
Naughty Panda Briefly Escapes Enclosure Zoo At Beijing: ఇటీవల కాలంలో పలు జంతువుల జూ నుంచి తప్పించుకుని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాక ఒక ఆవు జంతు వధ నుంచి తప్పించుకుని ఒక పార్క్‌లోకి ప్రవేశించిన వీడియో కూడా నెటిజన్లను భలే ఆకర్షించింది. అచ్చం అలానే ఇక్కడొక చిలిపి పాండా భలేగా జూ నుంచి తప్పించుకునేందుకు యత్నించి మళ్లీ వెనక్కి వచ్చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి)
అసలు ఏం జరిగిందంటే...చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్‌లాన్ అనే ఆరేళ్ల పాండా భలే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పైగా పాండా పర్యాటకులు ప్రవేశించే ద్వారం పైభాగానికి ఎక్కి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ మేరకు అది ఆరడగుల ఫెన్సింగ్‌ని ఎక్కేస్తుంది. పైగా అక్కడ ఉన పర్యాటకులు దాన్ని ఉత్సహపరుస్తూ బయటకు వచ్చేలా పాండాను ప్రోత్సహించారు కూడా. ఇంతలో జూ అధికారులు పాండాకి ఇష్టమైన ఆహారం తీసుకువచ్చి దాన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తారు. దీంతో పాండా దానికి నచ్చిన ఆహారాన్ని చూసి తెలియకుండానే వెనక్కి వచ్చేసింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి.
(చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!)
Comments
Please login to add a commentAdd a comment