ప్రచారంలో చినరాజప్పకు చుక్కెదురు | Nimmakayala Chinnarajappa Persuaded Why They Did Not Solve Their Problems For Five Years | Sakshi
Sakshi News home page

ప్రచారంలో చినరాజప్పకు చుక్కెదురు

Published Mon, Apr 1 2019 10:17 AM | Last Updated on Mon, Apr 1 2019 1:09 PM

Nimmakayala Chinnarajappa Persuaded Why They Did Not Solve Their Problems For Five Years - Sakshi

చినరాజప్ప కాన్వాయిని అడ్డుకున్న యువకులు, గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేస్తున్న దృశ్యం

సాక్షి, సామర్లకోట (పెద్దాపురం) : తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం హుస్సేన్‌పురంలో ఆదివారం రాత్రి ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్పకు చుక్కెదురైంది. ఆయన్ని అడ్డగించిన గ్రామస్తులు ఐదేళ్లుగా తమ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేదని నిలదీశారు. రాజప్ప కాన్వాయికి అడ్డంగా బైఠాయించారు. గ్రామంలో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేదని, గ్రామాన్ని కాలుష్య కోరల్లోకి నెట్టేశారని మండిపడ్డారు. గ్రామస్తులు సమస్యల్ని వివరిస్తుండగానే చినరాజప్ప వాహనం ముందుకు సాగింది. దీంతో వారు ’రాజప్ప డౌన్‌ డౌన్, రాజప్ప గో బ్యాక్‌’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement