జి.కొండూరు, న్యూస్‌లైన్ : వ్యసనాలకు బానిసై డబ్బు కోసం దొంగతనా లు చేస్తున్న వ్యక్తిని, అతడు దొంగిలించిన సొత్తును అమ్మేందుకు సహకరిస్తున్న మరొకరిని స్థానిక పోలీ సులు శుక్రవారం అరెస్టు చేశారు. స్థానిక పోలీస్‌స్టేష న్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ విజయారావు ఈ వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం.. మండలంలోని చెరువుమాధవరం గ్రామానికి చెందిన మాలావత్ రమేష్(32) కూలి పనులు చేస్తుంటాడు. కొన్నేళ్లుగా వ్యసనాలకు బానిసయ్యాడు.
ఇందుకు అవసరమైన సొమ్ము కోసం దొంగతనాలకు అలవాటు పడ్డాడు. స్వగ్రామంతోపాటు పొరుగున ఉన్న ఊళ్లలో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా ఎంచుకునేవాడు. రాత్రివేళ ఆ ఇళ్ల తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, డబ్బు దొంగిలించేవాడు. వాటిలో బంగారు, వెండి వస్తువులను విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న ఏకాంబరం, బాబావలి సహకారంతో అమ్ముకుని, వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవాడు. డబ్బు ఖర్చయ్యాక మరలా దొంగతనం చేసేవాడు. ఇలా ఏడాది కాలంగా రమేష్ చెరువుమాధవరం, రామన్నపాలెం, గంగినేని గ్రామాల్లో ఐదు ఇళ్లల్లో సుమారు రూ.4 లక్షల విలువగల సొత్తు దొంగిలించాడు.
ఈ చోరీ ఘటనలపై బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదులు అందాయి. పోలీసులకు రమేష్‌పై అనుమానం వచ్చి, నిఘా ఉంచారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలు చేసినట్లు అంగీకరించాడు. దీంతో అతడి వద్ద నుంచి ఉంగరం, తాళిబొట్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రమేష్‌ను, అతడికి సహకరించిన ఏకాంబరాన్ని కూడా అరెస్టు చేశారు. ఈ కేసుల్లో మరో నిందితుడు బాబావలి ప్రస్తుతం ఏలూరు సబ్ జైలులో ఉన్నాడని సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సై హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు.
జల్సాల కోసం చోరీలు
Published Sat, Aug 17 2013 1:25 AM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM
Advertisement