chopped
-
వేట కొడవళ్లతో నరుక్కున్న నవ దంపతులు!
కేజీఎఫ్/కోలారు: వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం.. పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో గానీ పెళ్లయిన రోజే ఏకాంతంగా ఉన్న సమయంలో ఇద్దరూ ఒకరిని ఒకరు వేట కొడవళ్లతో నరుక్కుని ప్రాణాలు తీసుకున్నారు. కర్ణాటకలోని కోలారు జిల్లా కేజీఎఫ్ పట్టణంలో బుధవారం సాయంత్రం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. కేజీఎఫ్ తాలూకా బైనేహళ్లికి చెందిన శ్రీనివాసులు, లక్ష్మి దంపతుల కుమార్తె లిఖితశ్రీ(19), చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని సంతూరు నివాసి మునియప్ప కుమారుడు నవీన్‌కుమార్(27)లు ప్రేమించుకున్నారు.పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధమయ్యారు. లిఖితశ్రీ ఇంటర్ పూర్తి చేయగా, నవీన్ దుస్తుల షాపు నిర్వహిస్తున్నాడు. కాగా, బుధవారం ఉదయం కర్ణాటక చండరసనహళ్లిలోని నవీన్‌కుమార్ సోదరి ఇంట్లో వారిద్దరి పెళ్లి వేడుక జరిగింది. ఇరు కుటుంబాల పెద్దలు, బంధువులు సంతోషంగా పాల్గొన్నారు. సాయంత్రం అదే గ్రామంలో ఉన్న నవీన్‌కుమార్ పెదనాన్న ఇంటికి కొత్త జంట వెళ్లింది. ఒక గదిలో విశ్రాంతి తీసుకునే సమయంలో నవ దంపతులు గొడవ పడ్డారు, గట్టిగా కేకలు వేయడంతో బంధువులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉన్నారు.ఇద్దరూ ఆ గదిలో ఉన్న వేట కొడవళ్లతో దాడి చేసుకున్నారని అనుమానాలున్నాయి. వధువు లిఖితశ్రీ ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మరణించింది. తీవ్ర గాయాలతో ఉన్న నవీన్ కుమార్‌ను అంబులెన్స్‌లో కోలారు ఆస్పత్రికి, అనంతరం బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించగా.. గురువారం ఉదయం ప్రాణాలు విడిచాడు. ఇలా కొత్త జంట కొన్ని గంటలకే ఈ లోకాన్ని వీడింది. జిల్లా ఎస్పీ శాంతరాజు, డీఎస్పీ పాండురంగ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ నవదంపతులు ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టమని ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. -
క్రిప్టో బిలియనీర్ విషాదాంతం: సూట్‌కేసులో డెడ్‌బాడీ ముక్కలు
Fernando perez algaba: అర్జెంటీనాకు చెందిన క్రిప్టోకరెన్సీ ఇన్‌ప్లూయెన్సర్ ఫెర్నాండో పెరెజ్ అల్గాబా (41) అదృశ్యమైన ఘటన విషాదాన్ని నింపింది. గత వారం రోజులకు ముందు తప్పిపోయిన ఫెర్నాండో శవమై కనిపించాడు. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఒక సూట్ కేసులో ఆయన మృతదేహానికి చెందిన కొన్ని భాగాలను పోలీసులు కనుగొన్నారు. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని ఒక ప్రవాహం సమీపంలో సూట్‌కేస్‌లో అల్గాబా అవశేషాలను పోలీసులు కను గొన్నారు. అనుమానాస్పద ఎర్రటి సూట్‌కేస్‌ని కొందరు చిన్నారులు ఆడుకుంటుండగా గుర్తించారు. దీంతో పెద్దల సాయంతో వారు పోలీసులకు సమాచారం అందించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీ చేయగా సూట్‌కేసులో అల్గాబా కాళ్లు, ముంజేతులు కనుగొన్నారని పోస్ట్ పేర్కొంది. అతని మరో చేయి ప్రవాహంలో కనిపించింది. చివరికి బాధితుడి మొండెం, కత్తిరించిన తల వంటి మరిన్ని శరీర భాగాలు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని బాడీ మీద ఉన్న వివిధ రకాల టాటూలు , వేలిముద్ర విశ్లేషణ ద్వారా అతని గుర్తించారు. అప్పుల కారణంగానే హత్య చేసి ఉంటారని వారు అనుమానిస్తున్నారు. తదుపరి విచారణ, శవపరీక్షలో ఫెర్నాండో పెరెజ్ అల్గాబా శరీరం మూడు బుల్లెట్ గాయాలున్నట్టు తేలింది. ఇదొక ఒక ప్రొఫెషనల్ నేరగాడి పని అని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అతను చాలా అప్పుల్లో ఉన్నాడని, మోసం ఆరోపణలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారం కోసం ఫెర్నాండో పెరెజ్ అల్గాబా మరణానికి కారణాలను పోలీసుల విచారిస్తున్నారు. కాగా అల్గాబా విలాసవంతమైన వాహనాలను అద్దెకు ఇవ్వడం, క్రిప్టోకరెన్సీని విక్రయించడం ద్వారా భారీ సంపదను ఆర్జించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు మిలియన్ ఫాలోయర్లు ఉన్నరు. విలాసవంతమైన జీవనశైలిని అనుసరించే ఈ క్రిప్టో ఇన్ఫ్లుయెన్సర్ ఎల్లప్పుడూ ‘ రాగ్స్ టు రిచెస్ స్టోరీ’ ల గురించి ఎక్కువ మాట్లాడుతుంటాడు. అతనికి అనేక కంపెనీలు కూడా ఉన్నాయి. 24 ఏళ్లకే అల్గాబా విలాసవంతమైన కార్లు, మోటార్‌సైకిళ్లు, జెట్ స్కీ లాంటి ఆస్తులున్నాయి. వీటిపై కూడా చాలా వివాదాలు ఉన్నట్టు సమాచారం. జూలై 19 నుంచి కనిపించకుండా పోయాడు. -
శ్రద్ధా దారుణ హత్య.. స్పందించిన బాలీవుడ్ నటి
న్యూఢిల్లీ: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ఢిల్లీలో మోహరౌలీ అడవుల్లోకి అఫ్తాబ్‌ను తీసుకెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 13 శరీర భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని గుర్తించాల్సి ఉంది. మరోవైపు ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలడంతో. అతడు వాడిన డేటింగ్ యాప్ ‘బబుల్’ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్ డేటింగ్ హిస్టరీ ఇవ్వాలని బబుల్‌కు లేఖ రాశారు. అతడి ప్రొఫైల్, యువతుల వివరాలు ఇవ్వాలని కోరారు. అంతేగాక అఫ్తాబ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది. అతనికి ఇన్‌స్టాలో 28 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో.. ఇదిలా ఉండగా ఢిల్లీ హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియురాలిని అత్యంత క్రూరంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన అఫ్తాబ్ అమీన్ పునావాలాకు మరణశిక్ష వేయాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక లవ్ జిహాద్ కోణం ఉందని ఆయన ఆనుమానిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘లవ్ జిహాద్ (ప్రేమ ముసుగులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం) పేరుతో నా కూతురిని హింసించాడని అనిపిస్తోంది. అఫ్తాబ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. కేసులో ఢిల్లీ పోలీసులపై నమ్మకం ఉంది. సరైన విధంగా విచారణ చేసి శిక్షిస్తారని ఆశిస్తున్నా. శ్రద్ధా వాళ్ల అంకుల్‌తో దగ్గరగా ఉంటుంది. నాతో ఎక్కువ మాట్లేడేది కాదు. నేను ఇప్పటి వరకు అఫ్తాబ్‌తో మాట్లాడలేదు. కూతురు కనిపించడం లేదని నవంబర్లోనే ముంబై వాసాయ్లో ముందుగా ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. అయితే శ్రద్ధ ఢిల్లీలో ఉందన్న విషయం తెలిసి కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. శ్రద్ధా అఫ్తాబ్ సంబంధం గురించి చెప్పడంతో కూతురు కనిపించకుండా పోవడం వెనక అతని హస్తం ఉందని అనుమానంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి కాగా శ్రద్ధా- అఫ్తాబ్ 2019 నుంచి రిలేషన్ షిష్‌లో ఉన్నారు. ఢిల్లీకి వచ్చే ముందు మార్చి ఏప్రిల్ నెలలో హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని ప్రదేశాలను చుట్టి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా కంటే ముందే అఫ్తాబ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత 18 రోజులపాటుటు తెల్లవారుజామున 2 గంటలకు శరీర భాగాలను బయట పారేశాడు. శ్రద్ధా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించేవాడు. హత్య గురించి ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. శ్రద్ధాను చంపిన గదిలోనే తాను ఉండేవాడు. స్పందించిన స్వరా భాస్కర్ ఢిల్లీలో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ కేసు ఎంతో విషాదకరమైనదని.. ఈ దారుణాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు. ప్రేమించిన వ్యక్తిని నమ్మి వెళ్తే ఇంత ఘోరానికి పాల్పడటం తన హృదయాన్ని ద్రవింపజేస్తోందన్నారు. పోలీసులు త్వరగా విచారణను ముగిస్తారని, ఈ రాక్షసుడికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. NO WORDS for how horrifying, gruesome & tragic this case is. My heart goes out to this poor girl-awful betrayal by someone she loved & trusted. Hope police speedily conclude their investigation & hope this monster gets the harshest punishment he thoroughly deserves. #shradhha 💔 https://t.co/W4w10JjdDf — Swara Bhasker (@ReallySwara) November 14, 2022 -
శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధాను చంపిన 15, 20 రోజుల్లోనే అప్తాబ్ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి యువతుకలు గాలం వేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో అదే డేటింగ్ యాప్‌లో శ్రద్ధాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇలా మరో యువతితో పరిచయం పెంచుకొని.. ప్రియురాలి శవం ఫ్రిజ్‌లో ఉండగానే జూన్, జూలై నెలలో ఆమెను ఇంటికి పిలిపించినట్లు తెలిసింది. అయితే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. శ్రద్ధా శరీర భాగాలను అల్మారాకు తరలించేవాడని తెలిపారు. అంతేగాక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పలువురు మహిళలను అతడు ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్, శ్రద్ధా శరీరాన్ని ముక్కలుగా చేసే ముందు రక్తపు మరకలు ఎలా శుభ్రం చేయాలో గూగుల్ చూసి నేర్చుకున్నట్లు, శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యుమన్ అనాటమీని చదివినట్లు పేర్కొన్నారు. క్రైం థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు చూసే అలవాటున్న అఫ్తాబ్.. అమెరికన్ వెబ్ సిరీస్ ‘డెక్సటర్’ ద్వారా ప్రేరణ పొంది శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు అగర్బత్తీలు వెలిగించడం, ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసుకునేవాడు. త్వరగా చెడిపోతున్న శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా…ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర! శ్రద్ధా హత్య తెలియకుండా ఉండేందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ ఉపయోగించేవాడు. దాని నుంచి తన స్నేహితులకు మెసెజ్ చూస్తూ ఉండేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించేవాడు. అయితే రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ఆరు నెలలకు ఈ ఉదంతం బయటకు రావడం గమనార్హం. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నారు. కాగా 24 ఏళ్ల శ్రద్ధాకు అఫ్తాబ్‌తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లు కలిసి జీవించారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ ఢిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి తీసుకురావడంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మే 18న మరోసారి ఇద్దిరి మధ్య గొడవ జరగడంతో శ్రద్ధను అత్యంత అమానుషంగా గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా కట్ చేసి పాడవకుండా ఉండేందుకు భారీ ఫ్రిజ్‌లో అమర్చాడు. తరువాత వాటిని ఒక్కొక్కొటిగా ఢిల్లీ నగరమంతా పారేశాడు. -
శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర!
న్యూఢిల్లీ: పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన ప్రియురాలిని అతికిరాతకంగా హత్య చేసిన ఓ ప్రియుడి ఉదంతం.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రియురాలిని చంపి 35 ముక్కలుగా చేసి.. నగరంలో అక్కడక్కడ పడేశాడు దుండగుడు. దేశరాజధాని నుంచి వెలుగు చూసిన ఈ కేసు దేశవ్యాప్తంగా తీవ్రచర్చనీయాంశంగా మారింది. అయితే.. ఈ కేసులో దుండగుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా(28)ను పటిష్టమైన భద్రత నడుమ ఉంచారు పోలీసులు. సౌత్ ఢిల్లీలోకి మెహ్రౌలీ పోలీస్ స్టేషన్లో మరో ఖైదీతో పాటు ఉంచారు. నేలపై దుప్పటి కప్పుకుని అతని ప్రశాంతంగా నిద్రించడం చూడొచ్చు. ఇక సెల్‌ను కవర్ చేసేలా సీసీటీవీ ఫుటేజీని ఉంచిన పోలీసులు.. ఆ సెల్ బయట ఇద్దరు కానిస్టేబుళ్లను కాపలా ఉంచారు. అంతేకాదు.. అధికారులు సైతం అతని కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక లోపల ఉన్న మరో ఖైదీ బిక్కుబిక్కుమంటూ కనిపించడం వీడియోలో ఉంది. తనను సెల్ మార్చాలని ఆ ఖైదీ వేడుకుంటున్నట్లు తెలుస్తోంది. కీలకమైన కేసు కావడం, పైగా అప్తాబ్ మానసిక స్థితిపై అనుమానాల నేపథ్యంలోనే ఇలా జాగ్రత్తలు వహిస్తున్నారు. కోర్టు తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు అతన్ని అలాగే చూసుకోవాల్సి ఉంటుంది. #Delhi : Shraddha Walker murder केस में आरोपी Aftab Amin Poonawalla का जेल वाला Video आया सामने.#shraddhawalker #ShraddhaWalkermurder #AftabAminPoonawalla #DelhiMurder pic.twitter.com/nhqAvRCZ6N — Eyenews (@eyenewsup) November 15, 2022 శ్రద్ధా వాల్కర్ అనే యువతితో సహజీవనం చేసిన అఫ్తాబ్ అమీన్ పూనావాలా.. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి నో చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ క్రమంలో ఈ ఏడాది మే 18వ తేదీన ఆమెను గొంతు కోసి హత్య చేశాడు. ఆపై ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఓ పెద్ద ఫ్రీజర్‌లో భద్రపరిచాడు. పద్దెనిమిది రోజులపాటు రోజూ అర్ధరాత్రి పూట బయటకు వెళ్లి.. ఆమె విడిభాగాల్ని నగరంలో అక్కడక్కడ పడేసి వచ్చాడు. రెండు నెలలుగా ఆమె సోషల్ మీడియా అకౌంట్లు యాక్టివ్‌గా లేకపోవడం, ఫోన్ సైతం లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె సోదరుడు.. తండ్రికి విషయం చెప్పాడు. ఆయన నవంబర్‌లో కూతురు ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా.. తాళం వేసి ఉంది. దీంతో పోలీసులకు కిడ్నాప్ ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగు చూసింది. ముంబైలో ఓ ఎంఎన్సీ కాల్సెంటర్లో పని చేసే శ్రద్ధకు.. డేటింగ్ యాప్ ద్వారా అఫ్తాబ్‌తో పరిచయం అయ్యింది. ఇంట్లో వాళ్లు వాళ్ల రిలేషన్‌షిప్‌కు ఒప్పుకోకపోవడంతో.. ముంబైని విడిచి ఢిల్లీకి వచ్చారు. పెళ్లి చేసుకోమని కోరడంతో అతను ఒప్పుకోలేదు. మరికొందరు అమ్మాయిలతో అతను సంబంధం కొనసాగించినట్లు శ్రద్ధకు తెలిసింది. దీంతో ఆమె పెళ్లి కోసం ఒత్తిడి చేయడంతోనే దారుణంగా హతమార్చాడు. విచారణలో తొలుత పొంతన లేకుండా సమాధానాలు చెప్పిన అఫ్తాబ్.. చివరకు నేరం అంగీకరించాడు. అతని ఫోన్ హిస్టరీలో నేరానికి సంబంధించిన ఆధారాలు కూడా దొరికాయి. ఆంగ్ల క్రైమ్ సిరీస్ డెక్స్టర్ ప్రేరణతోనే తాను ఈ హత్య చేశానని నేరం ఒప్పుకున్నాడు అప్తాబ్. సంబంధిత కథనం: 300 లీటర్ల ఫ్రిడ్జి కొని.. అగరబత్తులతో.. -
ఢిల్లీలో దారుణ ఘటన.. యువతిని 35ముక్కలుగా..
-
షాకింగ్: సహజీవనం, ప్రియురాలి మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి..
ఒక జంట ఇంట్లోంచి పారిపోయి సహజీవనం చేశారు. పెళ్లి ప్రస్తావన వచ్చేటప్పటికీ ఇద్దరి మధ్య పెద్ద గొడవయ్యేది. ఆ గొడవ కాస్త దారుణమైన హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...అఫ్తాబ్ అమీన్ పూనావల్ల అనే యువకుడు 26 ఏళ్ల శ్రద్ధా అనే అమ్మాయితో సహజీనం చేస్తున్నాడు. శ్రద్ధా ముంబైలోని ఒక మల్టీనేషనల్ కంపెనీ కాల్ సెంటర్లో పనిచేస్తోంది. అక్కడే పూనావల్లతో పరిచయం ఏర్పడింది. వీరి స్నేహం ఇద్దరూ డేటింగ్ చేసుకునేంత వరకు వచ్చింది. వీళ్లిద్దరి వ్యవహారం శ్రద్ధ వాళ్ల కుటుంబసభ్యులకు నచ్చలేదు. దీంతో వారు ఇంట్లోంచి పారిపోయి ఢిల్లీలోని మెహ్రౌలీలో ఒక ప్లాట్‌కి మకాం మార్చి అక్కడే కలిసి ఉంటున్నారు. ఐతే గత కొద్దిరోజులుగా ఆమె నుంచి కుటుంబసభ్యులకు కాల్స్ రావడం లేదు. దీంతో అనుమానం వచ్చిన శ్రద్ధా తండ్రి వికాశ్ మదన్ ఢిల్లీ వచ్చి ఆమె గురించి వాకాబు చేస్తూ...ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. దీంతో ఆయన పోలీసులుకు తన కూతురు కనిపించడం లేదంటూ పూనావల్లపై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేయడం ప్రారంభించారు. పోలీసులు పూనావల్ల కోసం తీవ్రంగా గాలించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో అతను చెప్పిన విషయాలు విని పోలీసులు షాక్ అయ్యారు. విచారణలో పూనావ్లల...తనని శ్రద్ధ తరచూ పెళ్లిచేసుకోమని పోరు పెడుతున్నట్లు తెలిపాడు. పెళ్లి విషయమై ఇద్దరు గొడవపడినట్లు తెలిపాడు. ఐతే ఒకరోజు ఆ గొడవ తారస్థాయికి చేరుకోవడంతో తాను కోపంతో శ్రద్ధా గొంతుకోసి హతమార్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా కోసి ఒక ఫ్రిజ్ కొనుక్కుని మరీ భద్రపర్చినట్లు తెలిపాడు. ఆ తర్వాత ఆ ముక్కలను పడేసేందుకు రోజు తెల్లవారుజామున 2 గంటలకు వెళ్లి వేర్వేరు ప్రాంతాల్లోపడేసి వచ్చినట్లు చెప్పాడు. దీంతో ఈ కేసు మర్డర్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. (చదవండి: మారణాయుధాలతో వచ్చి, అక్షితపై దాడిచేసి...) -
ఘోరం: వెండి వస్తువుల కోసం ఏకంగా వృద్ధురాలి కాలు నరికి...
జైపూర్: వెండి ఆభరణాల కోసం ఒక దొంగల ముఠా ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధురాలి కాలుని దారుణంగా నరికేశారు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వృద్ధురాలు ఆరు బయట నిద్రిస్తున్నప్పుడు ఒక దొంగల ముఠా వెండి వస్తువుల కోసం ఏకంగా కాలుని నరికి వెళిపోయారు. ఈ విషయాన్ని ఇంటి ఓనర్ తెలియజేయడంతో తమకు తెలిసిందని బాధితురాలి మనవరాలు చెబుతోంది. ఆమె వచ్చి చూసేసరికి వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు తెలిపింది. ఈ మేరకు భాధితురాలిని గంగా దేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై పలు గాయాలన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తెల్లవారుజామున తమకు ఈ విషయమై కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి సుమారు 100 ఏళ్లు ఉండవచ్చని, చాలా తీవ్రంగా గాయపడిందని అన్నారు. ఈ మేరకు పోలీసులు భాదితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం) -
ప్రియున్ని చంపి.. కూర వండేసింది..!
అబుదాబి : యూఏఈకి చెందిన ఓ మహిళ తన ప్రియున్ని చంపడమే కాక అతని మాంసంతో ఓ మొరాకో వంటకాన్ని తయారు చేసింది. అనంతరం అక్కడ పని చేస్తోన్న భవన నిర్మాణ కార్మికులకు ప్రియుడి మాంసంతో వండిన వంటని వడ్డించింది. అబుదాబికి చెందిన ఓ వార్తాసంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ మహిళ తన ప్రియుడితో ఏడేళ్లుగా సహజీవనం చేస్తోంది. కానీ సదరు వ్యక్తి ఆమెను కాదని మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడు. దాంతో తనను తిరస్కరించిన వ్యక్తిమీద పగ తీర్చుకోవాలని భావించిన మహిళ అతన్ని హత్య చేసింది. అంతటితో ఆగకుండా అతని శరీరంలో కొన్ని భాగాలను ముక్కలు చేసి వండింది. మిగిలిన మృత దేహాన్ని కుక్కలకు వేసినట్లు స్వయంగా సదరు మహిళే కోర్టు విచారణలో తెలిపిందని ‘ఖలీజ్ టైమ్స్’ పేర్కొంది. నెల రోజుల క్రితం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగు చూసింది. తన సోదరుడు కనిపించడం లేదని మృతుడి తమ్ముడు.. సదరు మహిళ ఇంటి వద్ద తనిఖీ చేయడంతో అసలు విషయం బయటపడింది. తొలుత మహిళను ప్రశ్నించగా.. తనకేమీ తెలియదని చెప్పింది. అయితే ఆమె ఇంట్లో ఓ మనిషి దంతాలు కనిపించడంతో అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. నిందితురాలి ఇంట్లో దొరికిన దంతాలను డీఎన్ఏ పరీక్ష కోసం పంపగా అవి మృతుడివేనని తేలడంతో ఈ హత్యోదంతం వెలుగు చూసింది. -
చుక్కకూర విత్తనాల సేకరణ ఎలా?
► మన విత్తనాలను మనం కట్టుకోవడం మంచిది. మార్కెట్లో దొరికే విత్తనాలు ఒక్కోసారి మొలవవు. మొలిచినా బూడిద తెగులువి అయ్యుండే ప్రమాదం ఉంటుంది! చక్కని ఆరోగ్యవంతమైన విత్తనాలను మనం మన తోటలోనే కట్టుకోవడం మంచిది. ► చుక్క కూర పూత దశకు రాగానే రెండు, మూడు బలమైన ఆరోగ్యవంతమైన మొక్కలను విత్తనం కోసం వదలాలి. వాటిని కొయ్యకూడదు. ► పువ్వుల మధ్యలో విత్తనాలు ఉంటాయి. చిన్న చిన్న స్పాంజి ముక్కల్లా కనిపిస్తాయి. గాలి ద్వారా వ్యాప్తి చెందే విత్తన రకం చుక్కకూర! ► పువ్వులు క్రమంగా ఎండుతాయి. బాగా ఎండిన తరువాత పువ్వుల గుత్తులను కొయ్యాలి. మరో రెండు రోజులు బాగా ఎండబెట్టాలి. తరువాత కుండలో నిల్వ చేసుకోవడం మంచిది! పైన మూత పెట్టుకోవాలి. వెంటనే కానీ తరువాత కానీ ఎప్పుడు అవసరం పడితే అప్పుడు నాటుకోవచ్చు. ఈ దిగువ విత్తనాలు వందల మందికి ఇవ్వవచ్చు. అలా ఇస్తున్నాం కూడా, మా మిద్దెతోట చూడ వచ్చిన వారికి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దె తోటల నిపుణులు -
బీడీ కోసం చేయి నరికాడు
ఆగిరిపల్లి: బీడి ఇవ్వనందుకు తోటి వ్యక్తిపై కత్తితో దాడి చేసి అతని చేతిని నరికేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన అవుటుపల్లి జోగి(30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. జోగి సోమవారం ఉదయం పనికి వెళ్లడానికి సెంటర్‌కు వచ్చిన అతను పక్కనే ఉన్న కె.ముసలయ్య(50)ను బీడీ అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన జోగి తన చేతిలో ఉన్న కర్ర కత్తితో ముసలయ్యపై దాడి చేశాడు. ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి ముసలయ్య చేయి అడ్డం పెట్టాడు. జోగీ బలంగా విసిరిన కర్రకత్తి ధాటికి ముసలయ్య చేయి తెగి పడిపోయింది. వెంటనే భయంతో జోగి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతని ఇంటికి వెళ్లి జోగికి దేహశుద్ధి చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జోగిని అదుపులోకి తీసుకున్నారు. మానవ సంబంధాలు పలుచ బారుతున్నాయనడానికి ఈ సంఘటనే సాక్ష్యం అని స్థానికులు వాపోతున్నారు. -
పొరపాటున మరో మహిళ చేయి నరికేశారు
బెంగళూరు: బెంగళూరులో ఇంటి యజమానికి.. మరొకరికి రగిలిన చిన్న వివాదంలో ఇంట్లో అద్దెకున్న పాపానికి ఓ మహిళ గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇసుక విషయంలో తమతో గొడవ పడిన వ్యక్తి బంధువుగా భావించి ఇంట్లో అద్దెకుంటున్న మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. అయితే ఈ విషయం తమ విచారణలో బయటపడిందని రాం నగర్ ఎస్పీ చంద్రగుప్త శనివారం తెలిపారు. వివరాల్లోకి వెళితే... తవేరాకరే గ్రామంలో ఇసుక విషయంలో కుమార్ , నింజే గౌడలతో ముగ్గురు వ్యక్తులు జులై 1న ఘర్షణ పడ్డారు. దీంతో ఎలాగైనా కుమార్, గౌడ్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పథకం వేశారు. శుక్రవారం కుమార్ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడ్డారు. అతని బంధువుగా భావించి ఇంట్లో అద్దెకుంటున్న ఒంటరి మహిళపై కత్తులతో విరుచుపడ్డారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినపుడు ఆమె ఎడమ చేతిని నరికేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు తెగిన ఆమె చేతిని అతికించారు. దాడి సమయంలో మహిళ భర్త కూడా ఇంట్లో లేడని, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని చంద్రగుప్త తెలిపారు.