301 మండలాల్లో కరవు ఛాయలు
అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో 15, ప్రకాశం 56, నెల్లూరు 27, చిత్తూరు 66, వైఎస్సార్ 32, అనంతపురం 63, కర్నూలు 36, విజయనగరం జిల్లాలో 6 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి రూ.60 కోట్లు విడుదల చేశామన్నారు. కరవు ఉపశమనంలో భాగంగా రెయిన్‌గన్‌లు, స్ప్రింక్లర్ల కొనుగోలు, నిర్వహణ కోసం రూ.103.50 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు.
కరవు ప్రభావిత మండలాల్లో వంద రోజుల ఉపాధిని పూర్తి చేసిన కుటుంబాలకు మరో 50 రోజులు వేతనంతో కూడిన ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా అసంఘటిత రంగంలో ఇప్పటివరకూ 2.10 కోట్ల మంది కార్మికులను గుర్తించామని, వారిని చంద్రన్న బీమా పరిధిలోకి తెచ్చామని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. సాధారణ మరణం పొందిన 32,182 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున అందజేశామని చెప్పారు. ప్రమాదాల్లో 3,946 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 845 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు.