భీమవరం: రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పార్టీ ఫిరాయించడం ఎన్టీఆర్ కాలం నుంచే ఉన్నాయని, దీనిపై కొత్తగా రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదని ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇతర పార్టీల నాయకులు చేరడం వల్ల టీడీపీలో అసమ్మతి రాజుకుంటోందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వ్యాఖ్యానించారు. ఆ ప్రాంతంలోని నాయకులు, కార్యకర్తలను ఒప్పించే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇతర పార్టీ నాయకులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని పేర్కొన్నారు.
హోదా బాధ్యత బీజేపీదే..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చే విషయంలో టీడీపీ కంటే బీజేపీకే ఎక్కువ బాధ్యత ఉందని చినరాజప్ప అన్నారు. ఈ విషయంలో కేంద్రాన్ని ఇరుకునపెట్టే బలం తెలుగుదేశానికి లేదని చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం ఎక్కువ నిధులిస్తున్నట్టు చెబుతున్నా.. ఇప్పటివరకు కేవలం రూ. 2 వేల కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు.రాష్ట్రంలో రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ లో ఉందనీ, దీంతో అభివృద్ధిలో ముందుకు వెళ్లలేకపోతున్నట్లు చెప్పారు. పించన్ల పంపిణీలో ఇబ్బందులున్నాయని, అయినా ప్రతినెలా 87 శాతం పంపిణీని పూర్తి చేస్తున్నామని తెలిపారు. మిగతా వారికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని, ఇందుకోసం సాంకేతిక విధానాన్ని సవరిస్తామని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ కాలం నుంచే ఫిరాయింపులు!
Published Sat, May 14 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement