కొత్తగూడెం: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన డబల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో బుధవారం డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవడానికి బారులు తీరిన జనాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట జరగింది. ఈ తోపులాటలో ఎనిమిది మందికి స్వల్ప గాయాలయ్యాయి. అస్వస్థతకు గురైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడం వలనే తోపులాట జరిగిందనే విమర్శలు వస్తున్నాయి.
డబుల్ బెడ్‌రూం దరఖాస్తుల్లో అపశ్రుతి
Published Wed, Jan 6 2016 1:42 PM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
Advertisement
Advertisement