నగరంలోని చిన్నారులకై.. 15 నుంచి కుంగ్‌ ఫూ పాండా–4 | For Children In The City This Month 15 To Kung Fu Panda-4 Movie Release | Sakshi
Sakshi News home page

నగరంలోని చిన్నారులకై.. 15 నుంచి కుంగ్‌ ఫూ పాండా–4

Published Fri, Jul 5 2024 12:27 PM | Last Updated on Fri, Jul 5 2024 12:27 PM

For Children In The City This Month 15 To Kung Fu Panda-4 Movie Release

మైక్‌ మిచెల్, స్టెఫానీ స్టైన్‌ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్‌ సంచలనం కుంగ్‌ ఫూ పాండా 4వ భాగం రానుంది. నగరంలోని చిన్నారులను, టీనేజర్లతో పాటు యానిమేషన్‌ చిత్రాలను ఇష్టపడే ప్రతి ఒక్కరినీ అలరించే సాహస దృశ్యాలు, అలాగే సునిశిత హాస్యంతో కూడిన ఈ చిత్రం... ఈ నెల15న జియో సినిమా ప్రీమియమ్‌లో ప్రసారం కానుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు.  ఈ డ్రాగన్‌ వారియర్‌ ఇంగ్లి‹Ù, హిందీతో పాటు, తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లోనూ అలరించనుందని వివరించారు.

లామాకాన్‌లో ఒలక్‌లంత్‌ కా సర్‌..
కళలు, సాహిత్యం, థియేటర్‌కు వేదికైన లామకాన్‌లో ‘ఒలక్‌లంత్‌ కా సర్‌’ అనే మరాఠీ థియేటర్‌ ప్లే శుక్రవారం ప్రదర్శితమవ్వనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమై గంట పాటు సాగనుంది. ఇందులో సౌరభ్‌ ఘరీపురీకర్, అదితీ ఇనామ్‌దార్‌ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ ప్లేను యోగేశ్‌ సోమన్‌ రచించగ, సౌరభ్‌ ఘరీపురీకర్‌ దర్శకత్వం వహించనున్నారు. సౌరభ్‌ జోషి సంగీతం అందించనున్నారు.  

జాగిల్‌ ఫిన్‌టెక్‌ లీడర్‌ ఆఫ్‌ ద ఇయర్‌..
మాదాపూర్‌లోని జాగిల్‌ ప్రీపెయిడ్‌ ఓషన్‌ సరీ్వసెస్‌ లిమిటెడ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ రాజ్‌ ఎన్‌కు ప్రతిష్టాత్మకమైన ‘ఫిన్‌టెక్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు లభించింది. వినూత్న శైలి సామర్థ్య నిర్వహణతో ఫిన్‌టెక్‌ పరిశ్రమాభివృద్ధికి తోడ్పడినందుకు అవార్డు లభించిందని జాగిల్‌ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్‌తో సహా క్రాస్‌–ఫంక్షనల్‌ టీమ్‌లతో కలిసి పని చేయడం ద్వారా బహుళ వ్యాపార కార్యక్రమాలను అమలు చేయగల సామర్థ్యానికి ప్రశంసగా.. ఇటీవల నిర్వహించిన ఫెస్టివల్‌ ఆఫ్‌ ఫిన్‌టెక్‌ కా క్లేవ్‌–అవార్డ్స్‌ 2024లో ఈ పురస్కారం దక్కిందని వివరించారు.

ఇవి చదవండి: 'ది ఫస్ట్‌ డిసెన్‌డెంట్‌'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్‌ గేమ్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement