
సాక్షి, కాకినాడ జిల్లా: పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామేశ్వరం మెట్ట, ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన దొరబాబు.. గ్రావెల్ తరలింపు వ్యవహారంలో నిజాయితీని నిరూపించుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమయ్యారు.
ఢిల్లీలో ట్రూత్ ల్యాబ్ అనుమతి తీసుకొని.. సంతకం చేసిన బాండ్ పేపర్లతో లైడిటెక్టర్ పరీక్షల కోసం మున్సిపల్ సెంటర్‌కు బయలుదేరారు. లైడికెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని చినరాజస్పకూ దవలూరి సవాల్ విసిరారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పిఠాపురంలోని వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. దవులూరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్దపురం వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment