Live Updates
#AA కేసు అప్‌డేట్స్.. జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్
అల్లు అర్జున్ రిలీజ్
- చంచల్‌గూడ జైలు నుంచి నటుడు అల్లు అర్జున్ రిలీజ్
- పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్‌కు వెళ్లిన అల్లు అర్జున్
- హీరో రాకతో థియేటర్ బయట తొక్కిసలాట
- ఓ మహిళ మృతి.. విషమంగానే ఆమె కుమారుడి ఆరోగ్యం
- మృతురాలి భర్త ఫిర్యాదుతో థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్.. ఆయన భద్రతా సిబ్బందిపై కేసు నమోదు
- ఏ11గా అల్లు అర్జున్ పేరు
- శుక్రవారం ఉదయం ఇంటికెళ్లి మరీ అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు
- స్టేట్‌మెంట్ రికార్డు చేసి.. గాంధీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు
- ఆపై నాంపల్లి కోర్టుకు తరలింపు
- 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- ఆ వెంటనే చంచల్‌గూడ జైలుకు తరలించిన పోలీసులు
- హైకోర్టులో క్వాష్ పిటిషన్‌పై అల్లు అర్జున్ తరఫున గట్టి వాదనలు
- మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన తెలంగాణ హైకోర్టు
- కింది కోర్టు రిమాండ్ విధించిన గంట వ్యవధిలో.. హైకోర్టు మధ్యంతర బెయిల్
- బెయిల్ ఆర్డర్ లేట్ కావడంతో.. రాత్రంత జైల్లోనే అల్లు అర్జున్
- ఈ ఉదయం చంచల్‌గూడ జైలు నుంచి రిలీజ్
- అల్లు అర్జున్‌కు బెయిల్ మంజూరు చేసిన కోర్టు
- అయినా విడుదలలో తీవ్ర జాప్యం
- ఆర్డర్ కాపీలో ఇవాళే విడుదల చేయాలని స్పష్టంగా లేకపోవడంతో రాత్రంతా జైల్లోనే ఉండనున్న బన్నీ
- అసహనంతో అక్కడినుంచి వెళ్లిపోయిన అల్లు అరవింద్
- రేపు ఉదయం ఆరు గంటల తర్వాత రిలీజ్ చేసే అవకాశం
అల్లు అర్జున్ రిలీజ్ మరింత ఆలస్యం
- అల్లు అర్జున్ రిలీజ్ మరింత ఆలస్యం
- ఈ రోజు అల్లు అర్జున్ విడుదల కాకపోవచ్చంటున్న అధికారులు.
- అల్లు అర్జున్ ఈరోజు చంచల్‌గూడ జైల్లోనే ఉండే అవకాశం.
- జైలు అధికారులకు ఇంకా చేరని హైకోర్టు మధ్యంతర బెయిల్ ఉత్వర్వుల కాపీ
- ప్రస్తుతం మంజీరా బ్యారక్‌లో ఉన్న అల్లు అర్జున్
- ఇంకా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కానీ మధ్యంతర బెయిల్ కాపీ
హైకోర్టులో అల్లు అర్జున్‌కు ఊరట
- మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కు జీవించే హక్కు ఉంది: తెలంగాణ హైకోర్టు
అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండించిన వైఎస్ జగన్
- హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది.
- అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు.
- అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసం?
- తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదు.
- అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.
హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది. అదే సమయంలో దీనిపై @alluarjun తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని…
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 13, 2024
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు..
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో కొనసాగుతున్న వాదనలు..
- క్వాష్ పిటిషన్‌పై నిర్ణయంపై తర్వాతే రిమాండ్‌పై స్పష్టత..
- కీలకంగా మారనున్న హైకోర్టు తీర్పు
అల్లు అర్జున్‌కు రిమాండ్
- అల్లు అర్జున్‌కు రిమాండ్
- 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు
- మరొకవైపు అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
- కీలకంగా మారనున్న హైకోర్టు తీర్పు
అల్లు అర్జున్ అరెస్టులో రాజకీయ కుట్ర కోణం ఉంది: మార్గాన్ని భరత్
- సంధ్య థియేటర్ నిర్వాహకులను, జనాన్ని అదుపు చేయని పోలీసులను ఈ సంఘటనలో ఎందుకు బాధ్యులను చేయలేదు
- రాజమండ్రి పుష్కరాల్లో జరిగిన తొక్కేసలాటకు బాధ్యుడైన అప్పటి సీఎం చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలి
- అధికారం ఉంది కాబట్టి చంద్రబాబు తనకు తాను క్లీన్ చిట్ ఇప్పించుకున్నారు
- చంద్రబాబుకు ఒకరకమైన చట్టం.. అల్లు అర్జున్‌కు మరో చట్టం ఉండకూడదు
- ప్రజలందరికీ ఒకే రకమైప చట్టం అమలు కావాలి
అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
- అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
- వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు
అల్లు అర్జున్‌ని అక్రమంగా అరెస్ట్ చేశారు: అంబటి రాంబాబు
గుంటూరు:
- అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం
- అల్లు అర్జున్ చేసిన తప్పేంటి?
- సినిమా రిలీజ్ రోజు అల్లు అర్జున్ థియేటర్‌కెళ్లి సినిమా చూశాడు.
- అక్కడ తొక్కిసలాట జరిగి దురదృష్టవశాత్తు ఒకరు మృతి చెందారు
- ఈ ఘటనపై అల్లు అర్జున్ స్పందించాడు ఆ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పాడు 25 లక్షలు కూడా ఇస్తానన్నాడు
- అల్లు అర్జున్ అరెస్టుపై అందరి హీరోలు ఆలోచించాలి
- ఈ సంస్కృతి మంచిది కాదు
- గతంలో గుంటూరులో ఘరానా మొగుడు సినిమా వ్యవహారంలో ఇలాంటి ఘటన జరిగింది
- చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయారు
- తెలంగాణలో ఉంది కూడా చంద్రబాబు సన్నిహితుడు ప్రభుత్వం
- అల్లు అర్జున్ అరెస్టుకు అక్కడ ప్రభుత్వం కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదు
- అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం, అన్యాయం, దుర్మార్గం
చట్టం ముందు అందరూ సమానులే: సీఎం రేవంత్
ఢిల్లీ:
- అల్లు అర్జున్ విషయంలో చట్టం తనపని తాసు చేసుకుపోతోంది
- అందులో నా జోక్యం ఏమీ ఉండదు
- తొక్కిసలాటలో ఒకరు చనిపోయిన నేపథ్యంలో పోలీసుల చర్యలు తీసుకున్నారు.
గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి
- గాంధీ ఆస్పత్రిలో అల్లు అర్జున్‌కు వైద్య పరీక్షలు పూర్తి
- నాంపల్లి కోర్టుకు తరలిస్తున్న పోలీసులు..
అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు
- అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి దంపతులు
- అల్లు అర్జున్ నివాసానికి చిరంజీవి, నాగబాబు
- అర్జున్ అరెస్ట్‌తో షూటింగ్ రద్దుచేసుకున్న చిరంజీవి
- అల్లు అర్జున్ అరెస్ట్ పరిణామాలపై ఆరా
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ 4 గంటలకు వాయిదా..
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ 4 గంటలకు వాయిదా..
- సోమవారం వరకు అరెస్ట్ చేయకుండా ఆర్డర్ ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ వేసిన అల్లు అర్జున్..
చిక్కడపల్లి పీఎస్‌కు చిరంజీవి
- కాసేపట్లో చిక్కడపల్లి పీఎస్‌కు చిరంజీవి
- అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో చిక్కడపల్లి పీఎస్‌కు సినీ పెద్దలు
- చిరంజీవితో పాటు దిల్ రాజు, మరికొందరు
- అల్లు అర్జున్‌ను విచారిస్తున్న పోలీసులు
- స్టేట్‌మెంట్ రికార్డు చేసి.. అనంతరం గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం తరలించే అవకాశం
- ఆపై కోర్టులో ప్రవేశపెట్టనున్న పోలీసులు
అల్లు అర్జున్ అరెస్ట్.. అతి చర్య: కేటీఆర్
- అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరును చేసిన అతిని ఖండిస్తున్నా
- జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ అల్లు అర్జున్ అరెస్టు పాలకుల అభద్రతాభావానికి తార్కాణం
- తొక్కిసలాట బాధితుల పట్ల నాకు పూర్తి సానుభూతి ఉంది, కానీ అసలు తప్పు ఎవరిది?
- నేరుగా ఆయనకు సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ గారిని సాధారణ నేరస్తుడిలా పరిగణించడం సరైంది కాదు.
- సంబంధం లేని అంశంలో అల్లు అర్జున్ అరెస్టు చేయడం న్యాయమైతే... హైడ్రా పేరుతో పేద ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి మరణానికి కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలి
Arrest of National Award winning star Allu Arjun is the pinnacle of insecurity of the rulers!
I totally sympathize with the victims of the stampede but who failed really?
Treating @alluarjun Garu as a common criminal is uncalled for especially for something he isn’t directly… pic.twitter.com/S1da96atYa— KTR (@KTRBRS) December 13, 2024
అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం: అంబటి
- అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయం
- అల్లు అర్జున్ అరెస్టును ఖండించిన వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు
- అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమంటూ ట్వీట్
ALLU ARJUN అరెస్టు అన్యాయం !@alluarjun @PawanKalyan @revanth_anumula @ncbn @TelanganaDGP @TelanganaCMO
— Ambati Rambabu (@AmbatiRambabu) December 13, 2024
నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత
- నాంపల్లి కోర్టు వద్ద భారీ భద్రత
- అల్లు అర్జున్‌కు గాంధీలో వైద్య పరీక్షలు
- అనంతరం నాంపల్లి క్రిమినల్ కోర్టులో హాజరుపర్చే అవకాశం
- కోర్టు ముందు భద్రతను సమీక్షించిన లా ఆర్డర్ అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్
అల్లు అర్జున్ అరెస్ట్ ధృవీకరణ
- సంధ్యా థియేటర్ లోని తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్
- అరెస్ట్ ధృవీకరించిన హైదరాబాద్ నగర కమిషనర్
- అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశాం: సీపీ సీవీ ఆనంద్
లక్ష్మీపార్వతి ఖండన
- అల్లు అర్జున్ అరెస్టు వెనుక చంద్రబాబు కుట్ర ఉంది
- పుష్జరాల సమయంలో చంద్రబాబు వలన 29 మంది చనిపోతే మరి ఆయన్ను ఎందుకు అరెస్టు చేయలేదు?
- కందుకూరు, గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో జనం చనిపోతే చంద్రబాబు ను ఎందుకు అరెస్టు చేయలేదు?
- చంద్రబాబు, ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి అక్రమ అరెస్టులకు దిగటం సిగ్గుచేటు
- అల్లు అర్జున్ సినిమా చూడటానికి వెళ్తే అతని తప్పేం ఉంది?
- తప్పు చేసిన వారిని కాదని అల్లు అర్జున్ ని ఎలా అరెస్టు చేస్తారు?
అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
- అల్లు అర్జున్‌పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు
- 105, 118(1), రెడ్ విత్ 3/5 BNS సెక్షన్ల కింద అల్లు అర్జున్ పై కేసుల నమోదు
- ఈ సెక్షన్ల ప్రకారం అల్లు అర్జున్ కు 5 నుండి 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం
- BNS 118(1) కింద ఏడాది నుంచి పదేళ్ల శిక్ష పడే అవకాశం
అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై విచారణ 4 గంటలకు వాయిదా..
- అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ పై లంచ్ మోషన్ విచారణ జరపాలని హైకోర్టు ను కోరిన న్యాయవాదులు..
- జస్టిస్ జువ్వాడి శ్రీదేవి కోర్టులో మెన్షన్ చేసిన న్యాయవాదులు నిరంజన్ రెడ్డి అశోక్ రెడ్డి...
- సోమవారం వరకు అరెస్టు చేయకుండా ఆర్దర్స్ ఇవ్వాలని న్యాయవాదులు
- పోలీసులను అడిగి 2.30కి చెబుతానన్న అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్
- విచారణ 2.30కి వాయిదా