
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ను హత్య చేస్తామంటూ బెదిరింపు సందేశం వచ్చింది. ఆయన్ను సోషల్ మీడియా వేదికగా ఓ దుండగుడు పవార్‌ని చంపేస్తామని ట్విట్ చేసినట్లు ఎన్సీపీ పేర్కొంది. ఈ మేరకు పవార్ కుమార్తె లోక్‌సభ సభ్యురాలు సుప్రియా సూలే నేతృత్వంలోని ఎన్సీపీ కార్యకర్తల ప్రతినిధి బృందం ముంబై పోలీసు చీఫ్ ఫన్సాల్కర్‌ను కలిసి చర్యల తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఎన్సీపీ అధినేత పవార్ ఫేస్‌బుక్‌లో ఓ దుండగుడు నీకు నరేంద్ర దభోల్కర్ లాంటి గతి తప్పదు అని బెదిరింపు సందేశం వచ్చిందని పోలీసులకు తెలిపారు. నిజానికి మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడిన నరేంద్ర దభోల్కర్‌ను ఆగస్టు 20, 2013న పుణేలో మార్కింగ్ వాక్ చేస్తున్న సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఆ విధంగానే పవార్‌ని చంపుతామని ఫేస్‌బుక్‌లో బెదిరింపు సందేశం వచ్చింది.
ఈ మేరకు ఆయన కుమార్తె ఎమ్మెల్యే సులే బెదిరింపులకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ల ప్రింట్ అవుట్‌లను పోలీసులుకు సమర్పించారు. అందుకు సంబంధించిన సమాచారం అందిందని ముంబై పోలీసులు తెలిపారు. ఈ విషయమై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేసే పనిలో ఉన్నామని చెప్పారు.
(చదవండి: ప్రపంచ వేదికల మీద భారత దేశ ప్రతిష్టను దిగజార్చింది ఎవరో తెలుసుకో.. జైరాం రమేష్ ఆగ్రహం )
Comments
Please login to add a commentAdd a comment