జైపూర్: వెండి ఆభరణాల కోసం ఒక దొంగల ముఠా ఆరు బయట నిద్రిస్తున్న వృద్ధురాలి కాలుని దారుణంగా నరికేశారు. ఈ ఘటన జైపూర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...వృద్ధురాలు ఆరు బయట నిద్రిస్తున్నప్పుడు ఒక దొంగల ముఠా వెండి వస్తువుల కోసం ఏకంగా కాలుని నరికి వెళిపోయారు. ఈ విషయాన్ని ఇంటి ఓనర్ తెలియజేయడంతో తమకు తెలిసిందని బాధితురాలి మనవరాలు చెబుతోంది. ఆమె వచ్చి చూసేసరికి వృద్ధురాలు ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులకు తెలిపింది.
ఈ మేరకు భాధితురాలిని గంగా దేవిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఒంటిపై పలు గాయాలన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. తెల్లవారుజామున తమకు ఈ విషయమై కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. బాధితురాలికి సుమారు 100 ఏళ్లు ఉండవచ్చని, చాలా తీవ్రంగా గాయపడిందని అన్నారు. ఈ మేరకు పోలీసులు భాదితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: దోపిడి చేసేందుకు వచ్చి కాల్పుల వీరంగం)
Comments
Please login to add a commentAdd a comment