diplomat
-
‘మీ మీద మాకు నమ్మకం లేదు’.. కెనడా ప్రధానిపై భారత్ ఆగ్రహం
ఢిల్లీ : ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత్ -కెనడా మధ్య దౌత్య పరమైన వివాదం రాజుకుంది. కెనడా దౌత్యవేత్తకు భారత్ సమన్లు జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ కార్యాలయానికి కెనడా అధికారి స్టీవర్ట్ వీలర్ సమన్లను అందుకున్నారు.నిజ్జర్ హత్య కేసులో భారత హై కమిషన్ సహా, పలువురు దౌత్య వేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చింది కెనడా. అంతేకాదు వారిని విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిర్ణయాన్ని ఖండించింది భారత్. కెనడా వాదన అసమంజసమని కొట్టిపారేసింది. ట్రూడో సర్కార్ రాజకీయ ఎజెండాలో భాగమేనంటూ ఫైరయ్యింది.ట్రూడోకు భారత్ పట్ల విధ్వేష భావం ఉందని భారత్ తన ప్రకటనలో తెలిపింది. భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద,వేర్పాటువాద ఎజెండాలతో సంబంధం ఉన్న వ్యక్తులను ట్రూడో తన కేబినెట్లో చేర్చుకున్నారని విమర్శించింది.ఖలిస్తాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత రాయబారి ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడో గతేడాది వ్యాఖ్యానించారు. అందుకు సంబంధించిన ఆధారాల్ని నాటి నుంచి నేటి వరకు తమతో పంచుకోలేదని భారత్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇప్పుడు ఏకంగా భారత దౌత్యవేత్తలను అనుమానితుల జాబితాలో చేర్చడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపించింది. కెనడా హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మపై చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ‘హై కమీషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 సంవత్సరాల పాటు దౌత్యవేత్తగా విశిష్టమైన సేవలందించారు. భారత్‌లోనే అత్యంత సీనియర్ దౌత్యవేత్త. సంజయ్ కుమార్ జపాన్, సూడాన్‌లలో రాయబారిగా ఉన్నారు. ఇటలీ, టర్కీ, వియత్నాం, చైనాలలో కూడా సేవలందించారు. అలాంటి దౌత్యవేత్తపై కెనడా ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది’అని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది.ఈ సందర్భంగా కెనడా నుంచి భారత హై కమిషనర్‌ను వెనక్కు పిలిపించింది. భారత దౌత్య సిబ్బందికి కెనడాలో రక్షణ లేదు అందుకే వెనక్కి పిలిపిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. కేంద్రం నిర్ణయంతో హై కమిషనర్‌తో పాటు ఇతర దౌత్య సిబ్బంది భారత్‌కు తిరిగి రానున్నారు. -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్‌లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
News about Hardeep Singh Nijjar, murder and S Jaishankarభారత్‌లోని అఫ్గనిస్థాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తనపై వ్యక్తిగత దాడులు, నిరంతర పరువునష్టం తన రాజీనామాకు కారణమని ఆమె పేర్కొన్నారు. మహిళా ప్రతినిధిని లక్ష్యంగా చేసుకొని తనపై దాడులు జరిగాయని వార్దక్ అన్నారు.ముంబైలో ఆఫ్ఘనిస్తాన్ కాన్సుల్ జనరల్‌గా ఉండటంతో పాటు న్యూఢిల్లీలో ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక రాయబారి బాధ్యతలను కూడా జకియా వార్దక్ నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె ముంబై విమానాశ్రయంలో 25 కేజీల బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులకు పట్టుబడ్డారు. దాదాపు రూ 18 కోట్ల విలువైన బంగారాన్ని ఆమె నుంచి స్వాధీనం చేసుకున్నారు.దుబాయ్ నుంచి భారత్‌కు తన వస్త్రాల్లో తరలించారని, ముమ్మర తనిఖీలు చేయగా ఈ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిందని అధికారులు పేర్కొన్నారు. ముంబయిలో ఏప్రిల్ 25న చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు జకియా వార్ధక్ శనివారం తెలిపారు.కాగా వార్ధక్ బంగారాన్నిఅక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న అధికారులు విమానాశ్రయంలో సిబ్బందిని మోహరించారు. ఏప్రిల్ 25న ఆమె తన కుమారుడితో కలిసి ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి ముంబయికి చేరుకున్నారు. విమానం దిగిన తర్వాత గ్రీన్ ఛానల్ నుంచి ఎయిర్‌పోర్టు బయటకు వచ్చారు. దౌత్యవేత్త కావడంతో ఆమెును తనిఖీలు చేయలేదు. అయితే, ఎయిర్‌పోర్టు ఎగ్జిట్ వద్ద డీఆర్ఐ అధికారులు ఆమెను అడ్డుకున్నారు. తొలుత స్మగ్లింగ్ ఆరోపణల గురించి ప్రశ్నించగా.. ఆమె వాటిని తోసిపుచ్చారు. అనంతరం ఆమెను గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా... ఆమె దుస్తుల్లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఒక్కో కడ్డీ బరువు కేజీ వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలను ఆమె సమర్పించకపోవడంతో అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. సాధారణంగా ఇలాంటి స్మగ్లింగ్ కేసుల్లో అనుమానితులను వెంటనే అరెస్టు చేస్తారు. అయితే వార్ధక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకోలేదు.News about Hardeep Singh Nijjar, murder and S Jaishanka -
25 కిలోల బంగారం స్మగ్లింగ్.. అఫ్గాన్ రాయబారి జకియా రాజీనామా
న్యూఢిల్లీ: రూ.18.6 కోట్ల విలువైన 25 కిలోల బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టులో దొరికిపోయిన అఫ్గానిస్తాన్ సీనియర్ దౌత్యవేత్త జకియా వార్దక్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తొలుత ముంబైలో అఫ్గాన్ కాన్సూల్ జనరల్‌గా రెండేళ్లు పనిచేశారు. గత ఏడాది ఇండియాలో అఫ్గాన్ రాయబారిగా బాధ్యతలు చేపట్టారు. గత నెల 25వ తేదీన ముంబై ఎయిర్‌పోర్టులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ) అధికారులు జకియా వార్దక్ నుంచి 25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆమె బంగారాన్ని దుబాయి నుంచి చట్టవిరుద్ధంగా తరలిస్తూ దొరికిపోయినట్లు వార్తలొచ్చాయి. దౌత్యవేత్త కావడంతో ఈ కేసులో అరెస్టు కాకుండా ఆమె మినహాయింపు పొందారు. అయితే, తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు జకియా వార్దక్ తాజాగా ‘ఎక్స్’లో పోస్టు చేశారు. తనపై వ్యక్తిగతంగా విమర్శల దాడి జరుగుతోందని, దీనివల్ల విధులు సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నానని, అందుకే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. -
గడ్డకట్టే చలిలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సాహసం..! ఐతే..
చైనాలోని యూఎన్ అత్యున్నత దౌత్యవేత్త సిద్ధార్థ్ ఛటర్జీ చేసిన యోగా నెట్టింట సంచలనం రేపుతుంది. మైనస్ సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో 'ఓం' కార పఠనంతో బ్రీతింగ్ వ్యాయామాలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అందుకు సంబంధించిన నాలుగు నిమిషాల నిడివి గల వీడియోని ఛటర్జీ "బ్రీతింగ్ ఫర్ గుడ్ హెల్త్" అనే పేరుతో పోస్ట్ చేశారు. ఆయన ఆ వీడియోలో బీజింగ్‌లోని గడ్డకట్టుకుపోయిన సరస్సుపై కూర్చొని శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేశారు. ఇది శారీరక, మానసికి ఆరోగ్యాన్ని కాపాడే బెస్ట్ వ్యాయామాలని వీడియో ప్రారంభంలోనే చెప్పారు. పొట్టను లోపలకి, బయటకు వదిలేలా లోతైన శ్వాస వ్యాయామాలు 'ఓం' కార పఠనంతో మొదలవ్వుతుందని అన్నారు. మనం ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టేటప్పుడు మొదట పని శ్వాస పీల్చుకోవడం. ఇక ఆఖరి పని దాన్ని విడిచిపెట్టయడమే అని చెప్పారు. ఇర ఆయన ఆ ఎముకలు కొరికే చలిలో పొట్టకు సంబంధించిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల తోపాటు శీర్షాసనం వంటివి యోగాసనాలు వేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అంతేగాకుండా ఈ వ్యాయామాల వల్ల కరోనా వంటి మహమ్మారిల నుంచి తట్టుకునేలా రోగనిరోధక శక్తిని అందిస్తుందని తెలిపారు. ఇదిలా ఉండగా, ఆయన 2020లొ చైనాలో యూఎన్ అత్యున్నత దౌత్యవేత్తగా నియమితులైన టైంలో అధిక కొలస్ట్రాల్, బీపీ, అధిక హృదయ స్పందన రేటు, ప్రీ డయాబెటిక్, ఒబెసిటీ వంటి సమస్యలతో బాధపడుతుండేవారు. ఆ తర్వాత ఈ యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజులు, సరైన జీవన శైలితో అనూహ్యంగా 25 కిలోల బరువు తగ్గడం జరిగింది. ఇక భారత్‌కి చెందిన ఛటర్జీ చైనాలోని యూఎన్ కార్యాలయానకి అధిపతిగా నియమించడం అప్పట్లో ఓ సంచలనంగా నిలిచింది. ఎందుకంటే తూర్పు లడఖ్ ప్రతిసష్టంభన, భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతల నడుమ ఆయన నియామకం జరగడమే అందుకు కారణం. కాగా, ఛటర్జీ కుటుంబం బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతాకు వలస వచ్చిన కుటుంబం. చిన్నప్పుడు బాల్యంలో ఆయన పోలియో బాధితుడు. సరైన చికత్స తీసుకుని పోలియో నుంచి పూర్తిగా రికవరయ్యాడు. ఆ తర్వాత 1981లో రెండో ప్రయత్నంలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చేరారు. అక్కడ నుంచి ఆయన ప్లేయర్‌గా, బాక్సర్‌గా మారి ఎన్నో టైటిల్స్ అందుకోవడం జరిగింది. ఆ తర్వాత ఎలైట్ పారా రెజిమెంటల్‌లో చేరారు. ఉన్నత విద్య కోసం యూఎస్ వెళ్లి అక్కడ ఐవీ లీగ్ ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో చేరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత యూఎన్ మిషన్కి నాయకత్వం వహించారు. ఆయన భార్య బాన్ హ్యూన్ హీ భారత్‌లోని యూనిసెఫ్ సామాజిక విధానానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన దౌత్యవేత్తగా తన 24 ఏళ్ల కెరీర్లో కెన్యా, స్విట్జర్లాండ్, డెన్మార్క్, ఇరాక్, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్ (డార్ఫర్), ఇండోనేషియా, బోస్నియా అండ్ హెర్జెగోవినా చైనా పొరుగు దేశం ఇరాకీ కుర్దిస్తాన్ వంటి దేశాలలో పనిచేశారు. ఛటర్జీ యూఎన్ శాంతి పరిరక్షణ, ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (UNDP), UNICEF, UN పాపులేషన్ ఫండ్ (UNFPA), రెడ్ క్రాస్ ఉద్యమం, UNOPS,UN భద్రతలలో కూడా పనిచేశారు. తన దౌత్యపరమైన పనుల తోపాటు అనారోగ్యం బారిన పడకుండా ఉండేలా ప్రజలను చైతన్యపరిచేలా..ముఖ్యంగా ఒత్తిడిని తట్టుకుని యాక్టివ్‌గా ఉండేలా చేసే శ్వాస వ్యాయమాలను సాధన చేస్తున్న వీడియోని నెటిజన్లతో పంచుకున్నారు సిద్ధార్థ్ ఛటర్జీ. VIDEO | Siddharth Chatterjee, the head of the #UN in China, is making waves on Chinese social media where he showcased his tough yoga and fitness exploits, including breathing exercises in sub-zero temperatures, which he says helped him to maintain physical and mental… pic.twitter.com/4q5nifvJHC — Press Trust of India (@PTI_News) April 16, 2024 (చదవండి: మొలకలు వచ్చిన ఆలు, కలర్ మారిన ఆకుకూరలు వండేస్తున్నారా..?) -
'ఖైమర్ అప్సర'గా భారత దౌత్యవేత్త!
భారత రాయబారి దేవయాని ఖోబ్రోగాడే 'ఖైమర్ అప్సర'గా దుస్తులు ధరించి సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలను కంబోడియాలోని భారత రాయబార కార్యాలయం సోషల్ మీడియా ఎక్స్‌లో పంచుకుంది. ఖైమర్ న్యూ ఇయర్ సందర్భంగా కంబోడియన్లకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు భారత దౌత్యవేత్త దేవయాని ఇలా కంబోడియన్ సంప్రదాయ దుస్తులను ధరించి ఖైమర్ అప్సరగా కనిపించారు. ఆమెకు ఖైమర్ సంస్కృతి, సంప్రదాయం పట్ల ప్రగాఢమైన అభిమానం ఉంది. అందువల్ల ఆమె ఇలా ఆ దుస్తుల్లో ధరించి ఆ నాగరికత పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ.. కాంబోడియన్ వాసులకు ఖైమర్ నూతర సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అంతేగాదు మా కాంబోడియా స్నేహితులందరూ ఈ ఖైమర్ నూతన సంవత్సర వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని కాంబోడియా భారత రాయబార కార్యాలయం అధికారిక సోషల్ మీడియా ఎక్స్‌లో పేర్కొంది. ఈ దౌత్యవేత్త ధరించి సంప్రదాయ కంబోడియన్ వస్త్రధారణ పురాణాల్లో ఉన్న పురాత ఖైమర్ కళకు నిలువెత్తు నిదర్శనంలా ఉంటుంది. ఈ వస్త్రధారణకు తగ్గట్టు ధరించిన ఖైమర్ సాంపాట్ అనే బంగారు ఆభరణం ఒక రకమైన ర్యాప్-ఎరౌండ్ స్కర్ట్‌తో కూడిన కిరీటం మాదిరిగా ఉంది. కాగా, దేవయాని 1999-బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి. తన 24 ఏళ్ల కెరీర్లో బెర్లిన్, ఇస్లామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారతీయ దౌత్యకార్యాలయాల్లో పనిచేశారు. అలాగే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వంటి దేశాల్లో విదేశాంగ మంత్రిత్వ ప్రధాన కార్యాలయంలో పనిచేశారు. అంతేగాక సెంట్రల్ యూరప్‌లో ఫైనాన్స్ అండ్ సీపీవీ (కాన్సులర్ పాస్‌పోర్ట్, వీసా) విభాగాలతో సహా అనేక విభాగాలలో పనిచేశారు దేవయాని. Ambassador Devyani Khobragade has a deep admiration for Khmer culture and tradition. Embracing the spirit of Khmer New Year, she elegantly dressed as a Khmer Apsara, embodying the rich bond of our civilizations. Wishing all our 🇰🇭 friends a joyous Khmer New Year celebration pic.twitter.com/5SfQ42g5ln — India in Cambodia (@indembcam) April 13, 2024 (చదవండి: ఒడిస్సీ బాలినీస్ నృత్యాల వందేమాతర సంగమం!) -
Israel Hamas War: చైనాలో ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై కత్తితో దాడి
ఇజ్రాయెల్ దౌత్య సిబ్బందిపై చైనాలో దాడి జరిగింది. ఈ మేరకు ఇజ్రాయెల్ విదేశాంగశాఖ శుక్రవారం ఓ ప్రకటన విడుల చేసింది. చైనా రాజధాని బీజింగ్‌లో ఇజ్రాయెల్ దౌత్యవేత్తను కత్తితో పొడిచినట్లు తెలిపింది. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చిక్సి అందిస్తున్నారని.. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొంది. అయితే ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడికి గల కారణాలు తెలియరాలేదు. దీనికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఎవరూ ఏ విధమైన ప్రకటన చేయలేదు. బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయంలో కాకుండా మరోచోట ఈ సంఘటన జరిగినట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా ఓ వైపు హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ సైన్యం మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ ఈ దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇజ్రాయిలీలు, యూదులు అలెర్ట్‌గా ఉండాలని సూచించింది. ఇజ్రాయెల్ దౌత్యవేత్తపై దాడి ఇజ్రాయెల్, చైనా మధ్య సంబంధాలను మరింత దెబ్బతీసింది. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ దాడులను చైనా ఖండించకపోవడంపై బీజింగ్‌లోని ఇజ్రాయెల్ రాయబారి తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు. ప్రస్తుతం యుద్ధ పరిణామాల పట్ల చైనా వైఖరికి సంబంధించి ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. చదవండి: తల్లి కడుపు చీల్చి మరీ.. వెలుగులోకి హమాస్ అరాచకాలు మరోవైపు వారం రోజులుగా గాజా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. గాజా సరిహద్దు వెంట ఇజ్రాయెల్‌లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న హమాస్ ఉగ్రవాదులపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. బాంబ్, వైమానిక దాడులతో విరుచుపడుతోంది. ఇప్పటి వరకు 6 వేల బాంబులను గాజాపై ప్రయోగించింది. గాజాస్ట్రిప్‌లోని ఇళ్ల కింద ఉన్న టన్నెల్స్‌లో హమాస్ టెర్రరిస్టులు దాక్కుడటంతో ఇజ్రాయెల్ కీలక ప్రకటన చేసింది. 24 గంటల్లో సిటీ వదిలి దక్షిణం వైపు వెళ్లాలని, ఉగ్రవాదులకు దూరంగా ఉండాలని గాజా పౌరులకు ఇజ్రాయెల్ ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలు, ఆసుపత్రుల్లో ఆశ్రయం పొందుతున్న వారికి కూడా హెచ్చరికలు జారీ చేసిందిమరోవైపు ఆహారం, ఇంధనం, నీరు, కరెంట్ నిలిపివేయడంతో గాజాలో పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే ఇజ్రాయెల్ ఆదేశాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళ వ్యక్తం చేసింది. పౌరుల తరలి వెళ్లాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరింది. చదవండి: ఇజ్రాయెల్ దాడుల్లో ఇజ్రాయెల్ పౌరులు, విదేశీ బందీల మృతి -
కెనడాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్.. ఐదు రోజుల్లో వెళ్లిపోండి..
న్యూఢిల్లీ: ఖలిస్థాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా దౌత్యకార్యాలయంలోని భారతీయ ఏజెంట్ ప్రమేయముందని ఆరోపిస్తూ ఆయనకు బహిష్కరించిన కొద్దీ సేపటికే భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖలిస్థానీ టైగర్ ఫోర్స్‌కు చెందిన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో భారతీయ ఏజెంట్‌కు సంబంధమున్నట్లు తమవద్ద ఆధారాలున్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అక్కడి పార్లమెంటులో ప్రకటించారు. ఆయితే భారత ప్రభుత్వం ఈ ఆరోపణలు నిరాధారమైనవని ఖండించింది. కెనడా ప్రధాని ఈ ప్రకటన చేసిన కొద్దిసేపటికే భారత దౌత్యాధికారిని బహిష్కరిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ప్రకటించారు. దీనికి బదులుగా భారత్ కూడా కెనడాకు అంతే దీటుగా స్పందించింది. మన అంతర్గత వ్యవహారాల్లో కెనడా దౌత్యవేత్తల జోక్యం చేసుకోకడమే కాకుండా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడిన నేరానికి భారత్‌లోని కెనడా దౌత్యాధికారిని వెంటనే బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది భారత విదేశాంగ శాఖ. భారత్‌కు కెనడా హైకమిషనర్ అయిన కామెరూన్ మెక్కేను ఐదు రోజుల్లో దేశాన్ని విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. The High Commissioner of Canada to India was summoned today by GOI and informed about it’s decision to expel senior Canadian diplomat and to leave India within the next five days! pic.twitter.com/wgJdvpLnzE — Prof.N John Camm (@njohncamm) September 19, 2023 ఇది కూడా చదవండి: గాయపడిన సైనికులకు జెలెన్స్కీ పరామర్శ -
మతోన్మాదం యూరప్ కొంప ముంచుతుందా?
యూరప్‌లో మతోన్మాదం అంతకంతకూ తీవ్రమవుతోంది. స్వీడన్ తర్వాత ఇప్పుడు మరో యూరోపియన్ దేశం డెన్మార్క్‌లో ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌ను తగలబెట్టినా ఆ ప్రక్రియను ఆపే చర్యలేవీ జరగడంలేదు. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో మితవాద సంస్థ ఖురాన్‌ను తగులబెట్టడంపై సౌదీ అరేబియా మొదలుకొని పాకిస్తాన్ వరకు అన్ని ముస్లిం దేశాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో.. ఖురాన్ దహనం చేసిన ఘటనపై ఆగ్రహించిన సౌదీ అరేబియా.. డెన్మార్క్ దౌత్యవేత్త సమక్షంలో తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. అదే సమయంలో డెన్మార్క్‌లో జరిగిన ఘటనపై పాకిస్తాన్ విదేశాంగ శాఖ కూడా తీవ్ర విమర్శలు గుప్పించింది. తాజాగా జరిగిన సమావేశంలో సౌదీ అధికారులు డెన్మార్క్ రాయబారి ఎదుట తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను తక్షణం ఆపాలని డెన్మార్క్‌కు వారు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి సంఘటనలు అన్ని మతాల సందేశాలకు, అంతర్జాతీయ చట్టాలు, ప్రమాణాలకు విరుద్ధమని సౌదీ పేర్కొంది. ఖురాన్‌ను తగులబెట్టడం వల్ల వివిధ మతాల మధ్య విద్వేషాలు వ్యాపిస్తాయని తెలిపింది. ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం దీనికిముందు డెన్మార్క్‌కు చెందిన పేట్రియాటర్ ఒక వీడియోను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్‌ను తగులబెట్టడం ఆ వీడియోలో కనిపిస్తుంది. తాజాగా స్వీడన్, డెన్మార్క్‌లలో కూడా ఖురాన్‌ను దగ్ధం ఘటన అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం దేశాల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోంది. మక్కా, మదీనా వంటి నగరాలు కలిగిన దేశమైన సౌదీ అరేబియా.. స్వీడన్లో ఖురాన్‌ను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా వ్యతిరేకించింది. ఒక ఇరాకీ శరణార్థి స్టాక్‌హోమ్‌లోని ప్రధాన మసీదు బయట ఖురాన్‌ను తగులబెట్టాడు. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల నేపధ్యంలో సౌదీ అరేబియా, ఇరాక్ సంయుక్తంగా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ) అసాధారణ సమావేశానికి పిలుపునిచ్చాయి. దీనిలో స్వీడన్, డెన్మార్క్‌లలో ఖురాన్ దహనం చేసిన అంశంపై చర్చించనున్నారు. మరోవైపు స్వీడన్ ప్రధాని తమ దేశానికి ఉగ్రదాడుల భయం ఎదురుకావడంతో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేశారు. ఇస్లామిక్ దేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు స్వీడన్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది కూడా చదవండి: ఆ పాప నా మనవరాలే : బైడెన్ -
విక్రయమే తప్ప సాయం కాదన్న అమెరికా... టెన్షన్లో భారత్
US Povide Pakistan For F-16 fighter jet fleet sustainment program: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నేతృత్వంలోని యూఎస్ ప్రభుత్వం పాకిస్తాన్‌కి సుమారు 450 మిలియన్ డాలర్ల ఎఫ్16 ఫైటర్ జెట్ సస్టైన్మెంట్ ప్రోగ్రామ్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ట్రంప్ కాలంలో ఈ భద్రతా సాయాన్ని నిలిపివేస్తే జోబైడెన్ నేతృత్వంలో యూఎస్ ప్రభుత్వం పునరుద్ధరించింది. దీంతో భారత్ తీవ్ర అభ్యంతరాలతోపాటు భయాందోళనలను వ్యక్తం చేసింది. ఐతే అమెరికా మాత్రం ఇది కేవలం అమ్మాకాలే కానీ సహాయం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు యూఎస్ దక్షిణాసియా, మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్డ్ లూ మాట్లాడుతూ.... ఒక దేశానికి అందించే రక్షణ పరికరాలకు మద్దతు ఇవ్వడం యూఎస్ ప్రభుత్వ విధానమని నొక్కి చెప్పారు. అంటే దీని అర్థం కేవలం పాక్‌తో ఉన్న ఎఫ్16 విమానాలకు సంబంధించిన విడిభాగాల విక్రయం మాత్రేమనని సహాయం కాదని తేల్చి చెప్పారు. తాము కేవలం పరికరాల సేవలను మాత్రమే ప్రతిపాదిస్తున్నామని చెబుతున్నారు. దీనివల్ల విమానాలు వాయు భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటాయన్నారు. తాము భారత్ ఆందోళనలను అర్థం చేసుకున్నామని అన్నారు. పాక్‌లో ఉన్న ఎఫ్16 యుద్ధ విమానాలు 40 ఏళ్లకు పైబడినవి అందువల్ల ఆయా భాగాలకు సంబంధించిన సర్వీస్‌ని అందిస్తున్నామే తప్ప కొత్త విమానాలను ఏమి అందిచండం లేదని స్పష్టం చేశారు. ఐతే 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాలిబన్ హక్కానీ నెట్వర్క్ వంటి ఉగ్రవాద గ్రూపులను అణిచివేయడం తోపాటు, వారి సురక్షిత స్థావరాలను కూల్చివేయడంలో విఫలమైనందున పాకిస్తాన్‌కు సుమారు రెండు వేల బిలియన్ డాలర్ల భద్రతాసహాయాన్ని నిలిపేశారు. (చదవండి: ఏదో చిన్న బహుమతి వస్తుందనుకుంటే... ఏకంగా రూ. 7 కోట్లు....) -
కెనడాకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చైనా!
బీజింగ్: జీ7 దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు విడుదల చేసిన ప్రకటనలో కెనడా పాల్గొనడం విషయమైన చైనా మండిపడుతోంది. ఈ మేరకు ఈ విషయమై కెనడా దౌత్యవేత్త జిమ్ నికెల్ని పిలిపించినట్లు చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. ఐతే తైవాన్ జలసంధి చుట్టూ ఉన్న ఉద్రిక్తతను శాంతియుత పద్ధతిలో పరిష్కరించుకోవాల్సిందిగా జీ 7 దేశాలు పిలిపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో బీజింగ్ తాజాగా కెనడా పై ఈ విధమైన దౌత్యపరమైన బెదిరింపులకు దిగింది. ఈ మేరకు చైనా డిప్యూటి విదేశాంగ మంత్రి క్సీ ఫెంగ్ కెనడా దౌత్యవేత్త నికెల్ని పిలిపించి...తైవాన్ విషయమై కెనడా తక్షణమైన తన తప్పులను సరిదిద్దుకోవాలని హెచ్చరించింది. అలా కాకుంటే జరబోయే పరిణామాలను భరించాల్సిం వస్తుందంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. (చదవండి: తైవాన్‌పై క్షిపణులతో విరుచుకుపడ్డ చైనా.. భయానక దృశ్యాలు వైరల్) -
ఇంటికి నిప్పు పెట్టి ఆర్పుతున్నట్లు నటన
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సమావేశంలో భారత యువదౌత్యవేత్త స్నేహ దుబే పాకిస్తాన్ నోరుమూయించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నారు. నెటిజన్లు ఆమె ప్రసంగంలో పటిమకు జేజేలు కొడుతున్నారు. యూఎన్ వేదికపై పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగానికి స్నేహ గట్టిగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ ప్రధాని భారత్ అంతర్గత విషయాలను ప్రస్తావించారు. అవాస్తవాలు ప్రచారం చేయడానికి అంతర్జాతీయ వేదికపై విషం చిమ్మడం ఇది మొదటిసారి కాదు. పదే పదే తానే ఉగ్రవాద బాధిత దేశమని పాక్ చెప్పుకుంటుంది. తనే ఇంటికి నిప్పు పెట్టి, మళ్లీ దానిని ఆర్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా నాటకాలు ఆడుతూ ఉం టుంది. పాక్ విధానాలతో యావత్ ప్రపంచం ఇ బ్బందులు ఎదుర్కొంటోంది. పాకిస్తాన్లో ఉగ్రవా దులు చాలా స్వేచ్ఛగా తిరుగుతారు. ఆ దేశం ఉగ్రవాదులకి శిక్షణ ఇచ్చి, వారికి నిధులు సమకూ ర్చి పెంచి పోషిస్తోంది. ఒసామా బిన్ లాడెన్ లాంటి వారికి ఆశ్రయం ఇచ్చింది’’అని ఫస్ట్ సెక్రటరీ స్నేహ దుబే దుయ్యబట్టారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో తన సందేశాన్ని వీడియో ద్వారా పంపించిన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ షా గిలానీ మృతి వంటి అంశాలను ప్రస్తావిస్తూ భారత్‌లో ఇస్లాం వ్యతిరేకులు పరిపాలకులుగా ఉన్నారని, ముస్లిం లపై ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనికి స్నేహ దుబే సమాధానమిస్తూ జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లు ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగంగానే ఉంటాయని స్పష్టం చేశారు. సరిహద్దుల్లో పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ తక్షణమే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. ఎవరీ స్నేహ దుబే? స్నేహ దుబే తన 12 ఏళ్ల వయసు నుంచే దేశానికి ప్రాతినిధ్యం వహించి విదేశాలు చుట్టి రావాలని కలలు కన్నారు. ఆమె కన్న కలకి తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడైంది. గోవాలో పాఠశాల విద్య అభ్యసించారు. ఉన్నత విద్య పుణెలో చదివారు. ఢిల్లీలోని జేఎన్‌యూలో ఎంఫిల్ చేశారు. 2011లో యూపీఎస్సీకి మొదటి ప్రయత్నంలోనే పాసయ్యారు. అంతర్జాతీయ వ్యవహారాలు, విభిన్న సంస్కృతులు తెలుసుకోవడంపై మక్కువ ఎక్కువ. ప్రయాణాలంటే ఆసక్తి ఉన్న ఆమె ఫారెన్ సర్వీసులో చేరితే ప్రపంచ దేశాలు చుట్టి రావచ్చునని ఆశపడ్డారు. దానికి తగ్గట్టే ఆమెకి అవకాశం వచ్చింది. మొదట విదేశాంగ శాఖలో పని చేసిన స్నేహ ప్రస్తుతం ఐరాసలో భారత్ ఫస్ట్ సెక్రటరీగా ఉన్నారు. భారత్‌లో ఫాసిస్ట్ ప్రభుత్వ పాలన పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ అమెరికా ధోరణితో తమకు ఎంతో నష్టం జరిగిందని ఐక్యరాజ్య సమితి వేదికగా చెప్పారు. అమెరికా కనీస కృతజ్ఞత లేకుండా ప్రవర్తించడం, అంతర్జాతీయ సమాజం ద్వంద్వ ప్రమాణాలతో తమ దేశం ఎన్నో ఇబ్బందులు పడిందన్నారు. ముందుగా రికార్డు చేసిన ఇమ్రాన్‌ఖాన్ ప్రసంగం వీడియోను శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రదర్శించారు. వాతావరణ మార్పుల దగ్గర నుంచి ఇస్లాం వ్యతిరేకత వరకు ఎన్నో అంశాలపై ఆయన మాట్లాడారు. భారత్‌ని పదునైన మాటలతో తూలనాడారు. భారత్‌లో మోదీ ప్రభుత్వాన్ని ఫాసిస్ట్‌గా అభివర్ణించారు. ఇస్లాం వ్యతిరేక ధోరణితో విషం కక్కుతోందని ఆరోపించారు. అఫ్గాన్‌లో పరిణామాలతో పాకిస్తాన్‌ను అందరూ దోషిగా చూస్తున్నారని అన్నారు. ‘అమెరికాపై సెప్టెంబర్ 11 దాడుల తర్వాత ఉగ్రవాదులపై జరిపిన యుద్దంలో ఆ దేశంతో చేతులు కలిపి మేమే ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొన్నాం. అఫ్గానిస్తాన్‌తో పాటు పాకిస్తాన్‌కి ఎక్కువ నష్టం జరిగింది’’అని పేర్కొన్నారు. -
పాక్‌లో దారుణం: మాజీ దౌత్యవేత్త కుమార్తె హత్య..
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణం చోటుచేసుకుంది. అక్కడ సామాన్యులకే కాదూ.. వీవీఐపీలకు అక్కడ రక్షణ లేకుండా పోయింది. తాజాగా, పాక్ మాజీ దౌత్యవేత్తగా కుమార్తెను కొంత మంది దుండగులు అతికిరాతకంగా హతమార్చారు. ప్రస్తుతం ఈ వార్త దేశంలో సంచలనంగా మారింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. పాకిస్తాన్‌కు చెందిన శౌకత్ ముకద్దమ్ గతంలో దక్షిణ కొరియా, కజికిస్తాన్‌లకు దౌత్యావేత్తగా పనిచేశారు. ఈ క్రమంలో కొంత మంది దుండగులు.. ఆయన కుమార్తె నూర్ ముకద్దమ్‌ను కిడ్నాప్‌చేసి అతి దారుణంగా చంపేశారు. ఆమె మృతదేహన్ని ఇస్లామాబాద్‌లోని ఎఫ్ 4 సెక్టార్ వద్ద వదిలేసి వెళ్లిపోయారు. దీంతో, పాక్ పోలీసులు ఆమె మృత దేహాన్ని స్వాధీనం చేసుకున్న పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా, కుటుంబ సభ్యులు ఈ హత్య కేసులో ఆమె మిత్రుడిపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు జహీర్ జఫ్పర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనతో పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్ని రోజుల క్రితమే.. పాక్‌లోని అఫ్గాన్ దౌత్యవేత్తగా పనిచేసిన నజిబుల్లా అలిఖిల్ కుమార్తె సిల్సిలా అలిఖిల్‌ను ఇస్లామాబాద్‌లో దుండగులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైనా సిల్సిలా.. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటుంది. ఈ చర్యలను పలుదేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. తక్షణమే దీనివెనుక ఉన్న వారిని అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. పాక్ మద్దతుతోననే తాలిబన్లు దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని పలుదేశాలు ఆరోపిస్తున్నాయి. -
అత్యున్నత స్థానాలు.. అందరూ మహిళలే
ఫ్రాన్స్‌కు తాజాగా మెన్నా రాలింగ్స్ అనే మహిళ... దౌత్యవేత్త కావడంతో బ్రిటన్ చరిత్రలోనే తొలిసారి అన్ని సీనియర్ డిప్లొమాటిక్ పోస్టులలో మహిళలే కనిపిస్తున్న సందర్భం విశేష ప్రాధాన్యాన్ని, చరిత్రాత్మక ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. ఇప్పటికే బీజింగ్, వాషింగ్టన్, బెర్లిన్, మాస్కో, టోక్యో, రోమ్లలో అందరూ మహిళలే సీనియర్ స్థాయిలో దౌత్య అధికారులుగా ఉన్నారు. ఇదొక అపూర్వ ఘట్టం. బ్రిటన్ ప్రభుత్వంలో ‘సర్’లు, ‘లార్డ్’లు ఉన్నట్లే మహిళల్ని అతి కీలకమైన విదేశాంగ పదవుల్లోకి రానివ్వని ధోరణీ ఉంటుంది. ఆ దేశాన్ని ఎప్పుడూ రెండు పార్టీలు మారి, మారి పాలిస్తూ ఉంటాయి. కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీ. ఇప్పుడున్నది కన్జర్వేటివ్ పార్టీ. 187 ఏళ్ల క్రితం పుట్టింది. ఇంతవరకు ఆ పార్టీ తరఫున ఒక్క మహిళా విదేశాంగ కార్యదర్శిగా లేరు! ఉంటే అదొక విడ్డూరం. ఆడవాళ్లేంటి! దేశాలు దాటిపోవడం ఏంటి! అని. అందుకే కావచ్చు 2006లో లేబర్ పార్టీ మార్గరెట్ బెకెట్ను విదేశాంగ కార్యదర్శిగా నియమించినప్పుడు మార్గరెట్ తనకు తనే నమ్మలేకపోయారు. లేబర్ పార్టీ పుట్టింది 121 ఏళ్ల క్రితం. ఆ పార్టీ చరిత్రలో తొలి మహిళా విదేశాంగ కార్యదర్శి మార్గరెటే. పార్టీలంటే సరే. ఏవో పురుషాధిక్యాలు, ‘మహిళలు చేయలేరు’ అనే చాదస్తాలు ఉంటాయి. మెన్నా రాలింగ్స్ (ఫ్రాన్స్) , కరోలిన్ విల్సన్ (బీజింగ్), డేమ్ కరేన్ (వాషింగ్టన్) మరి సీనియర్ దౌత్య అధికారులుగా వారిని నియమించడానికేమైంది? నమ్మకం లేక! ఆ నమ్మకం లేకపో వడం ఏళ్లుగా సాగుతూ వస్తోంది. అందరు పురుషులు ఒకేలా ఉండరు కదా. ‘అవకాశం ఇచ్చి చూస్తే కదా మహిళలలా చేయగలరో తెలుస్తుంది’ అని యు.కె. విదేశాంగ కార్యదర్శులు ఇద్దరు సర్ సైమన్ ఫ్రేజర్, లార్డ్ మెక్‌డోనాల్డ్ పట్టుపడితే అప్పుడు ఒకళ్లిద్దరితో మొదలైన ఉన్నతస్థాయి మహిళా నియామకాలు ఒకటీ అరగా పెరుగుతూ వచ్చాయి. గత పదేళ్లలో 22 నుంచి 60 మంది మహిళలు విదేశాంగ శాఖలో పెద్ద పోస్టుల్లోకి రాగలిగారు. తాజాగా ఇప్పుడు ‘తొలి మహిళ’ నియామకం ఒకటి జరిగింది! ఫ్రాన్స్‌కి ఇంతవరకు బ్రిటన్ నుంచి మహిళా రాయబారి లేరు. ఇప్పటివరకు ఉన్న 43 మంది రాయబారులూ పురుషులే. తొలిసారి మెన్నా రాలింగ్స్ (53) అనే మహిళ మొన్న ఏప్రిల్ 29న ఫ్రాన్స్ రాయబారిగా నియమితులయ్యారు. బ్రిటన్ నుంచి ఒక మహిళ తనకు రాయబారిగా రావడం అన్నది పారిస్‌కు పూర్తిగా కొత్త. దీంతో ‘ఫస్ట్ ఉమన్ ఇన్ ది రోల్’గా రాలింగ్స్ చరిత్ర సృష్టించారు. చరిత్ర మాత్రమే కాదు. ఇదొక చరిత్రాత్మక సందర్భం కూడా! జిల్ గల్లార్డ్ (బెర్లిన్) , డెబోరా బ్రానెర్ట్ (మాస్కో), జూలియా లాంగ్బటన్ (టోక్యో) ∙∙ రాలింగ్స్ ఫ్రాన్స్ రాయబారిగా పారిస్ వెళ్లడంతో ప్రపంచంలో బ్రిటన్‌కు అత్యంత ప్రధానమైన అన్ని దేశాలలో మహిళలే అత్యున్నతస్థాయి దౌత్య అధికారులుగా ఉన్నట్లయింది! బ్రిటన్ చరిత్రలో ఇలాంటి సందర్భం ఇదే ప్రథమం. బీజింగ్‌లో కరోలిన్ విల్సన్, వాషింగ్టన్లో డేమ్ కరేన్ పియర్స్, బెర్లిన్‌లో జిల్ గల్లార్డ్, మాస్కోలో డెబోరా బ్రానెర్ట్, టోక్యోలో జూలియా లాంVŠ బటన్, రోమ్‌లో జిల్ మోరిస్.. అంతా మహిళలే. ప్రతిభ ఉన్నవారిని పెద్ద స్థానాలకు వెళ్లనివ్వకుండా పక్కన పెడితే పెద్ద స్థానాలే ప్రతిభను వెతుక్కుంటూ వస్తాయనడానికి ఈ సందర్భం ఒక ఉదాహరణ. మహిళల శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను పురుషాధిక్య సమాజం ఎన్నాళ్లో, ఎన్నేళ్లో అడ్డుకుని ఆపి ఉంచలేదనడానికి ఇదొక నిదర్శనం కూడా. -
ఛీ..ఛీ మీకిదేం పాడు బుద్ది
ఇస్లామాబాద్: దౌత్యవేత్త అంటే ఎంతో బాధ్యతగా మెలగాలి. ఓ దేశ పరువు ప్రతిష్టలు వారి భుజాల మీద ఉన్నట్లు అర్థం. అందుకే వారు తమ మాటలు, చేతలు విషయంలో చాగా జాగ్రత్తగా ఉండాలి. స్వదేశంలో ఎలా ఉన్నా ఏం కాదు.. కానీ విదేశాలకు వెళ్లినప్పడు ఏ చిన్న తప్పు చేసినా.. దేశ ప్రతిష్టకు భంగం కలగకమానదు. అలాంటిది పాకిస్తాన్ దౌత్యవేత్తలు ఇద్దరు విదేశీ పర్యటనలో తన చేతివాటం చూపారు. చాక్లెట్స్, టోపీ దొంగిలించి అడ్డంగా బుక్కయ్యారు. దక్షిణ కొరియా పర్యటనలో సదరు అధికారులు ఈ పని చేశారు. కొరియా టైమ్స్ రిపోర్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు పాక్ దౌత్యవేత్తలు ఈ ఏడాది జనవరి 10న, ఫిబ్రవరి 23న దక్షిణ కొరియాలో పర్యటించారు. ఈ సందర్భంగా తొలుత కొరియా వెళ్లిన అధికారి సుమారు 750 రూపాయలు విలువ చేసే టోపి దొంగతనం చేయగా.. మరొకరు సుమారు వంద రూపాయలు విలువ చేసే చాక్లెట్స్ దొంగిలించినట్లు కొరియా అధికారులు తెలిపారు. ఇక అధికారుల చేతి వాటానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ టీవీకెమరాల్లో రికార్డయ్యాయి. ఇక దొంగతనం జరిగిన షాపు యమజానులు దీని గురించి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో సదరు అధికారుల చేతి వాటం బయటపడింది. దర్యాప్తు తరువాత, దౌత్యపరమైన ప్రోటోకాల్ కారణంగా అధికారులు సదరు నిందితులపై కేసు బుక్ చేయకుండా వదిలేశారు. దౌత్య సంబంధాలపై వియన్నా కన్వెన్షన్ ప్రకారం, దౌత్యవేత్తలు, వారి కుటుంబాలు తమ ఆతిథ్య దేశంలో అరెస్టు, నిర్బంధం, నేరారోపణల నుంచి మినాహాయింపు పొందవచ్చు. చదవండి: పావురంపై ఎఫ్ఐఆర్ నమోదు..ఎందుకో తెలుసా? -
అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలని
నవ్వును స్టాప్ చేసేవి.. చాలా జరిగాయి దేవయాని జీవితంలో! ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్ తను. ఆమెరికాలో పోలీసులు కేసు పెట్టారు. కస్టడీలోకి తీసుకున్నారు. నేరస్థుల మధ్య ఉంచారు. ఇండియాలో మరికొన్ని కేసులు. విచారణలో అన్నీ తేలిపోయాయి. ఇప్పుడు మళ్లీ రాయబారిగా కాంబోడియా వెళ్తున్నారు! కెరియర్లోని ప్రతి కష్టంలోనూ.. ‘నవ్వు నా బెస్ట్ ఫ్రెండ్’ అన్నట్లుగానే.. చిరునవ్వుతో నిలిచారు దేవయాని! దేవయాని ఖోబ్రాగడే ఐ.ఎఫ్.ఎస్. ఆఫీసర్. ఇండియన్ ఫారిన్ సర్వీసు. 1999 బ్యాచ్. ఏడేళ్ల క్రితం యు.ఎస్.లో ఆమె అరెస్ట్ అయినప్పుడు ఇండియా ఆమె కోసం అమెరికాతో అమీతుమీ తేల్చుకోవాలని ఢిల్లీలో జరిగిన అత్యున్నతస్థాయి ఆకస్మిక సమావేశంలో తీర్మానించింది. దేవయాని ఒక సాధారణ భారతీయ పౌరురాలు అయి వున్నా, ఆమె పట్ల అమెరికా వ్యవహరించిన తీరుకు భారత ప్రభుత్వం తీవ్రంగానే స్పందించి ఉండేది. అంతగా దేవయానిని అమెరికా వేధించింది. పోలీసులు ఆమె చేతులకు బేడీలు వేశారు. ఒంటి మీద వస్త్రాలు తీయించారు. సాధారణ నేరస్థులు, మాదక ద్రవ్యాలకు బానిసలైన వారు ఉన్న సెల్లో, వారితోపాటే ఆమెను ఉంచారు. అంతకుముందు ఏడాదే 2012లో న్యూయార్క్‌లోని ‘కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా’కు డిప్యూటీ కాన్సూల్ జనరల్‌గా వెళ్లారు దేవయాని. రెండు దేశాల మధ్య మహిళలు, రాజకీయాలు, ఆర్థిక వ్యవహారాలను చూడటం ఆమె పని. ఒక దేశం తరఫున అంత పెద్దపొజిషన్లో ఉన్న అధికారి అయిన దేవయానిని మహిళ అని కూడా చూడకుండా అమెరికన్ పోలీసులు కస్టడీలో ఉంచారు! వీసా మోసం, తన పనిమనిషికి కనీస వేతనం కూడా ఇవ్వకపోవడం.. ఇవీ ఆమె మీద నేరారోపణలు. 2013 డిసెంబర్ 13న దేవయాని అరెస్ట్ అయితే, 2014 జనవరి కల్లా ఇండియా ఒత్తిడిపై ఆమె బయటపడ్డారు. దౌత్యవేత్తకు ఉండే విశేష మినహాయింపులతో భారత ప్రభుత్వం ఆమె మీద ఉన్న ఆరోపణలను, అమెరికాలో నమోదైన కేసులను పక్కనపడేసి, కొంత విరామం తర్వాత ఢిల్లీలోని ఎం.ఇ.ఎ. (మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్)లో జాయింట్ సెక్రెటరీగా ప్రత్యేక స్థానం కల్పించింది. ఇన్నేళ్లుగా దేవయాని అక్కడే పని చేస్తున్నారు. ఇన్నాళ్లకు ఇప్పుడు మళ్లీ ఆమెకు తగిన హోదా వచ్చింది. కాంబోడియాకు భారత రాయబారిగా వెళ్తున్నారు! ∙∙∙ దేవయాని చురుకైన ఆఫీసర్. ఎవరు కాదు? ఐ.ఎ.ఎస్.లు, ఐ.ఎఫ్.ఎస్.లు అలాగే కదా ఉంటారు! దేవయాని ఇంకొంచెం ఎక్కువ. ఆమె తండ్రి ఉత్తమ్ ఖోబ్రగడే రిటైర్డ్ ఐయ్యేఎస్. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మహారాష్ట్రలోని తారాపూర్ వీళ్ల కుటుంబానిది. ఐఎఫ్ఎస్లోకి రాకముందు దేవయాని మెడిసిన్ చదివారు. యు.ఎస్. నుంచి రాగానే దేవయాని ఢిల్లీలోని ‘డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ అడ్మినిస్ట్రేషన్’ (డి.పి.ఎ.) డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2014 డిసెంబర్లో ఆమెను ‘కంపల్సరీ వెయిట్’లో ఉంచారు. దేవయాని పిల్లలకు రెండు దేశాల పాస్‌పోర్ట్‌లు ఉన్నాయనే ఒక పూర్వపు ఆరోపణపై విచారణ జరిపేందుకే కొద్ది రోజులు ఆమెను విధుల నుంచి దూరంగా ఉంచారు. తనేం తప్పు చేయలేదని నిరూపించుకున్నారు దేవయాని. తిరిగి పోస్టింగ్‌లోకి వచ్చారు. 2015 జూలైలో విదేశీ వ్యవహారాల శాఖ ‘స్టేట్ డివిజన్’ డైరెక్టర్‌గా అపాయింట్ అయ్యారు. అయితే ప్రమోషన్ లేకుండా! దానిపై దేవయాని క్యాట్‌ని ఆశ్రయించారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యున ల్. ఏడు నెలల తర్వాత క్యాట్ ఆమెకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో గ్రేడ్–త్రీ ఆఫీసర్ హోదాలో జాయింట్ సెక్రటరీగా నియమించింది. ఇప్పుడు కాంబోడియాకు ఇంకో ప్రమోషన్. దేవయాని భర్త డాక్టర్ ఆకాశ్ సింగ్ రాథోడ్ అమెరికా పౌరుడు. ఉండటం ఇటలీలో. రోమ్‌లోని లూయిస్స్ యూనివర్శిటీలో రిసెర్చ్ ప్రొఫెసర్. ఇద్దరు కూతుళ్లు. తల్లితో ఇండియాలోను ఉంటున్నారు. దేవయాని ఖోబ్రాగడే రచయిత్రి కూడా! ‘ది వైట్ శారీ’అనే పుస్తకం రాశారు. లవ్‌స్టోరీ అది. ఓ కులాంతర ప్రేమ జంట కథ. పిల్లల కోసం మరో పుస్తకం రాశారు. ‘ది అడ్వెంచర్స్ ఆఫ్ యంగ్ అంబేడ్కర్’ ఆ పుస్తకం. 41 ఏళ్ల దేవయానిలో ప్రత్యేక ఆకర్షణ ఆమె చిరునవ్వు. కెరీర్‌లోని ఆటుపోట్ల సమయంలోనూ ఆ చిరునవ్వు ఆమెను వదిలిపోలేదు. నవ్వు ఆమె బెస్ట్ ఫ్రెండ్. -
జాధవ్‌ను కలిసిన భారత రాయబారి
న్యూఢిల్లీ: మరణశిక్ష పడి పాక్ జైలులో ఉన్న నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాధవ్(49)ను భారత సీనియర్ దౌత్యాధికారి ఒకరు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా జాధవ్‌తో భారత దౌత్యాధికారి కాసేపు చర్చించారు. అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తీర్పు మేరకు కుల్‌భూషణ్ జాధవ్‌ను సెప్టెంబర్ 2వ తేదీన భారత దౌత్య అధికారులు కలుసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నామని పాక్ విదేశాంగ శాఖ ప్రతినిధి మొహ మ్మద్ ఫైసల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కాన్సులర్ అనుమతి లభించడంతో ఓ భారత దౌత్యాధికారి సోమవారం జాధవ్‌ను కలిశారని పాక్‌కు చెందిన ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యున్ పత్రిక తెలిపింది. అయితే, జాధవ్‌ను కలిసిన దౌత్యాధికారి ఎవరు? వారు ఎక్కడ సమావేశమయ్యారనే వివరాలు వెల్లడించలేదు. గూఢచర్యం ఆరోపణలపై కులభూషణ్ జాధవ్‌కు పాక్ విధించిన మరణ దండనను జూలై 18న అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తాత్కాలికంగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కులభూషణ్ విషయంలో పాక్ వ్యవహరించిన తీరును ఐసీజే తీవ్రంగా తప్పుబట్టింది. వియాన్నా ఒప్పందం ప్రకారం కులభూషణ్ జాధవ్‌ను కలిసేందుకు దౌత్యాధికారులకు అనుమతిని పాక్ ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాలు వెలువడి దాదాపు 15 రోజుల అనంతరం పాక్ దిగొచ్చింది. ఐసీజే ఆదేశాల మేరకు రాయబార సంబంధాలపై వియాన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36, పారాగ్రాఫ్ 1 (బీ) ప్రకారం కులభూషణ్‌కు తన హక్కులు తెలియజేశామని, బాధ్యతాయుతమైన దేశంగా ఆయనను కలిసేందుకు దౌత్యాధికారుల అనుమతిని జారీచేశామని పాక్ విదేశాంగ శాఖ ఇప్పటికే తెలిపిన విషయం తెలిసిందే. -
క్షమాపణ చెప్పకుంటే రూ. 5 కోట్లు కట్టండి
లాహోర్: ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ పాక్ రక్షణమంత్రి దస్తగీర్‌కు రూ.5.70 కోట్ల(10 కోట్ల పాకిస్తానీ రూపాయలు) పరువునష్టం నోటీసులిచ్చాడు. ‘పాఠశాల విద్యార్థులపై ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులు జరపకుండా ఉండేందుకే జేయూడీ, ఎఫ్ఐఎఫ్లకు విరాళాలపై నిషేధం విధిస్తున్నాం’ అని ఇటీవల దస్తగీర్ అన్నారు. దీంతో ‘ఈ విషయమై నా క్లయింట్(సయీద్)కు 14 రోజుల్లోగా రాతపూర్వకంగా క్షమాపణ చెపాల్పి. ఇలాంటి ఘటనలు పునరావృతం కావని దస్తగీర్ మాటివ్వాలి. లేదంటే పాకిస్తాన్ శిక్షాస్మృతి సెక్షన్ 500 కింద కోర్టును ఆశ్రయిస్తాం’ అని సయీద్ న్యాయవాది నోటీసులు జారీచేశారు. -
నామ్ హత్య: దౌత్యవేత్తకు అరెస్ట్ వారెంట్!
కౌలాలంపూర్: కిమ్ జోంగ్ నామ్ హత్యకు సంబంధించి ఉత్తర కొరియా దౌత్యవేత్తపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని మలేసియా భావిస్తోంది. ఉత్తర కొరియా దౌత్యవేత్త క్వాంగ్ సాంగ్ విచారణకు సహకరించటం లేదని.. తనంతట తానుగా విచారణకు సహకరించనట్లైతే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరతామని సెలంగోర్ స్టేట్ పోలీస్ చీఫ్ అబ్దుల్ సమ మట్ వెల్లడించారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జోంగ్ నామ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దౌత్యవేత్తతో సహా 8 మంది ఉత్తర కొరియన్లను విచారించాలని మలేసియా అధికారులు భావిస్తున్నారు. వీఎక్స్ నర్వ్ ఏజెంట్ అనే నిషిద్ధ రసాయనాన్ని వాడి కిమ్ జోంగ్ నామ్‌ను హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ మహిళ సైతం వీఎక్స్ నర్వ్ ఏంజెంట్ ప్రభావిత లక్షణాలతో అనారోగ్యం పాలైందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పనే అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.