్ ఫారం–26లో 5వ కాలమ్‌లో అభ్యర్థిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నాయా, లేవా.. అనే కాలమ్‌లో ఎటువంటి కేసులు లేవన్నట్టు ధ్రువీకరణ పత్రం ఇచ్చారని తెలిపారు. అయితే ఓబుళాపురం మైనింగ్ వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండగా దౌర్జన్యంగా మారణాయుధాలు ధరించి దాడి చేశారని, పోలీసులు వారించినా వినకుండా ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో మైనింగ్ కార్యాలయానికి వెళ్లి ఆస్తులు ధ్వంసం చేశారని చెప్పారు. అడ్డువచ్చిన పోలీసులను తోసివేసి అసభ్య పదజాలంతో దూషించిన నేరానికి.. రాజప్పతో పాటు మరో 20 మందిపై 2007 జూలై 21న పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు. 15వ ముద్దాయిగా ఉన్న చినరాజప్పకు రాయదుర్గం కోర్టు అరెస్టు వారెంట్ జారీచేసిందని, తదుపరి ఈ కేసు విజయవాడ ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయిందన్నారు. విజయవాడ కోర్టు కూడా 2018 డిసెంబర్ 28న కేసు నంబరు 50గా నమోదుచేసి అరెస్టు వారెంటు ఇచ్చిందని ఆమె చెప్పారు. కేసు నమోదు 2014 ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎమ్మెల్సీగా పెన్షన్ పొందుతున్నారని, 2019 ఎన్నికలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా ఆదాయం పొందుతూ ఉండగా.. కేవలం వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నట్లు అఫిడవిట్లో పేర్కొని ఎన్నికల కమిషన్‌ను మరో మోసం చేశారని ఆమె చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లో దాఖలు చేసిన నకలు ఆధారాలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన తప్పుడు అఫిడవిట్లపై ఈ నెల 5వ తేదీన ఏపీ హైకోర్టులో రాజప్పపై కేసు నమోదైందని.. ఆరు నెలల్లో ఆయనను కోర్టు అనర్హుడిగా ప్రకటిస్తుందని.. తదుపరి వచ్చిన మెజార్టీ ఆధారంగా ఎమ్మెల్యేగా తనకు అవకాశం వస్తుందని తోట వాణి వివరించారు. సమావేశంలో మాజీ ఎంపీ తోట నరసింహం తదితరులున్నారు. -
'చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడు'
సాక్షి, కాకినాడ : నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడని, ఆయన ఎన్నిక చెల్లదని పెద్దాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తోట వాణి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసు, అరెస్ట్ వారెంట్లను పొందుపరచకుండా చినరాజప్ప దాచిపెట్టారని ఆమె తెలిపారు. 2007లో ఓబులాపురం మైనింగ్ కేసులో చినరాజప్పతోపాటు మరో ఇరవై మందిపై క్రిమినల్ కేసు నమోదైందని, ఈ కేసుకు సంబంధించి పలుమార్లు రాజప్పకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా వస్తున్న పెన్షన్ వివరాలను కూడా అఫిడవిట్లో చిన్నరాజప్ప సమర్పించలేదని, ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని మోసం చేసిన చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ తోట వాణి జూలై 5న హైకోర్టును ఆశ్రయించారు. -
మా లెక్కలు మాకున్నాయి..: చినరాజప్ప
సాక్షి, అమరావతి : ఎన్నికలు ముగిసినప్పటికీ అడ్డగోలుగా అధికార దుర్వినియోగం చేస్తున్న టీడీపీ సర్కార్... ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు ప్రతిపక్షంపై ఎదురుదాడికి దిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రతిపక్షమే సమస్యలు సృష్టిస్తూ శాంతిభద్రతలు సరిగా లేవని నిందలు వేస్తున్నారని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని సొంత కుటుంబ సభ్యులే హత్య చేశారని, కావాలనే లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టిస్తున్నారని చినరాజప్ప విమర్శలు గుప్పించారు. గుంటూరులో స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైఎస్సార్ సీపీ శ్రేణులు దౌర్జన్యానికి పాల్పడ్డాయని అన్నారు. వైఎస్ జగన్ ఎప్పుడూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలలో సమస్యలు తలెత్తినా టీడీపీ కోసం మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటు వేశారని చెప్పుకొచ్చారు. పోలింగ్ రోజు ఎన్నికల కమిషన్ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నా ప్రజల సమస్యలపై సమీక్షలు చేయవచ్చని చినరాజప్ప సమర్థించుకున్నారు. ఇక ఎన్నికల్లో గెలుపు టీడీపీదేనని... ‘మా లెక్కలు మాకున్నాయి...ఖచ్చితంగా 115 నుంచి 120 సీట్లలో గెలుస్తాం.’ అంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. -
చినరాజప్ప గోబ్యాక్..
-
ప్రచారంలో చినరాజప్పకు చుక్కెదురు
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు చుక్కెదురైంది. ఆయన్ని అడ్డగించిన గ్రామస్తులు ఐదేళ్లుగా తమ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. రాజప్ప కాన్వాయికి అడ్డంగా బైఠాయించారు. గ్రామంలో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేదని, గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. గ్రామస్తులు సమస్యల్ని వివరిస్తుండగానే చినరాజప్ప వాహనం ముందుకు సాగింది. దీంతో వారు ’రాజప్ప డౌన్ డౌన్, రాజప్ప గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. -
అవినీతి లొల్లి.. కట్టాలా పట్టం మళ్లీ
సాక్షి, సామర్లకోట (పెద్దాపురం): 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ నుంచి వలస వచ్చిన నిమ్మకాయల చినరాజప్ప పెద్దాపురం నియోజకవర్గంలో పోటీ చేసి ... విజయపతాకం ఎగురవేసి ... ఏకంగా కొండలనే కొల్లగొట్టి రూ. కోట్ల ఆర్జనకు శ్రీకారం చుట్టారు. కీలకమైన ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి పదవులతో ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తారనుకుంటే అడుగడుగునా ఆయనతోపాటు ఆయన అనుచరులు అందినకాడికి దోచుకొని నియోజకవర్గ ప్రజలను దగా చేశారన్న విమర్శలున్నాయి. పెద్దాపురం మండలం ఆనూరు, కొండపల్లి, కొండలను గుల్ల చేసి గ్రావెల్ తవ్వకాలు జోరుగా చేశారు. ప్రతి రోజు వందలాది వాహనాలలో గ్రావెల్ రవాణా జరగడంతో ఆయా ప్రాంతాలు కాలుష్యంతో నిండిపోయాయి. ప్రకృతి ఇచ్చిన సంపదను కాపాడాల్సిన అధికారులు, అధికార పార్టీ నేతలకు తొత్తుగా మారి పోయారని ఈ ప్రాంతవాసులు మండిపడుతున్నారు. మంత్రి పదవిని అడ్డు పెట్టుకొని కొండలను కొల్లగొట్టి రూ.200 కోట్ల వరకు సంపాదించారనే ఆరోపణలున్నాయి. గత రెండేళ్లుగా ఏకధాటిగా సాగుతున్న కొండల తవ్వకాలపై ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దళితుల పొట్టకొడుతూ... పెద్దాపురం మండల పరిధిలో రామేశ్వరంపేట మెట్టపై ఆధారపడి ఆనూరు, కొండపల్లి, రామేశ్వరంపేట, సూరంపాలెం, వాలుతిమ్మాపురం గ్రామాలకు చెందిన సుమారు 800 మంది దళితులు జీవనం సాగిస్తున్నారు. అధికార పార్టీ పెద్దల అండతో మైనింగ్ మాఫియా ఆ భూముల్లోకి ప్రవేశించి దళితుల బతుకులతో ఆటలాడుకుంటోంది. దళితులతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకొని తవ్వకాలు దౌర్జన్యంగా చేస్తున్నారు. సుమారు 50 అడుగుల ఎత్తులో వాలుగా ఉన్న కొండను తవ్వి చదును చేయడంతో రెండు వంతుల భూమిని దళితులు కోల్పోయే అవకాశం ఉంది. కొండల మీదుగా 33 కేవీ విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేయగా వాటిచుట్టూ కూడా గ్రావెల్ తవ్వకాలు చేపట్టేశారు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రామేశ్వరం మెట్టపై ఉన్న 800 ఎకరాల భూమిని పేద దళితులకు పంపిణి చేశారు. తరువాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో 530 ఎకరరాల భూమిని ఒక్కో కుటుంబానికి ఎకరం 35 సెంట్ల చొప్పున పంపిణి చేశారు. పంటలకు అనువుగా వైఎస్ హయాంలో బోర్ల ఏర్పాటు... వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2005–06లో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఇందిరా క్రాంతి, ఇందిరా జలప్రభ ద్వారా 72 బోర్లు వేయించి డ్రిప్ ఇరిగేషన్ పథకం ద్వారా పంట పొలాలకు పైపు లైన్లు ఏర్పాటు చేయించారు. దాంతో మెట్టపై జీడి మామిడి, దుంప, అపరాల పంటలు, ఆకుకూరలు, కాయగూరలు పండిస్తూ కుటుంబాలను పోషించుకొంటున్నారు. ఎకరానికి రూ.30 నుంచి 40 వేల వరకు ఆదాయం వచ్చేదని రైతులు తెలియజేశారు. ఉపాధి హామీ పథకంలో మామిడి, జీడి మామిడి ఈ మెట్టపై వేసుకునేందుకు అధికారులు మొక్కలను పంపిణీ చేశారు. ఈ మొక్కల సంరక్షణ కోసం ప్రతి నెలా రూ.1500 నుంచి మూడు వేల వరకు ఇచ్చేవారు. విద్యుత్తు సదుపాయంతో బోర్ల ద్వారా వ్యవసాయం చేస్తున్న మెట్టను ఏ విధంగా తవ్వకాలకు అధికారులు అనుమతి ఇచ్చారో అర్థం కావడం లేదని దళిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ అండదండలతో తప్పుడు రికార్డులతో మాఫియా రంగంలోకి దిగి క్వారీ తవ్వకాలు చేస్తోంది. మెట్టపై భూములున్న వారిని బెదిరించి తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించారనే ఆరోపణలు విస్తృతంగా ఉన్నాయి. సొంత భూమిలో గ్రావెల్ తవ్వకానికి అనేక మంది అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఎటువంటి అనుమతి లేకుండా ఏడీబీ రోడ్డును ఆనుకొని ఉన్న ప్రభుత్వ కొండలో తవ్వకాలు చేస్తున్నా అధికారులు మౌనం వహించడమేమిటని పరిసర ప్రాంత జనం ప్రశ్నిస్తున్నారు. దాదాపు పది పొక్లెయిన్లతో 24 గంటలపాటు తవ్వకాలు చేస్తున్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అభివృద్ధి పనుల్లో అదే రీతి... నియోజకవర్గ పరిధిలో రూ.1,200 కోట్లతో అభివృద్ధి చేశామని చినరాజప్ప తరచుగా చెబుతున్నారని, అందులో అవినీతి భాగం ఎక్కువగా ఉందనే విమర్శలూ లేకపోలేదు. పెద్దాపురం మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.80 లక్షలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డు ప్రారంభం సమయంలోనే గోతులతో నిండిపోయింది. రూ.కోటితో పెద్దాపురం బస్సు కాంప్లెక్స్ నిర్మాణంలోను భారీ అవినీతి తొంగిచూస్తోంది. రేకులతో నిర్మాణం చేసి నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక ‘నీరు చెట్టు’ పథకం అవినీతికి మరో మెట్టుగా మారిపోయింది. సామర్లకోట నీలమ్మ చెరువు అభివృద్ధి పనులు నాసిరకంగా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. రేకుల షెల్టర్లకు రూ. ఐదు లక్షలా! ఐదు నుంచి ఆరుగురు ప్రయాణికులు వేచి ఉండటానికి వీలుగా రేకులతో ఇటీవల ఏర్పాటు చేసిన ఒక్కో షెల్టర్‌కు రూ. ఐదు లక్షలు ఖర్చు చేసినట్లు ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలేసుకొంటున్నారు. రూ.లక్ష కూడా ఖర్చు కాని ఈ షెల్టరుకు రూ.ఐదు లక్షలా అనే విమర్శలున్నాయి. ఇటువంటివి పెద్దాపురంలో మూడు నిర్మాణం చేసి భారీ ఎత్తున నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి. ఈ విధంగా ప్రతి అభివృద్ధి పనిలోనూ అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అనధికార లేఅవుట్ల జోరు నియోజకవర్గ పరిధిలో ప్రతి గ్రామంలోనూ అనధికార లే అవుట్లు జోరందుకున్నాయి. ఆయా గ్రామ పంచాయతీ కార్యదర్శులు గమనించినా ఏమీ చేయలేని పరిస్థితులున్నాయి. ఈ ప్లాట్లను కొనుగోలు చేసినవారికి ఇళ్ల నిర్మాణానికి ప్లాన్లు మంజూరు కాకపోవడంతో అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. పెద్దాపురం–సామర్లకోట రోడ్డు అభివృద్ధిలో ‘పచ్చ’పాతం చూపిస్తున్నారని పరిసర గ్రామాల ప్రజలు కన్నెర్ర చేస్తున్నారు. -
కమ్మ వాళ్ళకి చంద్రబాబు టికెట్ ఇస్తే నేనూ పోటీలో ఉంటా..
తూర్పుగోదావరి, పెద్దాపురం: పెద్దాపురం తెలుగుదేశం పార్టీలో సామాజిక చిచ్చు రేగింది. అసెంబ్లీ టికెట్ కేటాయింపులో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి చిన రాజప్పకు టికెట్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్న మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకులు ముత్యాల రాజబ్బాయి కమ్మ సామాజిక వర్గానికి చంద్రబాబు టికెట్ ఇవ్వదలచుకుంటే నేనూ పోటీలో ఉంటానంటూ సోమవారం బహిరంగంగా ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే బొడ్డు భాస్కర రామారావు రెండు రోజుల క్రితం అధిష్టానం కమ్మ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని చూస్తోందని, ఆరో తేదీలోపు తనకు టికెట్ ప్రకటిస్తుందని ప్రచారం చేస్తుండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన రాజబ్బాయి తాను కూడా ఈ దఫా పోటీలో ఉంటానంటూ ఆర్బీ పట్నంలో తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రకటించారు. దీంతో దాదాపు కమ్మ సామాజిక వర్గంలో కూడా చిచ్చురేగడంతో ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న బొడ్డుకు ఈ ప్రకటన చుక్కెదురైనట్టయ్యింది. 1982లో పార్టీ స్థాపించిన నాటి నుంచి టీడీపీలో కొనసాగుతున్న తనకు కమ్మ సామాజిక వర్గ నాయకుడే అడ్డుపడుతూ ఉన్నాడని రాజబ్బాయి అన్నారు. గత ఎన్నికల్లో టికెట్ ఆశించిన తనకు చంద్రబాబు ఈ దఫా చిన రాజప్ప గెలుపునకు కృషి చేస్తే ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చారన్నారు. ఇప్పటికీ ఆయన తనకు న్యాయం చేస్తాననడంతోనే సమన్వయ కమిటీ తరఫున తాను రాజప్పకు మద్దతు ఇచ్చానన్నారు. ఆయనకు కాకుండా కమ్మ సామాజిక వర్గం నుంచే పెద్దాపురం అసెంబ్లీ టికెట్ కేటాయిస్తే చంద్రబాబు తనకు టికెట్ కేటాయిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై మరోమారు చంద్రబాబును కలుస్తానని రాజబ్బాయి ప్రకటించారు. సమావేశంలో గ్రామ నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు. -
‘దేశం’లో అసంతృప్తి సెగలు
తూర్పుగోదావరి, అమలాపురం: కోనసీమ కేంద్రం అమలాపురం టీడీపీలో అసంతృప్తి సెగలు రాజుకుంటున్నాయి. కీలక నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత పదవులు రాలేదని కొంతమంది కినుక వహిస్తే.. పదవులు పొందినవారు సహితం అసంతృప్తితో ఉండడం విశేషం. అధికారంలో ఉండడంతో నిన్నటివరకూ గుంభనంగా ఉన్న నేతలు.. ఎన్నికల వేళ ఒక్కసారిగా తమ అసంతృప్తిని బహిర్గతం చేస్తున్నారు. ♦ అల్లవరం మండలంలో పట్టున్న కొంతమంది ద్వితీయ శ్రేణి నేతలు పనిగట్టుకుని విజయవాడ వెళ్లి ఆ ర్థిక మంత్రి యనమల రామకృష్ణుడిని కలిశారు. ఆనందరావుకు టి క్కెట్ ఇవ్వద్దని కుండబద్దలుగొట్టి మరీ చెప్పారు. సాధారణంగా అమలాపురం టీడీపీ అభ్యర్థి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేది ఈ నియోజకవర్గానికి చెందిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప. అయినప్పటికీ అల్ల వరం నాయకులు యనమలను కలిసి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఆ నందరావును రాజప్ప బహిరంగంగా వెనకేసుకు వస్తున్నారనే ఉద్దేశంతో జిల్లాలో సీనియర్ అయిన యనమలను వారు కలిశారు. ఇలా ఎమ్మెల్యే ఆనందరావు తీరుపై నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. ♦ ముఖ్యంగా పదవులు దక్కని ద్వితీయ శ్రేణి నాయకులు ఆనందరావు, చినరాజప్పల తీరుపై ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉండి, ప్రజారాజ్యం వచ్చిన సమయంలో టీడీపీని వదిలి వెళ్లిన నాయకులకు దక్కిన పదవులు తమకు రాకుండా పోయాయని వారు మండిపడుతున్నారు. ♦ పార్టీలో సీనియర్‌గా ఉన్న రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి మట్ట మహాలక్ష్మి ప్రభాకర్‌కు నామినేటెడ్ పదవి ఇస్తానని స్వయంగా రాజప్ప హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. నామినేటెడ్ పదవుల పందేరం జరిగిన ప్రతిసారీ ప్రభాకర్ పేరు వినిపించడం తరువాత పక్కన పెట్టడం పరిపాటిగా మారింది. ♦ అలాగే మున్సిపాలిటీ ఇన్చార్జి చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఉన్న పెచ్చెట్టి విజయలక్ష్మికి సైతం తిరిగి వైస్ చైర్మన్ ఇవ్వడం లేదు. జెంటిల్మెన్ ఒప్పందం అమలు కోసం ఆమె పదవిని వదులుకున్నారు. చైర్మన్‌తోపాటు వైస్ చైర్మన్ ఎన్నిక జరగాల్సి ఉన్నా ప్రస్తుత చైర్మన్ యాళ్ల నాగసతీష్, మాజీ చైర్మన్ చిక్కాల గణేష్‌ల మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వల్ల ఆమెకు పదవి దక్కలేదు. పార్టీ ఆదేశానుసారం పదవికి రాజీనామా చేసినా తిరిగి తనకు పదవి ఇవ్వకపోవడంపై ఆమె అసంతృప్తితో ఉన్నారు. ♦ ఇక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ఉన్న పెచ్చెట్టి చంద్రమౌళి తాను ఆశించిన శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ రాలేదన్న అసంతృప్తితో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ♦ కాంగ్రెస్ హయాంలో గోదావరి ప్రాజెక్టు కమిటీ వైస్ చైర్మన్‌గా పని చేసి, పార్టీకి సేవలందించిన సత్తి శ్రీను సొంత పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కనీసం నీటిసంఘం అధ్యక్షుడు కూడా కాలేకపోయారు. ♦ పదవులు అనుభవించిన నేతలు సైతం పార్టీ పెద్దలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ♦ అల్లవరం మార్కెట్ కమిటీ చైర్మన్‌గా రెండేళ్లు పని చేసిన గునిశెట్టి చినబాబు రెండోసారి అవకాశం రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ♦ జెంటిల్మన్ ఒప్పందంలో భాగంగా నిర్ణీత గడువుకన్నా ఎక్కువ రోజులు పదవుల్లో ఉన్న మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్, అమలాపురం మాజీ ఎంపీపీ బొర్రా ఈశ్వరరావు సైతం ఇదే తీరుతో ఉన్నారు. ♦ గత ఎన్నికల్లో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన ఒక ప్రధాన సామాజికవర్గం పట్టణ పార్టీ పెద్దల తీరుపై నిరసన తెలుపుతోంది. వీరిలో కొందరు జనసేన వైపు, మరికొందరు వైఎస్సార్ సీపీ వైపు వెళ్లిపోయారు. వీరే కాకుండా పార్టీ కష్టకాలంలో జెండా మోసిన పలువురిని ఆనందరావు, రాజప్ప పట్టించుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు దగ్గరపడే సమయంలో మరింతమంది పార్టీ మారే అవకాశముందని టీడీపీ వర్గాలు భయపడుతున్నాయి. ♦ అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా కొత్తవారిని తీసుకువస్తారని, ప్రస్తుత ఎమ్మెల్యేకు అవకాశం లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సమయంలో టీడీపీలో అసంతృప్తులు, అసమ్మతి రాగాలు బహిరంగం కావడం రాజప్ప, ఆనందరావులకు మింగుడుపడడం లేదు. -
వైఎస్సార్ సీపీలో భారీ చేరికలు
తూర్పుగోదావరి, పెద్దాపురం: ఉప ముఖ్యమంత్రి, హోం శాఖా మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో భారీ షాక్ తగిలింది. మాజీ సర్పంచి దాసు శివబాబు ఆధ్వర్యంలో గ్రామస్తులందరూ ఏకతాటిపైకి వచ్చి వైఎస్సార్ సీపీ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో గురువారం రాత్రి పార్టీలో చేరారు. టీడీపీకి ఏకవర్గంగా ఉండే ఈ గ్రామంలో ఒక్కసారి సర్పంచి, బూత్ కమిటీ, పార్టీ కమిటీ నాయకులు వైఎస్సార్ సీపీ గ్రామ నాయకులు ఆకుల వీరబాబు, గళ్లా శ్రీను ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. శివబాబుతోపాటు టీడీపీ గ్రామ బూత్ కమిటీ కన్వీనర్ మదిరెడ్డి చంద్రశేఖర్, మాజీ ఉప సర్పంచి అరవ సత్తిబాబు, గ్రామ కమిటీ నాయకులు, మాజీ వార్డు సభ్యులు పోకల శివ రామకృష్ణ, ఆకాశపు ప్రసాద్, అడబాల దొరబాబు, జున్ను సుబ్రహ్మణ్యం, అడబాల వెంకట్రావు, జున్ను రాంబాబు సహ సుమారు 200 మందికి కో–ఆర్డినేటర్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. పార్టీకి లభిస్తున్న ఆదరణను చూడలేక సీఎం చంద్రబాబు అబద్దపు హామీలతో తిరిగి గద్దె ఎక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పార్టీలో చేరిన శివబాబు మాట్లాడుతూ గ్రామ ప్రజల నుంచి వచ్చినా స్పందనతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కర్రి వెంకటరమణ, గోపు నారాయణమూర్తి, మాజీ ఎంపీపీ మేడిశెట్టి భద్రం, బంగారుకృష్ణ, పార్టీ జిల్లా కార్యదర్శులు యినకొండ వీర విష్ణుచక్రం, ఆదపురెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ విజయానికి ప్రతిక్క కార్యకర్త కృషిచేయాలని కోరారు. తొలుత దేవాలయాల్లో పూజలు చేసి బహిరంగ సభ వద్ద హిందూ, క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించి వారు పార్టీలో చేరారు. కార్మిక నాయకులు దవులూరి సుబ్బారావు, గోలి దొరబాబు, పార్టీ మండల అధ్యక్షుడు గవరసాని సూరిబాబు, యూత్ అధ్యక్షుడు గోపు మురళి, నల్లల నాగేంద్రబాబు, కొప్పిరెడ్డి రాధాకృష్ణ, తోట అప్పారావు, రెడ్డి లక్ష్మి, కామన రామకృష్ణ.,పల్లా గంగారావు, జోకా సతీష్ తదితరులు పాల్గొన్నారు. దాకోడులో 100 కుటుంబాలు.. అడ్డతీగల (రంపచోడవరం): అడ్డతీగల మండలం దాకోడు పంచాయితీలోని తిరుమలవాడ, జాజిపాలెం, దాకోడు, బందమామిళ్లు, ఎం.భీమవరం గ్రామాల నుంచి పలు పార్టీలకు చెందిన 100 కుటుంబాలకు చెందిన గిరిజనులు వైఎస్సార్ సీపీలో చేరారు. దాకోడు పంచాయతీలో గురువారం నిర్వహించిన ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో భాగంగా పార్టీలో చేరిన వారిని పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అనంత ఉదయ్‌భాస్కర్, నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో వివిధ పార్టీల్లో ముఖ్య నేతలు పల్లాల గోపాలకృష్ణారెడ్డి, పల్లాల రామిరెడ్డి, పల్లాల రవిరాజశేఖరరెడ్డి, వంతల ప్రసాద్ ఆధ్వర్యంలో మొల్ల ప్రేమ్‌కుమార్, ఒండ్లోపు పెద్దబ్బాయి, పొడుగు పండయ్య, చెదల అశోక్, సడ్డా సోమరాజు, శిరిసిం దుర్గబాబు, సడ్డా మల్లేశ్వర్రావు, జర్తా చిన్నబ్బాయి, చలుమర్తి సోమరాజు, కలింకోట శ్రీను సహ 100 కుటుంబాలు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉదయ్‌భాస్కర్ మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో భాగస్వాములవుతున్న ఇతర పార్టీల నేతల సంఖ్య పెరుగుతోందన్నారు. పార్టీ రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ టీడీపీ సర్కారుని అధికారం నుంచి సాగనంపడానికి ప్రజలందరూ కార్యోన్ముఖులై ముందుకు వస్తున్నారని అన్నారు. కన్నబాబు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు.. కాకినాడ రూరల్: చంద్రబాబు పాలనకు స్వస్తి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ సీపీ కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. రమణయ్యపేట పాత గైగోలుపాడు 49వ డివిజన్ సోమాలమ్మ గుడి వద్ద ఆయన సమక్షంలో చింతపల్లి శ్రీను, పాలిక నర్శింహమూర్తి, పాలిక వెంకటరమణ ఆధ్వర్యంలో సుమారు 100 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. ‘రావాలి జగన్ – కావాలి కన్నబాబు’నినాదంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలిక వీరభద్రరావు, సీహెచ్ అవినాష్, సమ్మంగి రామకృష్ణ, పి.నాని, నున్న సాయి, సీహెచ్ దినేష్, గుత్తుల అన్నవరం, అనసూరి సత్తెమ్మ, వి.పద్మ, వి.సుజాతలకు కన్నబాబు పార్టీ కండువాలు ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ (కిట్టు), రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి జమ్మలమడక నాగమణి, కాకినాడ రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు గీసాల శ్రీనివాసరావు, కోరాడ దుర్గాప్రసాద్, సూరాడ రాజు, వడ్డి మణికుమార్, గుబ్బల విజయ్, పాలిక ప్రకాష్, చిలుకూరి సుజాత, మేడిశెట్టి లక్ష్మి, కర్రి చక్రధర్, కొత్తా రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ప్రశ్నకు నోరుమెదపని హోంమంత్రి
సాక్షి, ఏలూరు: బద్ద శత్రువులైన కాంగ్రెస్, టీడీపీల కలయికపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న వేళ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ పార్టీ నిర్ణయాన్ని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. సోమవారం ఆయన పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రానికి న్యాయం చేస్తారన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. బీజేపీ అన్యాయం చేయడం వల్లే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ఎవరో ఒకరి సహకారం ఉండాలంటూ పాతపాటే పాడారు. బీజేపీ చేసినట్టు కాంగ్రెస్ కూడా మోసం చేస్తే అంటూ విలేకరులు ప్రశ్నించగా.. దానికి మంత్రి సమాధానం దాటవేశారు. రాష్ట్రంలో 3137 పోలీసు పోస్టులు భర్తీ చేయనున్నట్టు చినరాజప్ప తెలిపారు. అదే విధంగా చినరాజప్ప జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్ వల్లే టీడీపీ గెలిచిందని అనడంలో అర్ధం లేదన్నారు. పవన్ లేకుండానే స్థానిక సంస్థల్లో విజయం సాధించామంటూ చెపుకొచ్చారు. -
మంత్రి రాజప్పకు సొంతపార్టీ కౌన్సిలర్ ఝలక్
పెద్దాపురం: అధికార పార్టీలో అభివృద్ధే తమదేనంటూ ప్రగల్భాలు పలుకుతున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి నిమ్మకాయల చిన రాజప్పకు ఆ పార్టీ కౌన్సిలర్ సయ్యద్ అమీనా బీబీ ఝలక్ ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కో–ఆర్డినేటర్ దవులూరి దొరబాబు సమక్షంలో శుక్రవారం కౌన్సిలర్ అమీనాబీబీ, ఆమె భర్త సయ్యద్ కరీమ్ (జానీ)తో పాటు సుమారు 200 మంది ముస్లింలు, వార్డులోని టీడీపీ కార్యకర్తలు పార్టీలో చేరారు. కో–ఆర్డినేటర్ దొరబాబు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయం సాధించడం తథ్యమన్నారు. పార్టీలో చేరిన అమీనాబీబీ, జానీ మాట్లాడుతూ ప్రస్తుత టీడీపీ పాలనలో అవినీతి రాజ్యమేలుతోందన్నారు. అశ్లీల నృత్యాలు ఫేస్బుక్లో అప్లోడు చేసిన వ్యక్తిని మంత్రి రాజప్ప నెత్తిన పెట్టుకున్నారన్నారు. కౌన్సిలర్ భర్తపై పోలీసులు చేయిచేసుకుంటే కనీసం కౌన్సిలర్ కోరిన విధంగా క్షమాపణ కూడా చెప్పించలేని పరిస్థితి ప్రస్తుత పాలకులదన్నారు. ప్రజా పాలనను గాలికి వదిలి అక్రమ మట్టి తవ్వకాలతో సొమ్ములు చేసుకుంటున్నారు తప్ప ప్రజా సంక్షేమాన్ని పట్టించుకున్న దాఖలాల్లేవన్నారు. ఎన్నారై దొరబాబు మున్సిపాల్టీకి అందించిన మంచినీటి ట్యాంకర్లు, సేవా కార్యక్రమాలతో ఆకర్షితులం కావడమే కాకుండా జగన్మోహన్రెడ్డితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందనే నమ్మకంతో పార్టీలో చేరామన్నారు. జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడం, దవులూరి దొరబాబును ఎమ్మెల్యేగా గెలిపించడమే ప్రధాన ధ్యేయంగా పని చేస్తామన్నారు. సుమారు 200 మంది ముస్లింలు, మహిళలు, వార్డు కార్యకర్తలకు దొరబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సామర్లకోట మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి దొరబాబు, దవులూరి సుబ్బారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, కరణం భాను, ఎలిశెట్టి నరేష్, గోకేడ రాజా, ముస్లిం కమిటీ పెద్దలు సర్దార్, పబ్బీర్, నూరీ, బషీర్, జిలాల్, చందు, సందీప్, జాపూర్, ఇస్మాయేలు, రబ్బాని, సంధాని తదితరులు పాల్గొన్నారు. -
షటిల్ ఆడుతూ జారిపడ్డ హోంమంత్రి
-
అయ్యో.. మంత్రి అలా పడిపోయారేంటి?
సాక్షి, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వల్ప ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు ఎటువంటి గాయాలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని కుళాయి చెరువు వద్ద వివేకానంద పార్కును శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం కాకినాడ నగర ఎమ్మెల్యే కొండబాబుతో కలిసి సరదా కలిసి షటిల్ ఆడటానికి సిద్ధమయ్యారు. కొండబాబు కొట్టిన కాక్‌ను అందుకునే క్రమంలో కాలు జారి షటిల్ కోర్టులో పడిపోయారు. సెక్యురిటీ సిబ్బంది, అక్కడున్నవారంతా కలిసి ఆయనను వెంటనే పైకి లేవదీశారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత ఆయన అందరితో సరదాగా మాట్లాడారు. -
‘కుక్కను ఉసిగొల్పిన హోంమంత్రి మరదలు’
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళిత విద్యార్థిపై పెంపుడు కుక్కను ఉసిగొల్పి అతని మృతికి కారణమైన రాష్ట్ర హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తమ్ముడు భార్యను అరెస్టు చేయకుండా, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తున్న బీఎస్పీ నాయకులపై కేసులు పెడుతున్నారని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఏపీ అధ్యక్షుడు పట్టపు రవి అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల 28న దళిత విద్యార్థి ఎన్.వరుణ్ తోటివారితో కలిసి ఆడుకునేందుకు అమలాపురంలోని హౌసింగ్ కాలనీకి వెళ్లాడని, ఆ సమయంలో హోంమంత్రి మరదలు పెంపుడు కుక్కను ఉసిగొల్పిందన్నారు. దానినుంచి తప్పించుకునే క్రమంలో వరుణ్ పక్కనే ఉన్న ఎర్రకాలువలో పడి మృతిచెందాడని చెప్పారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు స్పందించటంలేదన్నారు. విద్యార్థి మృతికి కారణమైన మహిళను 2 రోజుల్లో అరెస్టు చేయని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బచ్చలకూర పుష్పరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లంకా కరుణాకర్ దాస్ పాల్గొన్నారు. -
‘కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదు’
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు ఉండదని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణతో అనేక విభేదాలు ఉన్నాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పొత్తుపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. చంద్రబాబు నాయుడు తెలంగాణ టీడీపీ నేతలకే నిర్ణయాన్ని అప్పగించారని తెలిపారు. చంద్రబాబుపై 24 కేసులు పెండింగ్ ఉన్నాయని, కోర్టులు స్టే విధించాయని పేర్కొన్నారు. ఏపీలో పోలీసులు సరిగా పనిచేయలేదన్న జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదని అన్నారు. దివాకర్ రెడ్డికి కాంగ్రెస్ వాసన పోలేదని ఎద్దేవా చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను తామే ప్రోత్సహించామని చెప్పారు. చంద్రబాబుకు సీబీఐ నోటీసులు కేవలం ఊహాగానాలేనన్నారు. -
హరికృష్ణ మరణం టీడీపీకి తీరనిలోటు
అవనిగడ్డ : మాజీ రాజ్యసభ సభ్యులు, సినీనటుడు నందమూరి హరికష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. దివిసీమ పర్యటనకు వచ్చిన ఆయన తన వియ్యంకుడు మాదివాడ విష్ణుమూర్తి స్వగృహంలో హరికృష్ణ రోడ్డు ప్రమాద దృశ్యాలను టీవీలో చూశారు. ఈ సందర్భంగా విలేఖరులతో మాట్లాడుతూ హరికష్ణ తనతో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారన్నారు. ఎన్టీ రామారావు టీడీపీ స్ధాపించిన తరువాత ఛైతన్యరధంకు హరికృష్ణ సారధిగా వ్యవహరించారని అన్నారు. అప్పటి నుంచే తాను ఆయనతో కలిసి పనిచేసినట్టు చెప్పారు. పాలిట్‌బ్యూరో సభ్యునిగా ఉన్న సమయంలో ఆయన కూడా సభ్యునిగా ఉన్నారని ఎప్పుడు కనబడినా ఎంతో ఆప్యాయతగా పలుకరించేవారని తెలిపారు. ఎన్టీఆర్ ఛైతన్య రధంకు సారధ్యం వహించి రాష్ట్ర మంతా తిప్పిన ఆయన ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం తను తీవ్రంగా కలచి వేసిందన్నారు. సర్పశాంతి హోమంపై ఆరా.... దివిసీమలో పాముకాట్లు పెరిగిన నేపధ్యంలో మోపిదేవి శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయం ఆధ్వర్యంలో బుధవారం సర్పశాంతి హోమం చేశారని శాసనసభ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ హోమంత్రి చినరాజప్ప దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పాముకాట్లు, తీసుకుంటున్న చర్యలు, సర్పశాంతి హోమం గురించిన విషయాలను హోమంత్రి బుద్ధప్రసాద్‌ని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ యువజన వికాస సమితి ఛైర్మన్ మండలి వెంకట్రామ్ (రాజా), ఎంపీపీ బీవీ కనకదుర్గ, జడ్పీటీసీ కొల్లూరి వెంకటేశ్వరరావు, డిఎస్పీ వి పోతురాజు, న్యాయవాది మాదివాడ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. -
మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప
జిల్లా పశుగణాభివృద్ధి కమిటీ అధ్యక్ష ఎన్నిక, ఒక పత్రికలో సర్వే పేరుతో తనకు వ్యతిరేకంగా రాసిన కథనాల నేపథ్యంలో అలక పాన్పు ఎక్కిన మంత్రి గంటా తెలుగుదేశం పార్టీకి మాత్రం అంటీముట్టనట్లే ఉంటున్నారు..ఆ రెండు ఘటనల విషయంలో ఉప ముఖ్యమంత్రి, సీఎంల బుజ్జగింపులతో మంత్రి అలకపాన్పు దిగినట్లు కనిపించినా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం అంతగా పాల్గొనడం లేదు..నగరంలో గురువారం జరిగిన జిల్లా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశానికి నగరంలోనే ఉన్నా.. గంటా డుమ్మా కొట్టడం.. ఆయన గైర్హాజరుపై జిల్లా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప, మరో మంత్రి అయ్యన్నపాత్రుడు అసహనంతో వ్యంగ్య బాణాలు విసరడం ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాఫిక్‌గా మారింది. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కీలకమైన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి డుమ్మా కొట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. గత రెండు నెలలుగా ఆయన పార్టీ విషయంలో అంటీముట్టనట్టుగానే ఉంటున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలకు ఇస్తున్న ప్రాధాన్యత పార్టీ కార్యక్రమాలకు ఇవ్వడం లేదన్న వాదన పార్టీలో బలంగా విన్పిస్తోంది. మంత్రులు పాల్గొనే కీలక అధికారిక సమీక్ష సమావేశాలకు కూడా గైర్హాజరవుతున్నారు. కీలక సమావేశానికి సైతం.. తాజాగా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప అధ్యక్షతన గురువారం జరిగిన టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశానికి గంటా గైర్హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ మంత్రి అయ్యన్న పాత్రుడుతో పాటు పార్టీ అర్బన్, రూరల్ జిల్లా అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంత్రి గంటా కోసం ఉదయం 9 నుంచి గంటన్నర పాటు వేచి చూశారు. కానీ ఆయన వచ్చే సూచనలు కన్పించకపోవడంతో 10.30 గంటలకు సమావేశాన్ని ప్రారంభించారు. కీలకమైన ఈ సమావేశానికి గంటా హాజరుకాకపోవడం పట్ల సహచర మంత్రుల్ది్దరు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోనీ స్థానికంగా లేరా అంటే.. గంటా జిల్లాలోనే ఉన్నారు. భీమిలిలో తన అనుచరుడి పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారని తెలుసుకున్న ఇన్చార్జి మంత్రి చినరాజప్ప పుట్టినరోజు వేడుకలకు ఇచ్చిన ప్రాధాన్యత పార్టీ సమన్వయ కమిటీ సమావేశానికి ఇవ్వకపోవడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి గారికి ఏం పనులున్నాయో..ఏమో?!: చినరాజప్ప ‘మంత్రి గారికి ఏం పనులున్నాయో.. ఏమో ? అని చినరాజప్ప మంత్రి గంటానుద్దేశించి ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో గంటా విషయమై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు మంత్రిలిరువురూ తీవ్ర అసహనంతోనే బదులిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకే ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గంటా కూడా సమాచారం ఇచ్చాం. ఆయన రాకపోతే ఏం చేస్తాం అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. ఈ మీటింగ్‌తో పనేముంది?..ఆయన కోసం ఏం చెబుతాం:అయ్యన్న మంత్రి గారికి బోల్డన్ని పనులు.. ఈ మీటింగ్‌తో పని ఏముంది అంటూ మరోమంత్రి అయ్యన్నపాత్రుడు వ్యం గ్యంగా వ్యాఖ్యానించారు. ఆయన తీరు మీకు తెలియదా? అని ప్రశ్నించారు. పార్టీ సమావేశాన్ని కాదని పుట్టిన రోజు వేడుకల్లో గంటా పాల్గొన్నారట..మీ దృష్టికి రాలేదా? అంటూ విలేకర్లు మరోసారి గుచ్చిగుచ్చి ప్రశ్నించగా ఆయన కోసం ఏం చెబుతాం? అంటూ బదులివ్వడానికి కూడా ఇష్టపడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలక వీడలేదా? డీఎల్‌డీఏ వివాదంతో అలకపాన్పు ఎక్కిన గంటా ఇంకా పాన్‌ను దిగలేదన్న చర్చ పార్టీలో జరుగుతోంది. మంత్రి అయ్యన్న కోసం డీఎల్‌డీఏ పదవిని తన అనుచరుడు గాడు వెంకటప్పడుకు దక్కనీయకుండా హోంమంత్రి చినరాజప్ప కలెక్టర్‌పై ఒత్తిడి తేవడం పట్ల గంటా ఒకింత అసహనం వ్యక్తం చేశారు. చివరికి అదే చినరాజప్ప జోక్యంతో గంటా అనుచరుడే ఆ పదవి చేపట్టడంతో ఆ వివాదానికి తెరపడింది. కాగా ఓ పత్రికలో తనకు వ్యతిరేకంగా వచ్చిన సర్వేను సాకుగా చూపి గంటా కేబినెట్‌కు సైతం డుమ్మా కొట్టి గత నెలలో మరోసారి అలక బూనడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. జూన్‌లో జరిగిన పట్టాల పంపిణీకి వస్తున్న సీఎం పర్యటనలో మంత్రి పాల్గొంటారో లేదోనన్న పార్టీ శ్రేణుల్లో నెలకొంది. అయితే మళ్లీ ఇన్చార్జి మంత్రి చినరాజప్పే గంటా ఇంటికి వెళ్లి బుజ్జగించి తన వెంట తీసుకెళ్లి సీఎం పక్కనే కూర్చొబెట్టారు. సీఎం కూడా బుజ్జగించడంతో ఆయన కాస్త మెత్తబడినట్టు కనిపించారు. కానీ పార్టీ కార్యక్రమాలను మాత్రం పట్టించుకోవడం లేదని.. మరీ ముఖ్యంగా ఇన్చార్జి మంత్రి చినరాజప్ప పాల్గొన్న కార్యక్రమాలకు గంటా డుమ్మా కొడుతుండడం టీడీపీలోనే చర్చనీయాంశమైంది.