Lie Detector Test
-
కోల్ కతా డాక్టర్ ఘటన.. నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
కోల్ కతా డాక్టర్ ఘటన.. నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్
-
పెద్దాపురంలో వేడెక్కిన రాజకీయం.. లైడిటెక్టివ్ పరీక్షకు సిద్ధమన్న దవులూరి
సాక్షి, కాకినాడ జిల్లా: పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్సీపీ, టీడీపీ నేతల సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రామేశ్వరం మెట్ట, ఆనూరుమెట్ట మట్టి తవ్వకాలపై వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ దవులూరి దొరబాబుపై మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన దొరబాబు.. గ్రావెల్ తరలింపు వ్యవహారంలో నిజాయితీని నిరూపించుకునేందుకు లైడిటెక్టర్ పరీక్షకు సిద్ధమయ్యారు. ఢిల్లీలో ట్రూత్ ల్యాబ్ అనుమతి తీసుకొని.. సంతకం చేసిన బాండ్ పేపర్లతో లైడిటెక్టర్ పరీక్షల కోసం మున్సిపల్ సెంటర్‌కు బయలుదేరారు. లైడికెక్టర్ పరీక్షలకు సిద్ధం కావాలని చినరాజస్పకూ దవలూరి సవాల్ విసిరారు. దీంతో ఎలాంటి గొడవలు జరగకుండా పిఠాపురంలోని వైఎస్సార్సీపీ, టీడీపీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసుల మోహరించారు. దవులూరిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పెద్దపురం వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. -
క్షమాపణలు చెప్పు.. లేదా 'లై డిటెక్టర్' పరీక్షకు రా..
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు సవాల్ విసిరారు బీజేపీ నేత కపిల్ మిశ్రా. సీబీఐపై సిసోడియా చేసిన వ్యాఖ్యలకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే లై డిటెక్టర్, నార్కో పరీక్షకు సిద్ధమని మీడియా ముందుకు వచ్చి అంగీకరించాలన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలపై సిసోడియా ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సిసోడియాను సోమవారం 9 గంటలపాటు విచారించారు సీబీఐ అధికారులు. అనంతరం మీడియాతో మాట్లాడిన సిసోడియా.. తనను ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరాలని సీబీఐ అధికారులు బెదిరించారని, లేదంటే ఇలాగే మరిన్ని కేసుల్లో విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారని చెప్పారు. అంతేకాదు తనకు బీజేపీలో సీఎం పదవి ఆపర్ చేశారని పేర్కొన్నారు. ఈ విచారణ అనంతరం తనపై పెట్టింది తప్పుడు కేసు అని పూర్తిగా అర్థమైందని సిసోడియా అన్నారు. తనను ఏం చేసినా సరే ఆప్‌ను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సిసోడియా ఆరోపణలను సీబీఈ ఇప్పటికే ఖండించింది. ఆయన వ్యాఖ్యల్లో అసలు వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. వృత్తిపరంగానే తాము సిసోడియాను విచారించినట్లు స్పష్టం చేసింది. మున్ముందు కూడా చట్టప్రకారమే ఆయన్ను విచారిస్తామంది. తాజాగా బీజేపీ సిసోడియా వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. లై డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాల్ విసిరింది. చదవండి: మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష! -
‘ఆ మంత్రులకు లై డిటెక్టర్ పరీక్షలు చేయాలి’
సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై అన్నాడీఎంకే నేతలే పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆయన శనివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ జయలలిత మృతిపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని అన్నారు. రిటైర్డ్, సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే ప్రసక్తే లేదన్నారు. మంత్రులు శ్రీనివాసన్, సెల్లూరు రాజుకు లై డిటెక్టర్ పరీక్షలు చేసి విచారణ చేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. అంతేకాకుండా తమిళనాడులోని మంత్రులనే కాకుండా, ఇతర రాష్ట్రాలకు చెందినవాళ్లు, ఢిల్లీ నుంచి వచ్చినవాళ్లను, రాష్ట్ర గవర్నర్‌ను సైతం ఈ వ్యవహారంలో విచారించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిమ్స్ వైద్యులు, లండన్ వైద్యులను విచారణ పరిధిలోకి తీసుకువచ్చి సమగ్ర దర్యాప్తు సాగినప్పుడే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. మంత్రులకు సీఎం క్లాస్ జయలలిత ఆరోగ్యం గురించి మంత్రులు తలోవిధంగా చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనిస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టారాజ్యంగా మంత్రులు ఆరోపణలు, అనుమానాలు గుప్పిస్తున్న దృష్ట్యా, సర్కార్ ఇరుకునపడే పరిస్థితి ఉండటంతో ఆయన... మంత్రులందరినీ తన నివాసానికి పిలిపించి మరీ క్లాస్ పీకారు. ఏ ఒక్కరూ ఇక అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడకూడదని హెచ్చరించినట్లు సమాచారం. -
రెండోరోజు విచారణకు హాజరైన సల్వీందర్
న్యూఢిల్లీ : పంజాబ్ ఎస్పీ సల్వీందర్ సింగ్ రెండోరోజు ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) ఎదుట హాజరయ్యారు. ఆయనకు ఇవాళ లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు కేంద్రం నుంచి కూడా అనుమతి లభించినట్లు సమాచారం. కాగా పఠాన్‌కోట్‌పై దాడికి ముందు ఉగ్రవాదులు తనను కిడ్నాప్ చేశారని పేర్కొన్న సల్వీందర్ సింగ్ కిడ్నాప్‌కు ముందు, తర్వాత జరిగిన సంఘటనలపై ఆయన చెప్తున్న కథనాల్లో పొంతన లేని అంశాలు ఉండటంతో లోతుగా ప్రశ్నించేందుకు తన ఎదుట హాజరు కావాల్సిందిగా ఎన్ఐఏ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సల్వీందర్ సింగ్ పంజాబ్ సాయుధ పోలీసు 75వ బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు. నిన్న ఆయనను ఎన్ఐఏ బృందం సుమారు 8 గంటలపాటు సుదీర్ఘంగా విచారణ జరిపింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎన్ఐఏ మాత్రం సల్వీందర్కు క్లీన్ చిట్ ఇవ్వలేదు. దీంతో మరోసారి ఆయనను విచారణకు హాజరు కావాలని ఎన్ఐఏ ఆదేశించడంతో మరోసారి విచారణకు హాజరయ్యారు. -
ఎన్ఐఏ విచారణకు హాజరైన సల్వీందర్
కోల్‌కతా: ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ సోమవారం ఉదయం ఎన్ఐఏ ఉన్నత కార్యాలయ సముదాయానికి వచ్చారు. సోమవారం తమ ముందు హాజరుకావాలని ఎన్ఐఏ ఇచ్చిన నోటీసుల ప్రకారం ఆయన సోమవారం ఉదయమే అక్కడికి చేరుకున్నారు. పఠాన్ కోట్ పై జైషే ఈ మహ్మద్ ఉగ్రవాదులు దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి పరోక్షంగా సల్వీందర్ సహకరించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అనంతరం ఎన్ఐఏ సందించిన పలు ప్రశ్నలకు కూడా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు ఆయనపై మరింత అనుమానం పెరిగి లైడిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధమయ్యారు. -
సల్వీందర్ సత్యవంతుడో.. కాదో?
న్యూఢిల్లీ: పఠాన్ కోట్ దాడిపై విచారణలో భాగంగా గురుదాస్ పూర్ ఎస్పీ సల్వీందర్ సింగ్ ఇస్తున్న వివరణలు నిజాలా లేక అబద్ధాల అనే విషయం నేడు తేలనుంది. ఆయనకు నేడు సత్య శోధన (లై డిటెక్టర్) పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఈ కేసు విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ఆయనను ఇప్పటికే ఢిల్లీలో పాలిగ్రాప్ పరీక్షలకు తీసుకెళ్లింది. పాలిగ్రాప్ పరీక్షలకు హాజరుకావాలని పేర్కొంటూ ఈ నెల 8నే సల్వీందర్ సింగ్ కు ఎన్ఐఏ అధికారులు నోటీసులు జారీ చేశారు. పఠాన్ కోట్ దాడికి ముందు తమను కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని, వారి వాహనాల్లో భారీ ఆయుధ సామాగ్రి కూడా ఉందని, తనను మధ్యలో జీపులో నుంచి తోసేసి వెళ్లిపోయారని సల్వీందర్ సింగ్ ఎన్ఐఏ అధికారులకు చెప్పారు. అయితే, ఆయన ఇస్తున్న వివరణలు పలు రకాల అనుమానాలకు దారి ఇవ్వడంతోపాటు ఆ రోజు కిడ్నాప్ అయినట్లు చెప్తున్న ప్రాంతంలో దర్గా మూసే సమయం అయినా కావాలని తెరిపించి ఉంచారని, సల్వీందర్ స్నేహితుడు రెండుసార్లు దర్గాను సందర్శించారని ఆ దర్గాలో పనిచేసే వ్యక్తి చెప్పారు. దీంతో ఎన్ఐఏ అధికారులు సల్వీందర్ తీరును మరింత అనుమానించారు. పైగా ఆ దర్గా ప్రాంతంలో, సమీప పొలాల్లో వేర్వేరు సైజుల్లో ఉన్న కాలి బూటు గుర్తులను కూడా ఫొటోలు తీసుకుని పరిశీలించారు. దాదాపు అన్నిరకాలుగా సల్వీందర్‌ను విచారించిన ఎన్ఐఏ అధికారులు చివరికి పాలిగ్రాప్ పరీక్షలకు సిద్ధమయ్యారు. -
పీటర్ ముఖర్జియాకు లై డిటెక్షన్ పరీక్షలు
న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో స్టార్ గ్రూప్ మాజీ సిఈవో పీటర్ ముఖర్జియాకు అధికారులు శనివారం లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించారు. పీటర్ ముఖర్జియాను షీనా బోరా హత్య కేసులో గత పది రోజుల కిందటే సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఆయనను పలుమార్లు ప్రశ్నించినా.. సీబీఐ అధికారులు సరైన సమాధానాలు రాబట్టలేకపోయారు. విచారణకు సహకరించని నేపథ్యంలో ఆయనకు లై డిటెక్షన్ పరీక్షలు నిర్వహించాలని ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇప్పటికే ఆయన భార్య ఇంద్రాణి ముఖర్జియా జైలులో ఉన్న విషయం తెలిసిందే. -
పాక్ ఉగ్రవాది నవేద్‌కు ‘లై’ టెస్ట్
న్యూఢిల్లీ: పొంతనలేని సమాధానాలు చెబు తున్న పాకిస్తాన్ ఉగ్రవాది నవేద్ యాకూబ్‌కు మంగళవారం సత్య శోధన(లై డిటెక్టర్ టెస్ట్) పరీక్ష నిర్వహించారు. గట్టి భద్రత మధ్య నవేద్‌ను ఢిల్లీలోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి తీసుకువచ్చి, కాసేపు ఏకాంతంగా ఉంచారు. తర్వాత పరీక్ష జరిపారు. ఎన్ఐఏ, ఐబీ తదితర దర్యాప్తు, నిఘా సంస్థల ఉన్నతాధికారుల సమక్షంలో పరీక్ష జరిగింది. ‘భారత్‌లోకి ఎవరెవరు, ఏయే మార్గాల్లో వచ్చారు? భారత్‌లో ఎక్కడెక్కడ తలదాచుకున్నారు? మీకు ఇక్కడ సహకరించినవారెవరు?’ వంటి ప్రశ్నలను అధికారులు అడిగినట్లు సమాచారం. కాగా, నవేద్‌తో పాటు జమ్ముకశ్మీర్‌లోని గుల్మర్గ్ సెక్టార్లో భారత్‌లోకి చొరబడిన ఇద్దరు జర్గా అలియాస్ మొహమ్మద్ భాయి(40), అబూ ఒకాశ(18)ల ఊహాచిత్రాలను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. వారి వివరాలు తెలిపిన వారికి రూ. 5 లక్షల నగదు బహుమతిగా ఇస్తామని ప్రకటించింది.