బీడీ కోసం చేయి నరికాడు | man hand chopped off clash | Sakshi
Sakshi News home page

బీడీ కోసం చేయి నరికాడు

Published Mon, Aug 3 2015 10:51 AM | Last Updated on Mon, Oct 8 2018 3:07 PM

man hand chopped off clash

ఆగిరిపల్లి: బీడి ఇవ్వనందుకు తోటి వ్యక్తిపై కత్తితో దాడి చేసి అతని చేతిని నరికేశాడో ప్రబుద్ధుడు. ఈ సంఘటన కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలంలో సోమవారం ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు... గ్రామానికి చెందిన అవుటుపల్లి జోగి(30) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. జోగి సోమవారం ఉదయం పనికి వెళ్లడానికి సెంటర్‌కు వచ్చిన అతను పక్కనే ఉన్న కె.ముసలయ్య(50)ను బీడీ అడిగాడు. అతను ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తుడైన జోగి తన చేతిలో ఉన్న కర్ర కత్తితో ముసలయ్యపై దాడి చేశాడు.

ఈ దాడి నుంచి తప్పించుకోవడానికి ముసలయ్య చేయి అడ్డం పెట్టాడు. జోగీ బలంగా విసిరిన కర్రకత్తి ధాటికి ముసలయ్య చేయి తెగి పడిపోయింది. వెంటనే భయంతో జోగి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతని ఇంటికి వెళ్లి జోగికి దేహశుద్ధి చేశారు. ఇంతలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జోగిని అదుపులోకి తీసుకున్నారు. మానవ సంబంధాలు పలుచ బారుతున్నాయనడానికి ఈ సంఘటనే సాక్ష్యం అని స్థానికులు వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement