
న్యూఢిల్లీ: ఆ కుటుంబంలోని వారంతా మహాకుంభ్‌లో స్నానం చేసేందుకు శనివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. వారిలో ఏడేళ్ల బాలిక రియా కూడా ఉంది. రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాటలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తెల ఎలా ప్రాణాలు కోల్పోయిందనే విషయాన్ని రియా తండ్రి ఓపిల్ సింగ్ మీడియాకు చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముందుగా వారంతా 14వ నంబరు ప్లాట్‌ఫారానికి చేరుకున్నారు. అయితే అక్కడి రద్దీని చూసి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోదామని అనుకున్నారు. దీంతో అతని భార్య, కుమారుడు ప్లాట్‌ఫారం నుంచి తిరిగి మెట్లు మీదుగా పైకి చేరుకున్నారు. వారి వెనుక ఓపిల్ సింగ్, అతని కుమార్తె రియా ఉన్నారు. ఇంతలో ఐదారువేల మంది పైనుంచి ఒక్కసారిగా ఒకరిని తోసుకుంటూ మరొకరు కిందకు దిగసాగారు. ఇంతటి రద్దీలో వారంతా ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో వారి కుమార్తె రియా కిందపడిపోయింది. ఆమె తలకు ఒక రాడ్డు బలంగా తగిలింది. వెంటనే రక్తం కారసాగింది. తొక్కిసలాట జరుగుతున్నా పోలీసులు అప్రమత్తం కాలేదు. నామమాత్రంగా విజిల్ వేసుకుంటూ వెళ్లిపోయారు.
అంతటి రద్దీలో కుమార్తెను ఎత్తుకుని ఓపిల్ సింగ్‌తో అతని భార్య, కుమారుడు ఎలాగోలా కిందకు దిగి, రైల్వే స్టేషన్ బయటకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓపిల్ సింగ్ జేబులోని పర్సుతో పాటు మొబైల్ ఫోనును ఎవరో కొట్టేశారు. అక్కడ అంబులెన్స్ లేకపోవడంతో ఓపిల్‌సింగ్ తన కుమార్తె రియాను తీసుకుని, ఆటోలో కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి రియాను పరీక్షించి, ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. తమ కుమార్తె చనిపోయాక ప్రభుత్వం ఇచ్చే రూ. 10 లక్షల పరిహారం ఎందుకుని ఓపిల్ సింగ్ మీడియా ముందు కంటతడిపెట్టుకున్నారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు
Comments
Please login to add a commentAdd a comment