stampade
-
శ్రీతేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది: సీపీ సీవీ ఆనంద్
సాక్షి,హైదరాబాద్ : సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ బాలుడు శ్రీతేజ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు నగర కమిషనర్ సీవీ ఆనంద్. అనంతరం బాలుడి ఆరోగ్య వివరాలను ఆయన మీడియాకు తెలియజేశారు. శ్రీతేజ్ కోలుకునేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని ఈ సందర్భంగా ఆయన విచారం వ్యక్తం చేశారు.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగిన రెండు వారాల నుంచి శ్రీతేజ కిమ్స్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం సీపీ సీవీ ఆనంద్,హెల్త్ సెక్రటరీ క్రిస్టినాలు కిమ్స్ ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.అనంతరం, సీపీ సీవీ ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు ప్రభుత్వం తరఫున శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నాం. తొక్కిసలాటలో శ్రీ తేజ్ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యింది. రికవరీ కావడానికి చాలా సమయం పడుతుంది. ట్రీట్మెంట్ మరింత కాలం పట్టే అవకాశం ఉంది. త్వరలోనే బాలుడి ఆరోగ్యంపై వైద్యులు బులిటెన్ విడుదల చేస్తారు’ అని వెల్లడించారు. ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో తొక్కిసలాటహైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్లో ‘పుష్ప-2’ ప్రీమియర్ షోలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సినిమా చూసేందుకు అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోగానే అభిమానులు ఒక్కసారిగా పెద్దఎత్తున లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి కట్టడి చేసేందుకు అభిమానులను పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతోపాటు థియేటర్‌కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయారు. పోలీసులు వీరిని ఆస్పత్రికి తరలించగా మహిళ మృతిచెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
Allu Arjun Case: ఆ సెక్షన్లు అంత తీవ్రమైనవా?
ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నటుడు అల్లు అర్జున్ను.. చిక్కడపల్లి పోలీసులు ఈ ఉదయం ఆయన నివాసంలోనే అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో అల్లు అర్జున్ సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. తొలుత పుష్ప హీరోను పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డుచేసి.. అటుపై వైద్యపరీక్షల కోసం గాంధీ ఆస్పత్రి.. అటు నుంచి అటు రిమాండ్ కోసం కోర్టుకు తరలించారు. అయితే..ఈ కేసులో అల్లు అర్జున్ పై 105, 118(1) రెడ్ విత్ 3(5) BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎఫ్ఐఆర్లో ఉంది. ఐపీసీ స్థానంలో వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొత్త చట్టంలోని సెక్షన్ల ప్రకారం ఈ కేసు అంత తీవ్రమైందా?.. ఒకవేళ నేరం రుజువైతే పడే శిక్షల గురించి ఓసారి పరిశీలిద్దాం..👉105 సెక్షన్ అనేది నాన్ బెయిలబుల్. ఉద్దేశపూర్వకంగా చంపేందుకు.. ఉద్దేశం లేకపోయినా అది మరణానికి దారి తీస్తుందని తెలిసిగానీ చేసే నేరాలు ఈ సెక్షన్ పరిధిలోకి వస్తుంది. ఇది హత్యానేరం(Murder) కిందకు రాకపోయినప్పటికీ.. శిక్షించదగిన హత్యానేరమే అవుతుంది.👉105 సెక్షన్ కింద.. ఉద్దేశపూర్వకంగా మరణానికి కారణమైతే మినిమమ్ ఐదేళ్లు.. గరిష్టంగా పదేళ్ల శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు కూడా విధించవచ్చు.👉105 సెక్షన్ ప్రకారం.. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా చేయకపోయినప్పటికీ తెలిసికూడా మరణానికి గనుక కారణమైతే.. ఆ శిక్షకుగానూ గరిష్టంగా పదేళ్ల శిక్ష, జరిమానా విధిస్తారు.👉సెక్షన్ 118(1).. ప్రమాదకరమైన ఆయుధాలు లేదంటే ఇతరత్రా మార్గల ద్వారా గాయపర్చడం. ఈ నేరం తీవ్ర దృష్ట్యా మూడేళ్ల వరకు జైలు శిక్ష.. రూ.20వేల జరిమానా విధిస్తారు. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండిదిల్సుఖ్ నగర్‌కు చెందిన భాస్కర్ మాగుడంపల్లి(మృతురాలు రేవతి భర్త) ఫిర్యాదుతో చిక్కడపల్లి పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సంధ్యా 70 ఎంఎం థియేటర్ మేనేజ్మెంట్, స్టాఫ్‌తో పాటు అల్లు అర్జున్, ఆయన పర్సనల్ భద్రతా సిబ్బందిని నిందితులుగా చేర్చారు. ఇప్పటిదాకా ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించగా.. అల్లు అర్జున్ పేరు 11వ నిందితుడిగా చేర్చారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. చంచల్‌గూడ జైలుకు తరలించనున్నారు.కాగ్నిజబుల్ నేరం . అంటే ఒక పోలీసు అధికారికి వారెంట్ లేకుండా అరెస్టు చేయడానికి, కోర్టు అనుమతితో లేకుండా విచారణ జరిపే అధికారం ఉన్న నేరమన్నమాట. నేరం తీవ్రత దృష్ట్యా ఇది అన్వయింపజేస్తారు. తాజాగా.. కాగ్నిజబుల్ నేరం కిందనే వారెంట్ లేకుండానే అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు.సెక్షన్ 118(1) విత్ సెక్షన్ 3(5).. సెక్షన్ 118(1)కు సెక్షన్ 3(సబ్ సెక్షన్-5)నుకూడా పోలీసులు జత చేశారు. ఈ సెక్షన్ కింద.. ఒక నేరంలో ఎక్కువ మందికి గనుక భాగం ఉంటే.. వాళ్లందరికీ సమానంగా బాధ్యత ఉంటుందని అర్థం.ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 304, సెక్షన్ 324, సెక్షన్ 34ను.. బీఎన్ఎస్లో 105, 118(1), 3(5) సెక్షన్లతో భర్తీ చేశారు. -
#AA కేసు అప్డేట్స్.. జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్
ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే ఈ క్రమంలో హైడ్రామా నడిచింది. కింది కోర్టు ఆయనకు రిమాండ్ విధిస్తే.. ఉన్నత న్యాయస్థానం మాత్రం ఆయనకు ఆ సెక్షన్లు వర్తించవని చెబుతూ మధ్యంతర బెయిల్ నడిచింది. -
అల్లు అర్జున్ అరెస్ట్.. టూమచ్!
హైదరాబాద్, సాక్షి: నటుడు అల్లు అర్జున్ అరెస్ట్‌ను నగర పోలీసులు దాదాపు ధృవీకరించారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుకుగానూ శుక్రవారం(నవంబర్ 13) మధ్యాహ్నాం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన నివాసం వద్ద అరెస్ట్ చేసి.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే..అరెస్ట్ టైంలో పోలీసులు అతి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. పోలీసులు వెళ్లిన టైంలో.. అల్లు అర్జున్ నైట్ దుస్తులతో ఉన్నారు. తమతో రావాలని కోరగానే.. డ్రస్ మార్చుకుంటానని అన్నారాయన. దీంతో బెడ్ రూం వరకు వెళ్లి డ్రస్ మార్పించి మరీ తీసుకెళ్లారు. ఆ టైంలో అరెస్ట్ సమయంలో పోలీసుల తీరుపై అల్లు అర్జున్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ‘‘బెడ్ రూంలోకి వచ్చి మరీ తీసుకెళ్లడం టూమచ్. ఉన్నపళంగా రావాలంటే ఎలా?. బట్టలు మార్చుకునే టైం కూడా ఇవ్వరా?’’ అంటూ అల్లు అర్జున్ పోలీసులను నిలదీసినట్లు సమాచారం. అయితే పోలీసులు మాత్రం ఏం చెప్పకుండా ఆయన్ని తమ వెంట తీసుకెళ్లారు. పోలీసుల హడావిడితో భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అవ్వగా.. ఆమెను అల్లు అర్జున్ ఓదార్చారు. ఇక.. తనయుడి వెంట అల్లు అరవింద్ వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకుని వాహనం నుంచి దించేశారు. ‘మంచైనా చెడైనా నాదేనంటూ..’ ఆ టైంలో అల్లు అర్జున్ , అరవింద్‌తో అన్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ అరెస్ట్ కేసు లైవ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండినాలుగు సెక్షన్ల కింద కేసుభారత న్యాయ సంహిత సెక్షన్లు 105, 118(1) రెడ్‌విత్ 3/5 కింద కేసు పెట్టారు. ఇందులో 105 నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం. ఈ కేసులో గనుక నేరం రుజువైతే కనీసం ఐదేళ్లు.. గరిష్టంగా 10 ఏళ్ల దాకా జైలు శిక్ష పడుతుంది. అలాగే.. బీఎన్ఎస్ 118(1) సెక్షన్ చూసుకుంటే ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడుతుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 4వ తేదీ రాత్రి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం ప్రీమియర్ షోలు పడ్డాయి. అయితే.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య ధియేటర్‌కు అల్లు అర్జున్ వచ్చారు. అల్లు అర్జున్ కోసం భారీగా అభిమానులు ఎగబడటంతో సంధ్య థియేటర్ వద్ద తోపులాట చోటుచేసుకుంది. తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా...ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.అయితే ఈ ఘటనకు సంబంధించి థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, ఆయన సెక్యూరిటీ టీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో సంధ్య థియేటర్ యజమానులలో ఒకరైన ఎం సందీప్‌ను, సీనియర్ మేనేజర్ నాగరాజు, లోయర్ బాల్కనీ మేనేజర్ విజయ్ చందర్ ఉన్నారు. కోర్టు రిమాండ్ విధించడంతో వారిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుని పరిస్థితిపై లీగల్ టీంను సంప్రదించి.. తదుపరి విచారణ నిమిత్తం హీరో అల్లు అర్జున్‌కు కూడా నోటీసులు ఇస్తామని పోలీసు అధికారులు ప్రకటించారు. కానీ, అలాంటి నోటీసులేం జారీ చేయకుండానే అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.హైకోర్టులో పిటిషన్ ఉండగానే..ఈకేసుకు సంబంధించిన అల్లు అర్జున్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ విచారణలో ఉండగానే అరెస్ట్ కావడం గమనార్హం.మాకేం సంబంధం లేదు!తమకు సంబంధం లేకుండా, దురదృష్టవశాత్తు జరిగిన ఘటనలో తప్పుడు కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేసింది. ‘ప్రీమియర్ షో నిర్వహణ థియేటర్ యాజమాన్యం నిర్ణయం కాదు. చట్టప్రకారం గత నెల 29న ప్రభుత్వ అనుమతి తీసుకుని ప్రదర్శనపై మైత్రి డిస్ట్రిబ్యూటర్ నిర్ణయం తీసుకున్నారు. చిత్ర ప్రదర్శన సమయంలో థియేటర్ డిస్ట్రిబ్యూటర్ ఆధీనంలోనే ఉంటుంది. ఈ నెల 4, 5 తేదీల్లో బెనిఫిట్ షో కోసం గత నెల 30 నుంచి ఏర్పాట్లు చేసుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు, ఇతర ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున చిక్కడపల్లి పోలీసులకు, ట్రాఫిక్ అధికారులకు సమాచారం ఇవ్వడం కూడా జరిగింది. .. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినా భారీగా వచ్చిన అభిమానులతో తొక్కిసలాటలో దురదృష్టవశాత్తు మహిళ మృతి ఘటన చోటుచేసుకుందే తప్ప ఇది హత్య కాదు. ఇది ఉద్దేశపూర్వకంగా ఎవరూ చేసింది కాదు. ఈ ఘటనలో మా ప్రమేయం ఏమీ లేదు. అయినా మేం దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో తదుపరి విచారణ నిలిపివేసేలా పోలీసులను ఆదేశించాలి’ అని విజ్ఞప్తి చేశారు. -
గద్దర్ అంత్యక్రియల్లో విషాదం
సాక్షి, హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియల్లో మరో విషాదం చోటు చేసుకుంది. కడసారి చూపు కోసం వచ్చిన అభిమానులతో ఆల్వాల్‌లోని గద్దర్ ఇంటి వద్ద తోపులాట జరిగింది. ఈ తోపులాటలో గద్దర్‌కు అత్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్ అలీఖాన్ మృతి చెందారు. గద్దర్ కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సియాసత్ ఉర్దూ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్ కింద పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు. వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా.. ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్. గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. గద్దర్ అంత్యక్రియలకు హాజరై.. ఎల్బీ స్టేడియం నుంచి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్ ఇంటి వద్దకు చేరుకున్నారు. అయితే.. ఇంటి దగ్గర కిక్కిరిసిన జనం మధ్య ఆయన కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్ అరెస్ట్‌తోనే జహీరుద్దీన్ మృతి చెందినట్లు తెలిపారు. -
కందుకూరు తొక్కిసలాట ఘటనపై విచారణ
నెల్లూరు: కందుకూరు తొక్కిసలాట ఘటనను జస్టిస్ శేషశయనారెడ్డి కమిషన్ విచారణ చేపట్టింది. ఈ విచారణకు తాడికొడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఆయన మాట్లాడుతూ..సమావేశానికి పర్మిషన్ తీసుకున్నారా అని కమిషన్ ప్రశ్నించినట్లు తెలిపారు. సభ ప్రాంగణం అనుమతి గురించి చర్చ జరిగిందన్నారు. అనుమతి తీసుకున్న డాక్యుమెట్స్ అడిగారని, సభకు అనుమతి తీసుకున్న పత్రాలు కమిషన్‌కు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈనెల 15 వ తేదీన 3 గంటలకు మళ్లీ విచారణకు రమన్నారని తెలిపారు. కాగా ఇప్పటికే గుంటూరు తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య కమిషన్ విచారించిన సంగతి తెలిసిందే. కందుకూరు విచారణ అనంతరం ప్రభుత్వానికి కమిషన్ నివేదకి అందజేయనుంది. కందుకూరులో చంద్రబాబు నాయుడు గత డిసెంబర్లో నిర్వహించిన రోడ్ షో పెను విషాదాన్ని మిగిల్చింది. రోడ్ షో జరిగిన ఎన్టీఆర్ సర్కిల్లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు
తాడికొండ: చంద్రబాబుకు మతిభ్రమించి రోడ్లపై సభలు పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 829వ రోజుకు చేరాయి. పలువురు మాట్లాడుతూ పేద ప్రజల మాన ప్రాణాలు పోతుంటే చంద్రబాబు ఇంకా రోడ్‌షోలు అంటూ రోడ్లపై సంచారం చేయడం సిగ్గుచేటని, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న బాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఎప్పటికీ ఉండదన్నారు. ప్రజల ప్రాణాలపై స్పందించని ప్యాకేజీ పార్టీలు, ఎల్లో మీడియాలో లేనిది ఉన్నట్లు ప్రచారం చేసేందుకు డిబేట్లలో గగ్గోలు పెడుతుండడం దేనికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనుల హక్కుల కోసం 829 రోజులుగా ఆకలి దప్పులతో పోరాటం చేస్తుంటే కనీసం తొంగి చూడని ఎల్లో మీడియా, కులవాదులు, కులగజ్జి పార్టీలు, బాబు కోసం బారులు తీరడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతుందని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారనడంలో సందేహం లేదన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు వద్దంటే రభసా? -
పేదలను బలిగొంటున్న బాబు ప్రచారార్భాటం
తాడికొండ: తన ప్రచారార్భాటంతో పేదల ప్రాణాలను బలిగొంటున్న చంద్రబాబును తక్షణమే అరెస్టు చేసి జైల్లో పెట్టాలని బహుజన పరిరక్షణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల 827వ రోజు సోమవారం పలువురు మాట్లాడారు. పబ్లిసిటీ పిచ్చితో పేదలకు తాయిలాలు ఇస్తామని ఆశపెడుతూ చంద్రబాబు పెడుతున్న మీటింగులకు వెళ్లిన పేద ప్రజలు అమాయకంగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానిలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం సీఆర్డీయేకు భూములు అమ్ముకుని రిటర్నబుల్ ప్లాట్లు పొందిన కులవాదులు.. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాల కోసం భూములిచ్చామని చెప్పడం మోసపూరితం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రానికి చంద్రబాబు శనిలా తయారయ్యాడన్నారు. బహుజనులు 827 రోజులుగా ఉద్యమాలు చేస్తుంటే తమ పచ్చ పత్రికల్లో ప్రచురించకుండా రాష్ట్రంలో కులవాదాన్ని రెచ్చగొడుతున్న మీడియాపై చర్యల కోసం త్వరలో ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. బాబు ఆయన ఎల్లో మీడియా, బినామీలు కలిసి ఎన్ని కుట్రలు పన్నినా రాబోయే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించి సత్తా చాటుతామని హెచ్చరించారు. నాయకులు మాదిగాని గురునాథం, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధం..ప్రజల భద్రత కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం -
చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు బలయ్యారు: మంత్రి రజనీ
సాక్షి, గుంటూరు: గుంటూరులో చంద్రన్న సంక్రాంతి కానుకల పంపణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగిన సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మంత్రి విడదల రజనీ. చంద్రబాబు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు మంత్రి. ‘చంద్రబాబు నాయుడు ప్రచార యావకి ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం. ఏదో చేసేస్తున్నట్లు, ప్రచార ఆర్భాటాలు చేశారు. గత పది రోజులుగా ఇక్కడేదో పంచుతున్నారని ఒక ఫేక్ ప్రచారాలు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కూడా గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి వాహనాలు పెట్టి జనాలను మభ్యపెట్టి ఇక్కడి తీసుకొచ్చారు. గోరంత ఇచ్చి కొండంత అని చెప్పుకునే ప్రయత్నంలో తొక్కిసలాట జరిగింది. కేజీ కందిపప్పు, అరకేజీ నూనె ఇచ్చి ఏదో అన్ని సరుకులు ఇచ్చినట్లు ప్రచారం చేసుకున్నారు. మొన్న కందుకూరులో 8 మంది మరణించారు. ఇప్పుడు గుంటూరులో ముగ్గురు. ఈ చావులన్నింటికీ కూడా చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలి ’అని టీడీపీ, చంద్రబాబుపై మండిపడ్డారు మంత్రి విడదల రజనీ. ఇది ఒక ప్రైవేటు కార్యక్రమం అయినప్పటికీ ప్రభుత్వం, పోలీసులు కావాల్సిన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు మంత్రి రజనీ. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి అదనపు డాక్టర్లను తరలించామని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇదీ చదవండి: చంద్రబాబు సభలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి -
విషాదం: షాపింగ్ మాల్లో తొక్కిసలాట.. 9 మంది మృతి
కంపాలా: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కోసం షాపింగ్‌కి వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో ఆదివారం జరిగింది. దేశ రాజధాని కంపాలా ప్రాంతంలోని ఫ్రీడమ్ సిటీ షాపింగ్ మాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో వినియోగదారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. ఫ్రీడమ్ సిటీలో ఏర్పాటు చేసిన బాణసంచా కొనుగోలు చేసేందుకు భారీగా జనం ఎకబడడంతో తొక్కిసలాట జరిగినట్లు మీడియా పేర్కొంది. దీంతో షాపింగ్ కోసం వచ్చిన పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
ప్రకాశం: చంద్రబాబు కందుకూరు సభలో విషాదం
సాక్షి, ప్రకాశం: ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం కందుకూరులో జరిగిన సభలో విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో మురుగు కాలువలో పడి మరణించిన వాళ్ల సంఖ్య ఏడుగురికి చేరినట్లు తెలుస్తోంది. పామూరులోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఆ టైంలో ఆయన ప్రసంగిస్తుండగా.. తొక్కిసలాట జరిగిందని, ఈ క్రమంలోనే వాళ్లు కాలువలో పడడంతో వాళ్లు మరణించినట్లు తెలుస్తోంది. మరో ఇద్దరు అస్వస్థతకు గురికాగా.. ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. మృతుల్ని గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం చినకొండయ్య, కందుకూరు పట్టణం గుర్రంవారి పాలెంకు చెందిన కాకుమాని రాజాగా గుర్తించారు. మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తొక్కిసలాట అనంతరం ఆ ప్రాంతమంతా ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. -
ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట.. 174 మంది దుర్మరణం
జకర్తా: ఫుట్‌బాల్ మైదానంలో తొక్కిసలాట జరిగి 174 మంది దుర్మరణం పాలైన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. తూర్పు జావా ప్రావిన్స్‌లో శనివారం రాత్రి నిర్వహించిన ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు పోలీసులు కూడా ఉన్నారు. మరో 180 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఫుట్‌బాల్ మ్యాచ్‌లో పెర్సెబాయ సురబాయ జట్టు చేతిలో అరెమా జట్టు ఓడిపోయింది. ఈ క్రమంలో ఇరుజట్ల అభిమానులు ఘర్షణకు దిగారు. ఓటమి భరించలేక మైదానంలోకి చొచ్చుకొచ్చారు అరెమా జట్టు అభిమానులు. వారిని నిలువరించేందురు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి, లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు తలెత్తాయి. అదే తొక్కిసలాటకు దారి తీసినట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. ప్రధాన ద్వారం వైపు పరుగులు పెట్టిన క్రమంలో కిందపడిపోయిన కొందరు ఊపిరాడక మరణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై ఇండోనేషియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈ ఘోర దుర్ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. మహిళలు, చిన్నారులు సహా 22 మంది మృతి -
అంతా పారదర్శకమే.. టికెట్ల విక్రయాలపై అజహర్ స్పష్టీకరణ
ఉప్పల్/సాక్షి, న్యూఢిల్లీ: క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో అన్ని రకాలుగా పారదర్శకత పాటించామని, తమ వైపునుంచి టికెట్లు బ్లాక్ అయ్యే అవకాశమే లేదని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ స్పష్టం చేశారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లో ఆదివారం జరిగే మూడో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాల్లో నెలకొన్న గందరగోళంపై ఆయన ఈ మేరకు స్పందించారు. జింఖానా మైదానంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, మ్యాచ్ రోజున ఎలాంటి సమస్య రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ‘టికెట్ల విక్రయం బాధ్యతను పేటీఎంకు అప్పగించాం. ఇందులో నేరుగా హెచ్‌సీఏ ప్రమేయం లేదు. ఆన్లైన్ టికెట్లను బ్లాక్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు’ అని చెప్పారు. ఆన్లైన్లో 11,450, 3,000 చొప్పున రెండుసార్లు, ఆఫ్‌లైన్‌లో 2,100 టికెట్లు విక్రయించామని చెప్పారు. తప్పనిసరిగా ఇవ్వాల్సిన స్పాన్సర్లు తదితరులకు 6 వేల టికెట్లు ఇచ్చినట్లు చెప్పారు. నిబంధనల ప్రకారమే తమ క్లబ్ కార్యదర్శులకూ కాంప్లిమెంటరీలు ఇచ్చామని అజహర్ పేర్కొన్నారు. సజావుగా నిర్వహించేందుకు... హెచ్‌సీఏలో కార్యకలాపాలు పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు నియమించిన కమిటీ మ్యాచ్ నిర్వహణకు సంబంధించి ఆన్లైన్లో సమీక్ష నిర్వహించింది. ఇందులో హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, ఏసీబీ డైరెక్టర్ అంజనీకుమార్, మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ పాల్గొన్నారు. మ్యాచ్‌ను సజావుగా నిర్వహించడమే ప్రధాన ఉద్దేశమని జస్టిస్ కక్రూ తెలిపారు. మ్యాచ్‌ను సక్రమంగా నిర్వహించేందుకు కమిటీ హెచ్‌సీఏకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చిందన్నారు. టి–20 టికెట్లలో భారీ కుంభకోణం: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి హఫీజ్‌పేట్: హైదరాబాద్‌లో భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరగబోయే టి–20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల్లో భారీ కుంభకోణం జరిగిందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. కేటీఆర్ ఆదేశాలతో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్ రంగంలోకి దిగి, హెచ్‌సీఏతో కుమ్మక్కై టికెట్లను బ్లాక్‌లో అమ్ముకున్నారన్నారు. మియాపూర్ మదీనాగూడలోని కిన్నెర గ్రాండ్ హోటల్లో శుక్రవారం జరిగిన ప్రవాస్ యోజన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టికెట్ల విక్రయం ఓ ఆన్లైన్ సంస్థకు అప్పజెప్పి, అర్ధరాత్రి 10 గం.కు అమ్మకాలు ఓపెన్ చేసి 20 నిమిషాల్లో 39 వేల టికెట్లు అమ్ముడుపోయాయనడం విడ్డూరమన్నారు. రూ.800 టికెట్‌ను బ్లాక్‌లో రూ.8,000 నుంచి రూ.30 వేల వరకు అమ్ముతున్నారని ఆరోపించారు. -
Sakshi Cartoon 24-09-2022
-
IND VS AUS 3rd T20 Tickets: జింఖానా గ్రౌండ్ వద్ద తొక్కిసలాట.. ఏడుగురికి గాయాలు
సాక్షి, హైదరాబాద్/ రాంగోపాల్‌పేట్: గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతం. ఒక్కసారిగా వర్షం. జింఖానా గ్రౌండ్స్ వద్ద అప్పటివరకు కిలోమీటర్ పొడవు క్యూ లైన్లలో ఉన్నవారు, చుట్టుపక్కల ఉన్నవారు ఒకేసారి మైదానం ప్రధాన గేటు వైపు దూసుకువచ్చారు. లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. ఫలితం.. తీవ్రమైన తొక్కిసలాట. ఊపిరే అందని పరిస్థితి. కొందరు కింద పడిపోయారు. కాళ్ల కింద నలిగిపోయారు. గుమిగూడిన వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ క్రమంలో ముగ్గురు మహిళలు సహా ఏడుగురు గాయపడ్డారు. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం జరిగే భారత్–ఆ్రస్టేలియా టీ20 క్రికెట్ మ్యాచ్ కోసం జింఖానా మైదానంలో నేరుగా (ఆఫ్‌లైన్) టికెట్లు విక్రయించాలని నిర్ణయించిన హెచ్‌సీఏ ఆ మేరకు సరైన ఏర్పాట్లు, బందోబస్తు చేయలేదని, అభిమానులు పోటెత్తడంతో తొక్కిసలాట జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత మ్యాచ్‌తో.. మూడేళ్ల విరామం తర్వాత హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. బుధవారం వరకు ఆన్లైన్లోనే టికెట్ల అమ్మకాలు అంటూ చెప్పిన హెచ్‌సీఏ.. గురువారం మాత్రం కౌంటర్ ద్వారా టికెట్లు అమ్మాలని నిర్ణయించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మకాలు జరుగుతాయని ప్రకటించింది. మైదానంలోని హెచ్‌సీఏ కార్యాలయానికి దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన గేట్ వద్ద కుడివైపు పురుషులు, ఎడమవైపు మహిళలకు లైన్లు కేటాయించారు. గేటు దాటి లోపలకు వచ్చిన తర్వాత మాత్రం ఒకే లైన్లో టిక్కెట్ కౌంటర్ వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో టికెట్ల కోసం బుధవారం రాత్రి నుంచే అభిమానులు గ్రౌండ్స్ వద్దకు చేరుకోవడం ప్రారంభించారు. గురువారం తెల్లవారుజాముకే వీరి సంఖ్య పది వేలు దాటింది. ఒక్కోటి దాదాపు కి.మీ. మేర క్యూలైన్లు ఏర్పడ్డాయి. ప్రధాన గేట్‌ను మూసి ఉంచిన పోలీసులు విడతల వారీగా కొందరి చొప్పున లోపలి క్యూ లైన్లోకి పంపిస్తున్నారు. వర్షంతో పరుగులు ఉదయం 11.30 గంటల ప్రాంతంలో వర్షం కురిసింది. దీంతో తలదాచుకునేందుకు మహిళలు, పురుషులు పెద్ద సంఖ్యలో ప్రధాన గేటు వద్దకు చేరుకున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్లకు ఇదే గేటు కావడంతో లోపల నుంచి వచ్చే వారి కోసం పోలీసులు కొద్దిగా దాన్ని తెరిచారు. అదే సమయంలో బయట ఉన్న దాదాపు 1,000 మంది ఒకేసారి లోపలకు దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. పోలీసులు అదుపు చేయలేకపోవడంతో ముందు వరుసల్లో ఉన్న వాళ్లు కింద పడిపోయారు. అదే అదనుగా కొందరు పోకిరీలు.. మహిళలు, యువతులపై పడుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జీకి దిగారు. తొక్కిసలాట, లాఠీచార్జిలో ఒక కానిస్టేబుల్, ఒక అగ్నిమాపక సిబ్బందితో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఉదంతంతో గ్రౌండ్స్ వద్దకు పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. టిక్కెట్ల విక్రయానికి మరో కౌంటర్ ఏర్పాటు చేయించారు. సాయంత్రం టిక్కెట్ల విక్రయం పూర్తయ్యే వరకు భారీ బందోబçస్తు ఏర్పాటు చేశారు. లాఠీచార్జీ తర్వాత బయట ఉన్నవారిని పోలీసులు పంపేయగా.. సాయంత్రం వరకు ఉండి టిక్కెట్ల దొరకని వారు నిరసనకు ప్రయత్నించడంతో అధికారులు నచ్చజెప్పి పంపేశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స తొక్కిసలాటలో గాయపడిన ఏడుగురిని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో జింఖానా మైదానంలో స్వీపర్‌గా పనిచేసే బోరబండకు చెందిన రంజిత, బేగంపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శ్రీకాంత్, కవాడీగూడకు చెందిన విద్యార్థి ఆదిత్యనాథ్, తిరుమలగిరి ఇందిరానగర్‌కు చెందిన విద్యారి్థని సయ్యదా ఆలియా, కొంపల్లి బహుదూర్‌పల్లికి చెందిన సాయి కిశోర్, సికింద్రాబాద్ కంట్రోల్ రూమ్‌కు చెందిన అగ్నిమాపక శాఖ కానిస్టేబుల్ శ్రీనాథ్ యాదవ్, కేపీహెచ్‌బీ (జేఎన్టీయూ)కి చెందిన సుజాత ఉన్నారు. వీరిలో సాయి కిశోర్, సుజాతలను ప్రా£ýథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశామని, చికిత్స పొందుతున్న వారు కోలుకుంటున్నారని ఆస్పత్రి వైద్యులు చెప్పారు. బాధితుల ఫిర్యాదుతో మూడు కేసులు హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. జింఖానా వద్ద జరిగిన తొక్కిసలాటకు హెచ్‌సీఏ నిర్లక్ష్యమే ప్రధాన కారణమని చికిత్స పొందుతున్న వారు ఫిర్యాదు చేయడంతో, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌తో పాటు నిర్వాహకులపై బేగంపేట పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ యాక్ట్, 420, 21,22/76 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. టికెట్లు బ్లాక్‌లో అమ్ముకున్నట్లు ఫిర్యాదులందాయి. హెచ్‌సీఏ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని, వారిపై చర్యలు ఉంటాయని, నోటీసులు జారీ చేస్తామని అదనపు సీపీ (శాంతిభద్రతలు) డీఎస్ చౌహాన్ చెప్పారు. కనీస ఏర్పాట్లు లేకపోవడం వల్లే.. ఉప్పల్ స్టేడియం సామర్థ్యం సుమారు 39,800లో అన్నిరకాల పాస్‌ల సంఖ్య 20 శాతానికి మించదు. మిగిలిన వాటిని ప్రేక్షకులకు అందుబాటులో ఉంచే విషయంలో హెచ్‌సీఏలో నెలకొన్న గందరగోళం తాజా పరిస్థితికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్‌లోనా లేక ఆఫ్‌లైన్‌లోనా అనే విషయంలో బుధవారం వరకు స్పష్టత లేకుండా పోయింది. హెచ్‌సీఏలో చాలా కాలంగా ఉన్న విభేదాల కారణంగా గతంలో టికెట్ల విషయంలో కీలకంగా, చురుగ్గా వ్యవహరించినవారు అధ్యక్షుడు అజారుద్దీన్‌కు సహకరించలేదని సమాచారం. దీంతో ఆయన పూర్తిగా దిగువ స్థాయి ఉద్యోగులపై ఆధారపడ్డారు. బుధవారం జింఖానా మైదానం వద్దకు ఫ్యాన్స్ పెద్దసంఖ్యలో వచ్చి హడావుడి చేసిన నేపథ్యంలో.. ఆఫ్‌లైన్‌లో టికెట్లు అమ్ముదామని అజహర్ చెప్పినట్లు తెలిసింది. మొత్తం మీద కనీస ఏర్పాట్లు, బందోబస్తు లేకపోవడం, వర్షం నేపథ్యంలో తొక్కిసలాట జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మ్యాచ్ నిర్వహణ సులువు కాదు: అజారుద్దీన్ గురువారం చోటు చేసుకున్న ఘటనలో తన తప్పేమీ లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ చెప్పారు. క్రికెట్ మ్యాచ్ నిర్వహణ అంత సులువు కాదని పేర్కొన్నారు. పోలీసులకు ముందే సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు. ఘటనపై ప్రభుత్వానికి నివేదిక సమరి్పస్తామని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి మ్యాచ్‌ల నిర్వహణ ఉంటుందని చెప్పారు. అందరం క్రికెట్ అభివృద్ధి కోసమే కష్టపడుతున్నామని అన్నారు. మ్యాచ్ టికెట్లు అన్నీ అమ్ముడుబోయినట్లు తెలిపారు. తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగితే సహించం: మంత్రి శ్రీనివాస్‌గౌడ్ క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జింఖానా గ్రౌండ్స్ వద్ద జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో టీ20 క్రికెట్ మ్యాచ్ ఏర్పాట్లపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర పేరు, ప్రతిష్టలకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. దళారులు టికెట్లు అమ్మే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హెచ్‌సీఏ పాలకమండలి ఏకపక్షంగా వ్యవహరించకుండా ప్రభుత్వ సహకారాన్ని కోరిఉంటే ఇలాంటి ఘటనలు జరిగేవి కావని మంత్రి చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. 25న జరిగే మ్యాచ్‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు సమన్వయంతో పనిచేసి రాష్ట్రానికి మంచి పేరు తేవాలని విజ్ఞప్తి చేశారు. జింఖానా వద్ద గాయపడిన వారికి హెచ్‌సీఏ ఆధ్వర్యంలో ఉచితంగా వైద్యసేవలు అందజేస్తామన్నారు. సమావేశంలో హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, టీఎస్పీడీసీఎల్ ఎండీ రఘుమా రెడ్డి, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు పాల్గొన్నారు. ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు నాలుగు కౌంటర్లు అని చెప్పినా డిజిటల్ పేమెంట్లు పని చేయలేదు. మధ్యాహ్నం వరకు ఒక కౌంటర్ నుంచే టికెట్లు అమ్మారు. మరో కౌంటర్ కేవలం పోలీసుల కోసమే కేటాయించినట్టుంది. చాలామంది అడ్డదారిలో అక్కడకు వెళ్లి కొనుక్కున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి వేచి చూసినా నాకు టికెట్ దొరకలేదు. – సాయి ప్రవీణ్, గాజులరామారం -
మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస
-
మహేశ్ ఫొటోషూట్‌లో తొక్కిసలాట..రభస
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’.. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా బుధవారం గచ్చిబౌలిలోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీ వద్ద హీరో మహేశ్‌బాబుతో ఫ్యాన్స్ ఫొటోషూట్‌ను ఏర్పాటు చేశారు. చిత్ర నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్స్ స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే గచ్చిబౌలిలో ఈ ఫొటోషూట్‌ను ఏర్పాటుచేసినట్టు తెలుస్తోంది. అయితే, దీని గురించి తెలియడంతో మహేశ్‌బాబు అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పలువురు అభిమానులు ఈ ఫొటోషూట్‌లో మహేశ్‌తో ఫొటోలు దిగినట్టు సోషల్ మీడియాలో, ట్విటర్లో వస్తున్న అప్డేట్స్ను బట్టి తెలుస్తోంది. అయితే, మహేశ్ అభిమానులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఇక్కడ ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకొని.. తీవ్ర గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఈ ఫొటోషూట్‌కు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో మహేశ్‌బాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమచారం. మహేశ్‌తో ఫొటోషూట్ పేరిట ఆన్లైన్లో పోస్టులు పెట్టిమరీ అభిమానుల్ని ఇక్కడికి రప్పించినట్టు తెలుస్తోంది. -
మాల్ ఓపెనింగ్‌లో విషాదం
సాక్షి, తిరువనంతపురం: ఓ మాల్ ఓపెనింగ్ ఈవెంట్లో విషాదం చోటు చేసుకుంది. తన ఫేవరెట్ స్టార్‌ను చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటుతో అతను మృతి చెందాడని చెబుతున్నప్పటికీ.. స్థానికులు మాత్రం తొక్కిసలాటలోనే ప్రాణాలు విడిచాడని అంటున్నారు. శనివారం సాయంత్రం కొల్లాంలోని కొట్టారక్కరలో ఎంసీ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మళయాళ యంగ్ స్టార్ దుల్కర్ సల్మాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరై దాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ప్రవచబలం(తిరువనంతపురం)కు చెందిన హరి(45) కూడా వారిలో ఉన్నారు. దుల్కర్ అక్కడికి చేరుకోగానే అతన్ని చూసేందుకు ఒక్కసారిగా జనం తోసుకోవటం ప్రారంభించారు. ఈ క్రమంలో హరి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పోలీసులు తమ వాహనంలో అతన్ని ఆస్పత్రికి తరలించినప్పటికీ లాభం లేకపోయింది. ఈ ఘటనకు సంబంధించి నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, మీడియాలో వస్తున్న తొక్కిసలాట కథనాలను పోలీసులు ఖండిస్తున్నారు. -
'మహా'విషాదం జరిగి నేటికి మూడేళ్లు
-
అధికారులకు రైల్వేమంత్రి డెడ్‌లైన్
సాక్షి, న్యూఢిల్లీ : ‘మహా’ విషాదం నేపథ్యంలో కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్... ఆశాఖ ఉన్నతాధికారులకు వారం రోజులు డెడ్‌లైన్ విధించారు. ముంబై ఎల్పిన్స్టోన్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అలాగే 35మంది గాయపడ్డారు. ఈ ఘటనపై పీయూష్ గోయల్ శనివారం రైల్వే భద్రత అంశంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గడువులోపు ముంబై సబర్బన్ రైల్వేస్టేషన్లో భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా ఆదేశించారు. అలాగే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలకు అవకాశం ఉన్న కీలక ప్రదేశాలను గుర్తించాలన్నారు. అంతేకాకుండా అన్ని స్టేషన్లలో లోపల, బయటకు వెళ్లే ప్రాంతాలలో పూర్తిస్థాయి ప్రణాళిక చేపట్టాలని, రైల్వే ఫ్లాట్‌ఫామ్‌లను సాధ్యమైనంత క్రమబద్ధీకరించేలా చూడాలన్నారు. వారం రోజుల్లోగా వీటన్నింటిని పూర్తి చేయాలని గోయల్ ఆదేశాలు ఇచ్చారు. ఇక 15 నెలల్లోగా ముంబయితో పాటు దేశంలోని అన్ని సబర్బన్ రైళ్లలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కాగా 23 మందిని బలిగొన్న ఎల్ఫిన్స్టన్ స్టేషన్ వద్ద అదనపు పాదచారుల వంతెన (ఎఫ్ఓబీ) నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లను ఆహ్వానిస్తోంది. ప్రమాదం జరిగిన శుక్రవారమే ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 40 అడుగుల పొడవు నిర్మించనున్న ఈ వంతెనను 2016 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు. ముంబై సబర్బన్ ప్రాంతంలో రూ.45 కోట్ల బడ్జెట్‌తో చేపట్టబోయే ఎస్కలేటర్లు, ఎఫ్‌ఓబీలు, ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్ల ప్రాజెక్టుల్లో ఇది అంతర్భాగం. రూ.9.5 కోట్ల వ్యయమయ్యే ఈ వంతెనను వచ్చే ఏడాది అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. -
తొక్కిసలాట.. 50 మంది మృతి
అడిస్ అబాబా: ఆందోళనకారులపై పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో జరిగిన తొక్కిసలాటలో సుమారు 50 మంది మృతిచెందిన ఘటన ఇథియోపియాలో చోటుచేసుకుంది. ఒరోమియా ప్రాంతంలో మతపరమైన కార్యక్రమం సందర్భంగా ఆదివారం ఓ వర్గానికి చెందిన ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ.. తిరుగుబాటుదారులకు సంబంధించిన జండాను ఎగురవేశారు. దీంతో వారిని చదరగొట్టే క్రమంలో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పౌరులు మృతి చెందారని అక్కడి ప్రతిపక్ష పార్టీ వెల్లడించింది. అయితే ప్రభుత్వం మాత్రం మృతుల సంఖ్యను ధృవీకరించనప్పటికీ.. కొంతమంది ప్రాణాలు కోల్పోయారని.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారని వెల్లడించింది. -
డబుల్ బెడ్రూం దరఖాస్తుల్లో అపశ్రుతి
కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి బారులు తీరిన జనాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరగింది. ఈ తోపులాటలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే తోపులాట జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. -
'తొక్కిసలాటప్పుడు నేనక్కడ లేను'
రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా తొలిరోజు తొక్కిసలాట జరిగిన సమయంలో తాను రాజమండ్రిలోనే లేనని సినీ దర్శకుడు బోయపాటి శ్రీను వెల్లడించారు. అంతకు ముందురోజు గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొని తాను వెళ్లిపోయానన్నారు. హారతి చూసిన ప్రతి భక్తుడూ సంతోషించాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగానే ఆ కార్యక్రమాన్ని తీర్చిదిద్దేందుకు వచ్చానే గాని, షార్ట్ ఫిల్మ్ కోసం కాదని స్పష్టం చేశారు. వీఐపీ ఘాట్‌లో శుక్రవారం పుష్కర స్నానమాచరించిన ఆయన మీడియాతో మాట్లాడారు. పుష్కరాలకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ముగింపు రోజు నిత్యహారతి కార్యక్రమాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేలా చూడాలని ప్రభుత్వం తనను కోరిందన్నారు. ఆ మేరకు హారతిచ్చే రెండు వంతెనలపై అధునాతన లైటింగ్, సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. గోదావరికి అభిముఖంగా ఇస్తున్న నిత్యహారతిపై స్వామిజీలు, ఆధ్యాత్మికవేత్తల నుంచి వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. ఎవరో ఏదో మాట్లాడితే స్పందించాల్సిన అవసరం తనకు లేదన్నారు. -
బాబు, బోయపాటిలపై కేసు నమోదు
రాజమండ్రి క్రైం : పుష్కరాల ప్రారంభం సందర్భంగా ఈ నెల 14న రాజమండ్రి పుష్కర ఘాట్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ తనయుడు జీవీ శ్రీరాజ్ త్రీ టౌన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. పుష్కరాల ప్రారంభం రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై షార్ట్ ఫిల్మ్ తీయడమే తొక్కిసలాటకు కారణమని, తన పాపులార్టీని పెంచుకునేందుకు పుష్కరాలను చంద్రబాబు ఉపయోగించుకున్నారని జీవీ శ్రీరాజ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. షార్ట్‌ఫిల్మ్ రూపకల్పనకు ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు అప్పగించారని, షార్ట్‌ఫిల్మ్ మిషతో ఆయన అనధికార అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరించారని తెలిపారు. పుష్కర ప్రారంభోత్సవంతో బోయపాటి శ్రీనివాస్‌కు ఏ సంబంధమూ లేనప్పటికీ, తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా వ్యవహరించారన్నారు. ఆయనకు ప్రభుత్వ యంత్రాంగ నిర్వహణ, ఉత్సవ నిర్వహణ, ప్రొటోకాల్ వ్యవహారంలో ఎటువంటి అనుభవమూ లేదని ఆరోపించారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు. బోయపాటి శ్రీనివాస్ అనధికార నిర్వహణలో పుష్కరాలు జరిగాయని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. షార్ట్‌ఫిల్మ్ చిత్రీకరణకు రెండున్నర గంటలపాటు స్నానఘట్టాలను చిత్రీకరించారన్నారు. ఈ క్రమంలో బోయపాటి శ్రీనివాస్ ప్రజలను వదలండని చెప్పడంతో ప్రజలను అధికారులు ఒకేసారి ఘాట్‌లోకి వదిలారన్నారు. దీనివల్లనే 29 మంది మృతి చెందారని ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన చంద్రబాబు నాయుడు, బోయపాటి శ్రీనివాస్లపైన, ఆయన ఆదేశాలు పాటించి అధికార దుర్వినియోగానికి పాల్పడిన కలెక్టర్, రాజమండ్రి అర్బన్ ఎస్పీలపై న్యాయవిచారణ జరిపి చర్యలు తీసుకోవాలని శ్రీరాజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. -
వీవీఐపీ 'బాబు' ల కోసం వంగిన నిబంధనలు
హైదరాబాద్: ఏమంత అర్జెంటు పనుందని అందరికంటే ముందుగా చంద్రబాబు పుష్కర స్నానం చేశారు? ఏదైనా అధికారిక కార్యక్రమానికి హాజరు కావాల్సిఉందా? లేదా ఇంకేదైన ముఖ్యమైన పనుందా? పుష్కరాల ప్రారంభానికి మూడు రోజుల ముందు నుంచే రాజమండ్రిలో మకాం వేసిన ఆయన.. పన్నెండు రోజులూ అక్కడే ఉంటానని ప్రకటించారు. అలాంటప్పుడు తీరిక సమయంలోనే భక్తుల రద్దీ తగ్గినప్పుడో.. అదీకాదంటే వీఐపీ ఘాట్ లోనో స్నానం చేస్తే పోయేదికదా? ఇంత మంది చనిపోయేవారు కాదుకదా? అని ఎన్డీటీవీ తన కథనంలో ప్రశ్నించింది. మొత్తం వ్యవహారంలో చంద్రబాబు వీవీఐపీ హోదాలో నిబంధనలను గోదాట్లో కలిపిన తీరును ఎండగట్టింది. 'గోదావరి పుష్కరాలు ప్రారంభమైననాడే 29 మంది అమాయకుల (వారిలో 26 మంది మహిళలు) ప్రాణాలు బలిగొన్నపాపం చంద్రబాబుదే..' నిన్నవరకూ భక్తులూ, రాజకీయ పక్షాలూ మాట్లాడిన ఈ వాస్తవాన్నే ఇప్పుడు జాతీయ మీడియా కూడా చెబుతోంది. అంతేకాదు.. వీవీఐపీ హోదాలో బాబు చేసిన ఘోర తప్పిదాలే అనంత విషాదానికి కారణమని ఎన్డీటీవీ ప్రముఖంగా పేర్కొంది. ఏపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రచారం కల్పించినట్లే రాజమండ్రిలోని ప్రధాన ఘాట్లు అన్నింటివద్దా జనం రద్దీ విపరీతంగా ఉంది. జన సమూహ నిర్వహణ (క్రౌడ్ మేనేజ్మెంట్) నిపుణులు చెప్పినదాన్నిబట్టి మంగళవారం పుష్కర ఘాట్ వద్ద ప్రతి 10 నిమిషాలకు అప్పటికే ఉన్న భక్తులకు తోడు కొత్తగా మరో 10 వేల మంది తోడయ్యారు. సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో కలిసి పుణ్యస్నానం, పితృదేవతలకు సంతర్పణం తదితర కార్యక్రమాలకు దాదాపు రెండు గంటలపాటు సాగింది.. ఆ సమయంలో భక్తులెవరిని నదిలోకి అనుమతించలేదు. అంటే సీఎం గడిపిన నిమిష నిమిషానికి భక్తుల సంఖ్య అమాంతం పెరుగుతూనేపోయింది. అలా రెండు గంటలపాటు.. దాదాపు లక్షన్నర మంది వన్ వే ట్రాఫిక్ లాగా పోగయ్యారు. పుష్కరిణిలోకి తోసుకురావడం తప్ప మరో దారి లేదక్కడ. బాబు వెళ్లిపోగానే భక్తులను అనుమతించడంతో ఒక్కసారిగా తోపులాట జరిగి 29 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. మంత్రులకు ఇంగితం లేకున్నా అధికారులకైనా సోయి ఉండక్కరలేదా? అనే ప్రశ్నలకు వినిపించే సమాధానం.. 'వీఐపీల కోసం నిబంధనలు సైతనం వంగిపోవాల్సిందే' అని. రూ.2 వేల కోట్లతో పుష్కర ఏర్పాట్లు ఘనంగా చేస్తామన్న చంద్రబాబు ప్రకటనలు అవాస్తవాలని, ఘాట్ల వద్ద టాయిలెట్టుగానీ, మెడికల్ క్యాంపులు గానీ, చివరికు గుక్కెడు మంచినీళ్లు కూడా లేకుండాపోయిన వైనాన్ని తెలిపింది. నిపుణులు వివరణను బట్టి.. జన సమూహం కదులుతున్నప్పుడు చదరపు మీటరుకు గరిష్టంగా ముగ్గురు వ్యక్తులు మాత్రమే ఉండేలా చూడటం రక్షణాత్మక చర్యల్లో ప్రధాన అంశం. నిన్న రాజమండ్రి విషాదంలో ఒక చదరపు మీటరుకు కనిష్ఠమే ఏడుగురు వ్యక్తులు ఉన్నారు. అంటే కనీసం గాలి పీల్చికునే అవకాశంకూడా మృగ్యమైన స్థితన్నమాట.