Panda
-
నగరంలోని చిన్నారులకై.. 15 నుంచి కుంగ్ ఫూ పాండా–4
మైక్ మిచెల్, స్టెఫానీ స్టైన్ దర్శకత్వం వహించిన ఈ యానిమేటెడ్ సంచలనం కుంగ్ ఫూ పాండా 4వ భాగం రానుంది. నగరంలోని చిన్నారులను, టీనేజర్లతో పాటు యానిమేషన్ చిత్రాలను ఇష్టపడే ప్రతి ఒక్కరినీ అలరించే సాహస దృశ్యాలు, అలాగే సునిశిత హాస్యంతో కూడిన ఈ చిత్రం... ఈ నెల15న జియో సినిమా ప్రీమియమ్‌లో ప్రసారం కానుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ డ్రాగన్ వారియర్ ఇంగ్లి‹Ù, హిందీతో పాటు, తెలుగు, తమిళం తదితర ప్రాంతీయ భాషల్లోనూ అలరించనుందని వివరించారు.లామాకాన్‌లో ఒలక్లంత్ కా సర్..కళలు, సాహిత్యం, థియేటర్‌కు వేదికైన లామకాన్‌లో ‘ఒలక్లంత్ కా సర్’ అనే మరాఠీ థియేటర్ ప్లే శుక్రవారం ప్రదర్శితమవ్వనుంది. రాత్రి 8 గంటలకు ప్రారంభమై గంట పాటు సాగనుంది. ఇందులో సౌరభ్ ఘరీపురీకర్, అదితీ ఇనామ్దార్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ ప్లేను యోగేశ్ సోమన్ రచించగ, సౌరభ్ ఘరీపురీకర్ దర్శకత్వం వహించనున్నారు. సౌరభ్ జోషి సంగీతం అందించనున్నారు. జాగిల్ ఫిన్‌టెక్ లీడర్ ఆఫ్ ద ఇయర్..మాదాపూర్‌లోని జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సరీ్వసెస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ రాజ్ ఎన్‌కు ప్రతిష్టాత్మకమైన ‘ఫిన్‌టెక్ లీడర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. వినూత్న శైలి సామర్థ్య నిర్వహణతో ఫిన్‌టెక్ పరిశ్రమాభివృద్ధికి తోడ్పడినందుకు అవార్డు లభించిందని జాగిల్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, లీగల్‌తో సహా క్రాస్–ఫంక్షనల్ టీమ్‌లతో కలిసి పని చేయడం ద్వారా బహుళ వ్యాపార కార్యక్రమాలను అమలు చేయగల సామర్థ్యానికి ప్రశంసగా.. ఇటీవల నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఫిన్‌టెక్ కా క్లేవ్–అవార్డ్స్ 2024లో ఈ పురస్కారం దక్కిందని వివరించారు.ఇవి చదవండి: 'ది ఫస్ట్ డిసెన్‌డెంట్'.. ఇదొక హైక్వాలిటీ గ్రాఫిక్స్ గేమ్! -
హైడ్రోజన్‌తో స్వావలంబన దిశగా..
సాక్షి, హైదరాబాద్: ఇంధన రంగంలో మన దేశం స్వావలంబన సాధించేందుకు హైడ్రోజన్ ఉపయోగపడుతుందని, ఈ దిశగా పరిశోధనలూ వేగంగా సాగుతున్నాయని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) హైడ్రోజన్ విభాగం జనరల్ మేనేజర్ డీఎంఆర్ పాండా వెల్లడించారు. జాతీయ సైన్స్ దినోత్సవాల్లో భాగంగా మంగళవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో డీఎంఆర్ పాండా ‘గ్రీన్ హైడ్రోజన్ ఎమర్జింగ్ ట్రెండ్స్’’అన్న అంశంపై కీలకోపన్యాసం చేశారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పర్యావరణ అనుకూలమైన విధానాల్లో హైడ్రోజన్‌ను వినియోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా లేహ్, ఢిల్లీల్లో హైడ్రోజన్ బస్సులు ఇప్పటికే నడుస్తుండగా, సౌర విద్యుత్ సాయంతో హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వలకు కూడా పైలెట్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామని చెప్పారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గింది.. దేశంలో సౌర, పవన విద్యుదుత్పత్తులకు అపార అవకాశాలున్నాయని, ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌తో వేర్వేరు పద్ధతులను ఉపయోగించుకుని హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా దేశం పెట్రో ఉత్పత్తుల దిగుమతులపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుందని పాండా వివరించారు. అలాగే కర్బన ఉద్గారాల తగ్గింపూ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతం హైడ్రోజన్ ఉత్పత్తి ఖర్చులు ఎక్కువైనప్పటికీ, ఐఐసీటీ, ఇతర విద్యా, పరిశోధన సంస్థల సహకారంతో దాన్ని తగ్గించి విస్తృత వినియోగంలోకి తేవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో హైడ్రోజన్ ధర పదిరెట్లు తగ్గిందని గుర్తు చేశారు. ఎలక్ట్రలైజర్లు, ఒత్తిడిని తట్టుకోగల సిలిండర్లు, హైడ్రోజన్‌ను చిన్న చిన్న సిలిండర్లలోకి పంపేందుకు అవసరమైన కంప్రెషర్ల విషయంలో దేశం ఇప్పటికీ విదేశాలపైనే ఆధారపడుతోందని, ఫలితంగా ఈ ఇంధనాన్ని అందరికీ అందుబాటులోకి తేవడంలో ఆలస్యం జరుగుతోందని చెప్పారు. ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సమీర్ దవే, డాక్టర్ నెట్టెం వి.చౌదరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగంపై జరుగుతున్న ప్రయత్నాలను క్లుప్తంగా వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ దేశంలో హైడ్రోజన్ ఉత్పత్తి, వినియోగాలను పెంచే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో హైడ్రోజన్ హబ్ ఒకదాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఎన్టీపీసీ జనరల్ మేనేజర్ (హైడ్రోజన్ విభాగం) డీఎంఆర్ పాండా తెలిపారు. విశాఖపట్నంలోని ఎన్టీపీసీ కేంద్రానికి దగ్గరగా ఈ హబ్ ఏర్పాటు కానుందని ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. మొత్తం 1200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటయ్యే హైడ్రోజన్ హబ్‌లో హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు దానికి సంబంధించిన టెక్నాలజీలు, రవాణా వ్యవస్థలపై విస్తృతమైన పరిశోధనలు జరగనున్నాయని, సౌర శక్తి కోసం పెద్ద ఎత్తున సోలార్ ప్యానెల్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ హబ్ ఏర్పాటుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని, అన్నీ సవ్యంగా సాగితే ఇంకో వారం రోజుల్లో ఎన్టీపీసీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య దీనిపై ఒక అవగాహన ఒప్పందం కూడా జరగనుందని వివరించారు. రానున్న పదేళ్లలో ఈ హబ్ ఏర్పాటుకు కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు పాండా తెలిపారు. ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’ ఈ నెల ఏడు నుంచి! కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) పరిశోధనశాలల కార్యకలాపాలను ప్రజలకు వివరించేందుకు ఉద్దేశించిన ‘వన్ వీక్.. వన్ ల్యాబ్’కార్యక్రమం ఈ నెల ఏడవ తేదీ నుంచి ప్రారంభం కానుందని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఆరు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఐఐసీటీలో జరుగుతున్న పరిశోధనలు, అభివృద్ధి చేసిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నామని చెప్పారు. పరిశోధకులు, ఉపాధ్యాయులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజిస్టులు, స్టార్టప్‌లు, సాధారణ ప్రజలు ఎవరైనా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని సూచించారు. -
పాపం.. తిండి మానేసి మరీ కన్నుమూసింది
హాంకాంగ్: ప్రపంచంలో అత్యంత వయస్కురాలైన మగ పాండా కన్నుమూసింది. 35 ఏళ్ల యాన్ యాన్(పాండా పేరు) హాంకాంగ్ ఓషన్ థీమ్ పార్క్‌లో మృతి చెందినట్లు నిర్వాహకులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భూమ్మీద మానవ సంరక్షణలో ఉన్న అత్యంత వయసుర్కాలైన మగ పాండా ఇదే. దీని వయసు 35 ఏళ్లు కాగా, ఈ వయసు మనిషి వయసు 105 ఏళ్లకు సమానం. అత్యంత సున్నితమైన జీవరాశి జాబితాలో పాండాకు సైతం చోటు ఉంది. యాన్ యాన్ 1999 నుంచి ఈ పార్క్‌లో ఉంటోంది. గత పదిరోజులుగా అది తిండి తగ్గిస్తూ వచ్చింది. ఆరోగ్యంగానే ఉన్నా.. అది ఎందుకలా చేస్తుందో ఎవరికీ అర్థం కాలేదు. బలవంతంగా తినిపించే ప్రయత్నం చేసినా.. ప్రయత్నాలు ఫలించలేదు. ఇంతకు ముందు అత్యధిక వయసున్న పాండాగా జియా జియా పేరిట రికార్డు ఉండేది. 38 ఏళ్ల వయసులో అది 2016లో కన్నుమూసింది. జియా జియా, యాన్ యాన్లను చైనా ప్రభుత్వం హాంకాంగ్ పార్క్‌కు కానుకగా ఇచ్చింది. పాండాల సంరక్షణకు మారుపేరుగా ఉన్న హాంకాంగ్‌లో.. వాటి జనాభా మాత్రం అంతగా వృద్ధి చెందడం లేదు. మరోవైపు చైనా నుంచే కానుకల రూపంలో వచ్చిన యింగ్ యింగ్, లే లే పాండాలతో సంతానోత్పత్తి చేయించాలన్న పదిహేనేళ్ల ప్రయత్నాలు ఫలించడం లేదు. -
జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి... పాండా ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!
Naughty Panda Briefly Escapes Enclosure Zoo At Beijing: ఇటీవల కాలంలో పలు జంతువుల జూ నుంచి తప్పించుకుని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాక ఒక ఆవు జంతు వధ నుంచి తప్పించుకుని ఒక పార్క్‌లోకి ప్రవేశించిన వీడియో కూడా నెటిజన్లను భలే ఆకర్షించింది. అచ్చం అలానే ఇక్కడొక చిలిపి పాండా భలేగా జూ నుంచి తప్పించుకునేందుకు యత్నించి మళ్లీ వెనక్కి వచ్చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) అసలు ఏం జరిగిందంటే...చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్లాన్ అనే ఆరేళ్ల పాండా భలే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పైగా పాండా పర్యాటకులు ప్రవేశించే ద్వారం పైభాగానికి ఎక్కి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ మేరకు అది ఆరడగుల ఫెన్సింగ్‌ని ఎక్కేస్తుంది. పైగా అక్కడ ఉన పర్యాటకులు దాన్ని ఉత్సహపరుస్తూ బయటకు వచ్చేలా పాండాను ప్రోత్సహించారు కూడా. ఇంతలో జూ అధికారులు పాండాకి ఇష్టమైన ఆహారం తీసుకువచ్చి దాన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తారు. దీంతో పాండా దానికి నచ్చిన ఆహారాన్ని చూసి తెలియకుండానే వెనక్కి వచ్చేసింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) -
యాక్..ఛీ.. వాటి విసర్జలనతో టీ చేసి తాగుతారట..!
బ్లాక్ టీ, గ్రీన్ టీ, లెమన్ టీ ఎట్సెట్రా చాలా రకాల టీలు విన్నాం.. తాగుతున్నాం కూడా. చైనాలో పాండా విసర్జనలతో కూడా టీ కాస్తారట తెలుసా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అరుదైన టీ ఇది. సాధారణంగా పాండాలు వెదురు మొక్కలను తింటాయి. దాంతో అవి విసర్జించే పేడలో అత్యధిక పోషకాలు, విటమిన్స్, క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయట. అందుకే ఒక పాండా టీ ప్యాకెట్ విలువ రూ.2.4 లక్షలు. ఒట్టి పాండాలే కాదు సేంద్రియ తేయాకులను తినే పురుగుల విసర్జనతో కూడా చైనీయులు చాయ్ తయారుచేస్తారు. ఈ చాయ్ ఒక కప్పెడు కావాలంటే రూ.200 పైనే చెల్లించాలి. రక్తపోటు, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు ఈ టీ తాగితే చాలా మంచిదట. అందుకే అక్కడ చాలామంది వీటిని బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు. వీటిల్లో కూడా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. -
కళ్లు మోసం చేస్తాయంటే ఇదేనేమో!
కొన్ని వస్తువులు, దృశ్యాలు దృష్టికోణాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కోలా కనిపించొచ్చు. ఒకే ఫోటోలో రెండు రకాలైన అర్థం దాగి ఉండొచ్చు. పరేడోలియా అని పిలిచే అద్భుత దృశ్యాన్ని చూస్తే మన కళ్లు కూడా ఒక్కోసారి మనల్ని మోసం చేస్తున్నాయోమో అనే భావన కలుగుతుంది. వాస్తవానికి మనం ఎలా అయితే ఆలోచిస్తున్నామో అదే విధంగా చూడగలుగుతాం. ఉదాహరణకు బాగా చీకటి పడ్డాకా వీధిలో నడుస్తుంటే ఎక్కడ నుంచి ఓ ముప్పు వస్తుందో అన్న భయం మనకు కలుగుతుంది. ఆ సమయంలో కొంచెం వంగి ఉన్న చెట్టును చూసినా దాని వల్ల మనకేదైనా జరుగుతుందేమో అన్న భయం కలగడం సహజం. అయితే ఎక్కువ ఆందోళన చెందినప్పుడు ప్రతీది పరేడోలియా విజువల్ లానే కనిపిస్తుంది. అంతేకాకుండా దాదాపు 40 శాతం మంది ఈ విజువల్ వండర్‌ను ఆస్వాదించారని ప్రొఫెసర్ లీ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే దీన్నో జబ్బులా చూడాల్సిన పనిలేదు. వాస్తవానికి పరేడోలియా ఉన్నవారు మరింత సృజనాత్మకంగా ఆలోచిస్తారు అని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది. లైవ్ సైన్స్ ప్రకారం, మతపరమైన లేదా అతీంద్రియ శక్తుల గురించి బలంగా నమ్మేవారు ప్రకృతిని కూడా వాళ్ల వాళ్ల ఆలోచనలతోనే చూస్తారు. అంటే భౌతికంగా దాని రూపం వేరైనా వారి ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మార్చుకుంటారన్నామాట. -
ఇప్పటికి ఒకటయ్యాయి
మనుషుల సంచారం లేకపోవడంతో ‘జూ’లో జంతువులు కూడా ఉల్లాసంగా ఉంటున్నాయి. హాంకాంగ్‌లోని ‘ఓషన్ పార్క్’ జూ లో.. పదేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కనాడూ కలవని ఇంగ్ ఇంగ్, లె లె అనే పాండాల ఆడామగ జంట ఈ లాక్డౌన్ లో తమంతట తామే కలవడం జూ సంరక్షణ అధికారులకు గొప్ప సంతోషకరమైన విషయం అయింది. పద్నాలుగేళ్ల వయసున్న పాండాలవి. ఈడూజోడుగా ఉన్నా ఏనాడూ ఒకదానిలో ఒకటి తోడు వెతుక్కోడానికి అవి ఆసక్తి చూపలేదట. ఇన్నాళ్లకు వాళ్ల కల ఫలించింది. పాండాల జీవిత కాలం ఇరవై ఏళ్ల వరకు ఉంటుంది. ఇంగ్ ఇంగ్, లె లె.. జీవితం మొత్తం ఇలాగే నిస్సారంగా, నిర్లిప్తంగా ఉండిపోతాయేమోనని అనుకున్న అధికారులకు వాటి కలయిక ఊహించని వరమే. -
వైరల్ వీడియో: పాండాల మధ్య పడిపోయిన చిన్నారి
-
పాండాతో యువకుడి రెజ్లింగ్
బీజింగ్: చైనాలో షాంగారోకు చెందిన చెన్ అనే వ్యక్తి పాండాను ఆటపట్టించాలనుకొని నవ్వులపాలయ్యాడు. ఈ సంఘటన జియాంగ్సీ ప్రావీన్స్‌లోని ననచాంగ్ జూ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలేం జరిగిందంటే.. ననచాంగ్ జూ లో జంతువులను చూడటానికి వచ్చిన చెన్, పాండా డెన్లోకి దూకి వెళ్లాడు. అంతేకాకుండా గాఢ మత్తులో ఉన్న ఆ పాండాను తట్టిమరీ నిద్రలేపాడు. చిర్రెత్తుకొచ్చిన ఆ పాండా ఒక్కసారిగా యువకుడిపైకి దాడికి దిగింది. ఇక తర్వాత నువ్వా నేనా అనే రీతిలో ఇద్దరు కొట్టుకుంటుంటే, రెజ్లింగ్ మ్యాచ్‌ను తలపించింది. పాండా ఆ యువకుని కాలు పట్టుకొని కిందపడేసింది. చెన్ దాని చెవులు పట్టుకొని అదుపు చేద్దామనుకున్నాడు. ఇక ఈ తతంగాన్నంత చూస్తున్న వారు దాని చెవులు పట్టుకోకు, అలా చేస్తే పాండా కొరికేస్తుంది అంటూ చెన్కు సలహా ఇచ్చారు. అయితే యువకుడు కూడా ఏదోలా ధీటుగానే పాండాతో పోరాడాడు. చివరకు అవకాశం దొరకడంతో పాండాను పక్కకు ఒక్క తోపు తోసి పరుగు లంకించాడు. పాండాలు సాధారణంగా వెదురు కర్రలు తింటూ మనుషులై దాడికి దిగవని అందరూ భ్రమపడుతుంటారని జూ ఉన్నతాధికారి లి డోంగ్టావ్ పేర్కొన్నాడు. మొత్తం ఐదు నిమిషాలు జరిగిన ఈ ఫైట్‌లో యువకుడు చెన్ పారిపోవడంతో చివరకు పాండానే నెగ్గిందంటూ నెటిజన్లు కితాబిస్తున్నారు. జంతు ప్రేమికులు మాత్రం ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. -
పాండాతో యువకుడి రెస్లింగ్
-
జెయింట్ పాండాకు కవలపిల్లలు పుట్టాయ్!
మకావుః చైనాలోని మకావులో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తొలిసారిగా ఓ పాండా కవలపిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడక్కడ హాట్ టాపిక్ గా మారింది. మకావు కు చెందిన జిన్ జిన్ అనే పాండాకు దాని పెవిలియన్ లో రెండు మగ పాండా పిల్లలు పుట్టాయి. దీంతో మకావు ప్రాంతంలో పిల్లలు పెట్టిన మొదటి పాండాగా జిన్ జిన్ ను అధికారులు గుర్తించారు. పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరోటి కాస్త అనారోగ్యంతోనూ, బరువు తక్కువగా ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో పెట్టినట్లు అధికారులు వెల్లడించారు. పాండాల జాతి అంతరించిపోతున్న తరుణంలో మకావులోని జెయింట్ పాండా జిన్ జిన్ కు కవల పిల్లలు పుట్టడం అక్కడివారికి అపురూపంగా మారింది. అందుకే వాటి సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. జ్యూ లో నివసించే పాండాల్లో గర్భధారణ సహజంగా జరగకపోవడంతో కృత్రిమ గర్భధారణ పద్ధతులను కూడ చేపట్టి పాండాల సంతతి పెంచేందుకు అధికారులు చర్యలు కృషి చేస్తున్నారు. సాధారణంగా కవల పిల్లలు ఒకరు ఆరోగ్యంగా ఉంటే, మరొకరు కాస్త బలహీనంగా ఉండటం చూస్తుంటాం. అలాగే ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన రెండు పిల్లల్లో ఒకటి పూర్తి ఆరోగ్యంగా ఉండగా, మరొకటి కాస్త బలహీనంగా ఉండి, బరువు తక్కువగా ఉండటంతో దాని ఆరోగ్య రక్షణ కోసం అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతన్నారు. ఇంటెన్సివ్ కేర్ లో పెట్టి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. జిన్ జిన్.. కై కై.. జంటను గత ఏడాది చైనా మెయిన్ ల్యాండ్.. మకావుకు బహుమతిగా ఇచ్చింది. అదే జంటకు ప్రస్తుతం కవల పిల్లలు పుట్టడంతో మకావు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జెయింట్ పాండాకు పుట్టిన పిల్లల్లో ఒకటి 138 గ్రాముల బరువు ఉండగా, మరోటి మాత్రం కేవలం 53.8 గ్రాములే ఉండటంతో దాన్ని ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి, వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జిన్ జిన్ ప్రసవం కోసం మకావు అధికారులు జూన్ 14 నుంచే పెవిలియన్ ను కూడ మూసి ఉంచారు. -
మావోయిస్టు అగ్రనేత పండా అరెస్టు
బరంపురంలో ఆయన తలదాచుకున్న ఇంటిపై అర్ధరాత్రి పోలీసుల దాడి పెద్ద ఎత్తున బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లు స్వాధీనం వీహెచ్‌పీ నేత లక్ష్మణానంద హత్య కేసుతో పాటు పండాపై 61 కేసులు బరంపురం: మావోయిస్టు అగ్రనేత, ఒడిశా మావోయిస్టు పార్టీ వ్యవస్థాపకుడు సవ్యసాచి పండా అలియాస్ శరత్ అలియాస్ సుమన్ అలియాస్ సునీల్‌ను గురువారం అర్ధరాత్రి ఒడిశా పోలీసులు అరెస్టు చేశారు. ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా బరంపురంలో తలదాచుకుంటున్న పండాను గంజాం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వల పన్ని పట్టుకున్నారు. పండావద్ద బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నారు. సవ్యసాచి పండా అరెస్టయినట్టు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. పండా అరెస్ట్ ఒడిశా పోలీసులు సాధించిన విజయమని ఆయన అభినందించారు. ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారంతో బరంపురంలోని ఒక ఇంటిలో పోలీసులు పండాను అరెస్టు చేశారన్నారు. విశ్వ హిందూ పరిషత్ నేత స్వామి లక్ష్మణానంద సరస్వతి హత్య, నయాగడ్ ఠాణా, ఆయుధాగారంపై దాడి, ఆయుధ దోపిడీ, ఆర్. ఉదయగిరి ఠాణాపై దాడి, ఇద్దరు ఇటాలియన్ల అపహరణ తదితర కేసుల్లో సవ్యసాచికి ప్రమేయం ఉంది. 25 మంది పోలీసులు, 34 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలతోనూ ప్రత్యక్ష ప్రమేయం ఉంది. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పండా 1995 నుంచి చురుకుగా పాల్గొంటున్నారు. ఒడిశాలోని రాయగడ, గజపతి, కొంథమాల్, నయాగడ్ జిల్లాల్లో మావోయిస్ట్ కార్యకలాపాలలో కీలకంగా పనిచేశారు. ఈ జిల్లాల్లో ఆయనపై 61 కేసులు నమోదయ్యాయి. మోస్టు వాంటెడ్ జాబితాలో ఉన్న సవ్యసాచిని పట్టించే వారికి రూ. 5 లక్షల నగదు పురస్కారాన్ని ఒడిశా ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. బంగారం, నగదు స్వాధీనం పండా వద్ద పెద్దమొత్తంలో బంగారం, నగదు, కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు లభించాయని ఒడిశా డీజీపీ సంజీవ్ మారిక్ తెలిపారు. పండా వద్ద ఆటోమేటిక్ పిస్టల్, తూటాలు, *2 లక్షల నగదు, అర కిలో బంగారం, 10 మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, 2 కంప్యూటర్ హార్డ్ డిస్కులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పండా అరెస్ట్‌పై పోలీసు కుటుంబాల హర్షం పండా అరెస్ట్‌తో పలు పోలీసు కుటుంబాలు హ ర్షం వ్యక్తం చేశాయి. ఎన్కౌంటర్లలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల భార్యలు సంతోషం వ్యక్తంచేశారు. పండాకు మరణశిక్ష విధిస్తే తాను ఎంతో సంతోషిస్తానని వారిలో ఒకరు అన్నారు.పండాకు ఉరిశిక్ష వేయాలి.. లక్ష్మణానంద సరస్వతి, ఆయన నలుగురు సహచరుల హత్యకేసులో ప్రధాన నిందితుడైన పండాకు మరణశిక్ష వేయాల్సిందేనని సంఘ్‌పరివార్ సంస్థ అయిన స్వామి లక్ష్మణానంద సరస్వతి సమితి (ఎస్ఎల్ఎస్ఎస్) డిమాండ్ చేసింది. ఈ హత్యలు తానే చేసినట్టు పండా స్వయంగా ప్రకటనల ద్వారా, వీడియో టేపులద్వారా ప్రకటించుకున్నారని సమితి కార్యదర్శి లక్మికాంత్ దాస్ చెప్పారు. లక్ష్మణానంద సర స్వతి హత్యకు నిరసనగా ఒడిశాలోని కొంథమాల్ జిల్లాలోను ఇతర ప్రాంతాల్లోను జరిగిన అల్లర్లలో 38మంది మరణించారు.కాగా, తన భర్త విప్లవకారుడని, ఒడిశా పోలీసులు చెబుతున్నట్టుగా హంతకుడు కానేకాదని పండా భార్య శుభశ్రీ పండా అలియాస్ మిలీ పండా అన్నారు. -
మొత్తానికి సవ్యసాచి పాండా దొరికేశాడు!
-
పండా పుట్టినరోజు.. ఆ జూకు పండగరోజు.
తైపీ: యువాన్ జాయ్ అనే ఈ పండా కూనకు ఆదివారం మొదటి పుట్టినరోజు. దీని బర్త్‌డే వేడుకలను తైవాన్‌లోని తైపీ జూ నిర్వాహకులు, సందర్శకులు అట్టహాసంగా జరుపుకొన్నారు. ఆపిల్స్, పైన్ఆపిల్స్, క్యారెట్లు, బన్స్‌తో ప్రత్యేక కేక్‌ను తయారు చేసి దీనికి అందించారు. పిల్లలు, పెద్దలు కలసి 3 వేల మంది 10 కి.మీ. పరుగు పందెంలో పాల్గొన్నారు. ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. దీని పుట్టినరోజు ఇంత ఘనంగా ఎందుకంటే తైవాన్‌లో పుట్టిన మొట్టమొదటి పండా ఇదే మరి! తైవాన్‌కు 2008లో చైనా ఇచ్చిన ఓ పండా జంటకు గతేడాది ఇది జన్మించింది. అయితే సహజ ప్రక్రియలో ఈ పండా తల్లి గర్భం దాల్చలేకపోయింది. దీంతో కృత్రిమ గర్భధారణ పద్ధతిలో ఈ పండాకు జన్మనిచ్చేలా చేశారు. పైగా ఇది పుట్టిన తర్వాత జూకు సందర్శకుల తాకిడి కూడా విపరీతంగా పెరిగిపోయిందట. అందుకే ఈ బుల్లి పండాకు యమా క్రేజ్ వచ్చేసింది. అన్నట్టూ.. చిన్నప్పుడు రకరకాల వస్తువులు పిల్లల ముందేసి వారు ఏది పట్టుకుంటే పెద్దయ్యాక అదే అవుతార ని చెబుతూ మురిసిపోయే ఆట మాదిరిగా ఈ పండాను కూడా పరీక్షించారు. రకరకాల పెయింటింగ్‌లను దీని ముందు వేలాడదీయగా.. ఇది పెయింటర్ పండా ఉన్న బొమ్మను పట్టుకుందట. అంటే భవిష్యత్తులో మంచి పెయింటర్ అవుతుందన్నమాట!