ప్యోంగ్ యాంగ్: శత్రువుకు శత్రువు మిత్రుడవుతాడన్న మాటను నిజం చేస్తూ అమెరికాకు బద్ధ శత్రువులైన రష్యా, చైనా నార్త్ కొరియాతో చేతులు కలిపాయి. నార్త్ కొరియా విక్టరీ డే 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఆహ్వానం మేరకు రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా ప్రతినిధుల బృందంతో కలిసి చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా జరిగిన ఎగ్జిబిషన్ పెరేడ్లో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ నిషేధించబడిన క్షిపణులను ప్రతినిధి బృందానికి చూపించారు. ఈ సందర్భాంగా రష్యా, చైనా, నార్త్ కొరియా మధ్య ఏర్పడ్డ కొత్త స్నేహాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు కిమ్ జోంగ్. అమెరికాతో శత్రుత్వం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా కౌన్సిల్ నిషేధించిన ఈ క్షిపణులను ప్రదర్శించి బలప్రదర్శన చేశారు.
ఈ సందర్బంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేఖ రూపంలో కిమ్ జోంగ్ కు కృతజ్ఞతలు తెలిపారు. కిమ్ జోంగ్ కూడా తమ దేశానికి మిలటరీ ప్రతినిధులను పంపినందుకు రష్యా అధ్యక్షుడికి కృతఙ్ఞతలు తెలిపారు. కిమ్ జొంగ్ మాట్లాడుతూ.. మిలటరీ ప్రతినిధుల పర్యటన ద్వారా రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, సంప్రదాయ సంబంధాలు మరింత మెరుగయ్యాయని అన్నారు. ఒకే రకమైన ఆలోచనలతో రెండు దేశాల సార్వభౌమత్వం, అభివృద్ధి లక్ష్యంగా సామ్రాజ్యవాదుల కలయిక అంతర్జాతీయ శాంతి, సమన్యాయం నెలకొల్పే దిశగా ఫలప్రదంగా జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా ఆయన రష్యా సైన్యం పైనా, ప్రజలపైన అపార నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
రష్యా రక్షణ శాఖ మంత్రి షెర్గే షోయిగు, చైనా కమ్యూనిస్ట్ పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడు లీ హాంగ్ జాంగ్ కూడా తమ సంతోషసన్ని వ్యక్తం చేశారు. ఈ సమావేశం ద్వారా ఈ మూడు దేశాలు అమెరికాకు గట్టి సంకేతాలనే పంపాయి. కానీ ఎక్కడా ఉక్రెయిన్ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం
ఇది కూడా చదవండి: ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment