సాక్షి,హైదరాబాద్ : అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాలుగు కేసులు నమోదు చేశారు. అల్లు అర్జున్ అరెస్ట్ అనంతరం, పలువురు తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై అభ్యంతరకర పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లపై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. నిందితులపై ఐటి యాక్ట్‌తో పాటు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సంధ్య థియేటర్ వద్ద ఏం జరిగింది..?
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో డిసెంబర్ 4న రాత్రి 9:30 నిమిషాలకు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఆర్టీసీ క్రాస్ రోడ్‌లోని సంధ్య థియేటర్ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. సరిగ్గా అదే సమయంలో హీరో అల్లు అర్జున్.. భార్య స్నేహతో కలిసి థియేటర్‌కు వెళ్లాడు. అయితే, థియేటర్ యాజమాన్యం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదు. ఎంట్రీ, ఎగ్జిట్‌లలో కూడా ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు.
అయితే, దిల్‌సుఖ్‌నగర్ శివలింగనగర్‌కు చెందిన మగుడంపల్లి భాస్కర్ (40) తన భార్య రేవతి (39), కొడుకు శ్రీతేజ్ (9)తో కలిసి 4వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో సంధ్య థియేటర్‌లో పుష్ప-2 సినిమాకు వెళ్లారు. వీరు థియేటర్‌లోని లోయర్ బాల్కనీలో ఉండగా.. 9.40 గంటల సమయంలో అల్లు అర్జున్ వచ్చారు. ఆయన భద్రతా సిబ్బంది ప్రేక్షకుల గుంపును తొలగిస్తూ ముందుకు రావడంతో రేవతి, శ్రీతేజ్ కిందపడిపోయారు. అప్పటికే రేవతి మరణించగా, స్పృహ కోల్పోయిన శ్రీతేజ్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
దర్యాప్తు ప్రారంభించిన చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment