state home minister
-
Haryana Communal Clashes: 102 ఎఫ్ఐఆర్లు...200 మంది అరెస్ట్
చండీగఢ్: హరియాణాలో ఇటీవలి మత ఘర్షణలకు సంబంధించి మొత్తం 202 మందిని అరెస్ట్ చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ శుక్రవారం తెలిపారు. ముందు జాగ్రత్తగా మరో 80 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఘర్షణలపై 102 ఎఫ్ఐఆర్లను నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో సగం వరకు నూహ్ జిల్లాలోని వన్నారు. మిగతావి గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ జిల్లాల్లో నమోదయ్యాయన్నారు. ఘర్షణలకు కారకులైన వారిని వదిలే ప్రసక్తే లేదని మంత్రి చెప్పారు. పోలీస్స్టేషన్లపై జరిగిన దాడులకు కారకులను గుర్తించే పని మొదలయ్యిందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో శుక్రవారం ప్రార్థనలను ఇళ్ల వద్దే చేసుకోవాలని యంత్రాంగం ప్రజలకు సూచించిందన్నారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా కమిటీని వేశామని చెప్పారు. 250 గుడిసెలు కూల్చివేత టౌరు పట్టణంలోని ప్రభుత్వ జాగాలో నిర్మించుకున్న 250కి పైగా గుడిసెలను నూహ్ జిల్లా యంత్రాంగం శుక్రవారం కూల్చివేసింది. హరియాణా షహరి వికాస్ ప్రాధికారణ్(హెచ్ఎస్వీపీ)కి చెందిన ఎకరం భూమిలో బంగ్లాదేశీ వలసదారులు అక్రమంగా వీటిని నిర్మించుకున్నారని నూహ్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంత్ పన్వర్ చెప్పారు. వీరంతా గతంలో అస్సాంలో నివసించారని చెప్పారు. ఇటీవలి మత ఘర్షణలకు తాజాగా గుడిసెల కూల్చివేతకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆక్రమణల తొలగింపులో భాగంగానే ఈ గుడిసెలను కూల్చివేసినట్లు వివరించారు. -
301 మండలాల్లో కరవు ఛాయలు
► శాసన మండలిలో ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అమరావతి: రాష్ట్రంలోని 301 మండలాల్లో కరవు ఛాయలు అలుముకున్నాయని ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అదే విధంగా శ్రీకాకుళం జిల్లాలో 15, ప్రకాశం 56, నెల్లూరు 27, చిత్తూరు 66, వైఎస్సార్ 32, అనంతపురం 63, కర్నూలు 36, విజయనగరం జిల్లాలో 6 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తాగునీటి సమస్యను అధిగమించడానికి రూ.60 కోట్లు విడుదల చేశామన్నారు. కరవు ఉపశమనంలో భాగంగా రెయిన్గన్లు, స్ప్రింక్లర్ల కొనుగోలు, నిర్వహణ కోసం రూ.103.50 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. కరవు ప్రభావిత మండలాల్లో వంద రోజుల ఉపాధిని పూర్తి చేసిన కుటుంబాలకు మరో 50 రోజులు వేతనంతో కూడిన ఉపాధిని కల్పిస్తున్నామన్నారు. ప్రజా సాధికార సర్వే ద్వారా అసంఘటిత రంగంలో ఇప్పటివరకూ 2.10 కోట్ల మంది కార్మికులను గుర్తించామని, వారిని చంద్రన్న బీమా పరిధిలోకి తెచ్చామని కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు. సాధారణ మరణం పొందిన 32,182 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చొప్పున అందజేశామని చెప్పారు. ప్రమాదాల్లో 3,946 మంది మృతి చెందగా ఇప్పటి వరకు 845 బాధిత కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించినట్లు తెలిపారు. -
నక్కలగండికి నేడు హోంమంత్రి నాయిని రాక
చందంపేట : రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం నక్కలగండి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు దేవరకొండకు చేరుకుంటారు. ఐబీ అతిథిగృ హంలో అల్పాహారం తీసుకున్న అనంతరం 10.30 గంటలకు చందంపేట మండలంలోని తెల్దేవరపల్లి సమీపంలో నిర్మించనున్న నక్కలగండి (డిండి బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రదేశాన్ని సందర్శిస్తారు. అక్కడినుంచి డిండి మండలం గోనబోయినపల్లి వద్ద మిడ్ డిండి (ముర్పునూతుల) రిజర్వాయర్ నిర్మిత ప్రదేశాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత డిండి ప్రాజెక్టును సందర్శిస్తారు. భోజన విరామం తర్వాత కల్వకుర్తి మీదుగా హైదరాబాద్కు వెళతారు. -
హోం మంత్రి సీసీటీ సందర్శన
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్ర హోం మంత్రి కేజే. జార్జ్ మంగళవారం నగరంలోని సెంటర్ ఫర్ కౌం టర్ టైజం (సీసీటీ)ను సందర్శించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ తరహాలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు ఇక్కడ శిక్షణనిస్తారు. రాష్ట్ర పోలీసు శాఖ పరిధిలో పని చేసే ఈ కేంద్రంలో గరుడ ఫోర్స్...ఉగ్రవాదులను పట్టుకునే నమూనా ప్రదర్శన ను నిర్వహించింది. ఉగ్రవాదులు మాటు వేసిన భవనాన్ని చుట్టు ముట్టడం, ఎవరినైనా కిడ్నాప్ చేసి ఉంటే విడిపించడం లాంటి కార్యాచరణను ప్రదర్శించి చూపారు. పోలీసు శాఖలోని కొందరిని ప్రత్యేకంగా ఎం పిక చేసి, మూడు నెలల పాటు ఇక్కడ శిక్షణనిస్తారు. అనంతరం గరుడ ఫోర్స్లో చేర్చుకుంటారు. ఇప్పటికే ఈ కేంద్రంలో రెండు వేల మందికి పైగా శిక్షణనిచ్చారు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఈ బలగాన్ని వినియోగించుకుంటారు. మైసూరు దసరా, ఐపీఎల్ టోర్నీ సందర్భంగా వినియోగించుకున్నారు. మేజర్ జనరల్ ముత్తన్న నేతృత్వంలో శిక్షణనిస్తున్నారు. తన సందర్శన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుధాల ప్రదర్శనను మంత్రి తిలకించారు. ఆయన వెంట అదనపు డీజీపీ అమర్ కుమార్ పాండే, ఐజీ సీమంత్ కుమార్ ఉన్నారు.