బిలియనీర్ల అడ్డాగా బీజింగ్! | India Has World 3rd Highest Number of Billionaires | Sakshi
Sakshi News home page

బిలియనీర్ల అడ్డాగా బీజింగ్!

Published Fri, Apr 9 2021 2:14 PM | Last Updated on Fri, Apr 9 2021 4:10 PM

India Has World 3rd Highest Number of Billionaires - Sakshi

సాక్షి, సెంట్రల్‌ డెస్క్: ప్రపంచంలో బాగా డబ్బున్నోళ్లు ఎక్కువ ఎక్కడుంటారు. 'మొన్నమొన్నటివరకైతే అమెరికా పేరే చెప్పేవాళ్లం... ఇప్పుడు ఆ స్థానాన్ని నెమ్మదినెమ్మదిగా చైనా అక్రమిస్తోంది. గత ఏడేళ్లుగా ప్రపంచ సంపన్నుల రాజధానిగా వెలుగొందిన న్యూయార్క్‌ ఇప్పుడు రెండో స్థానంలోకి వెళ్లిపోయింది. 2020లో వరల్డ్‌ బిలియనీర్స్‌ క్యాపిటల్‌ హోదాను బీజింగ్‌ చేజిక్కించుకుంది. ఫోర్స్‌ వరల్డ్‌ బిలియనీర్స్‌ జాబితా-2021 ప్రకారం బీజింగ్‌లో 100 మంది బిలియనీర్లు ఉండగా న్యూయార్క్‌లో 99 మంది ఉన్నారు.

ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 2,755 మందిలో పావు శాతం మంది కింద పేర్కొన్న ఈ పది నగరాల్లో నివసిస్తున్నారు. ఈ నగరాల్లో మన ముంబై కూడా ఉండటం విశేషం. రూ.7,400 కోట్లు(బిలియన్‌ డాలర్లు)  అంతకన్నా ఎక్కువ సంపద కలిగిన వారికి ఈ జాబితాలో చోటు దక్కింది. న్యూయార్క్‌లో అత్యంత ధనవంతుడిగా మాజీ మేయర్స్‌ బ్లూంబర్ల్‌ కంపెనీ అధినేత మైఖేల్‌ బ్లూంబర్డ్‌ నిలవగా... బీజింగ్‌లో అత్యంత సంపన్నుడి స్థానాన్ని జాంగ్‌ ఇమింగ్‌(టిక్‌టాక్‌ యాప్‌ వీళ్లదే) దక్కించుకున్నారు.

చదవండి: 

జియో ఫైబర్ యూజర్లకు బంపర్ ఆఫర్!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement