సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి చినరాజప్ప ఇంకా అలకవీడలేదు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభానికి గురువారం హోంమంత్రికి ఆహ్వానం లభించని విషయం తెలిసిందే. దీంతో అవమానంగా భావించిన చినరాజప్ప అప్పటి నుంచి అలకబూనారు. అయితే ఈ విషయంపై సీఎం చంద్రబాబు నాయుడు చినరాజప్పతో ఫోన్లో మాట్లాడారు. మీ శాఖలో మీరే సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని.. అధికారుల పట్ల మెతక వైఖరితో ఉండొద్దని చంద్రబాబు సూచించినట్టు తెలుస్తోంది.
శంకుస్ధాపనకు తనని పిలవకుండా అవమానించారని చినరాజప్ప మనస్థాపానికి గురయ్యారు. మంత్రినే పట్టించుకోకుంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. కాగా, ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు ప్రొటోకాల్ పాటించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు వ్యవహరించిన తీరు పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
(ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తున్నచంద్రబాబు.. )
Comments
Please login to add a commentAdd a comment