
సాక్షి, కాకినాడ : నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడని, ఆయన ఎన్నిక చెల్లదని పెద్దాపురం వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్ తోట వాణి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌లో తనపై నమోదైన క్రిమినల్ కేసు, అరెస్ట్ వారెంట్‌లను పొందుపరచకుండా చినరాజప్ప దాచిపెట్టారని ఆమె తెలిపారు.
2007లో ఓబులాపురం మైనింగ్ కేసులో చినరాజప్పతోపాటు మరో ఇరవై మందిపై క్రిమినల్ కేసు నమోదైందని, ఈ కేసుకు సంబంధించి పలుమార్లు రాజప్పకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా వస్తున్న పెన్షన్ వివరాలను కూడా అఫిడవిట్‌లో చిన్నరాజప్ప సమర్పించలేదని, ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని మోసం చేసిన చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ తోట వాణి జూలై 5న హైకోర్టును ఆశ్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment