పొరపాటున మరో మహిళ చేయి నరికేశారు | Karnataka: Woman's hand chopped off in mistaken identity | Sakshi
Sakshi News home page

పొరపాటున మరో మహిళ చేయి నరికేశారు

Published Sat, Jul 4 2015 12:23 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

పొరపాటున మరో మహిళ చేయి నరికేశారు - Sakshi

పొరపాటున మరో మహిళ చేయి నరికేశారు

బెంగళూరు:  బెంగళూరులో ఇంటి యజమానికి.. మరొకరికి రగిలిన చిన్న వివాదంలో  ఇంట్లో అద్దెకున్న పాపానికి  ఓ మహిళ  గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.   ఇసుక  విషయంలో   తమతో గొడవ పడిన వ్యక్తి బంధువుగా భావించి ఇంట్లో అద్దెకుంటున్న మహిళపై ముగ్గురు వ్యక్తులు దాడిచేసి గాయపర్చారు. అయితే ఈ విషయం తమ విచారణలో బయటపడిందని రాం నగర్ ఎస్పీ చంద్రగుప్త  శనివారం తెలిపారు.

వివరాల్లోకి వెళితే... తవేరాకరే గ్రామంలో ఇసుక  విషయంలో  కుమార్ , నింజే గౌడలతో ముగ్గురు వ్యక్తులు జులై 1న ఘర్షణ పడ్డారు.  దీంతో  ఎలాగైనా కుమార్, గౌడ్పై ప్రతీకారం తీర్చుకోవాలని  పథకం వేశారు.    శుక్రవారం  కుమార్ ఇంట్లోకి దౌర్జన్యంగా  చొరబడ్డారు.  అతని బంధువుగా భావించి ఇంట్లో అద్దెకుంటున్న ఒంటరి మహిళపై కత్తులతో విరుచుపడ్డారు.  దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించినపుడు ఆమె ఎడమ చేతిని నరికేశారు.

దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.   వెంటనే శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యులు తెగిన ఆమె చేతిని అతికించారు. దాడి సమయంలో మహిళ భర్త కూడా ఇంట్లో లేడని, ప్రస్తుతం బాధితురాలు కోలుకుంటోందని చంద్రగుప్త తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement