లైంగిక ఆరోపణలు: సీనియర్ న్యూస్ ఎడిటర్‌ అరెస్ట్‌ | Mathrubhumi senior journo Amal Vishnudas arrested for alleged sexual harassment of junior | Sakshi
Sakshi News home page

లైంగిక ఆరోపణలు: సీనియర్ న్యూస్ ఎడిటర్‌ అరెస్ట్‌

Published Wed, Jul 26 2017 12:09 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

లైంగిక ఆరోపణలు: సీనియర్ న్యూస్ ఎడిటర్‌ అరెస్ట్‌ - Sakshi

లైంగిక ఆరోపణలు: సీనియర్ న్యూస్ ఎడిటర్‌ అరెస్ట్‌

తిరువనంతపురం:  ప్రముఖ మలయాళం న్యూస్‌ చానల్‌  మాతృభూమి కి చెందిన సీనియర్‌ జర‍్నలిస్టుపై  లైంగిక ఆరోపణలు కలకలం రేపాయి.  పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి, లైంగికంగా లోబర్చుకుని, మోసంచేశాడన్న  ఆరోపణలతో మాతృభూమి ఛానల్‌ సీనియర్ న్యూస్ ఎడిటర్‌  అమాల్ విష్ణుదాస్‌ను పోలీసులు బుధవారం  అరెస్ట్‌ చేశారు.

విష్ణుదాస్‌ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగి మంగళవారం డీసిపికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని తిరువనంతపురం  నగర పోలీస్‌ కమిషనర్‌ స్పర్జన​ కుమార్‌  ధృవీకరించారు.  మహిళా ఉద్యోగిపై  లైంగికఆరోపణల నేపథ్యంలో  బుధవారం ఉదయం విష్ణుదాస్‌ను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు  చెప్పారు.సెక్షన్ 376 (రేప్), 377 (అసహజ నేరాలు),  506 (క్రిమినల్ బెదిరింపు)  కింద కేసులు నమోదు చేశామని తిరువనంతపురం సీఐ రియాజ్‌  తెలిపారు.
బాధితురాలి  కథనం ప్రకారం మొదటి భార్యతో విభేదాల కారణంగా త్వరలోనే  ఆమెకు విడాకులిచ్చి  ఈమెను పెళ్లి చేసుకుంటానని హామి ఇచ్చాడు . అయితే  విడాకులు మంజూరైన తరువాత మొహం చాటేయంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.  అలాగే ఈ వ్యవహారాన్ని ఎవరికైనా చెబితే  తీవ్ర పరిణామాలుంటాయనీ, కరియర్‌ను నాశనం చేస్తానని హెచ్చరించాడు.  దీంతోపాటుగా విష్ణుదాస్‌ తండ్రి వైద్య ఖర్చుల పేరుతో  తన దగ్గర భారీ మొత్తంలో డబ్బులు కూడా తీసుకున్నాడని ఆమె  ఆరోపించారు.
 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement