'పుష్ప 2' రిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఎందుకంటే కొన్నిరోజుల క్రితం ఇదే కేసులో హీరో అల్లు అర్జున్‌ని అరెస్ట్ చేయడం సంచలనం అయింది. కోర్ట్ మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బన్నీ బయటకొచ్చాడు. అయినా సరే ఈ కేసు ఇంకా బలంగా బిగుసుకుంటున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: జైలు నుంచి రిలీజ్.. వెంటనే దర్శన్‌పై ప్రేమ బయటపెట్టిన పవిత్ర గౌడ)
తాజాగా చిక్కడపల్లి పోలీసులు.. సంధ్య థియేటర్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. తొక్కిసలాట ఘటనపై 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు. అలానే లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని వివరణ అడిగారు.
షోకాజ్ నోటీసుల్లో పోలీసులు పేర్కొన్న కొన్ని అంశాలు
సంధ్య 70MM థియేటర్ నిర్వహణలో లోపాలు
సంధ్య 70MM మరియు సంధ్య 35MM థియేటర్లు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఒకే వైపు ఉన్నాయి.
రెండు థియేటర్లలో కలిపి దాదాపు 2520 మంది కూర్చునే సామర్థ్యం.
ఎంట్రీ అండ్ ఎగ్జిట్‌లను సూచించే సరైన సైన్ బోర్డులు లేవు. థియేటర్లో మౌలిక సదుపాయాలు సరిగా లేవు.
అనుమతి లేకుండా థియేటర్ వెలుపల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి ప్రేక్షకులు పోగవ్వడానికి అవకాశం ఇచ్చారు
అల్లు అర్జున్ రాక గురించి స్థానిక పోలీసులకు తెలియజేయడంలో థియేటర్ నిర్వాహకులు విఫలమయ్యారు.
అల్లు అర్జున్ రాకపై యాజమాన్యానికి సమాచారం ఉన్నప్పటికీ ఎంట్రీ , ఎగ్జిట్ ప్లాన్ చేయలేదు.
అల్లు అర్జున్‌తో పాటు తన ప్రైవేట్ సెక్యూరిటీని కూడా థియేటర్ లోపలికి అనుమతించారు.
టిక్కెట్‌లను తనిఖీ చేయడానికి సరైన వ్యవస్థ లేదు, అనధికారిక ప్రవేశాన్ని అనుమతించి థియేటర్ లోపల రద్దీ పెరిగేలా చేశారు.
మరి ఈ అంశాలపై సంధ్య థియేటర్ యాజమాన్యం.. పోలీసులకు ఏం వివరణ ఇస్తుందో చూడాలి?
(ఇదీ చదవండి: 'కన్నప్ప' ఐదుసార్లు చూస్తా.. విష్ణుతో నెటిజన్ ట్వీట్ టాక్)
Comments
Please login to add a commentAdd a comment