Kim Jong Nam
-
ట్రంప్‌తో పోరుకు రెడీ.. నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం!
ప్యాంగ్యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్‌తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్‌కు సహకరిస్తోందన్నారు. 🚨#BREAKING: North Korea's Kim Jong Un Is Calling For A "New Cold War"This comes in response to the Biden Administration's recent actions in the East.Kim Jong Un also calls for UNLIMITED EXPANSION OF HIS NUCLEAR WEAPONS.Thoughts? pic.twitter.com/naRaJLkTs8— Donald J. Trump News (@realDonaldNewsX) November 18, 2024 -
అమెరికా శత్రువులంతా ఒకేచోట.. ఎందుకంటే..
ప్యోంగ్ యాంగ్: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న మాటను నిజం చేస్తూ అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రూపంలో కిమ్ జోంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్ జోంగ్ కూడా తమ దేశానికి మిలటరీ ప్రతినిధులను పంపినందుకు రష్యా అధ్యక్షుడికి కృతఙ్ఞతలు తెలిపారు. కిమ్ జొంగ్ మాట్లాడుతూ.. మిలటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఒకే రకమైన ఆలోచనలతో రెండు దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యంగా సామ్రాజ్యవాదుల కలయిక అంతర్జాతీయ శాంతి, సమన్యాయం నెలకొల్పే దిశగా ఫలప్రదంగా జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన రష్యా సైన్యం పైనా, ప్రజలపైన అపార నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ కూడా తమ సంతోషసన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ఈ మూడు దేశాలు అమెరికాకు గట్టి సంకేతాలనే పంపాయి. కానీ ఎక్కడా ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం ఇది కూడా చదవండి: ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే -
మా దేశంలో కరోనా నియంత్రణలోనే ఉంది..
ప్యాంగ్యాంగ్: తమ దేశంలో కరోనా నియంత్రణలోనే ఉందని, పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని ఉత్తర కొరియాకు చెందిన అమెరికా రాయబారి కిమ్ సోంగ్ బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. కరోనాకుం సంబంధించిన వివరాలు, సూచనలు కిమ్ సోంగ్ లైవ్ ద్వారా వివరించడం గమనార్హం. మహమ్మారి కాలంలో విదేశీయులెవరినీ తమ దేశంలోకి రానివ్వలేదని చెప్పారు. కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందిగా అత్యున్నత అలర్ట్ ఇచ్చినట్లు వెల్లడించారు. (చదవండి: కరోనా కట్టడికి ఉ.కొరియా షూట్ ఎట్ సైట్) ఆయా నిబంధనలు పాటించకపోతే సహించబోయేది లేదని కిమ్ ప్రభుత్వం చెప్పిందని అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ పాలక పార్టీ సభ్యులతో మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. అందులో ప్రధానంగా యాంటీ వైరస్ క్యాంపెయిన్‌పై చర్చించినట్లు పేర్కొంది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదని ఆ దేశం చెబుతుండగా, విదేశీ నిపుణులు దాన్ని కొట్టిపారేస్తున్నారు. (చదవండి: దక్షిణ కొరియా అధికారిపై కాల్పులు : కిమ్ క్షమాపణ) -
ఆమె విడుదల.. పంది మాంసంతో విందు
కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న వియత్నాం మహిళ డొయన్ థి హ్యుంగ్(30)కు విముక్తి లభించింది. రెండేళ్లుగా మలేసియా జైల్లో ఉన్న డొయన్ శుక్రవారం విడుదలైనట్టు ఆమె తరపు న్యాయవాది దాతుక్ నారన్ సింగ్ తెలిపారు. 2017, ఫిబ్రవరి 13న కౌలాలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జాంగ్ నామ్ హత్యకు గురయ్యారు. ఆయన ముఖ్యంపై ప్రమాదకరమైన వీఎక్స్ అనే రసాయన ద్రవ పదార్థాన్ని చిమ్మడంతో నామ్ మృతి చెందారు. ఈ కేసులో డొయన్తో పాటు ఇండోనేసియాకు చెందిన మరో మహిళ సితీ ఐశ్యాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిపై మోపిన హత్యారోపణలను మలేసియా న్యాయాధికారులు ఉపసంహరించడంతో మార్చి నెలలో జైలు నుంచి సితీ ఐశ్యా విడుదలయ్యారు. కిమ్ జాంగ్ నామ్ హత్యకేసులో వీరు పాత్రధారులు మాత్రమేనని, సూత్రధారులు వేరే ఉన్నారని డిఫెన్స్ లాయర్లు వాదించారు. కిమ్ ముఖ్యంపై చిమ్మింది విష పదార్థమని నిందితురాళ్లకు తెలియదని పేర్కొన్నారు. జైలు నుంచి విడుదలైన డొయన్ను ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకుని పుత్రజయకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి శుక్రవారం సాయంత్రం విమానంలో వియత్నాం రాజధాని హనోయ్‌కు ఆమెను పంపించనున్నారు. విమానం ఎక్కే ముందు డొయన్.. విలేకరుల సమావేశం నిర్వహిస్తారని ఆమె తరపు న్యాయవాది నారన్ సింగ్ తెలిపారు. డొయన్కు స్వాగతం పలికేందుకు ఆమె తండ్రి, సోదరుడు హనోయ్ విమానాశ్రయానికి వస్తారని వెల్లడించారు. స్వదేశానికి వెళ్లిన తర్వాత గతంలో మాదిరిగానే నటన, సింగింగ్ కెరీర్‌ను ఆమె కొనసాగిస్తుందన్నారు. డొయన్ జైలు నుంచి విడుదల కావడం పట్ల తనతో పాటు, తమ గ్రామం కూడా ఎంతో సంతోషంగా ఉందని ఆమె తండ్రి రాయిటర్స్ వార్తా సంస్థతో ఫోన్లో చెప్పారు. డొయన్ రాకను పురస్కరించుకుని ఆదివారం తమ గ్రామంలో పార్టీ ఏర్పాటు చేశామని, పందులను కోసి విందు భోజనం పెడతామని.. ఎవరైనా పార్టీకి రావొచ్చని అన్నారు. తన కూతురికి వేయించిన చేపలు అంటే ఇష్టమని తెలిపారు. -
కిమ్ సోదరుడి హత్య వీడియో ప్రదర్శన
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్యకు సంబంధించిన వీడియోను కోర్టు విచారణ సమయంలో ప్రదర్శించారు. ఈ కేసులో ప్రస్తుతం ఇద్దరు మహిళలు ప్రధాన నిందితులుగా విచారణ ఎదుర్కొంటుండగా ఆ హత్య తాము చేయలేందంటూ విజ్ఞప్తి చేస్తుండగా ఆ వీడియోను ప్రదర్శించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిమ్ జాంగ్ నామ్‌ను కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ తనిఖీ విభాగం వద్ద విష ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆ చర్య తాము కావాలని చేయలేదని, తమతో చేయించినవారు రియాలిటీ షో అని చెప్పారని వారు అన్నారు. అయితే, తాజాగా వారి ముందే ప్రదర్శించిన ఆ వీడియోలో కిమ్ జాంగ్ నామ్ వస్తుండగా వియత్నాంకు చెందిన మహిళగా అనుమానిస్తున్న డోవాన్ తి హువాంగ్ తన రెండు చేతులతో నామ్ ముఖాన్ని గట్టిగా ఓసారి మూసి వెళ్లినట్లు కనిపించింది. అయితే, నామ్‌పై దాడిలో స్వయంగా సితీ ఐసియాహ్ అనే ఇండోనేషియా మహిళ లేనప్పటికీ వేరే డైరెక్షన్లో ఆమె పారిపోతున్నట్లు కనిపించింది. అంతేకాకుండా హువాంగ్ ప్రవర్తన ఈ సంఘటన జరగడానికి రెండు రోజుల ముందు చాలా భయానకంగా ఉందని ఈ సందర్బంగా ఈ కేసు విచారణ చేస్తున్న పోలీసు అధికారి వాన్ అజిరుల్ నిజామ్ చేవాన్ అజిజ్ తెలిపారు. హువాంగ్ కోర్టును తప్పుదోవపట్టిస్తుందని, నామ్‌ను ఏమాత్రం క్షమించరాదనే దోరణితో ఆమె వ్యవహరించిందని, ఎట్టి పరిస్థితుల్లో ఆమెను శిక్షించాలని పేర్కొంది. -
సమస్య కొలిక్కి.. నామ్ మృతదేహం అప్పగింత
-
సమస్య కొలిక్కి.. నామ్ మృతదేహం అప్పగింత
కౌలాలంపూర్: ఎట్టకేలకు ఉత్తర కొరియా మలేషియాల మధ్య తాజాగా తలెత్తిన సమస్య తీరింది. ఇరు దేశాలు ఒక ఒప్పందానికి వచ్చి దాదాపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పరిచిన సమస్యను తీర్చుకున్నాయి. మలేషియా ఎయిర్‌పోర్ట్‌లో హత్యకు గురైన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మృతదేహాన్ని తిరిగి ఉత్తర కొరియాకు మలేషియా అప్పగించింది. దీంతో ఉత్తర కొరియాలో బందీలుగా ఉన్న తొమ్మిదిమంది మలేషియా రాయభార కార్యాలయానికి చెందినవారు తిరిగి కౌలాలంపూర్‌లో అడుగుపెట్టారు. ప్రస్తుతం నామ్ మృతదేహాం కొరియా చేరుకునే క్రమంలో ఉందని, తమ దేశ పౌరులు సురక్షితంగా తిరిగొచ్చారని మలేషియా అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. నామ్ హత్య తర్వాత ఇరు దేశాల మధ్య కీలక పరిణామాలు సంభవించాయి. ఇరు దేశాల రాయబారులను బహిష్కరించుకోవడంతోపాటు తమ దేశాల పౌరులు పరస్పర దేశాల్లోకి అడుగుపెట్టనివ్వకుండా ట్రావెల్ బ్యాన్ కూడా విధించుకున్నాయి. అయితే ఎట్టేకేలకు మలేషియా ప్రధాని నజీబ్ రజాక్ ఉత్తర కొరియాతో చర్చలు జరిపిన తర్వాత ఇరు దేశాల మధ్య విధించుకున్న బ్యాన్ ను ఎత్తేశారు. కిమ్ జాంగ్ నామ్ మృతదేహాన్ని పంపించారు. ఉత్తరకొరియాలోని మలేషియా రాయబార కార్యాలయానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు, ఓ చిన్నారి, ముగ్గురు చిన్నారులు తిరిగి శుక్రవారం ఉదయం కౌలాలంపూర్‌లో అడుగుపెట్టడంతో కొంత ఉద్వేగభరితమైన క్షణాలు ఆవిష్కృతమయ్యాయి. -
వెలుగులోకి నామ్ కొడుకు.. ‘నాన్నది హత్య’
ప్యాంగ్యాంగ్: మలేషియా విమానాశ్రయంలో విష ప్రయోగానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ నామ్ కుమారుడి వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. 40 సెకన్లపాటు ఉన్న ఈ వీడియో మార్చి 7న యూట్యూబ్‌లో ప్రత్యక్షమైంది. ఆ వీడియోలో ఉన్న యువకుడు తనను తాను కిమ్ హాన్ సోల్‌గా చెప్పుకున్నాడు. తాను కిమ్ జాంగ్ నామ్ కుమారుడినని ప్రస్తుతం తన తల్లి, సోదరితో కలిసి ఉత్తర కొరియాలోనే ఉంటున్నాని చెప్పాడు. అసంపూర్తిగా అర్ధమయ్యేలా బ్రిటన్ ఇంగ్లిష్ భాషలో అతడు మాట్లాడాడు. ‘నాపేరు కిమ్ హాన్ సోల్. నేను ఉత్తర కొరియా నుంచి మాట్లాడుతున్నాను. నేను కిమ్ కుటుంబంలో భాగం’ అని స్వయంగా చెప్పాడు. ఈ సందర్భంగా అతడు తన పాస్‌పోర్టును కూడా చూపించాడు. ప్రస్తుతం తాము సురక్షితంగానే ఉన్నామని చెప్పాడు. ఫిబ్రవరి 13న తండ్రిని హత్య చేశారని చెప్పారు. అతడిని నామ్ పెద్ద కుమారుడు సోల్ (22) అని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ విభాగం కూడా స్పష్టతనిచ్చింది. అయితే, ఈ వీడియో బయటకు వచ్చిన కొద్ది సేపటికే అతడికి విపరీతమైన మద్దతు వచ్చింది. అతడికి తాము రక్షణ కల్పిస్తామని, సురక్షితంగా తమ ప్రాంతాలకు తీసుకొస్తామని చెబుతూ పలువురు భరోసా ఇచ్చారు. ఈ వీడియో బయటకు రావడంపై ఉత్తర కొరియా అధికారులు ఇప్పుడు తెగ కంగారుపడిపోతున్నారని తెలుస్తోంది. -
కిమ్ సోదరుడిని చంపిన మహిళలకు మరణ శిక్ష!
మలేషియా: ఉత్తర కొరియా అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ సోదరుడు కింగ్ జాంగ్ నామ్ హత్య విషయంలో ఇద్దరు మహిళలపై మలేషియా పోలీసులు హత్యాభియోగాలు మోపనున్నారు. విచారణ పూర్తి చేసి వారు దోషులుగా తేలితే వారికి మరణ శిక్ష అమలు చేయనున్నారు. మలేషియా అటార్నీ జనరల్ మహ్మద్ అపాంది అలీ ఈ మేరకు బుధవారం వివరాలు తెలియజేశారు. నామ్ హత్యకు సంబంధించి తదుపరి జరగనున్న పరిణామాలను చెప్పారు. ఇండోనేషియాకు చెందిన సితి ఐసియా, వియత్నాంకు చెందిన డోవాన్ థి హువాంగ్ అనే ఇద్దరు మహిళలపై హత్యాభియోగాలు నమోదుకానున్నాయని, వారు దోషులుగా తేలితే మరణ శిక్షే ఉంటుందని తెలిపారు. అదొక సరదా కార్యక్రమం అని భావించి, అందులో నటించేందుకని అనుకొని తాను 90 డాలర్లు తీసుకొని అవతలి వ్యక్తి చేసినట్లు సితీ ఐసియా చెప్తుండగా మలేషియా పోలీసులు మాత్రం వారిద్దరు ఏం చేస్తున్నారనే విషయం వారికి ముందే తెలుసని చెప్పారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు ఈ ఘటనకు సంబంధించి అరెస్టు చేయగా వారిలో ఒకరు ఇప్పటికే బెయిల్‌పై బయట ఉన్నారు. మరో ఉత్తర కొరియా వ్యక్తిని మాత్రం పోలీసులు విచారిస్తున్నారు. ఒక వేళ ఉత్తర కొరియాకు సంబంధించిన వ్యక్తిపై ఆరోపణలు నమోదు చేయాల్సి వస్తే అతడి విషయంలో కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళతామని తెలిపారు. మరో ఏడుగురు ఉత్తర కొరియాకు చెందినవారి కోసం మలేషియా పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో నలుగురు ఇప్పటికే తమ దేశం పారిపోయారట. -
సోదరుడు నామ్ని కిమ్మే చంపించాడు!
సియోల్: ఉత్తరకొరియాపై దక్షిణకొరియా సంచలన ఆరోపణలు చేసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా ప్రభుత్వ పెద్దలే ఉన్నారని ఆరోపించింది. విదేశాంగ, రక్షణశాఖలో పనిచేస్తున్న మంత్రులు ఉన్నారని పేర్కొంది. ఈ నెల మలేసియా విమానాశ్రయంలో నామ్‌పై విషప్రయోగం జరిగిన విషయం తెలిసిందే. ఆయనపై వీఎక్స్ నెర్వ్ అనే అత్యంతప్రమాదమైన విషం ప్రభావం కారణంగా 20 నిమిషాల్లో చనిపోయారు. ఇది పెద్ద సంచలనం కాగా తొలుత ఉత్తర కొరియా ఏ విధంగానూ స్పందించలేదు. పైగా నామ్ పోస్టు మార్టం చేయడానికి మీరెవరు అంటూ మలేషియా ప్రభుత్వాన్ని నిలదీసింది. అయితే, ముందు నుంచే నామ్ హత్య వెనుక కీలకంగా కదులుతున్న మలేషియా ఎనిమిదిమందిని అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా దక్షిణ కొరియా స్పందిస్తూ ఈ ఘటనపై తమ ఇంటెలిజెన్స్ నుంచి అందిన సమాచారం ప్రకారం ఉత్తర కొరియా నుంచి నామ్ హత్యను ఆపరేట్ చేశారని, సాక్షాత్తు ప్రభుత్వంలోని కీలక శాఖలైన విదేశాంగ, రక్షణ శాఖ చట్టప్రతినిధులు ఉన్నారని ఆరోపించింది. ‘నామ్ హత్య కేసులో మొత్తం ఎనిమిది మందిని అనుమానిస్తున్నారు. వీరిలో నలుగురు ఉత్తర కొరియా రక్షణ వ్యవహారాలు చూసుకునే వారున్నారు. మరో ఇద్దరు మాత్రం మొత్తం పనిని పూర్తి చేశారు. ఆ ఇద్దరు విదేశాంగ మంత్రిత్వశాఖ వారు’ అని దక్షిణ కొరియా చట్టప్రతినిధి లీ చియోల్ వూ ఆరోపించారు. ఇది ముమ్మాటికి ఉత్తర కొరియా చేసిన ఉగ్రవాద చర్యే. నామ్ హత్య జరిగిన తర్వాత విచారణ చేసిన మలేషియా పోలీసులు మొత్తం ఎనిమిదిమంది ఉత్తర కొరియా వాసులను అదుపులోకి తీసుకుంది. అలాగే, మలేషియాలోని ఎంబసీ అధికారులను కూడా విచారించనుంది. -
కిమ్ సోదరుడు ఎన్నినిమిషాల్లో చనిపోయాడంటే..
కౌలాలంపూర్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సోదరుడు అత్యంత వేగంగా ప్రాణాలు కోల్పోయాడని మలేషియా ప్రభుత్వం తెలిపింది. విష ప్రయోగం కారణంగా సంభవించిన కిమ్ సోదరుడు కిమ్ జాంగ్ నామ్ మరణంపై ఆదివారం మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి ప్రకటన చేస్తూ సరిగ్గా 15 నుంచి 20 నిమిషాల వ్యవధిలో నామ్ మృత్యువాత పడ్డారని చెప్పారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో ఈ నెల(ఫిబ్రవరి) 13న నామ్‌పై ఇద్దరు మహిళలు విషప్రయోగం చేయడంతో ఆయన అక్కడే కుప్పకూలిపోయారు. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో చనిపోయారు. శుక్రవారం ఆయన పోస్టుమార్టం వివరాల్లో మలేషియాలో నిషేధించిన పవర్ఫుల్ కెమికల్ విషపదార్థం వీఎక్స్ నెర్వ్‌ను దాడి చేసినవాళ్లు ఉపయోగించడం వల్లనామ్ చనిపోయారని తెలిసింది. అసలు నామ్‌కు మలేషియా పోస్టుమార్టం చేయడమేమిటని ఉత్తర కొరియా మండిపడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం ఆ రెండు దేశాల మధ్య కొంత వైరుధ్యాలు తీసుకొస్తున్న నేపథ్యంలో నామ్‌పై దాడి, వైద్యం, చావు, పోస్టుమార్టం, ఇలా ప్రతి విషయంలో స్పష్టతను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా నామ్ మృతిపై అనుమానాలు తొలిగేలా అక్కడి ఆరోగ్యశాఖమంత్రి సుబ్రహ్మణ్యం సదాశివం ఓ ప్రకటన విడుదల చేశారు. మోతాదుకు మించిన వీఎక్స్ విషయం ఇవ్వడం వల్లే నేరుగా అతడి గుండెపై ప్రభావం చూపి అనంతరం ఊపరితిత్తులు ఇలా శరీరంలోని ప్రధాన భాగాలపై తదనంతరం మొత్తం శరీరంపై ప్రభావం చూపి మృత్యువాత పడేలా చేసిందని అన్నారు. పది మిల్లిగ్రామ్ల వీఎక్స్ నెర్వ్‌ను ఉపయోగించినట్లు తెలిపారు. మొత్త నాడీ వ్యవస్థనే ఈ విషం ఒక్కసారిగా కుప్పకూల్చగలదని అన్నారు. -
నామ్ హత్య: దౌత్యవేత్తకు అరెస్ట్ వారెంట్!
కౌలాలంపూర్: కిమ్ జోంగ్ నామ్ హత్యకు సంబంధించి ఉత్తర కొరియా దౌత్యవేత్తపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని మలేసియా భావిస్తోంది. ఉత్తర కొరియా దౌత్యవేత్త క్వాంగ్ సాంగ్ విచారణకు సహకరించటం లేదని.. తనంతట తానుగా విచారణకు సహకరించనట్లైతే అతడిపై అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని కోర్టును కోరతామని సెలంగోర్ స్టేట్ పోలీస్ చీఫ్ అబ్దుల్ సమ మట్ వెల్లడించారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో కిమ్ జోంగ్ నామ్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో దౌత్యవేత్తతో సహా 8 మంది ఉత్తర కొరియన్లను విచారించాలని మలేసియా అధికారులు భావిస్తున్నారు. వీఎక్స్ నర్వ్ ఏజెంట్ అనే నిషిద్ధ రసాయనాన్ని వాడి కిమ్ జోంగ్ నామ్‌ను హత్య చేసినట్లు నిర్థారణ అయింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఓ మహిళ సైతం వీఎక్స్ నర్వ్ ఏంజెంట్ ప్రభావిత లక్షణాలతో అనారోగ్యం పాలైందని పోలీసులు వెల్లడించారు. ఈ హత్య సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పనే అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. -
జోంగ్ నామ్ శరీరంలో ఆ విషం
కౌలాలంపూర్: ఉత్తర కొరియా నియంత కింగ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ శరీరంలోకి అత్యంత విషపూరితమైన కెమికల్‌ను పంపి ఆయన్ను హత్య చేసినట్లు మలేసియా పోలీసుల విచారణలో తేలింది. ఈ మేరకు మలేసియా పోలీసులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. నామ్ కళ్లు, ముఖంలోని మరికొద్ది భాగాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో వీఎక్స్ నర్వ్ ఏజెంట్‌కు సంబంధించిన ఆనవాళ్లు కనిపించినట్లు వెల్లడించారు. ఈ విషాన్ని వీఎక్స్ నర్వ్ ఏజెంట్ లేదా ఎస్-2 డైసోప్రొఫైలమైనోఈథైల్ మిథైల్ఫాస్ఫోనోథియోలైట్ అని కూడా పిలుస్తారు. దీని వినియోగంపై యూనైటెడ్ నేషన్స్‌లో నిషేధం ఉంది. మకావు వెళ్లేందుకు కౌలాంలంపూర్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన నామ్‌పై ఇద్దరు మహిళలు దాడి చేసి చంపారు. నామ్‌ను హతమార్చిన ఇరువురూ ఉత్తరకొరియా ఏజెంట్లేనని దక్షిణ కొరియా, అమెరికా దేశాల అధికారులు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్టు వీడియోను దక్షిణ కొరియాకు చెందిన ఓ టీవీ ప్రసారం చేసింది. నామ్ వెనుక నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు ఆయన ముఖంపై విషాన్ని స్ప్రే చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీఎక్స్ నర్వ్ ఏజెంట్‌ను కేవలం పార్మారంగ పరిశోధనలకు మాత్రమే వినియోగిస్తారు. క్రీమ్, లిక్విడ్ తదితర రూపాల్లో ఇది లభ్యమవుతుంది. పొరబాటున ఈ మిశ్రమాన్ని ఎవరైనా తాకితే 15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాగా నిందితులను పట్టుకునేందుకు మలేసియా ప్రభుత్వం ఇంటర్‌పోల్‌ను అలర్ట్ చేసింది. పోలీసులు ఇప్పటికే ఓ ఉత్తర కొరియా జాతీయుడిని అదుపులోకి తీసుకోగా.. కేసుకు సంబంధించిన మరో ఏడుగురు అనుమానితులు పరారీలో ఉన్నారు. -
కిమ్ హత్య.. మహిళ పరుగు అందుకే!
కౌలాలంపూర్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్యకు సంబంధించి ఇద్దరు మహిళలను మలేసియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌలాలంపూర్ విమానాశ్రయంలో మకావు వెల్లడానికి సిద్ధంగా ఉన్న కిమ్‌పై ఇటీవల విషప్రయోగం వీడియో దృశ్యాలు సైతం సోషల్ మీడియాలో కనిపించాయి. కిమ్‌పై విషప్రయోగం చేసిన యువతి.. వేగంగా బాత్ రూం వైపు పరిగెత్తడం వీడియోల్లో కనిపించింది. ఇదే విషయమై విలేకరులు మలేసియా పోలీస్ చీఫ్ అబు బాకర్‌ను ప్రశ్నించారు. మహిళలు ఉద్దేశపూర్వకంగానే కిమ్‌పై విషప్రయోగం చేశారా? చేతిలో ఉన్నది విషం అన్న విషయం ఆ మహిళకు తెలుసా.. అని ఓ విలేకరి అబూబకర్‌ను ప్రశ్నించగా.. 'మీరు ఆ వీడియో చూసి ఉంటారు. విషప్రయోగం తరువాత చేతులను దూరంగా ఉంచుతూ మహిళ బాత్ రూం వైపు పరిగెత్తింది. అంటే ఆ విషాన్ని వెంటనే కడిగేసుకోవాలనే విషయం ఆ యువతికి స్పష్టంగా తెలుసు. అందుకే అలా పరిగెత్తింది' అని వ్యాఖ్యానించారు. కిమ్ హత్యలో మహిళలు ఉద్దేశపూర్వకంగానే పాల్గొన్నారని ఇది తెలుపుతుందన్నారు. నామ్ హత్య వెనుకాల సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిమ్‌పై ప్రయోగించిన విషం ఏంటనేది తేలాల్సి ఉంది. -
కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే !
-
షాకింగ్: కిమ్‌ను దారుణంగా చంపిన వీడియో ఇదే!
ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్‌ను మలేషియాలోని విమానాశ్రయంలో దారుణంగా చంపిన ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వెలుగుచూసింది. అనూహ్యరీతిలో ఒక మహిళ నామ్‌పై వెనుక నుంచి దాడిచేసి.. ముఖానికి వేగంగా పనిచేసే విషాన్ని పూయడంతో ఆయన చనిపోయినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెల్లని దుస్తులు ధరించిన మహిళ వెనుక నుంచి నామ్ ముఖాన్ని పట్టుకొని.. ఏదో పూస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ వీడియోను జపాన్‌కు చెందిన ఫుజి టీవీ విడుదల చేసింది. నామ్‌పై దాడి దృశ్యాలను ఎయిర్‌పోర్టు సీసీ టీవీ కెమెరాలు రెండు కోణాలలో చిత్రీకరించినట్టు ఈ వీడియోను బట్టి తెలుస్తున్నది. దాడి చేసిన వెంటనే ఆ మహిళ వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోవడం ఈ వీడియోలో కనిపిస్తున్నది. మహిళ దాడితో తడబడుతూ.. తన ముఖాన్ని తుడుచుకుంటూ నామ్ అక్కడి నుంచి కదిలి పోలీసుల సహకారం తీసుకున్నాడు. అనంతరం విమానాశ్రయంలో ఉన్న చికిత్ర కేంద్రానికి వెళ్లాడని ఈ దృశ్యాలను బట్టి తెలుస్తోంది. అయితే, ఈ వీడియోలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. అయితే, మహిళలు తన ముఖానికి ఏదో ద్రవాన్ని పూశారని దాడి తర్వాత నామ్ ఎయిర్‌పోర్టు కస్టమ్స్ అధికారులకు ఫిర్యాదు చేశారని పోలీసులు ఆదివారం వెల్లడించిన సంగతి తెలిసిందే. మకావ్ వెళ్లేందుకు గత సోమవారం కౌలాలంపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన సమయంలో కిమ్ జాంగ్ నామ్‌పై మహిళలు విషప్రయోగంతో దాడి చేశారు. నాటకీయ ఫక్కీలో జరిగిన ఆయన హత్య వెనుక ఉత్తర కొరియా హస్తమున్నట్టు తాజాగా మలేషియా జరిపిన దర్యాప్తులో వెలుగుచూసిందని దక్షిణకొరియా తెలిపింది. కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ సాక్షిగా జరిగిన ఈ హత్యతో ఉత్తరకొరియా-మలేషియా మధ్య దౌత్య ఉద్రిక్తతలు తీవ్రస్తాయికి చేరాయి. ఈ హత్య కేసులో ఒక ఉత్తర కొరియా మహిళను అరెస్టు చేశామని, మరో నలుగురు ఆ దేశ పౌరుల కోసం గాలిస్తున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. నామ్ హత్య జరిగినరోజే ఆ నలుగురు దేశాన్ని విడిచిపోయారని పోలీసులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా పేర్కొంది. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన నామ్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన నామ్‌ను అతని తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సవతి సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు అన్న కారణంతోనే నామ్‌ను మహిళతో కిమ్ హత్య చేయించి ఉంటాడని అనుమానాలు వస్తుండగా.. ఈ హత్య వెనుక ఉత్తరకొరియా హస్తముందని తాజా దర్యాప్తులో తేలడం గమనార్హం. -
సవతి సోదరుడిని చంపించింది కిమ్మే!
హత్య వెనుక ఉత్తర కొరియా హస్తముంది ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జాంగ్ నామ్ హత్య కేసు దర్యాప్తులో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తమున్నట్టు తాజాగా మలేషియా జరిపిన దర్యాప్తులో వెలుగుచూసిందని దక్షిణకొరియా తెలిపింది. కౌలాలంపూర్ ప్రధాన విమానాశ్రయంలో గత సోమవారం కిమ్ జాంగ్ నామ్ విషప్రయోగం ద్వారా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఒక ఉత్తర కొరియా వ్యక్తిని అరెస్టు చేశామని, మరో నలుగురు ఆ దేశ పౌరుల కోసం గాలిస్తున్నామని మలేషియా పోలీసులు తెలిపారు. నామ్ హత్య జరిగినరోజే ఆ నలుగురు దేశాన్ని విడిచిపోయారని పోలీసులను ఉటంకిస్తూ దక్షిణ కొరియా పేర్కొంది. నామ్ హత్య వెనుక ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు అనుమానాలు వస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన నామ్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన నామ్‌ను అతని తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సవతి సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు అన్న కారణంతోనే నామ్‌ను మహిళతో కిమ్ హత్య చేయించి ఉంటాడని అనుమానాలు వస్తుండగా.. ఈ హత్య వెనుక ఉత్తరకొరియా హస్తముందని తాజా దర్యాప్తులో తేలడం గమనార్హం. -
కిమ్ సోదరుడి మృతదేహంపై వివాదం
కౌలాలంపూర్: ఇటీవల కౌలాలంపూర్ ఎయిర్‌పోర్ట్‌లో హత్యకు గురైన కిమ్ జోంగ్ నామ్ మృతదేహాన్ని అప్పగించే విషయంలో మలేసియా ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తుందని ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. అయితే.. ఈ ఆరోపణలపై మలేసియా పోలీసు ఉన్నతాధికారి ఖలీద్ అబు బకర్ ఘాటుగా స్పందించారు. కిమ్ జోంగ్ నామ్‌కు సంబంధించిన వారు డీఎన్ఏ వివరాలను అందించనంతవరకు విచారణ పూర్తి కాదని, అప్పటివరకు మృతదేహాన్ని అప్పగించడం కుదరదని ఆయన తెగేసి చెప్పారు. ఈ వ్యవహారంలో మలేసియాలోని చట్టాలకు ఉత్తరకొరియా కట్టుబడి ఉండాల్సి ఉంటుందని ఖలీద్ స్పష్టం చేశారు. 'కావాలంటే మా న్యాయవాదులు వారికి సలహా ఇస్తారు. మలేసియా చట్టాలకు కట్టుబడి ఉండాల్సిందే' అని ఖలీద్ అన్నారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు.. 45 ఏళ్ల కిమ్ జోంగ్ నామ్ కౌలాంలంపూర్ నుంచి మకావు వెళ్తుండగా సోమవారం విమానాశ్రయంలో హత్యకు గురయ్యారు. ఇద్దరు మహిళలు అతడిపై విషప్రయోగం చేసినట్లు వార్తలొచ్చాయి. సన్నిహిత కుటుంబవర్గాల వారికి మృతదేహాన్ని అప్పగిస్తామని మలేసియా అధికారులు చెబుతుండగా.. మృతదేహాన్ని కోరుతున్న ఉత్తర కొరియా రాయబార కార్యాలయం అధికారులు ఎలాంటి డీఎన్ఏ అధారాలను సమర్పించలేదు. -
మహిళలతో కిమ్ ఉన్ హత్య చేయించాడా?
-
మహిళలతో కిమ్ ఉన్ హత్య చేయించాడా?
సియోల్(దక్షిణకొరియా): ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్(45) హత్యను మహిళలే చేసినట్లు తెలిసింది. ఈ హత్యకు పాల్పడిన ఇద్దరు మహిళల్లో ఒకరిని ఇది వరకే అరెస్టు చేయగా మరో మహిళను తాజాగా అదుపులోకి తీసుకున్నారు. జోంగ్ నాం శవానికి పోస్ట్‌మార్టం పూర్తయిందని, అయితే, ఆ వివరాలు బహిర్గంత చేయకూడదని మలేషియా పోలీసులు తెలిపారు. దీనిపై మలేషియా రాయల్ పోలీసు బాస్ శ్రీ ఖలిద్ బిన్ అబు బకర్ మాట్లాడుతూ గురువారం ఉదయం జోంగ్ నామ్‌ను హత్య చేసిన మహిళను తాము అరెస్టు చేసినట్లు వివరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అరెస్టు చేశామని, ఆమె వద్ద ఇండో నేషియా పాస్‌పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే కిమ్ జోంగ్ చామ్ పేరిట ప్రయాణిస్తున్న ఆ వ్యక్తి జోంగ్ నామ్ అనే ఇప్పటి వరకు మలేషియా ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేయలేదు. ఉత్తర కొరియా మాత్రం ఆయనే అని ధ్రువీకరిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ హత్య వెనుకాల ఉత్తర కొరియా హస్తం ఉన్నట్లు పెద్ద మొత్తంలో అనుమానాలు వస్తున్నాయి. అయితే, దీనిపై కూడా ఎలాంటి స్పష్టత లేదు. మరోపక్క, ఉత్తర కొరియా గురువారం ప్రస్తుతం చనిపోయిన కిమ్ జోంగ్ నామ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ 75వ జయంతి వేడుకలు జరిపేందుకు సిద్ధమైంది. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన కిమ్ జోంగ్ నామ్ అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన కిమ్ జోంగ్నామ్ను తన తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో ఎప్పటికైనా తనకు అడ్డు కారణంగానే అతడి మహిళతో ఈ హత్య చేసి ఉంటాడేమో అని కూడా చాలామంది అనుమానిస్తున్నారు. -
ఉత్తర కొరియా అధినేత సోదరుడి హత్య
సియోల్(దక్షిణకొరియా): ఉత్తర కొరియా అధినేత కిమ్ జోన్ ఉన్ సవతి సోదరుడు కిమ్ జోంగ్ నాం(45) మలేసియాలో హత్యకు గురయ్యాడు. దేశంలో నియంతృత్వ పోకడలను నిరసించిన ఆయన అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. లాయర్ అయిన కిమ్ జోంగ్నామ్ను తన తండ్రి కిమ్ జోంగ్-2 హయాంలో రాజకీయ వారసుడిగా పరిగణించేవారు. ఆయన మరణానంతరం సోదరుడు కిమ్ జోంగ్ ఉన్ పాలన పగ్గాలు చేపట్టారు. దీంతో కిమ్ జోంగ్ నాం ప్రాణభయంతో 2001లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో జపాన్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడ కొంతకాలం గడిపాడు. ఎక్కువగా చైనాలోని మకావు ప్రాంతంలోనే ఆయన నివసించాడు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం మలేసియా వస్తూ కౌలాలంపూర్ విమానాశ్రయంలో దిగాడు. అక్కడ ఉండగానే గుర్తు తెలియని ఇద్దరు మహిళా ఏజెంట్లు ఆయనకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి మరుక్షణమే మాయమయ్యారని అధికారులు చెబుతున్నారు. ఆస్పత్రికి తరలిస్తుండగానే ఆయన చనిపోయాడని వెల్లడించారు. ఆగంతకుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కాగా, 2013లో తన మామ అయిన జాంగ్ సాంగ్ థెక్కు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరణ శిక్ష విధించాడు. అనంతరం అంతటి ప్రముఖుడిని చంపేయటం ఇదే ప్రథమం అని పరిశీలకులు అంటున్నారు.