bejing
-
హైస్పీడ్ బుల్లెట్ రైలును పరీక్షించిన చైనా
బీజింగ్:ఆవిష్కరణల్లో చైనా తనకు తానే సాటి అని నిరూపించుకుంటోంది. గంటకు 450 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బుల్లెట్ రైలు నమూనాను చైనా రైల్వే సంస్థ తాజాగా ఆవిష్కరించింది. దీనికి సీఆర్450గా పేరుపెట్టింది. ఆదివారం(డిసెంబర్29) బీజింగ్‌లో ఈ రైలును పరీక్షించారు. ట్రయల్‌రన్‌లో గంటకు 400 కిలోమీటర్ల వేగంతో ఈ బుల్లెట్ రైలు దూసుకుపోయింది. ఇది అత్యధికంగా గంటకు 450 కిమీ వేగాన్ని అందుకోగలదని చైనా రైల్వే తెలిపింది. ఇది ప్రయాణాలకు అందుబాటులోకి వస్తే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ప్యాసింజర్ రైలుగా రికార్డు సృష్టిస్తుందని పేర్కొంది.ఈ బుల్లెట్ రైలు చైనా రాజధాని బీజింగ్ నుంచి షాంఘై నగరానికి కేవలం రెండున్నర గంటల్లోనే ప్రయాణించగలదు. ప్రస్తుతం ఈ ప్రయాణానికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఈ రైలు బాడీ బరువు కేవలం 10 టన్నులు మాత్రమే. ప్రస్తుతమున్న సీఆర్400 మోడల్ కంటే ఇది 12 శాతం బరువు తక్కువ. ఇంధనాన్ని కూడా 20 శాతం తక్కువగానే వాడుతుందని చైనా రైల్వే అధికారులు తెలిపారు.ఇక గత బుల్లెట్ రైలు మోడల్ కంటే అదనంగా 50 కిలోమీటర్లు అధిక వేగంతో ప్రయాణించగలదు. ఇంజిన్ పరీక్షల్లో ఇది అత్యధికంగా గంటకు 453 కిమీ వేగాన్ని అందుకోవడం గమనార్హం. చైనా హైస్పీడ్ రైల్ నెట్వర్క్ ప్రపంచలోనే అతిపెద్దది కావడం గమనార్హం. చైనాలో ఇప్పుడున్న బుల్లెట్ రైలు అత్యధిక వేగం గంటకు 350 కిలోమీటర్లు. -
చైనాలో భారీ పేలుడు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌కు 50 కిలోమీటర్ల దూరంలోని యాంజియావోలో బుధవారం ఉదయం 7.55 గంటలకు(చైనా కాలమానం ప్రకారం)భారీ పేలుడు సంభవించింది. ఓ పాత నివాసభవనంలోని కింది అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో గ్యాస్ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి చుట్టుపక్కల భవనాలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. 🚨🇨🇳 BREAKING: HUGE EXPLOSION IS REPORTED IN YANJIAO, CHINA The explosion happened in a building. There's no immediate report on casualties.pic.twitter.com/XylJsBuLUW — Mario Nawfal (@MarioNawfal) March 13, 2024 భవనాల శిధిలాలు ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడ్డాయి. పేలుడు తర్వాత భారీ నీలి మంటలు ఎగిసిపడినట్లు వీడియోలో కనిపిస్తోంది. ఈ పేలుడులో ఎంత మంది చనిపోయారో వివరాలు తెలియాల్సి ఉంది. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. రెస్క్యూటీమ్ సహాయక చర్యలు మొదలు పెట్టింది. #BREAKING- Large explosion damages multiple buildings in Yanjiao, China. No word on injuries at this time.#explosion #China #Yanjiaopic.twitter.com/lQ6UMCTv30 — Chaudhary Parvez (@ChaudharyParvez) March 13, 2024 ఇదీ చదవండి.. అట్లాంటా గ్యాస్ స్టేషన్లో దోపిడీ -
కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా!
బీజింగ్: జీ7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో కెనడా పాల్గొనడం విషయమైన చైనా మండిపడుతోంది. ఈ మేరకు ఈ విషయమై కెనడా దౌత్యవేత్త జిమ్ నికెల్ని పిలిపించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఐతే తైవాన్ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాల్సిందిగా జీ 7 దేశాలు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజింగ్ తాజాగా కెనడా పై ఈ విధమైన దౌత్యపరమైన బెదిరింపులకు దిగింది. ఈ మేరకు చైనా డిప్యూటి విదేశాంగ మంత్రి క్సీ ఫెంగ్ కెనడా దౌత్యవేత్త నికెల్ని పిలిపించి...తైవాన్ విషయమై కెనడా తక్షణమైన తన తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. అలా కాకుంటే జరబోయే పరిణామాలను భరించాల్సిం వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్) -
చైనాలో రికార్డు స్థాయిలో వరదలు...వందల ఏళ్లలో లేని విధంగా..
బీజింగ్: చైనా భారీ వర్షాల కారణంగా రికార్డు స్థాయిలు వరదలు ముంచెత్తాయి. వందల ఏళ్లలో ఎన్నడూ చూడని విధంగా రికార్డు స్థాయిలో భారీ వరదలు సంభవించాయి. దక్షిణ చైనా ఈ వరదల కారణంగా అతలాకుతలమైంది. చైనా టెక్ రాజధాని షెనజెన్, లాజిస్టిక్స్ హబ్ అయిన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ ప్రాంతాలు దారుణంగా దెబ్బతిన్నాయి. లక్షలాది మంది ప్రజలను వరద ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షితప్రాంతాలకు తరలించారు. గ్వాంగ్డాంగ్లోని ప్రమాదంలో ఉన్న కొన్ని ప్రాంతాల్లో పరిశ్రమలను, పాఠశాలలను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే తీర ప్రాంత ఫుజియాన్ ప్రావిన్స్, గ్వాంగ్జితో సహా ఇతర ప్రాంతాలు ఈ నెలలో కురిసిన భారీ వర్షాలకు బాగా ప్రభావితమయ్యాయి. ఐతే చైనాలో కొన్ని ప్రాంతాల్లో వేసవి వరదలు సర్వసాధారణం. కానీ ఇటీవల కొన్ని సంవత్సరాలలో ఇవి మరింత తీవ్ర తరమవుతున్నాయి. పైగా ఈ వరద బీభత్సాన్ని 'శతాబ్దానికి ఒకసారి వచ్చే వరదలు'గా చైనా మీడియా సంస్థలు పిలుస్తున్నాయి. పైగా నీటి మట్టాలు 1931లో నమోదైన రికార్డును అధిగమించాయని, 1951 నాటి ఘటన పునరావృతమైందని చైనా అధికారులు వెల్లడించారు. -
కరోనా కట్టడి.. జింగ్‌పిన్ తీవ్ర హెచ్చరికలు
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. ఒక్క చైనా మాత్రమే కరోనా కట్టడికి జీరో కొవిడ్ పాలసీని అనుసరిస్తోంది. అయితే.. ఆ అనుసరించే విధానం మరీ ఆరాచకంగా ఉండకపోవడమే సొంత పౌరుల నుంచే వ్యతిరేకతకు కారణం అవుతోంది. లాక్‌డౌన్‌తో నరకం అనుభవిస్తున్న వాళ్లు విజ్ఞప్తులు చేస్తున్నా.. కనికరించే ప్రసక్తే లేదంటున్నాడు చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్. బలవంతపు లాక్డౌన్లను చైనా ప్రజలు భరించలేకపోతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ.. కొద్దిపాటి కేసులకే లాక్డౌన్, అదీ కఠినంగా విధించడం, సామూహిక కరోనా టెస్టుల పేరిట భౌతిక దాడులకు పాల్పడుతుండడం, ఐసోలేషన్ పేరిట జంతువుల కంటే హీనంగా మనుషులతో ప్రవర్తించడం లాంటి చేష్టలపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. పైగా ఈ ఆగ్రహానికి తోడు ఆహార, మందుల కొరత వాళ్లను వేధిస్తోంది. షాంగై వాసుల లాక్డౌన్ కష్టాలే అందుకు నిదర్శనం. ఈ తరుణంలో.. లాక్డౌన్ పరిణామాలపై ప్రశ్నిస్తే కఠిన శిక్షలు అమలు చేయాలని చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కమ్యూనిస్ట్ పార్టీ ‘సుప్రీం పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీ’ సమావేశం జరిగింది. తమ దేశంలో కరోనా కట్టడికి ఏ విధానాలైతే మేలు చేస్తాయో వాటిని, అవి ప్రజలను ఇబ్బంది పెట్టినా పర్వాలేదని.. అంతిమంగా డైనమిక్ జీరో కొవిడ్ పాలసీని ముందుకు తీసుకెళ్లాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ఏడాది కరోనా విజృంభణ పరిస్థితులు.. తీవ్ర విమర్శల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జింగ్‌పిన్ తొలిసారి, అదీ ఒక కీలక సమావేశంలో ప్రసంగించడం విశేషం. ‘‘కఠిన నిర్ణయాలనేది సహజంగానే మన పార్టీతత్వం . కరోనా కట్టడికి తీసుకునే నిర్ణయాలు ప్రభావవంతంగా ఉంటున్నాయి. వుహాన్‌లో ఏ తరహాలో కరోనాపై పోరాడి గెల్చాం.. అలాగే షాంగైలోనూ గెలిచి తీరతాం. జీరో కొవిడ్ పాలసీని తప్పుబట్టే వాళ్లను, పార్టీ విధానాలను వ్యతిరేకించే వాళ్లను కఠినంగా శిక్షించండి. సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారానికి పుల్‌స్టాప్ పెట్టించండి’’ అని జింగ్‌పిన్ ప్రసంగించినట్లు సీఎన్ఎన్ ఓ కథనం ప్రచురించింది. ఇదిలా ఉంటే.. ఏప్రిల్ 20వ తేదీ నుంచి ఇప్పటిదాకా రాజధాని బీజింగ్‌లో 500కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో.. ఎక్కడ షాంగై తరహా లాక్డౌన్ అమలు చేస్తారో అని హడలి పోతున్నారు అక్కడి ప్రజలు. చదవండి: చైనాలో కరోనా కట్టడి పేరిట వికృత చేష్టలు -
ఆ వ్యక్తి విమానాశ్రయంలోనే 14 ఏళ్లుగా నివాసం....
Lives in airport for 14 years Says family interferes: ఏవోవే చిన్న చిన్న కారణాలతో కుటుంబంతో గొడవపడి ఇంటి నుంచి బయటకి వచ్చేసి నానాపాట్లు పడుతున్నవారు ఎందరో ఉన్నారు. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తారతమ్యం లేకుండా మాటమాట పెరిగి కోపంతో బయటకు వచ్చి అనాధలుగా బతుకు వెళ్లదీసేవాళ్లు కోకొల్లలు. మరికొంతమంది చెడుమార్గంలో పయనించి తమ జీవితాలను నాశనం చేసకున్నావాళ్లు ఉన్నారు. అచ్చం అలానే ఇక్కడోక వ్యక్తి ఇంటి నుంచి వచ్చేసి 14 ఏళ్లు అయ్యింది. అతను ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నాడో? ఎందుకు వచ్చేశాడో తెలుసా? వివరాల్లోకెళ్తే...వీ జియాంగువో అనే చైనీస్ వ్యక్తి బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం టర్మినల్‌లోనే 14 ఏళ్లుగా నివసిస్తున్నాడు. అయితే అతనికి డ్రింక్ చేయడం, సిగరెట్ కాల్చడం వంటి చెడు అలవాట్లు ఉన్నాయి. అంతేగాదు అతను ఆ చెడు అలవాట్లకు బానిసై పోవడంతో అతని కుటుంబం అతన్ని బాగు చేయాలనే ఉద్దేశంతో కాస్త కఠినంగా వ్యవహరించింది. ఈ మేరకు అతని కుటుంబం అతనికి ఒక షరతు కూడా పెట్టింది. అతను కుటుంబంలో ఉండాలనుకుంటే చెడు అలవాట్లను వదిలేయాలని ఒకవేళ అలా చేయలేకపోతే తన నెలవారి జీతం రూ.12 వేలు ఇచ్చేయాలని ఒక షరతు విధించారు. అలా ఇచ్చేస్తే తాను సిగరెట్, మందు కొనుక్కోవడం కష్టం అవుతుందని ఇంటి నుంచి వచ్చేశానని చెప్పాడు. 40 ఏళ వయసులో తనను ఉద్యోగం నుంచి తొలగించారని చెప్పుకొచ్చాడు. వృద్ధాప్యం కారణంగా తనకు మళ్లీ ఉపాధి లభించలేదని వీ చెప్పుకొచ్చాడు. అయితే అతను లాంటి మరో ఆరుగురు వ్యక్తులు ఆ టెర్మినల్‌లోనే నివశిస్తున్నారు. (చదవండి: మొసలితో డ్యాన్స్ చేస్తున్న వ్యక్తి... వీడియో వైరల్) -
జూ నుంచి తప్పించుకోవాలని యత్నించి... పాండా ఎలా టెంప్ట్ అయ్యిందో చూడండి!!
Naughty Panda Briefly Escapes Enclosure Zoo At Beijing: ఇటీవల కాలంలో పలు జంతువుల జూ నుంచి తప్పించుకుని నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసిన వీడియోలను అనేకం చూశాం. అంతేకాక ఒక ఆవు జంతు వధ నుంచి తప్పించుకుని ఒక పార్క్‌లోకి ప్రవేశించిన వీడియో కూడా నెటిజన్లను భలే ఆకర్షించింది. అచ్చం అలానే ఇక్కడొక చిలిపి పాండా భలేగా జూ నుంచి తప్పించుకునేందుకు యత్నించి మళ్లీ వెనక్కి వచ్చేస్తున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. (చదవండి: ఫిలిప్పీన్స్‌లో టైఫూన్ తుపాను బీభత్సం.. 21 మంది మృతి) అసలు ఏం జరిగిందంటే...చైనాలోని బీజింగ్ జూలోని మెంగ్లాన్ అనే ఆరేళ్ల పాండా భలే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది. పైగా పాండా పర్యాటకులు ప్రవేశించే ద్వారం పైభాగానికి ఎక్కి తప్పించుకునేందుకు తెగ ప్రయత్నిస్తుంటుంది. ఈ మేరకు అది ఆరడగుల ఫెన్సింగ్‌ని ఎక్కేస్తుంది. పైగా అక్కడ ఉన పర్యాటకులు దాన్ని ఉత్సహపరుస్తూ బయటకు వచ్చేలా పాండాను ప్రోత్సహించారు కూడా. ఇంతలో జూ అధికారులు పాండాకి ఇష్టమైన ఆహారం తీసుకువచ్చి దాన్ని టెంప్ట్ అయ్యేలా చేస్తారు. దీంతో పాండా దానికి నచ్చిన ఆహారాన్ని చూసి తెలియకుండానే వెనక్కి వచ్చేసింది. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఓ లుక్ వేయండి. (చదవండి: ప్లీజ్.. నా కారుని ధ్వంసం చెయ్యొద్దు!) -
డొమినో ఎఫెక్ట్ గురించి ఆందోళన చెందడం లేదు!!
బీజింగ్: బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరమైన బహిష్కరణల "డొమినో ఎఫెక్ట్" గురించి తాము ఆందోళన చెందడం లేదని చైనా పేర్కొంది. ఈ మేరకు పశ్చిమ ప్రాంతమైన జిన్జియాంగ్లో చైనా మానవ హక్కుల "దౌర్జన్యాలు" కారణంగా చైనాలో జరుగుతున్న ఒలింపిక్ క్రీడలకు తమ ప్రభుత్వ అధికారులు హాజరుకావడం లేదని అమెరికా దౌత్యపరమైన బహిష్కరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాము డొమినో ప్రభావం గురించి ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్బిన్ అన్నారు. అంతేకాదు ప్రపంచంలోని చాలా దేశాలు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌కు మద్దతు తెలిపాయంటూ సమర్థించే ప్రయత్నం చేశారు. అయితే దేశాలన్ని రాజకీయాలకు అతీతంగా ఈ అంతర్జాతీయ క్రీడలకు ఏకంకావాలని పిలువపునివ్వడమే కాక అందుకై 170కి పైగా దేశాలు చేసిని తీర్మానాన్ని ఐక్యరాజ్యసమితి ఆమోదించిన విషయాన్ని వాంగ్ ప్రస్తావించారు. అంతేకాదు కొంతమంది విదేశీ నాయకులు, రాజ కుటుంబాల సభ్యులు ఈ ఒలింపిక్ క్రీడలకు హాజరు కావడానికి నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు. ఈ క్రమంలో చైనా విదేశాంగ ప్రతినిధి వాంగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రధాన దేశానికి బహిరంగంగా ఆహ్వానాన్ని అంగీకరించిన ఏకైక నాయకుడు అని ప్రశంసించారు. అమెరికా మాదిరిగానే బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా బీజింగ్ వింటర్ ఒలింపిక్స్‌ను దౌత్యపరంగా బహిష్కరణ చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తమకు బ్రిటన్, కెనడా దేశాల అధికారులను క్రీడలకు ఆహ్వానించే ఆలోచన చైనాకు లేదని వాంగ్ స్పష్టం చేశారు. అంతేకాదు అమెరికా దాని మిత్ర దేశాలు తమ రాజకీయ ఎత్తుగడ కోసం ఒలింపిక్ క్రీడలను వేదికగా ఎంచుకున్నాయని, అందుకు ఆయా దేశాలు తగిన మూల్యం చెల్లించుకుంటాయని వాంగ్ విరుచుకుపడ్డారు -
చైనాను వెంటాడుతున్న సమస్యలు.. రహదారులు మూసివేత!
చైనాను ఒక సమస్య పోతే మరొక సమస్య వెంటాడుతుంది. చైనాలో తిరిగి కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. వీటిని అరికట్టడం కోసం అక్కడ చైనా ఆంక్షలు కూడా విధిస్తుంది. ఈ సమస్య సమసిపోక ముందే ఆ దేశంలో భారీ కాలుష్యం కారణంగా బీజింగ్‌లోని రహదారులు, పాఠశాల ఆట స్థలాలను మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే, చైనా ఇటీవల విద్యుత్ తయారీ కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని పెంచడమే. ఇటీవల తీవ్ర బొగ్గు కొరత కారణంగా.. ఆ దేశంలో భారీగా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని అరికట్టడం కోసం బొగ్గు ఉత్పత్తి, వినియోగాన్ని ఒక్కసారిగా పెంచింది. దీంతో ఉత్తర చైనాలో దట్టమైన పొగమంచు కప్పబడి ఉంది. కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల వరకు రహదారుల మీద ఎవరు నడిచేది కూడా కనిపించడం లేదు. దీంతో ఆ దేశ వాతావరణ శాఖ.. ఫిబ్రవరిలో జరగబోయే వింటర్ ఒలింపిక్స్ 2022కు ఆతిథ్యం ఇచ్చే రాజధానిలో పాఠశాలలు, శారీరక విద్యా తరగతులు, బహిరంగ కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది. షాంఘై, టియాన్జిన్, హార్బిన్ తో సహా ప్రధాన నగరాలకు వెళ్లే హైవేలను మూసివేశారు. బీజింగ్‌లోని యుఎస్ రాయబార కార్యాలయం వద్ద ఒక మానిటరింగ్ స్టేషన్ ద్వారా వాయు నాణ్యతను పరిశీలించగా అక్కడ వాయు కాలుష్యం సాధారణ జనాభాకు హానికలిగించే విధంగా ఉన్నట్లు తేలింది. (చదవండి: గంగిరెద్దులకు క్యూఆర్ కోడ్.. నిర్మలా సీతారామన్ ఆసక్తికర వీడియో!) డబ్ల్యూహెచ్ఓ నిర్దేశించిన స్థాయి కంటే 15పాయింట్లు అధికంగా అక్కడ వాయు కాలుష్యం ఉంది. శనివారం సాయంత్రం వరకు పరిస్థితులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని బీజింగ్ అధికారులు తెలిపారు. గ్రీన్ హౌస్ వాయువులను ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశం చైనా. ఆ దేశం విద్యుత్ తయారీ కోసం 60 శాతం వరకు బొగ్గు ఉత్పత్తి మీద ఆధారపడుతుంది. అక్టోబర్ మధ్యలో సగటు రోజువారీ బొగ్గు ఉత్పత్తి సెప్టెంబర్ చివరి కంటే 1.1 మిలియన్ టన్నులు ఎక్కువగా ఉందని దేశంలోని ఉన్నత ఆర్థిక ప్రణాళిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ బొగ్గు కేంద్రాలు ఈ వారం ప్రారంభంలో 112 మిలియన్ టన్నులను ఉత్పత్తి చేశాయి అని ప్రభుత్వ ఏజెన్సీ తెలిపింది. కాలుష్యాన్ని అరికట్టడం కోసం సీఓపీ 26 సదస్సులో ప్రపంచ దేశాలు తీర్మానం చేస్తుంటే.. చైనా వారి నిర్ణయాలను పెడచెవిన పెడుతుంది. -
"మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు"
తైవాన్: బీజింగ్ ఎంత ఒత్తిడికి గురి చేసిన తైవాన్ తలొగ్గదని ప్రజాస్వామ్య జీవన విధానాన్ని రక్షించుకోగలదంటూ తైవాన్ అధ్యక్షురాలు త్సాయ్ ఇంగ్ వెన్ తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తైవాన్ ప్రజలు నిరంతరం తమ దేశంపై చైనా ఎప్పుడు దాడి చేసి ఆక్రమించేస్తోందేమో అన్న భయంతోనే జీవిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చైనా అధ్యక్షుడు జీ జింగ్పింగ్ కూడా తాము ఏదో ఒక రోజు తైవాన్‌ని ఆక్రమించుకుంటామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (చదవండి: బుడిబుడి నడకల బుడతడు డ్యాన్స్ చేసి అదరగొడుతున్నాడు) ఈ మేరకు తైవాన్ అధ్యక్షురాలు మాట్లాడుతూ..."మనం ఎంత ఎక్కువ సాధిస్తే చైనా నుంచి మనం అంత ఒత్తిడి ఎదుర్కొంటాం. చైనా నిర్దేశించిన మార్గంలో పయనించమని మనల్ని ఎవరూ ఒత్తిడి చేయలేరు. తైవాన్ ఎప్పుడూ ప్రజాస్వామ్య రక్షణకే మొదటి ప్రాధాన్యతనిస్తుంది. అంతేకాదు బీజింగ్‌తో సంబంధాలను సడలించుకోవాలని నిర్ణయించుకున్నాం. తైవాన్ ప్రజలు ఒత్తిడికి తలొగ్గుతారని భ్రమపడొద్దు" అంటూ ఛైనాకు హెచ్చరికలు జారీ చేశారు. (చదవండి: సైక్లోథాన్‌తో మానసిక ఆరోగ్యం పై అవగహన కార్యక్రమాలు") -
నవ్వితేనే ఆఫీసుల్లోకి ఎంట్రీ.. ఇదేం విడ్డూరం!
ఆఫీస్ పరిధిల్లో సీసీ కెమెరాలు, ఐరిష్ మెషిన్లు ఉద్యోగుల కదలికలను, హాజరును పరిశీలించేందుకు ఏర్పాటు చేస్తుంటాయి కంపెనీలు. అయితే చైనాలోని కొన్ని ఆఫీసుల్లో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చారు. ఉద్యోగులు ఆఫీస్‌లోకి అడుగుపెట్టాలంటే కచ్చితంగా నవ్వాల్సిందే. ఈ మేరకు స్మైల్ రికగ్నిషన్ కెమెరా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ఆఫీసుల్లోకి ప్రవేశించడం మాత్రమే కాదు.. పర్సనల్ పీసీలు ఆన్ చేయాలన్నా, లంచ్ యాక్సెస్, మీటింగ్‌లకు అటెండ్ కావాలన్నా ఎంప్లాయి నవ్వాల్సిందే. ఇందుకు సంబంధించి కెనన్ కంపెనీ, అర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సాయంతో స్మైల్ రికగ్నిషన్ టెక్నాలజీ డెవలప్ చేసింది. పని చేసే టైంలో ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? లేదా? అనేది ఈ టెక్నాలజీ మానిటరింగ్ చేస్తుందని కెనన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తెలిపింది. ప్రయోగాత్మకం మరో 30 దేశాల్లో(భారత్‌తో సహా) ఈ టెక్నాలజీకి ట్రయల్ రన్ నిర్వహించాలని భావిస్తున్నట్లు కెనన్ ఒక స్టేట్మెంట్లో పేర్కొంది. నిజానికి స్మైల్ రికగ్నిషన్ కెమెరాలను కిందటి ఏడాదే డెవలప్ చేసినప్పటికీ.. అది అంతగా గుర్తింపు దక్కించుకోలేదు. అయితే ఈ ఏడాది బీజింగ్‌లో కొన్ని టాప్ కంపెనీలు ఈ టెక్నాలజీని అనుమతించడంతో ప్రముఖంగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ టెక్నాలజీపై విమర్శలు ఉన్నప్పటికీ.. ఇది ఉద్యోగుల మానస్థితిని అదుపు చేస్తుందని, వాళ్లను వందకి వంద శాతం సంతోషంగా ఉంచుతాయని కంపెనీలు వివరణలు ఇచ్చుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మాస్కులు పెట్టుకున్న ఉద్యోగుల సంగతేంటని కొందరు సెటైర్లు వేస్తుండడం కొసమెరుపు. చదవండి: ఆర్టిఫిషీయల్ మూడో కన్ను! -
వైరల్: స్ప్రింటర్లను మించి కెమెరామెన్ పరుగో పరుగు..
బీజింగ్: మనుషులు తమ ఆలోచనలు, భావాలు, ఉద్వేగాలు, బంధాలను ప్రతిదీ కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఉత్తర చైనాలోని షాంకి ప్రావిన్స్‌లోని డాటాంగ్ విశ్వవిద్యాలయంలో పరుగు పందెం పోటీలు నిర్వహించారు. అయితే ఈ 100 మీటర్ల పరుగుపందెం ఈవెంట్‌ను కెమెరాలో బంధించే బాధ్యతను ఓ విద్యార్థికి అప్పగించారు. ఇంకేముంది ఆ విద్యార్థి ఈవెంట్‌ను వీడియో తీయడానికి ఓ 4 కిలోల భారీ కెమెరా గేర్‌ను పట్టుకొని స్ప్రింటర్ల కంటే వేగంగా పరిగెత్తి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటి వరకు ఈ వీడియోను 1.4 మిలియన్ల నెటిజన్లు వీక్షించారు. దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ.. కెమెరామెన్ ప్రతి ఒక్కరినీ వీడియో తీయడానికి వేగాన్ని తగ్గించాల్సి వచ్చింది, లేకపోతే రాకెట్లా దూసుకుపోయేవాడు.’’ అంటూ ప్రశంస జల్లు కురిపించాడు. ఇక మరో నెటిజన్ ‘‘ ఆ బహుమతికి కెమెరామెన్ అర్హుడు.’’ అంటూ కామెంట్ చేశాడు. (చదవండి: ముంబైలో ఘోర ప్రమాదం.. 8 మంది పిల్లలతో సహా..) -
ఒకదాని వెంట మరొకటి.. చైనాలో వరుస భూకంపాలు
బీజింగ్: వరుసగా చోటు చేసుకుంటున్న భూకంపాలు చైనాను కుదిపేస్తున్నాయి. కొద్దిపాటి విరామంతోనే మళ్లీమళ్లీ భూమి కంపిస్తుండటంతో చైనీయులు ఆందోళన చెందుతున్నారు. భూకంపాల ధాటికి ఇప్పటి వరకు చైనాలో ముగ్గురు చనిపోగా 27 మంది గాయపడ్డారు. వేల సంఖ్యలో ఇళ్లు భూకంప తీవ్రతకు దెబ్బ తిన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది. శుక్రవారం సాయంత్రం నుంచి చైనాలోని దాదాపు 12 కౌంటీల్లో భూమి కంపిస్తోంది. అయితే యంగ్బీ, యాంగ్ గౌజాంగ్ కౌంటీలు భూకంపాల ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. రిక్టరు స్కేలుపై 5 శాతం కంటె ఎక్కువ తీవ్రతతో వరుసగా నాలుగు సార్లు వచ్చిన భూకంపాలతో యంగ్బీ కౌంటీ తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ ప్రమాద తీవ్రతకు ఇద్దరు చనిపోగా..యాంగ్‌గౌజాంగ్ కౌంటీలో ఒక్కరు మరణించారు. దాదాపు 162 సార్లు భూమి కంపించినట్టు సమాచారం. (చదవండి: Nepal: కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం) -
బిలియనీర్ల అడ్డాగా బీజింగ్!
సాక్షి, సెంట్రల్ డెస్క్: ప్రపంచంలో బాగా డబ్బున్నోళ్లు ఎక్కువ ఎక్కడుంటారు. 'మొన్నమొన్నటివరకైతే అమెరికా పేరే చెప్పేవాళ్లం... ఇప్పుడు ఆ స్థానాన్ని నెమ్మదినెమ్మదిగా చైనా అక్రమిస్తోంది. గత ఏడేళ్లుగా ప్రపంచ సంపన్నుల రాజధానిగా వెలుగొందిన న్యూయార్క్ ఇప్పుడు రెండో స్థానంలోకి వెళ్లిపోయింది. 2020లో వరల్డ్ బిలియనీర్స్ క్యాపిటల్ హోదాను బీజింగ్ చేజిక్కించుకుంది. ఫోర్స్ వరల్డ్ బిలియనీర్స్ జాబితా-2021 ప్రకారం బీజింగ్‌లో 100 మంది బిలియనీర్లు ఉండగా న్యూయార్క్‌లో 99 మంది ఉన్నారు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 2,755 మందిలో పావు శాతం మంది కింద పేర్కొన్న ఈ పది నగరాల్లో నివసిస్తున్నారు. ఈ నగరాల్లో మన ముంబై కూడా ఉండటం విశేషం. రూ.7,400 కోట్లు(బిలియన్ డాలర్లు) అంతకన్నా ఎక్కువ సంపద కలిగిన వారికి ఈ జాబితాలో చోటు దక్కింది. న్యూయార్క్‌లో అత్యంత ధనవంతుడిగా మాజీ మేయర్స్ బ్లూంబర్ల్ కంపెనీ అధినేత మైఖేల్ బ్లూంబర్డ్ నిలవగా... బీజింగ్‌లో అత్యంత సంపన్నుడి స్థానాన్ని జాంగ్ ఇమింగ్(టిక్‌టాక్ యాప్ వీళ్లదే) దక్కించుకున్నారు. చదవండి: జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్! -
ఒక్క ఫోన్‌కాల్: ప్రకంపనలు సృష్టించింది..
-
బీజింగ్‌లో కరోనా.. సూపర్ స్ర్పెడ్డర్ అతనేనా!
బీజింగ్ : కరోనా వైరస్ పుట్టుకకు చైనా కారణమన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ మొదలైన కరోనా వైరస్ ఖండాంతరాలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఇంకా విజృంభణ చేస్తూనే ఉంది. తాజాగా చైనా రాజధాని బీజింగ్‌లో కొత్తగా కరోనా కేసులు వెనుక డెలివరీ మ్యాన్ ఉన్నట్లు తెలుస్తుంది. బీజింగ్‌లో కరోనా వేగంగా విస్తరించడం వెనుక సూపర్ స్ప్రెడ్డర్ ఇతనేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫుడ్ డెలివరీ మ్యాన్‌గా పనిచేస్తున్న 47 ఏళ్ల వ్యక్తి కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడ్డాడు. బీజింగ్‌లో నమోదైన మొదటి కరోనా కేసు ఈ వ్యక్తిదే కావడం విశేషం. ఇతను జూన్ 1 నుంచి 17వరకు బీజింగ్‌లోని డాక్సింగ్, ఫాంగ్‌షాన్, డాంగ్చెంగ్, ఫెంగ్టై జిల్లాల్లో ఫుడ్ డెలివరీ అందించాడు. కాగా జూన్ 11 నుంచి 22 వరకు చూసుకుంటే బీజింగ్‌లో మొత్తం 249 కరోనా కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి చూస్తే బీజింగ్ నుంచి వివిధ ప్రాంతాలకు ఫుడ్ డెలివరీ చేసిన సదరు వ్యక్తే సూపర్ స్ప్రెడ్డర్ అనే అనుమానాలకు బలం చేకూరుస్తుంది. అతను కరోనా బారిన పడినప్పటి నుంచి దాదాపు రెండు వారాల పాటు యావరేజ్‌గా 50 ఫుడ్ ఆర్డర్లను డెలివరీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. (ద. కొరియాపై సైనిక చర్య: ఆదేశాలు నిలిపివేసిన కిమ్!) బీజింగ్‌లో మంగళవారం కొత్తగా 29 కేసులు వెలుగుచూడగా, కరోనా లక్షణాలు ఉన్న మరో 99 మందిని అబ్జర్వేషన్లో ఉన్నట్లు మెడికల్ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు దాదాపు 2.3 మిలియన్ మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు బీజింగ్ హెల్త్ కమిషన్ పేర్కొంది. చైనా అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 83,148 మంది కరోనా బారిన పడగా వారిలో 359 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. వీరిలో 78,425 మంది రికవరీ అవ్వగా, మృతుల సంఖ్య 4634గా ఉంది. (భారత్: ఒక్కరోజే 15968 పాజిటివ్ కేసులు) -
చైనాలో భారీగా కరోనా పరీక్షలు
బీజింగ్: కరోనా మహమ్మారి మరోసారి తన కోరలు చాచడంతో చైనా అప్రమత్తమైంది. కొత్త కరోనా కేసులు మొదలైన బీజింగ్ హోల్‌సేల్ మార్కెట్‌కు ఇటీవల వెళ్లిన వారందరికీ కరోనా పరీక్షలు చేసింది. తాజాగా దేశవ్యాప్తంగా 67 మందికి కరోనా సోకగా, ఇందులో 42 మంది రాజధాని బీజింగ్‌కు చెందిన వారే. ఇప్పటివరకూ చైనాలో మొత్తంగా 83181 మందికి కరోనా సోకగా, 4,634 మంది మరణించారు. కొన్ని వారాలపాటు కొత్త కేసులేవీ లేకపోవడంతో ఊపిరిపీల్చుకున్న చైనా.. తాజాగా కేసులు నమోదవడంతో వైరస్ వ్యాప్తి కట్టడి చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా మే 30 నుంచి బీజింగ్ హోల్‌సేల్ మార్కెట్‌కు వెళ్లిన 29,386 మందికి సోమవారం నుంచి పరీక్షలు చేయడం మొదలుపెట్టిందని బీజింగ్ హెల్త్ కమిషన్ ప్రతినిధి గావ్ షియాజున్ తెలిపారు. ‘కరోనా టీకా’కు మరింత దగ్గరయ్యాం కోవిడ్–19కు టీకా కనుగొనే దిశగా ముందడుగు వేసినట్లు చైనా కంపెనీ సైనోవాక్ బయోటెక్ ఆదివారం ప్రకటించింది. తమ ‘కరోనా వాక్’టీకా మొదటి, రెండో దశ క్లినికల్ ట్రయల్స్‌లో సానుకూల ఫలితాలు వెలువడ్డాయని వెల్లడించింది. తొలి దశలో 143 మంది వాలంటీర్లు, మలి దశలో 600 మంది వాలంటీర్లు తమ ట్రయల్స్‌లో పాల్గొన్నారని పేర్కొంది. ఈ ట్రయల్స్‌లో 90% కన్నా ఎక్కువ మందిలో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది. వారిలో తీవ్రస్థాయి సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ కనిపించలేదని పేర్కొంది. త్వరలో చైనా ‘నేషనల్ మెడికల్ ప్రాడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్’కు పూర్తి వివరాలు అందజేస్తామని, అనంతరం, మూడో దశ క్లినికల్ ట్రయల్స్ విదేశాల్లో నిర్వహించేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేస్తామని వెల్లడించింది. బ్రెజిల్‌కు చెందిన ‘ఇన్స్టిట్యూటొ బూటాంటన్’సంస్థతో కలిసి విదేశాల్లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తామంది. ‘తొలి, మలి క్లినికల్ ట్రయల్స్ విజయవంతం కావడంతో కోవిడ్–19పై పోరులో కీలక దశకు చేరుకున్నాం. కరోనావాక్ సురక్షితమైందని మా ట్రయల్స్‌లో తేలింది’అని సైనోవాక్ ప్రెసిడెంట్, సీఈఓ వీడాంగ్ యిన్ ప్రకటించారు. -
రాష్ట్రంలో హైస్పీడ్ రైళ్లు
- చైనాలో సీఎం బృందం పరిశీలన - టియాంజిన్ నుంచి బీజింగ్ వరకు ప్రయాణం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలిస్తున్నారు. చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మంగళవారం టియాంజిన్ నుంచి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించినట్లు హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. బుల్లెట్ రైలులో సీఎంతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు, మౌలిక సదుపాయాల కల్పన ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, సీఎం కార్యాలయ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ తదితరులు ప్రయాణించారు. అమరావతి- విశాఖపట్నం, అమరావతి- హైదరాబాద్ మధ్య బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టే అవకాశాలపై టియాంజిన్ నుంచి బీజింగ్ మధ్య 140 కిలోమీటర్లను 31 నిమిషాల్లో ప్రయాణించి పరిశీలించారు. బీజింగ్ నుంచి గుయాన్ చేరుకుని స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొనాల్సి ఉండగా, వాతావరణం అనుకూలించక పోవడంతో సీఎం ఏడున్నర గంటలు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. పీవీకి నివాళులు: చైనా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఘనంగా నివాళులు అర్పించారు. దేశంలో పీవీ ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుడితే తాను సీఎంగా వాటిని కొనసాగించానని తెలిపారు. ఢిల్లీలో పీవీ స్మృతి చిహ్నం ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. -
చైనాలో చంద్రబాబు బుల్లెట్ ట్రైన్ జర్నీ
బీజింగ్ : చైనాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన మూడోరోజు పర్యటన కొనసాగుతోంది. ఆయన ఇవాళ టియాంజిన్ నుంచి బీజింగ్ నగరానికి బుల్లెట్ రైలులో ప్రయాణించారు. బుల్లెట్ రైళ్లు, హైస్పీడు రైళ్ల సర్వీసుల్ని అధ్యయనం చేయడానికి బీజింగ్‌కు బుల్లెట్ రైలులో ప్రయాణించిన చంద్రబాబు అమరావతి-విశాఖ, అమరావతి-హైదరాబాద్ మార్గాల్లో బుల్లెట్ లేదా హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశాలపై పరిశీలన చేశారు. టియాంజిన్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో వున్న బీజింగ్ నగరానికి ముఖ్యమంత్రి కేవలం 31 నిమిషాలలో చేరుకున్నారు. కాగా చైనాలోని బుల్లెట్ రైళ్లు గంటకు 295 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. అనంతరం బుల్లెట్ రైళ్ళను పరిశీలించిన అనంతరం చంద్రబాబునాయుడు గుయాన్ వెళ్లారు. చంద్రబాబుతో పాటు ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు కూడా ఉన్నారు. కాగా బుల్లెట్ ట్రయిన్లో ప్రయాణం చేయడం ఓ మధురానుభూతి అని చంద్రబాబు ట్విట్టర్లో పేర్కొన్నారు. Elated at the experience of travelling in a Bullet train from Tianjin to Beijing. A memorable experience. #ChinaTrip pic.twitter.com/flyZtuJ80H — N Chandrababu Naidu (@ncbn) 28 June 2016 -
బీజింగ్‌లో కేసీఆర్ ‘బిజీ’నెస్!