బీజింగ్: జీ7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో కెనడా పాల్గొనడం విషయమైన చైనా మండిపడుతోంది. ఈ మేరకు ఈ విషయమై కెనడా దౌత్యవేత్త జిమ్ నికెల్‌ని పిలిపించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఐతే తైవాన్ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాల్సిందిగా జీ 7 దేశాలు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో బీజింగ్ తాజాగా కెనడా పై ఈ విధమైన దౌత్యపరమైన బెదిరింపులకు దిగింది. ఈ మేరకు చైనా డిప్యూటి విదేశాంగ మంత్రి క్సీ ఫెంగ్ కెనడా దౌత్యవేత్త నికెల్‌ని పిలిపించి...తైవాన్ విషయమై కెనడా తక్షణమైన తన తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. అలా కాకుంటే జరబోయే పరిణామాలను భరించాల్సిం వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
(చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్)
Comments
Please login to add a commentAdd a comment