నక్కలగండికి నేడు హోంమంత్రి నాయిని రాక
చందంపేట : రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శనివారం నక్కలగండి ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 9 గంటలకు దేవరకొండకు చేరుకుంటారు. ఐబీ అతిథిగృ హంలో అల్పాహారం తీసుకున్న అనంతరం 10.30 గంటలకు చందంపేట మండలంలోని తెల్దేవరపల్లి సమీపంలో నిర్మించనున్న నక్కలగండి (డిండి బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ ప్రతిపాదిత ప్రదేశాన్ని సందర్శిస్తారు. అక్కడినుంచి డిండి మండలం గోనబోయినపల్లి వద్ద మిడ్ డిండి (ముర్పునూతుల) రిజర్వాయర్ నిర్మిత ప్రదేశాన్ని పరిశీలిస్తారు. ఆ తర్వాత డిండి ప్రాజెక్టును సందర్శిస్తారు. భోజన విరామం తర్వాత కల్వకుర్తి మీదుగా హైదరాబాద్కు వెళతారు.