
మహారాష్ట్ర: ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌కు బెదిరింపు కాల్స్ రావడం మహారాష్ట్ర రాజకీయంలో కలకలం రేపింది. అయితే.. తాజాగా శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్..తనకూ, తన సోదరుడు ఎమ్మెల్యే సునీల్ రౌత్‌కు కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయని చెప్పారు. చంపేస్తామంటూ దుండగులు బెదిరించినట్లు పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రతిపక్షాలను భయాందోళనకు గురి చేసేందుకే దుండగులు ఈ చర్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం కూడా ఇలాంటి బెదిరింపులను కోరుకుంటోందని విమర్శించారు. ఇలాంటి బెదిరింపులకు భయపడబోనని గతంలోనూ ఇలాంటివే వచ్చాయని ఆయన అన్నారు. దీని వెనుక 40 మందితో కూడిన సూపర్ పవర్‌గా పిలిచే ఓ అదృశ్య శక్తి దాగి ఉందంటూ భాజపాపై పరోక్ష విమర్శలు చేశారు. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: గాడ్సే, ఆప్టే పుత్రులు ఎవరో?.. ఫడ్నవీస్ వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
Comments
Please login to add a commentAdd a comment