నామ్ హత్య: దౌత్యవేత్తకు అరెస్ట్ వారెంట్!
నామ్ హత్య: దౌత్యవేత్తకు అరెస్ట్ వారెంట్!
Published Sat, Feb 25 2017 1:56 PM | Last Updated on Mon, Aug 20 2018 4:35 PM
కౌలాలంపూర్: కిమ్ జోంగ్ నామ్ హత్యకు సంబంధించి ఉత్తర కొరియా దౌత్యవేత్తపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని మలేసియా భావిస్తోంది. ఉత్తర కొరియా దౌత్యవేత్త క్వాంగ్ సాంగ్ విచారణకు సహకరించటం లేదని.. తనంతట తానుగా విచారణకు సహకరించనట్లైతే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరతామని సెలంగోర్ స్టేట్ పోలీస్ చీఫ్ అబ్దుల్ సమ మట్ వెల్లడించారు.
కౌలాలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జోంగ్ నామ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దౌత్యవేత్తతో సహా 8 మంది ఉత్తర కొరియన్లను విచారించాలని మలేసియా అధికారులు భావిస్తున్నారు. వీఎక్స్ నర్వ్ ఏజెంట్ అనే నిషిద్ధ రసాయనాన్ని వాడి కిమ్ జోంగ్ నామ్ను హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ మహిళ సైతం వీఎక్స్ నర్వ్ ఏంజెంట్ ప్రభావిత లక్షణాలతో అనారోగ్యం పాలైందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పనే అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
Advertisement