న్యూఢిల్లీ: ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. శ్రద్ధా శరీర భాగాలను పడేసిన ఢిల్లీలో మోహరౌలీ అడవుల్లోకి అఫ్తాబ్‌ను తీసుకెళ్లిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే 13 శరీర భాగాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తిని గుర్తించాల్సి ఉంది.
మరోవైపు ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్‌మెంట్‌లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలడంతో. అతడు వాడిన డేటింగ్ యాప్ ‘బబుల్’ నుంచి సమాచారం సేకరిస్తున్నారు. అఫ్తాబ్ డేటింగ్ హిస్టరీ ఇవ్వాలని బబుల్‌కు లేఖ రాశారు. అతడి ప్రొఫైల్, యువతుల వివరాలు ఇవ్వాలని కోరారు. అంతేగాక అఫ్తాబ్ సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉన్నట్లు తేలింది. అతనికి ఇన్‌స్టాలో 28 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
చదవండి: శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో..
ఇదిలా ఉండగా ఢిల్లీ హత్య ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియురాలిని అత్యంత క్రూరంగా చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. తన కూతురిని హత్య చేసిన అఫ్తాబ్ అమీన్ పునావాలాకు మరణశిక్ష వేయాలని శ్రద్ధా తండ్రి డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనక లవ్ జిహాద్ కోణం ఉందని ఆయన ఆనుమానిస్తున్నారు. ఆయన మాట్లాడుతూ..
‘లవ్ జిహాద్ (ప్రేమ ముసుగులో బలవంతంగా మత మార్పిడికి పాల్పడటం) పేరుతో నా కూతురిని హింసించాడని అనిపిస్తోంది. అఫ్తాబ్‌ను ఉరితీయాలని డిమాండ్ చేస్తున్నాను. కేసులో ఢిల్లీ పోలీసులపై నమ్మకం ఉంది. సరైన విధంగా విచారణ చేసి శిక్షిస్తారని ఆశిస్తున్నా. శ్రద్ధా వాళ్ల అంకుల్‌తో దగ్గరగా ఉంటుంది. నాతో ఎక్కువ మాట్లేడేది కాదు. నేను ఇప్పటి వరకు అఫ్తాబ్‌తో మాట్లాడలేదు. కూతురు కనిపించడం లేదని నవంబర్‌లోనే ముంబై వాసాయ్‌లో ముందుగా ఫిర్యాదు చేశాను’ అని తెలిపారు. అయితే శ్రద్ధ ఢిల్లీలో ఉందన్న విషయం తెలిసి కేసును ఢిల్లీ పోలీసులకు బదిలీ చేశారు. శ్రద్ధా అఫ్తాబ్ సంబంధం గురించి చెప్పడంతో కూతురు కనిపించకుండా పోవడం వెనక అతని హస్తం ఉందని అనుమానంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
చదవండి: ఢిల్లీ: ప్రియురాలి హత్యోదంతం.. సంచలన విషయాలు వెలుగులోకి
కాగా శ్రద్ధా- అఫ్తాబ్ 2019 నుంచి రిలేషన్ షిష్‌లో ఉన్నారు. ఢిల్లీకి వచ్చే ముందు మార్చి ఏప్రిల్ నెలలో హిమాచల్ ప్రదేశ్ వంటి కొన్ని ప్రదేశాలను చుట్టి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శ్రద్ధా కంటే ముందే అఫ్తాబ్‌కు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. శ్రద్ధాను హత్య చేసిన తరువాత 18 రోజులపాటుటు తెల్లవారుజామున 2 గంటలకు శరీర భాగాలను బయట పారేశాడు. శ్రద్ధా బతికే ఉందని నమ్మించేందుకు ఆమె సోషల్ మీడియా అకౌంట్లను ఉపయోగించేవాడు. హత్య గురించి ఎవరికి అనుమానం రాకుండా ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాడు. శ్రద్ధాను చంపిన గదిలోనే తాను ఉండేవాడు.
స్పందించిన స్వరా భాస్కర్
ఢిల్లీలో ప్రియురాలిని అతి కిరాతకంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ కేసు ఎంతో విషాదకరమైనదని.. ఈ దారుణాన్ని చెప్పడానికి మాటలు రావడం లేదని అన్నారు. ప్రేమించిన వ్యక్తిని నమ్మి వెళ్తే ఇంత ఘోరానికి పాల్పడటం తన హృదయాన్ని ద్రవింపజేస్తోందన్నారు. పోలీసులు త్వరగా విచారణను ముగిస్తారని, ఈ రాక్షసుడికి కఠిన శిక్ష పడుతుందని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
NO WORDS for how horrifying, gruesome & tragic this case is. My heart goes out to this poor girl-awful betrayal by someone she loved & trusted. Hope police speedily conclude their investigation & hope this monster gets the harshest punishment he thoroughly deserves. #shradhha 💔 https://t.co/W4w10JjdDf
— Swara Bhasker (@ReallySwara) November 14, 2022
Comments
Please login to add a commentAdd a comment