కబడ్డీలో ఓడించినందుకు కిరాతకం
తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్‌ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.
అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్‌పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్ కుటుంబం ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment