alleged
-
నా భార్యపై దారుణంగా దాడి చేశారు.. ఆర్మీజవాన్ వీడియో కలకలం
కొంతమంది వ్యక్తులు నా భార్యపై దారుణంగా దాడి చేశారంటూ ఓ ఆర్మీ జవాన్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో తీవ్ర కలకలం రేపింది. ఈ మేరకు తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో కడవాసల్ గ్రామంలో కొందరు వ్యక్తులు నా భార్యను అర్థనగ్నంగా చేసి దాడి చేశారంటూ ఆమె భర్త ఆర్మీ జవాన్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వీడియోని రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఎన్ త్యాగరాజన్ పోస్ట్ చేశారు. ఆ వీడియోలో.. ఆరోపణలు చేస్తున్న ఆర్మీ జవాన్ హవల్దార్ ప్రభాకరన్ తమిళనాడులోని పడవేడు గ్రామానికి చెందిన వ్యక్తి. అతను ప్రస్తుతం కాశ్మీర్లో ఉద్యోగం చేస్తున్నాడు. ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియోలో అతను తన భార్యకు జరిగిన అవమానం గురించి వివరించాడు. తన భార్య ఒక స్థలంలో లీజుకు ఓ దుకాణం నుడుపుతోందని వీడియోలో తెలిపాడు. ఆమెను 120 మంది వ్యక్తలు కొట్టి షాపులోని వస్తువులను బయటకు విసిరేశారు. ఎస్పీకి ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కత్తులతో నా కుటుంబంపై దాడి చేసి బెదిరించారని, తన భార్యను అర్ధ నగ్నం చేసి దారుణంగా కొట్టారని ఆరోపణలు చేశాడు. అయితే పోలీసులు అతని ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు కంధవాసల్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేసి ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటనలో..రేణుగాంబాల్ ఆలయానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాన్ని ప్రభాకరన్ మామగారైన సెల్వమూర్తి కుమార్ నుంచి ఐదేళ్ల కాలానికి రూ. 9.5 లక్షలకు లీజుకు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కుమార్ మరణించిన తర్వాత అతని కుమారుడు రాము దుకాణాన్ని తిరిగి ఇవ్వాలని కోరాడు. అందుకు డబ్బు తిరిగి ఇవ్వడాన్ని కూడా అంగీకరించడమే గాక ఒప్పందంపై సంతకం కూడా చేశాడు. ఐతే సెల్వమూర్తి డబ్బు తీసుకునేందుకు తిరస్కరించడమే గాక దుకాణం నుంచి వెళ్లేందుకు నిరాకరించాడని రాము పేర్కొన్నాడు. ఈ క్రమంలో జూన్ 10వ తేదిన సెల్వమూర్తి కుమారులు జీవా, ఉదయలకు డబ్బు ఇచ్చేందుకు రాము దుకాణానికి వెళ్లగా అతనిపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ గొడవను గమనించి స్థానికులు రాముకు పెద్ద ఎత్తున మద్దతుగా రావడంతో అది కాస్త పెద్దదై, అక్కడ దుకాణంలో వస్తువులు బయటకు విసిరేసేంత వరకు దారితీసిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ సమయంలో దుకాణంలో ప్రభాకరన్ భార్య కీర్తి, ఆమె తల్లి దుకాణంలో ఉన్నారని, కానీ వారిపై ఆ గుంపు దాడి చేయలేదని ప్రకటనలో వెల్లడించారు పోలీసులు. ఇదిలా ఉండగా, తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై ఆర్మీ జవాన్‌తో మాట్లాడి తమ పార్టీ అతని భార్యకు న్యాయం చేయడమే గాక కుటుంబానికి అండగా ఉంటామని ట్వీట్లో పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ చీఫ్ ఆ ట్వీట్లో..కాశ్మీర్లో మన దేశానికి ధైర్యంగా సేవ చేస్తున్న హవల్దార్, అతని భార్యతో ఫోన్లో మాట్లాడటం జరిగింది. ఆమె కథ విని నిజంగా బాధనిపించింది. తమిళ గడ్డపై ఆమెకు ఇలా జరిగినందుకు సిగ్గుపడ్డాను. వెల్లూరులో ఓ ఆస్పత్రిలో చేరినా ఆమెను తమ పార్టీ పరామర్శించినట్లు ట్వీట్ చేశారు. @ThanthiTV @News18TamilNadu @PTTVOnlineNews @ChanakyaaTv @Def_PRO_Chennai @narendramodi @annamalai_k @rajnathsingh — Lt Col N Thiagarajan Veteran (@NTR_NationFirst) June 10, 2023 (చదవండి: కేకు డబ్బులు అడిగాడని కాల్పులు.. దుకాణదారుని మృతి!) -
శరద్ పవార్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపులు!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్‌ను హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. ఆయన్ను సోషల్ మీడియా వేదికగా ఓ దుండగుడు పవార్‌ని చంపేస్తామని ట్విట్ చేసినట్లు ఎన్సీపీ పేర్కొంది. ఈ మేరకు పవార్ కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే నేతృత్వంలోని ఎన్సీపీ కార్యకర్తల ప్రతినిధి బృందం ముంబై పోలీసు చీఫ్ ఫన్సాల్కర్‌ను కలిసి చర్యల తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఎన్సీపీ అధినేత పవార్ ఫేస్బుక్లో ఓ దుండగుడు నీకు నరేంద్ర దభోల్కర్ లాంటి గతి తప్పదు అని బెదిరింపు సందేశం వచ్చిందని పోలీసులకు తెలిపారు. నిజానికి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్టు 20, 2013న పుణేలో మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఆ విధంగానే పవార్‌ని చంపుతామని ఫేస్బుక్లో బెదిరింపు సందేశం వచ్చింది. ఈ మేరకు ఆయన కుమార్తె ఎమ్మెల్యే సులే బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్షాట్ల ప్రింట్ అవుట్లను పోలీసులుకు సమర్పించారు. అందుకు సంబంధించిన సమాచారం అందిందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నామని చెప్పారు. (చదవండి: ప్రపంచ వేదికల మీద భారత దేశ ప్రతిష్టను దిగజార్చింది ఎవరో తెలుసుకో.. జైరాం రమేష్ ఆగ్రహం ) -
మహిళతో మంత్రి వీడియో చాట్.. బీజేపీ రాజీనామా డిమాండ్
జార్ఖండ్ హెల్త్ మినిస్టర్ ఓ మహిళతో చేసిన వీడియో చాట్ పెను దుమారం రేపుతోంది. ఇదే అదనుగా బీజేపీ ఆరోపణలు చేయడం ప్రారంభించింది. ఆ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తోంది. జార్ఖండ్ ఆరోగ్య శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత బన్నా గుప్తా ఓ మహిళతో చేసిన వీడియో చాట్ తీవ్ర కలకలం సృష్టించింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ప్రతిపక్ష బీజేపీ విమర్శల దాడికి దిగింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ఈ వీడియో కాంగ్రెస్ ఒరిజినాల్టిని బట్టబయలు చేసిందని విమర్శించారు.అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ప్రతుల్ షాదేయో కూడా ఈ అసభ్యకరమైన వీడియోపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలన్నారు. ఆయన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని రాష్ట్ర మంత్రి వర్గంలోని సభ్యుడు కాబట్టి ఆ వీడియో క్లిప్ నిజమో కాదో తెలుసుకోవాలనుకుంటున్నాం అన్నారు. దీనిపై దర్యాప్తు చేసేలా సీఎం ఆదేశించాలని పట్టుబట్టారు షాదేయో. ఆ మంత్రికి సంబంధించిన వీడియో వాస్తవమని తేలితే వెంటనే అతను మంత్రి పదవి నుంచి వైదొలగాలన్నారు. ఈ వ్యాఖ్యలపై సదరు ఆరోగ్య శాఖ మంత్రి బన్నా గుప్తా స్పందిస్తూ.. తన ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగమే ఆ వీడియో క్లిప్ అంటూ మండిపడ్డారు. అదంతా ఫేక్ అని, అది ఎడిట్ చేసిన వీడియో అని వివరణ ఇచ్చారు. దీనిపై తాను ఇప్పటికే ఎఫ్ఐఆర్ దాఖలు చేసినట్లు కూడా చెప్పారు. ఎవరో కావలనే ఉద్దేశపూర్వకంగానే ఆ ఎడిట్ చేసిన ఫేక్ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేశారని, దీని వెనుకు ఉన్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కాంగ్రెస్ నేత బన్నా గుప్తా అన్నారు. (చదవండి: యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు..వివాదాస్పదంగా సామూహిక వివాహ పథకం..) -
అది నిజమని నిరూపిస్తే..రాజీనామా చేస్తా! దీదీ సవాల్
తృణమూల్ కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై వచ్చిన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు. అదే గనుక నిజమైతే తాను రాజీనామా చేస్తానని సవాలు కూడా విసిరారు మమత. ఎన్నికల సంఘం తృణమూల్ పార్టీ అర్హతను సమీక్షించిన తర్వాత జాతీయ పార్టీ హోదాను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లోని ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి మమతపై సంచలన ఆరోపణలు చేశారు. తన పార్టీ జాతీయ హోదాను పునరుద్ధరించాలంటూ అమిత్ షాకు కాల్ చేసి మమత అభ్యర్థించారని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై స్పందించిన మమత..నేను అమిత్ షాకు ఫోన్ చేసి అడిగినట్లు నిజమైతే ఈ క్షణమే నా పదవికి రాజీనామా చేస్తానంటూ సవాలు విసిరారు. ఆయన వ్యాఖ్యలను విని తాను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానన్నారు. సువేందు అబద్ధాలు చెబుతున్నాడంటూ విరుచుకపడ్డారు. ఈ సందర్భంగా వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల గురించి కూడా ప్రస్తావించారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న యత్నాల గురించి కూడా వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు మౌనం చాలా గొప్పదని, ప్రతిపక్షాలు కలవవని అనుకోవద్దన్నారు. మేమందరం ఒకరితో ఒకరు సంబంధాలు కొనసాగిస్తున్నామని, అది ఒక్కసారిగా గాలివానాల వస్తుందని అన్నారు. అంతేగాదు స్వలింగ వివాహ చట్టం గురించి కూడా మాట్లాడారు. ఇది చాలా సున్నితమైన విషయం అని, ప్రజల నాడి తోపాటు కోర్టు ఆదేశాలను కూడా చూసి ఒక అభిప్రాయానికి రావాలన్నారు. (చదవండి: భారీ అగ్ని ప్రమాదం..మూడు కిలోమీటర్ల వరకు..) -
భర్త చనిపోయాడనుకుని విలవిలలాడింది..కట్ చేస్తే అతను..
భర్త చనిపోయాడనుకుని ఓ భార్య చాలా ఆవేదన చెందింది. ఒక పక్కా ఆమె అతడి కోసం కోర్టులో విడాకుల విషయమై పోరాడుతుంది. ఇంతలో సడెన్‌గా భర్త మరణ వార్త విని తట్టుకోలేకపోయింది. అతడి చివరి చూపుకోసం తపించిన భర్త తల్లిదండ్రులు ఆమెను రానివ్వలేదు. ఆ ఆవేదన నుంచి బయటపడలేక పోయింది. తీరా కొన్ని నెలల తర్వాత అసలు విషయం తెలుసుకుని నిర్ఘాంతపోయింది. ఈఘటన అమెరికాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..కాలిఫోర్నియాలోని శాన్ డియాగోకు చెందిన అనెస్సా రోస్సీ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన తన భర్తతో పోరాడుతోంది. ఆమె విడాకులిచ్చేందకు సముఖంగా లేదు కూడా. అయితే అనూహ్యంగా తన భర్త చనిపోయాడన్న షాకింగ్ వార్త వచ్చింది. దీంతో ఆమె తన భర్త చనిపోయాడనుకుని చివరి చూపుకోసం అతడి ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ అతడి తల్లిదండ్రులు అందుకు అంగీకరించ లేదు. దీంతో ఆమె చాలా పశ్చాత్తాపంతో ఆవేదన చెందింది. విడాకులు ఇచ్చేసినా.. బతికేవాడేమో అనుకుని విలపించింది. ఇలా రోజులు గడిచిపోతున్నాయి. ఇంతలో కొన్ని నెలల క్రితం తన భర్త బతికే ఉన్నట్లు తెలుసుకుని షాక్‌కి గురయ్యింది. అతను మెక్సికోలో మరో గర్ల్‌ఫ్రెండ్‌తో ఉన్నట్లు తెలుసుకుని నిర్ఘాంతపోతుంది. ఆఖరికి వేరో అమ్మాయితో ఉండేందుకు చనిపోయినట్లు నాటకం ఆడినట్లు తెలుసుకుని కుంగిపోయింది. ఈ విషయాన్ని ఆమె టిక్‌టాక్‌లో పంచుకుంది. దీన్ని తెలుసుకున్న ఆమె భర్త తానేమి నాటకాలు ఆడలేదని ఆమె విడాకులు ఇవ్వకపోవడంతో మెక్సికోలో గడిపేందుకు వెళ్లినట్లు సమర్ధించుకునే యత్నం చేశాడు. (చదవండి: రిషి సునాక్ విదేశీ పర్యటన ఖర్చు..కేవలం ఫ్లైట్ జెట్లకే రూ. 4 కోట్లు) -
ట్రంప్ రోజూ రూ. 7లక్షల జరిమానా కట్టాలటా! ఎందుకో తెలుసా?
Trumpobeys a subpoena and surrenders documents relating to his business: అమెరికా మాజీ అధ్యక్షుడు, వివాదాస్పద నాయకుడుగా తరచు వార్తలో నిలిచే డోనాల్డ్ ట్రంప్‌కి యూఎస్ కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ట్రంప్ వ్యాపార లావాదేవీలకు సంబంధించిన పత్రాలను న్యూయార్క్ అటార్నీ జనరల్ కార్యాలయానికి సమర్పించే వరకు ప్రతి రోజు సుమారు రూ. 7లక్షల వరకు జరిమాన కట్టాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎంగోరోన్ మాట్లాడుతూ...2019 విచారణలో ట్రంప్ తన ఆర్థిక ప్రయోజనాల కోసం తన ఆస్తుల విలువను తప్పుగా చూపించడమే కాకుండా అవసరమైన పత్రాలను సమర్పించడంలో విఫలమవ్వడంతోనే జరిమాన విధించినట్లు స్పష్టం చేశారు. అందువల్ల ట్రంప్ మంగళవారం నుంచే రోజువారి జరిమాన చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను దిక్కరించినట్లు తెలిపారు. గోల్ఫ్ క్లబ్‌లు, పెంట్‌హౌస్ అపార్ట్‌మెంట్‌తో సహా ఆస్తుల విలువలను దర్యాప్తులో తప్పుగా పేర్కొన్నట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఆస్తులుపై మంచి రుణాలు పొందడం కోసం వాటి విలువను అధికంగా చూపించారని, మరికొన్ని సందర్భాల్లో పన్ను ప్రయోజనాలను పొందడం కోసం వాటి విలువనే తక్కువగా కూడా చూపించారని పేర్కొన్నారు. వాస్తవానికి ట్రంప్ గతంలోనే కోర్టు ఆదేశాల మేరకు ఆ ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించడంలో విఫలమయ్యారు. కానీ ఆయన తరుపున న్యాయవాదులు అభ్యర్థన మేరకు కోర్టు మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. అయితే ట్రంప్ తరుపు న్యాయవాది అలీనా హబ్బా విచారణ అనంతరం ఈ విషయమై అప్పీలు చేస్తానని చెప్పాడం గమనార్హం. (చదవండి: పుతిన్‌కు నా తడాఖా చూపించేవాడిని.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!) -
పాలన పక్కన పెట్టి కుట్రలు
హుజూరాబాద్: ‘నా ముఖం అసెంబ్లీలో కనిపించవద్దని.. రాష్ట్రంలో పరిపాలన పక్కన పెట్టి, హుజూరాబాద్‌లో ఎలాగైనా గెలవాలని సీఎం కేసీఆర్ కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రలను మంత్రి హరీశ్‌రావు అమలు చేస్తున్నారు’అని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆరోపించారు. గురువారం ఆయన హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ‘అన్ని కులాల బంధువులారా మీకు జీవోల రూపంలో కేసీఆర్ కత్తి ఇస్తున్నారు. ఆ కత్తితో పేదల గొంతుక అయిన ఈటల రాజేందర్‌ను పొడిచి చంపమని చెపుతున్నారు. నేను రాజీనామా చేసి 4 నెలల 22 రోజులు అయింది. అప్ప టి నుంచి హుజూరాబాద్‌లో వందల సంఖ్యలో టీఆర్ఎస్ నాయకులు మోహరించి, ప్రజాస్వా మ్యం అపహాస్యం అయ్యేలా పని చేస్తున్నారు’అని విమర్శించారు. కేసీఆర్‌కు కలలో కూడా హుజూరాబాదే కనిపిస్తోందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానిక నాయకులకు దావత్‌లు ఇచ్చి.. స్వయంగా వారే వడ్డిస్తున్నారని, మందు పోస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నాయకుల కొనుగోళ్లకి రూ.200 కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. ఇతర పార్టీల వారిని వేధించి, బెదిరించి టీఆర్ఎస్ కండువాలు కప్పుతున్నారని, ప్రజాస్వామ్య వాదులు దీనిని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. అన్ని సంఘాలకు భవనాలు, గుడులు కట్టిస్తాం అని జీవోలు ఇస్తున్నారని.. శంకుస్థాపనలు చేస్తున్నారని, ఇవన్నీ ప్రజల మీద ప్రేమతో ఇవ్వడం లేదని, ఓడిపోతామనే భయంతోనే కేసీఆర్ ఇస్తున్నారని పేర్కొన్నారు. ‘దళితుల మీద ప్రేమతో దళితబంధు రాలే.. మీ ఓట్ల మీద ప్రేమతో వచ్చింది. నిజంగా ప్రేమ ఉంటే మొత్తం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదు’అని ప్రశ్నించారు. రూ.4 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్‌లో ఉందని.. ఆర్థిక మంత్రి దీనిపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని అన్నారు. నిరుద్యోగుల చావులకు కారణమై వాళ్ల ఉసురు పోసుకుంటున్నారని.. ఉద్యోగాల మీద దృష్టి పెట్టకుండా హుజూరాబాద్ ఎన్నిక మీదనే ఫోకస్ చేశారని విమర్శించారు. పరాభవం తప్పదని అర్థమై, సీఎం కేసీఆర్ ఎన్నిక వాయిదా కోరారని ఆరోపించారు. భూములు అమ్మితే తప్ప జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని, ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ధ్వజమెత్తారు. హరీశ్ ఇక్కడ కుట్రలో భాగస్వామిగా మారి, ఆర్థిక శాఖ ఎటు పోయిందో పట్టించుకోవడం లేదన్నారు. ‘2 గుంటలున్న వ్యక్తికి.. 200 ఎకరాలు ఉన్న ఆసామికి జరుగుతున్న ఎన్నిక ఇది.. అంటున్నారు. మరి 2 గుంటలు ఉన్న వ్యక్తి ఇంత ఖర్చు ఎలా పెడుతున్నారో హరీశ్ సమాధానం చెప్పాలి’అని అన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ కుట్రలో పావులా మారొద్దు..
సాక్షి, హైదరాబాద్: బలమైన ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేయడమే లక్ష్యంగా బీజేపీ కుట్రలు చేస్తోందని ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ఈ కుట్రలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పావుగా మారొద్దని హితవు పలికారు. ఆదివారం నల్లగొండలో జరిగిన బహిరంగ సభలో బీజేపీపై ప్రవీణ్‌కుమార్ ఒక్క మాట కూడా మాట్లాడలేదని విమర్శించారు. కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే గురుకుల సొసైటీలో ప్రవీణ్ రాణించిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. అంతా తనవల్లే జరిగిందని డబ్బా కొట్టుకుంటున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భాస్కర్‌రావు, శానంపూడి సైదిరెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్‌తో కలసి సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కిశోర్ మాట్లాడుతూ.. ఏ పార్టీలోనైనా చేరే హక్కు ప్రవీణ్‌కు ఉందని, అయితే కేసీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడితే మాత్రం సహిం చేది లేదని హెచ్చరించారు. ఏనుగెక్కి ప్రగతిభవన్‌కు వెళ్తానంటూ ప్రవీణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ఉత్తరప్రదేశ్‌లో బీఎస్పీ ఎవరి చేతుల్లో ఉందో తెలుసా అని ప్రశ్నించారు. గతంలోనూ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పార్టీలు పెట్టి ఏమయ్యారో అందరికీ తెలుసని, ప్రగతిభవన్‌కు సుస్థిరంగా వెళ్లేది ‘కారు’మాత్రమేనని వ్యాఖ్యా నించారు. మేధావి ముసుగులో దళితులకు అన్యాయం చేయొద్దని హితవు పలికారు. దళితబంధు పథకం చూసి కేసీఆర్‌ను విమర్శించే వారిలో భయం మొదలైందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ లాంటి పథకాలు ఒక్కటి కూడా లేదని ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. దళితవర్గాలకు నష్టం చేసే కుట్రలకు ప్రవీణ్‌కుమార్ లాంటి వారిని బీజేపీ వాడుకుంటోందని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. -
ఎన్ఐఏ దాడులు: ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు అరెస్ట్
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విశాఖ జిల్లా ముంచంగి పుట్టు కేసులో ఆరుగురు పౌరహక్కుల సంఘం నేత లను ఎన్ఐఏ అరెస్టు చేసింది. ఈ సోదాలన్నీ ముంచంగిపుట్టు ఠాణాలో నమోదైన కేసు ఆధారంగానే జరిగినట్లు గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఏపీ, తెలంగాణల్లో 31 చోట్ల సోదాలు జరిపినట్టు తెలిపింది. ఏపీలో విశాఖ పట్నం, గుంటూరు, ప్రకాశం, శ్రీకాకుళం,కర్నూలు, కృష్ణా, తూర్పు గోదావరి, కడపతోపాటు తెలంగా ణలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజి గిరి, మెదక్ జిల్లాల్లో తనిఖీలు చేసినట్లు పేర్కొంది. వారికి మావోలతో లింకులపై అనుమానాల నేపథ్యంలో ఈ సోదాలు జరిపినట్టు వివరించింది. గతేడాది కేసు నమోదు.. మావోయిస్టులకు విప్లవ సాహిత్యం తీసుకెళ్తున్న జర్నలిస్టు పంగి నాగన్నను ముంచంగిపుట్టు పోలీసులు గతేడాది అరెస్టు చేశారు. దీనిపై గతేడాది నవంబర్ 23న ముంచంగిపుట్టు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టేందుకు గత నెల 7న కేసు నమోదు చేసిన ఎన్ఐఏ పంగి నాగన్నను విచారించింది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్టు నాగన్న అంగీకరించడం తోపాటు మరో 64 మంది పౌరహక్కుల సంఘల, విరసం నేతల పేర్లు వెల్లడించడంతో వారిపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే పంగి నాగన్న, అదులూరి అన్నపూర్ణ, జంగర్ల కోటేశ్వర్రావు, మానుకొండ శ్రీనివాసరావు, రేలా రాజేశ్వరి, బొప్పుడి అంజమ్మ అనే ఆరుగురిని అరెస్టు చేసినట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా సాగించిన తనిఖీల్లో 40 మొబైల్ఫోన్లు, 44 సిమ్‌కార్డులు, హార్డ్‌డిస్క్, మైక్రో ఎస్డీ కార్డులు, ఫ్లాష్ కార్డులు తదితర 70 స్టోరేజ్ డివైజెస్, 184 సీడీలు/డీవీడీలు, 19 పెన్‌డ్రైవ్‌లు, ట్యాబ్, ఆడియో రికార్డర్, ఒక అనుమానితుని నుంచి రూ.10లక్షల నగదు, కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు మావోయిస్టు పార్టీ సాహిత్యంతో ఉన్న లేఖలు, అనేక అనుమానాస్పద డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. విశాఖ ఏజెన్సీలోని మావోయిస్టులకు పౌరహక్కుల నేతలు సహకరించారని, పోలీసుల కదలికలను మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరవేస్తున్నారని, ఏజెన్సీ గ్రామాల్లో ప్రజలను మావోయిస్టులకు అనుకూలంగా సమీకరించి పోలీసులను అక్కడికి రాకుండా అడ్డంకులు కల్పిస్తున్నారని, ప్రజలను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని అభియోగాలు మోపింది. సోదాలపై నిరసన.. పౌరహక్కుల సంఘాలు, ప్రజాసంఘాలు, న్యాయవాదుల ఇళ్లల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించడాన్ని ఖండిస్తూ గురువారం విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఆయా సంఘాలు నిరసన చేపట్టాయి. పీవోడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి మాట్లాడుతూ ఎన్ఐఏ అధికారులు ప్రజాసంఘాల నేతల ఇళ్లపై అక్రమంగా సోదాలు చేయకూడదని హైకోర్టు ఇచ్చిన రిలీఫ్‌ఆర్డర్‌ను కూడా పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. ప్రజాజీవన స్రవంతిలో కలిసిపోయిన వారికి మీరిచ్చే గౌరవం ఇదేనా.. ప్రజాస్వామ్యాన్ని బతకనివ్వరా? అంటూ మావోయిస్టు నేత ఆర్కే సతీమణి శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. -
యూనిస్ నా పీకపై కత్తి పెట్టాడు: ఫ్లవర్
న్యూఢిల్లీ: పాక్ మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్‌కు సలహా ఇవ్వబోతే తన పీకపై కత్తి పెట్టాడని ఆ జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ ఆరోపించాడు. ‘పాక్ జట్టు తరఫున ఆసీస్ పర్యటనలో ఉండగా ఓ సంఘటన నన్ను బాగా కలవరపెట్టింది. బ్రిస్బేన్ టెస్టు సందర్భంగా నేను యూనిస్‌కు బ్యాటింగ్‌లో సలహా ఇస్తుంటే... అది అతనికి నచ్చలేదేమో ఏకంగా నా పీకపై కత్తి పెట్టేశాడు. మా పక్కనే ఉన్న మికీ ఆర్థర్ కలగజేసుకొని సముదాయించారు. ఈ సంఘటనతో నేను ఒక్కసారిగా ఖిన్నుడినయ్యా. కానీ కోచ్‌గా ఇదంతా నా ప్రయాణంలో భాగమే అనుకొని సరిపెట్టుకున్నాను’ అని అన్నాడు. జింబాబ్వేకు చెందిన ఫ్లవర్‌కు 2016లో కంగారూ టూర్లో ఈ అనుభవం ఎదురైంది. ఇతను 2015 నుంచి 2019 వరకు పాక్ బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. దీనిపై 42 ఏళ్ల మాజీ కెప్టెన్ యూనిస్ స్పందించలేదు. -
తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు
సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని టీఆర్ఎస్ ఎంపీలు ఆరోపించారు. ఈ మేర కు బుధవారం పార్లమెంటు ఆవర ణలోని గాంధీ విగ్ర హం వద్ద ధర్నా చేపట్టారు. నిధులను వి డుదల చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ధర్నాలో టీఆర్ఎస్ పార్లమెంట రీ పార్టీ నేత కె.కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు లక్ష్మీకాంతరావు, సంతోష్‌కుమార్, పసునూరి దయాకర్, బీబీ పా టిల్, మాలోతు కవిత, వెంకటేష్ నేత, రంజిత్‌రెడ్డి, బండ ప్రకాశ్, లింగయ్యయాదవ్, శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు. తెలంగాణకు జీఎస్టీ, వివిధ పథకాల కింద రూ. 29,891 కో ట్లు, ఐజీఎస్టీ కింద రూ. 4,531 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ. 450 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ. 312 కోట్లు, యూఎల్బీ గ్రాంట్ కింద రూ. 393 కోట్లు, నీతిఆయోగ్ సిఫార్సుల మేరకు మిషన్ భగీరథకు రూ. 19,204 కోట్లు, మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్ల నిధులు రావాల్సి ఉందని ఎంపీలు తెలిపారు. -
ఏజెన్సీలో మావోల అలజడి
సాక్షి, భూపాలపల్లి : పట్టుకోసం మావోయిస్టులు పలు చర్యలతో ప్రయత్నిస్తుండగా.. భద్రతాబలగాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతుండడంతో ఏజెన్సీలో మళ్లీ అలజడి పెరుగుతోంది. తాజాగా జరిగిన చర్ల సంఘటనతో భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అటవీ ప్రాంతంలో మావోయిస్టు ముఖ్యనేతలు సంచరించారనే వార్తలు వచ్చిన నేపథ్యంలోనే.. చర్లలోని టీఆర్ఎస్ ఎంపీటీసీ కిడ్నాప్ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈనెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల వారోత్సవాలు ఉన్నాయి. దీంతో భద్రతా దళాలు సైతం అప్రమత్తమయ్యాయి. ఉమ్మడి భూపాలపల్లి జిల్లాపై పట్టు పెంచుకునేందుకు మావోయిస్టులు ప్రయత్నిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. రెండు జిల్లాల పరిధి పలు మండలాల్లో కరపత్రాలు లభించడం, గత నెల తాడ్వాయి మండలంలో వాచ్మెన్పై దాడి ఘటన ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. తాజాగా వాజేడు– వెంకటాపురం కమిటీని ఏర్పాటు చేయడం కూడా విస్తరణలోనే భాగమే అని తెలుస్తోంది. ఇటీవల కాలంలో జిల్లాలో అక్కడక్కడా మావోల ఉనికి కనిపిస్తుండడంతో భద్రతా బలగాలు పటిష్టమైన చర్యలు చేపట్టాయి. ఇటీవల సరిహద్దు మండలం చర్లలో టీఆర్ఎస్ నాయకుడి అపహరణ, హత్యనేపథ్యంలో కూంబింగ్‌ను మరింత విస్తృతం చేశారు. సీఆర్పీఎఫ్, స్పెషల్ పార్టీ పోలీసులు ఎప్పటికప్పుడు అటవీ గ్రామాలతో పాటు, అడవులను జల్లెడ పడుతున్నారు. మరోవైపు మావోయిస్టు వారోత్సవాలు దగ్గర పడుతుండటంతో సరిహద్దు మండలాల్లో నిఘా మరింత పెంచారు. ఛత్తీస్‌గఢ్, భద్రాచలం, ములుగు జిల్లాల సరిహద్దులో పెద్ద ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను అనుకుని ఉన్న ప్రాంతాల్లో కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. ఏటూరునాగారం ముల్లకట్ట వంతెన సమీపంలో, వాజేడు, వెంకటాపురం, ఏటూరునాగరం, కన్నాయిగూడెం, పలిమెల, మహాముత్తారం మండలాల్లో వాహన తనిఖీలు విస్తృతగా చేపడుతున్నారు. ఇంటలిజెన్స్ వర్గాలు సైతం గ్రామాల్లో తిరుగుతూ.. ఎవరు వస్తున్నారు.. ఎక్కడి వారు.. ఎవరిని కలుస్తున్నారనే విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు. -
'చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడు'
సాక్షి, కాకినాడ : నిమ్మకాయల చినరాజప్ప ఎమ్మెల్యేగా అనర్హుడని, ఆయన ఎన్నిక చెల్లదని పెద్దాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తోట వాణి పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తనపై నమోదైన క్రిమినల్ కేసు, అరెస్ట్ వారెంట్లను పొందుపరచకుండా చినరాజప్ప దాచిపెట్టారని ఆమె తెలిపారు. 2007లో ఓబులాపురం మైనింగ్ కేసులో చినరాజప్పతోపాటు మరో ఇరవై మందిపై క్రిమినల్ కేసు నమోదైందని, ఈ కేసుకు సంబంధించి పలుమార్లు రాజప్పకు అరెస్టు వారెంట్లు జారీ అయ్యాయని ఆమె వెల్లడించారు. ఎమ్మెల్సీ పదవి ద్వారా వస్తున్న పెన్షన్ వివరాలను కూడా అఫిడవిట్లో చిన్నరాజప్ప సమర్పించలేదని, ఈ విధంగా ఎన్నికల సంఘాన్ని మోసం చేసిన చినరాజప్ప ఎన్నిక చెల్లదంటూ తోట వాణి జూలై 5న హైకోర్టును ఆశ్రయించారు. -
లైంగిక ఆరోపణలు: సీనియర్ న్యూస్ ఎడిటర్ అరెస్ట్
తిరువనంతపురం: ప్రముఖ మలయాళం న్యూస్ చానల్ మాతృభూమి కి చెందిన సీనియర్ జర్నలిస్టుపై లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి. పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న ఆరోపణలతో మాతృభూమి ఛానల్ సీనియర్ న్యూస్ ఎడిటర్ అమాల్ విష్ణుదాస్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. విష్ణుదాస్ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మంగళవారం డీసిపికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని తిరువనంతపురం నగర పోలీస్ కమిషనర్ స్పర్జన కుమార్ ధృవీకరించారు. మహిళా ఉద్యోగిపై లైంగికఆరోపణల నేపథ్యంలో బుధవారం ఉదయం విష్ణుదాస్ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు చెప్పారు.సెక్షన్ 376 (రేప్), 377 (అసహజ నేరాలు), 506 (క్రిమినల్ బెదిరింపు) కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్ తెలిపారు. బాధితురాలి కథనం ప్రకారం మొదటి భార్యతో విభేదాల కారణంగా త్వరలోనే ఆమెకు విడాకులిచ్చి ఈమెను పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చాడు . అయితే విడాకులు మంజూరైన తరువాత మొహం చాటేయంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. అలాగే ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయనీ, కరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించాడు. దీంతోపాటుగా విష్ణుదాస్ తండ్రి వైద్య ఖర్చుల పేరుతో తన దగ్గర భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని ఆమె ఆరోపించారు. -
నాగ్‌పూర్‌లో రెచ్చిపోయిన శివ సైనికులు
-
చిదంబరానికి ఎయిర్ సెల్ షాక్!
న్యూఢిల్లీ: ఎయిర్ సెల్ మాక్సిస్ వ్యవహారం కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పీచిదంబరం మెడకు తీవ్రంగానే చుట్టుకుంటోంది. ఒప్పదంలో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈడీ తన రిపోర్టును సుప్రీంకోర్టుకు సమర్పించింది విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు (ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు)ఎఫ్ఐపీబీ నిబంధనల ఉల్లంఘనలో ఆర్థిక మంత్రిగా చిదంబరం పాత్రపై ఈడీ నివిదేకను సుప్రీంకు అందించింది. దీంతో దీనిపై తదుపరి విచారణను కోర్టు మే 2 వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీటు దాఖలు చేసిన సీబీఐ ఈ కేసులో చిదంబరం పాత్రపై విచారిస్తున్నట్టు కోర్టుకు వివరించింది. మరోవైపు ఎయిర్‌సెల్-మాక్సిస్ ఒప్పందంలో మనీలాండరింగ్ ఆరోపణ నేపథ్యంలో విచారణ జరపించాల్సిందిగా బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కోర్టును ఆశ్రయించారు. అయితే ఫిబ్రవరిలో దీనిపై పూర్తి నివేదిక అందించించాల్సిందిగా స్వామిని కోరింది. 2016 నాటి ఈ కేసుకు కీలక సాక్ష్యాలను సమర్పించాల్సిందిగా ఆదేశించింది. మాక్సిస్ అనుబంధం సంస్థ గ్లోబెల్ కమ్యూనికేషన్ సర్వీసెస్ రూ. 4,866 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను పొందేందుకు 2006లో అనుమతి లభించింది.. విదేశీ పెట్టుబడుల ప్రొత్సాహక బోర్డు ఎఫ్‌ఐవివి అభ్యర్థనపై ఆర్థిక మంత్రిగా చిదంబరం అనుమతులు మంజూరు చేశారు. అయితే నిబంధనలను విరుద్ధంగా ఎయిర్‌సెల్ మాక్సిస్ ఒప్పందం జరిగిందని బీజేపీ సీనియర్ సుబ్రమణియన్ స్వామి వాదిస్తున్నారు. 100 శాతం వాటా అనుమతిద్వారా మలేషియా సంస్థ మాక్సిస్ నుంచి కార్తీ చిదంబరానికి భారీ ముడుపులు ముట్టాయని స్వామి ఆరోపించారు. ప్రధానంగా 74శాతం సీలింగ్ ఉండగా ఎక్కువ పెట్టుబడులకు అనమతించారని, గరిష్టంగా రూ. 600 కోట్లు విలువైన ఎఫ్‌డీఐలకు మాత్రమే అనుమతులు ఇచ్చే అధికారం కేంద్ర ఆర్థికమంత్రికి ఉంటుందని, అంతకు మించి పెట్టుబడులను ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదించవలసి ఉంటుందని స్వామి పేర్కొన్నారు. కాగా చిదంబరం కుమారుడు కార్తి చిదంబరానికి ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది. అయితే ఎయిర్‌సెల్ మాక్సిస్ ఒప్పందానికి అనుమతుల విషయంలో నిబంధనల ప్రకారమే నడుచుకున్నానని చిదంబరం వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
పేటీఎంకు మరో షాక్!
న్యూఢిల్లీ: డీమానిటైజేషన్ తరువాత బాగా పాపులర్ అయిన మొబైల్ కామర్స్ , చెల్లింపుల కంపెనీ పేటిఎం కు భారీ షాక్ తగలనుంది. ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణలతో అమెరికన్ పేమెంట్ దిగ్గజం, ప్రపంచ చెల్లింపుల కంపెనీ పేపాల్ తాజాగా కేసు నమోదు చేసింది. తమ లోగోకు సమానమైన ఒక లోగోను పేటీఎం అక్రమంగా ఉపయోగిస్తోందని ఆరోపించింది. దీంతో ప్రముఖ డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం ట్రేడ్ మార్క్ ఉల్లంఘన ఆరోపణల్లో ఐటీసీ, మెక్ డోవెల్ లాంటి భారతీయ కంపెనీల సరసన చేరింది. కాలిఫోర్నియాకు చెందిన పే పాల్ ట్రేడ్ మార్క్ ఉల్లంఘనల కింద పే టీఎంపై కేసు నమోదు చేసింది. సుమారు14 పేజీల పత్రంలో పేటీఎంపై ఫిర్యాదు చేసింది. 1999 ఇండియన్ ట్రేడ్ మార్క్ చట్టం అయిదు రకాల లోగోలను రిజిస్టర్ చేసినట్టు తెలిపింది. వీటిల్లో ఏదో ఒకటి వాడుకునే హక్కు తమకు ఉందని వాదిస్తోంది. 2007 సం.రం నుంచి తాము దీన్ని వాడుతున్నట్టు పేర్కింది. తమ లోగోను అక్రమంగా వాడుకోవడం ద్వారా తమ ఖాతాదారుల్లో, ప్రజల్లో అయోమయం సృష్టిస్తోందని తెలిపింది. ఈ గందరగోళం, మోసంకారణంగా తమ బ్రాండ్ ఈక్విటీ తగ్గిపోయే అవకాశ ఉందనే ఆందోళన వ్యక్తం చేసింది. అలాగే ఈ ఏడాది ఆగస్టులో వన్ 97 పేరుతో దాఖలైన పేటీఎం ట్రేడ్‌మార్క్ దరఖాస్తును వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అతి పెద్ద లబ్దిదారుగా అవతరించిన పే టీఎం గత నెలలో తన వినియోగదార్ల బేస్ గా భారీగా పెంచుకుంది. దేశంలో చిన్న చెల్లింపులు బ్యాంకుగా ఆర్బిఐ లైసెన్స్ ఉన్న పేటీఎం 14 మిలియన్ కొత్త వినియోగదారులను సాధించింది. సుమారు 100 మిలియన్ల యూజర్లతో దూసుకుపోతోంది. డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నేపథ్యంలో పేటీఎం చురుగ్గా కదులుతోంది. నగదు రహిత భారతంకోసం భారీ ప్రచారాన్ని నిర్వహిస్తూ తన సేవలను ప్రమోట్ చేసుకుంటోంది. మరోవైపు కొంతమంది ఆన్లైన్ మోసగాళ్లు తమను చీట్ చేశారని డిజిటల్ వాలెట్ కంపెనీ పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు 48 మంది కస్టమర్లు తమను రూ 6.15 లక్షల మేర మోసం చేశారని ఆరోపించారు. దీనిపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. -
'నయీంను పెంచి పోషించింది ప్రభుత్వాలే'
నల్గొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను పెంచి పోషించింది ప్రభుత్వాలేనని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ విమర్శించారు. ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు ఉన్నాయని, అవే నయీమ్ లాంటి వారిని పెంచి పోషించాయన్నారు. పోలీసులు, మంత్రులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న నక్సలైట్లు, మాజీ నక్సలైట్లను చంపేందుకు నయీమ్‌కు ప్రభుత్వాలు డబ్బులిచ్చి ఉపయోగించుకున్నాయని ఆరోపించారు. డీజీపీ స్థాయి అధికారులు, మంత్రులు నయీమ్‌తో సన్నిహితంగా ఉంటూ అనేక ఆస్తులు సంపాదించుకుని, సాంబశివుడి లాంటి వారిని చంపించారని దుయ్యబట్టారు. నయీమ్ కేసులో ఉన్న పెద్దలు బయటకి రావాలంటే సిట్ ద్వారా కాకుండా.. సీబీఐ ద్వారా విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై బీజేపీ మాట మార్చడం బాధకరమన్నారు. ఆనాడు ప్రత్యేక హోదాపై ఆశలు కల్పించి నేడు ఇలా మాట మార్చడంలో ఆంతర్యమేమిటో తెలపాలన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడికి నాలుకపై నరం లేదని విమర్శించారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజల మధ్యలో ఉంటూ పోటీ చేస్తానని చెప్పిన పవన్‌కళ్యాణ్ మాటలపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తానని చెప్పడం స్వాగతిస్తున్నామని తెలిపారు. -
టీడీపీ కార్పోరేటర్ పై జర్నలిస్టు ఆరోపణ
-
వివాదంలో సర్దార్ సింగ్
లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బ్రిటిష్ హాకీ ప్లేయర్ ఆరోపణ న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. రెండేళ్ల కిందట తనతో నిశ్చితార్థం చేసుకొని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని భారత సంతతికి చెందిన బ్రిటిష్ హాకీ ప్లేయర్ అష్పాల్ కౌర్... సర్దార్‌పై లూథియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని గతేడాది బలవంతంగా అబార్షన్ కూడా చేయించాడని ఆరోపించింది. అప్పట్నించి పెళ్లి మాట ఎత్తితే బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. 2012 లండన్ ఒలింపిక్స్ సందర్భంగా ఇద్దరికీ పరిచయం అయ్యిందని, అదే ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం జరిగిందని క్రీడాకారిణి తెలిపింది. అప్పట్నించి కలిసి జీవిస్తున్నామని చెప్పింది. అయితే అష్పాల్ చేసిన ఆరోపణలను సర్దార్ సింగ్ ఖండించాడు. క్రీడాకారిణితో పరిచయం ఉన్న మాట వాస్తవమే అయినా... తామిద్దరికి ఎలాంటి నిశ్చితార్థం జరగలేదని స్పష్టం చేశాడు. ఆమె తనపై చేస్తున్న ఆరోపణలకు త్వరలోనే సమాధానమిస్తానన్నాడు. ‘ఆ అమ్మాయి నాపై చాలా సీరియస్ ఆరోపణలు చేస్తోంది. సరైన సమయంలో వాటన్నింటికీ సమాధానం ఇస్తా. ప్రస్తుతం నేను హాకీ ఇండియా లీగ్ మ్యాచ్‌లపై దృష్టి పెట్టా. మంగళవారం రాత్రి మ్యాచ్ తర్వాత ఈ ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. గురువారం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంది. దాని తర్వాత మా లాయర్‌తో సంప్రదించి జవాబిస్తా’ అని సర్దార్ సింగ్ వ్యాఖ్యానించాడు. -
చేతబడి చేశారన్న నెపంతో కుటుంబం వెలి
-
'టీఆర్ఎస్లో చేరాలని ఒత్తిడి తెచ్చారు'
హైదరాబాద్ సిటీ: టీఆర్ఎస్లో చేరాలని తమపై కొందరు ఒత్తిడిచేశారని టీటీడీపీ ఎమ్మెల్యేలు రాజేందర్ రెడ్డి, వివేకానంద్ లు బుధవారం ఏసీబీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం ఎమ్మెల్యేలు విలేకర్లతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి రావాలని ఒత్తిడి తెచ్చారని, పార్టీలోకి వస్తే కార్పొరేషన్ పదవి ఇస్తామని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయిస్తామని ఆశచూపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన కొన్ని రోజులకు ఈ కేసులు పెట్టడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇన్ని రోజులు గుర్తుకు రానిది ఓటుకు నోటు కుంభకోణం బయటపడిన తర్వాతే టీడీపీ నాయకులు ఫిర్యాదు చేయడంతో ఓటుకు నోటు కేసు మరో మలుపు చోటుచేసుకుంది. -
వైద్యుల నిర్లక్ష్యమే మృతి కారణం...