
హైదరాబాద్: టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి నటిస్తూ నిర్మిస్తున్న సినిమాలో భాగంగా ఆఫీస్ ను ప్రారంభించారు. జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమాను నిర్మించడంతో పాటూ అందులో నటిస్తున్నారు జగ్గారెడ్డి. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను నందినగర్ లో ప్రారంభించారు జగ్గారెడ్డి. జగ్గారెడ్డి చిత్రానికి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు.
సినిమా ఆఫీస్ ప్రారంభోత్సవంలో భాగంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. ‘నేను ఇటీవల ఢిల్లీ లో చెప్పినట్టు జగ్గారెడ్డి ఏ వార్ ఆఫ్ లవ్ పేరుతో సినిమా స్టార్ట్ చేస్తున్నాము. ఉగాది పండుగ సందర్భంగా సినిమా ఆఫీస్ ను ప్రారంభించాము. నా నిజ జీవితంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా వుంటుంది.
నా నిజ జీవితం పాత్రలో నేను నటిస్తున్నాను. మిగతా విషయాలు త్వరలో ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.జగ్గారెడ్డి కూతురు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆమె మాట్లాడుతూ.. నాన్న జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ స్టేజ్ కి వచ్చారు. ఆయన జీవితం ఒక ఇన్సిరేషన్ అని పేర్కొన్నారు.